Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లోనూ వరలక్ష్మీ వ్రతం గురించి సాగదీతే కనిపించింది. గత మూడు నాలుగు ఎపిసోడ్లుగా ఇదే చూపిస్తున్న మేకర్స్.. లేటెస్ట్ ఎపిసోడ్ లోనూ వ్రతం ఏర్పాట్ల దగ్గరే ఆగిపోయారు. ఈ వ్రతం ద్వారా ఇందుకి పెళ్లి కాలేదని నిరూపించాలని ఐశ్వర్య చూడటం ఇందులో చూడొచ్చు.
తమ్ముడికి సాయం చేయమని రాజుని అడిగిన చలపతి

చాలా రోజుల తర్వాత సొంతింటికి వెళ్లిన రాజు అమ్మ చేతి వంట తినే సీన్ తో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ మొదలవుతుంది. నీ చేతి వంట చాలా మిస్ అవుతున్నానని రాజు తల్లి లక్ష్మితో అంటాడు. ఇంతలో చలపతి వస్తాడు. వెంకీ గురించి చెబుతాడు. వాడు మంచి కోర్స్ కోసం ఏదో ఇన్‌స్టిట్యూట్ లో చేరతాడట.. నీ సాయం కావాలని అని అడుగుతాడు. అదేముంది చేసేద్దాం అని రాజు అంటాడు. ఫీజు ఎంత కట్టాలని అడిగితే రూ.50 వేలని చలపతి చెబుతాడు.
దీంతో రాజు షాక్ తింటాడు. నీకు సాధ్యం కాకపోతే ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటాను.. తర్వాత ఇచ్చేద్దామని చలపతి అంటాడు. అవసరం లేదు.. అలా అప్పులు చేసే ఈ పరిస్థితి వచ్చింది.. నేనే ఏదో రకంగా ఏర్పాటు చేస్తానులే అని రాజు అనడం చూసి చలపతి సంతోషిస్తాడు. నువ్వు చాలా మారిపోయావు అంటూ మురిసిపోతాడు.
వెంకీకి ధైర్యం చెప్పి వెళ్లిన రాజు
తమ్ముడికి కాస్త ధైర్యం చెప్పి వెళ్లు అని చలపతి అడగడంతో వెంకీ దగ్గరికి వెళ్తాడు రాజు. అతడు బాధగా ఉండటం చూసి రాజు ధైర్యం చెబుతాడు. జాబ్ కోసం ఇంతలా ఆలోచించాలా.. నీకున్న టాలెంట్ కు ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అని రాజు అంటాడు. నువ్వు నీ కోర్సు మీదే దృష్టి పెట్టు.. డబ్బు విషయం నాకు వదిలెయ్ అని కూడా చెబుతాడు. వెంకీ సరే అంటాడు.
వెళ్లబోతూ నువ్వు నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా అని వెంకీని మరోసారి రాజు అడుగుతాడు. ఏది ఉన్నా సరే నాకు చెప్పు.. ఈ అన్నయ్య ఉన్నాడు.. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగాం అని రాజు ఎమోషనల్ అవుతాడు. కానీ వెంకీ మాత్రం తన ప్రేమ గురించి చెప్పడు.
భ్రమరాంబకు క్లాస్ పీకిన శేషు
{{/usCountry}}వెళ్లబోతూ నువ్వు నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా అని వెంకీని మరోసారి రాజు అడుగుతాడు. ఏది ఉన్నా సరే నాకు చెప్పు.. ఈ అన్నయ్య ఉన్నాడు.. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగాం అని రాజు ఎమోషనల్ అవుతాడు. కానీ వెంకీ మాత్రం తన ప్రేమ గురించి చెప్పడు.
భ్రమరాంబకు క్లాస్ పీకిన శేషు
{{/usCountry}}ఇటు ఇంట్లో భ్రమరాంబకు శేషు క్లాస్ పీకుతాడు. భర్త కోసం వ్రతం చేయని భార్య ఉండటం దండగ అనే విషయం ఆమెకు అర్థమయ్యేలా ఫోన్ లో ఏదో వినిపిస్తాడు. కానీ ఆమె పట్టించుకోదు. ఎప్పుడూ తినడమే తప్ప నా కోసం ఏ వ్రతం చేయవా అని శేషు అడుగుతాడు. అప్పుడే రేఖ, ఐశ్వర్య కూడా వస్తారు. వాళ్ల ముందూ అదే చెబుతాడు. నువ్వు కూడా బామ్మర్ది కోసం వ్రతం చేయవా అని రేఖను అడుగుతాడు శేషు.
