Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ అండ్ గ్యాంగ్ కి దిమ్మదిరిగే షాక్ తగులుతుంది. అటు దీనికి సమాంతరంగా వెంకీ, నందు ఎపిసోడ్ కూడా చూపించారు. మరోవైపు కొడుకును చూసి తొలిసారి పుత్రోత్సాహంతో పొంగిపోతాడు చలపతి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
మిగిలింది లక్షే.. అదీ రేఖకు ఇవ్వనివ్వని రాజు

కంపెనీలో రాజు, ఇందు కలిసి చేసిన తొలి ప్రాజెక్ట్ భారీగా లాభాలు తెచ్చి పెట్టడంతో ఆ డబ్బును ఇంట్లో వాళ్లకు చూపించే సీన్ తో సీరియల్ శనివారం (ఆగస్ట్ 15) ఎపిసోడ్ మొదలైంది. అయితే ఆ డబ్బులో ఖర్చులు, సుభాష్ సర్జరీ కోసం ఇచ్చే మొత్తం తీసేస్తే కేవలం లక్షే మిగులుతుంది. అది చూసి రేఖ, భ్రమరాంబ ముఖాలు మాడిపోతాయి.
లక్ష పోనూ అంతా మనదే అనుకుంటే లక్షే మిగిలిందేంటి అనుకుంటుంది. ఆ లక్షను కూడా ఇందు తీసి ఇంటి ఖర్చుల కోసం రేఖకు ఇస్తుంది. కానీ ఆ బాధ్యతలు పిన్నికి ఎందుకు.. ఎలాగూ నువ్వే చూసుకుంటున్నావు కదా అంటూ లక్ష తీసి మళ్లీ ఇందు చేతుల్లోనే పెడతాడు రాజు. దీంతో రేఖకు దిమ్మదిరిగే షాక్ తగులుతుంది.
బాధలో నందు, వెంకీ
మరోవైపు నందును పూర్తిగా దూరం పెట్టి తనకు పెళ్లి చూపులని అబద్ధం కూడా చెప్పిన వెంకీ ఆమె గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాడు. ఆమె ఫొటో చూస్తూ వెంకీ.. అంటు వెంకీ ఫొటో చూస్తూ నందు ఒకరి కోసం మరొకరు ఆలోచిస్తుంటారు. కొన్నాళ్లయితే నువ్వు నన్ను మరచిపోతావ్ నందు.. నన్ను క్షమించు అని వెంకీ అనుకుంటాడు. నిన్న మరచిపోవడం జరగని పని.. అయినా ఆ పెళ్లి చూపులు అబద్ధం అని చెప్పు అని నందు అంటుంది.. అవి అబద్ధమే నందు.. కానీ నాకు మరో దారి లేదని వెంకీ అనుకుంటాడు.
నాన్నకు ఇష్టం లేని పని చేయను
అప్పుడే తల్లి లక్ష్మి రావడంతో నందు ఫొటోను దాచేస్తాడు వెంకీ. నందు ఫొటోను దాచగలవు కానీ.. నీ మనసులో ఆమెపై ప్రేమను ఎలా దాస్తావు రా అని ఆమె అడుగుతుంది. ఇంత ప్రేమ పెట్టుకొని ఆ అమ్మాయిని ఎందుకంతలా బాధ పెడతావని అంటుంది. మీ నాన్నను నేను ఒప్పిస్తాను.. ఆయన ఏమీ అనరు అని సర్ది చెబుతుంది. తెలుసమ్మా.. పెళ్లి కూడా చేస్తాడు.. కానీ ఆ తర్వాత నుంచి నాకు ఏమవుతుందో అని భయపడుతూ కూర్చొంటాడు అని వెంకీ అంటాడు.
{{/usCountry}}అప్పుడే తల్లి లక్ష్మి రావడంతో నందు ఫొటోను దాచేస్తాడు వెంకీ. నందు ఫొటోను దాచగలవు కానీ.. నీ మనసులో ఆమెపై ప్రేమను ఎలా దాస్తావు రా అని ఆమె అడుగుతుంది. ఇంత ప్రేమ పెట్టుకొని ఆ అమ్మాయిని ఎందుకంతలా బాధ పెడతావని అంటుంది. మీ నాన్నను నేను ఒప్పిస్తాను.. ఆయన ఏమీ అనరు అని సర్ది చెబుతుంది. తెలుసమ్మా.. పెళ్లి కూడా చేస్తాడు.. కానీ ఆ తర్వాత నుంచి నాకు ఏమవుతుందో అని భయపడుతూ కూర్చొంటాడు అని వెంకీ అంటాడు.
{{/usCountry}}నాకోసం అన్ని త్యాగాలు చేసిన నాన్నకు ఇష్టం లేని పని నేనెప్పుడూ చేయను అని తేల్చి చెబుతాడు. దీంతో ఇన్నాళ్లూ పిల్లలను అర్థం చేసుకున్న తల్లిదండ్రులను చూశాను కానీ.. తొలిసారి తల్లిదండ్రులను అర్థం చేసుకునే పిల్లలను చూస్తున్నానంటూ వెంకీని చూసి లక్ష్మి గర్వంతో ఉప్పొంగిపోతుంది.
రేఖ, భూషణ్ చేతుల్లో బొచ్చ పెట్టిన శేషు..
అటు ఇంట్లో దిగులుగా కూర్చొన్న రేఖ, భ్రమరాంబ, భూషణ్ దగ్గరికి వచ్చిన శేషు.. వాళ్ల చేతుల్లో బొచ్చలు పెడతారు. ఇక మనకు మిగిలింది ఇదే.. నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి, నువ్వు హనుమాన్ గుడికి, నువ్వు రామాలయానికి వెళ్లి అడుక్కో అని అనడంతో వాళ్లు షాక్ తింటారు. గుళ్ల దగ్గర కాంపిటీషన్ ఎక్కువైతే.. సిగ్నల్స్ దగ్గర అడుక్కోండని శేషు అంటాడు. రేఖ కోపంతో ఊగిపోవడంతో శేషు అన్నదాంట్లో తప్పేమీ లేదంటూ భ్రమరాంబ అతనికి సపోర్ట్ చేస్తుంది.
మనకు మిగిలింది ఇదే కదా.. మనం అనుకున్నది ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి.. ఏదో ఒక రోజు మనల్ని కట్టుబట్టలతో బయటకు పంపించేలా ఉన్నారు అని భ్రమరాంబ అంటుంది.
అటు భూషణ్ కూడా రేఖను నిలదీస్తాడు. అసలు నీకేమైంది రేఖ.. ఒకప్పుడు నిన్ను చూస్తే ఇంట్లో వాళ్లు భయపడేవాళ్లు.. ఇప్పుడు నీ ముందే ఇలా మాట్లాడుతున్నారు.. నువ్వెందుకు ఏమీ అనడం లేదు.. అసలు ఏమైందని నిలదీస్తాడు. కానీ ఆ లక్కీ గాడి వల్లే నాకీ గతి అని రేఖ మనసులో అనుకుంటుంది కానీ బయటకు ఏమీ చెప్పలేకపోతుంది.
పేమెంట్ కోసం రాజు తిప్పలు.. అర్థం చేసుకొని 5 లక్షలు ఇచ్చిన ఇందు..
మరోవైపు వచ్చి డబ్బు అందరికీ ఇచ్చినా ఇందు తన పేమెంట్ ఇవ్వకపోవడంతో రాజు బాధ పడతాడు. ఇందును నేరుగా అడగలేక సతమతమవుతాడు. ఇంకా ఎవరికైనా పేమెంట్ బాకీ ఉందేమో ఆలోచించు అని రాజు అంటే.. ఎవరికీ లేదు.. అందరికీ ఇచ్చేశాను.. ఇక ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదని ఇందు అంటుంది. అది విని రాజు షాక్ తింటాడు. కక్కలేక మింగలేక వెళ్లిపోతుంటాడు.
అప్పుడే ఇందు పిలుస్తుంది. అతని చేతుల్లో 5 లక్షలు పెడుతుంది. నీ పేమెంట్ గురించి అడగలేకపోతున్నావని అర్థమైందని అంటుంది. నాకు రావాల్సింది 2 లక్షలే కదా అని రాజు అంటాడు. ఈ ఇంటిని అర్థం చేసుకొని, వీళ్ల కోసం నువ్వు కష్టపడుతున్నప్పుడే ఇందులో నీకూ వాటా రావాలని అనుకున్నానని ఇందు చెబుతుంది.
రాజు ఎమోషనల్.. ఇందుని హగ్ చేసుకొని..
ఆ డబ్బు చూసి రాజు ఎమోషనల్ అవుతాడు. తానెప్పుడూ మోసం చేసే డబ్బు సంపాదించానని, మొదటిసారి కష్టపడి సంపాదించిన ఈ డబ్బు చూసి చాలా సంతోషంగా ఉందని అంటాడు. ఎమోషనల్ అయిపోయి ఇందుని హగ్ చేసుకుంటాడు. అతని కంట్లో కన్నీళ్లు చూసి ఎందుకు ఏడుస్తున్నావని ఇందు అడుగుతుంది.
ఇన్నాళ్లూ డబ్బుని ఓ అవసరంగా చూశానే తప్ప ఆ డబ్బు ఇంతలా తృప్తి ఇస్తుందని అనుకోలేని అంటాడు. ఇందుకు థ్యాంక్స్ చెబుతాడు. ఈ విషయం మా నాన్నకు చెబితే ఎంతలా సంతోషిస్తాడో అని అంటాడు. వాళ్లకూ ఈ విషయం తెలియాలని ఇందు అంటుంది.
సొంతింటికి వచ్చిన రాజు, ఇందు
ఇందుతో కలిసి రాజు తన ఇంటికి వెళ్తాడు. చలపతి ముందు రూ.5 లక్షలు పెడతాడు. అది చూసి అతడు షాక్ తింటాడు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు రా అని తిడతాడు. దీంతో షాక్ తిన్న ఇందు.. అది మీ కొడుకు కష్టపడి సంపాదించిన డబ్బు అంటూ సపోర్ట్ చేస్తుంది.
అది విన్న చలపతి గర్వంతో ఉప్పొంగిపోతాడు. తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడని, బస్తీలో వాళ్లందరినీ పిలుస్తాడు. నా కొడుకు నెల జీతం రూ.5 లక్షలు అంటూ గొప్పగా చెప్పుకుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.