వరలక్ష్మీ వ్రతం గురించి అపర్ణ ప్రస్తావన
అప్పుడే వరలక్ష్మీ వ్రతం గురించి అపర్ణ ప్రస్తావిస్తుంది. తాను రేపు ఇంట్లో వ్రతం చేస్తున్నానని, అందులో మీరు కూడా కూర్చోండని అంటుంది. దీంతో భ్రమరాంబ, రేఖ కూడా సరే అంటారు. దానికోసం ఏర్పాట్లన్నీ తాను చేశానని అపర్ణ చెబుతుంది.
ఇందుని ఇరికించిన ఐశ్వర్య.. సై అన్న ఇందు
అప్పుడే ఇందుని ఇరికించాలని ఐశ్వర్య చూస్తుంది. ఇంట్లో కొత్తగా పెళ్లయిన జంట కూడా వ్రతం చేయాలి కదా అంటూ ఇందు, రాజు గురించి చెబుతుంది. దీంతో రేఖ వెంటనే ఇందుని పిలుస్తుంది. అది విని అపర్ణ షాక్ తింటుంది. పెళ్లి కాకుండా వాళ్లు ఎలా వ్రతంలో కూర్చుంటారు అని అనుకుంటుంది. ఇందు వచ్చిన తర్వాత రేఖ, భ్రమరాంబ వ్రతం గురించి చెబుతారు.
కానీ ఇందు మాత్రం కంగారు పడుతుంది. అపర్ణ వచ్చి రేపుకు మీకు ఏదో మీటింగ్ ఉంది కదా.. వద్దులే అని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఐశ్వర్య మరింత ఇరికిస్తుంది. మీటింగ్ మరో రోజు పెట్టుకోవచ్చు.. ఇప్పుడు వ్రతంలో అయిన కూర్చో లేదంటే అసలు నిజం చెప్పెయ్ అని అనడంతో ఇందు సరే అంటుంది. రాజుతో కలిసి వ్రతం చేస్తానని స్పష్టం చేసి వెళ్లిపోతుంది.
ఆధారాలతో నిరూపిస్తానన్న ఐశ్వర్య
ఇందు, రాజుకు పెళ్లి కాలేదని నేను చెబితే నమ్మలేదు కదా.. ఆధారాలు చూపించినా వినలేదు.. రేపు మరోసారి నిరూపిస్తాను చూడండి అని ఐశ్వర్య అంటుంది. ఈ వ్రతం కూడా పూర్తి చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు చూడండి అని ఐశ్వర్య చెబుతుంది. చెప్పిందే ఎన్నిసార్లు చెబుతావని రేఖ చిరాకు పడినా కూడా.. ఈసారి మీరే చూస్తారు కదా అని ఐశ్వర్య అంటుంది.
వ్రతం వద్దని ఇందుని వారించిన అపర్ణ.. మనసుకు మంగళసూత్రం కట్టేసినట్లేనన్న ఇందు
లోనికి వెళ్లిన తర్వాత ఇందుని అపర్ణ తిడుతుంది. ఎందుకు వ్రతం చేస్తావని ఒప్పుకున్నావ్.. పెళ్లి కాకుండా వ్రతంలో ఎలా కూర్చొంటారు.. అమ్మవారితో ఆటలు వద్దు అని వారిస్తుంది. కానీ తాను కూర్చోకపోతే తమకు పెళ్లి కాలేదని రేఖ ఆంటీకి డౌట్ వస్తుందని ఇందు అంటుంది. అలా అని పెళ్లి కాకుండా వ్రతం చేయకూడదు అని అపర్ణ చెబుతుంది.
పెళ్లి కాని వాళ్లు చేయకూడదని రూల్ ఏముంది.. మంచి భర్త కోసం చేస్తారు కదా.. అయినా బావ ఎప్పుడైతే మనకోసం తన ఇంటిని వదిలి వచ్చాడో అప్పుడే అతని ప్రేమలో పడిపోయాను.. ప్రపంచం చూడటానికి తమకు పెళ్లి కాలేదు కానీ.. మనసుకు మాత్రం బావ ఎప్పుడో మంగళసూత్రం కట్టేశాడు.. ఏమీ కాదు మేము వ్రతంలో కూర్చొంటామని ఇందు అంటుంది. మరి రాజు ఒప్పుకుంటాడా అని అపర్ణ అడిగితే.. ఒప్పిస్తానని ఇందు హామీ ఇస్తుంది. అప్పుడే రాజు వస్తాడు.
రాజుకి వరలక్ష్మీ వ్రతం గురించి చెప్పిన ఇందు
నీ గురించే మాట్లాడుకుంటున్నామని, నువ్వు బాగా చూసుకోవడం లేదని మీ నాన్నకు ఫోన్ చేద్దామనుకుంటున్నామని ఇందు అంటుంది. అపర్ణ కూడా అదే చెబుతుంది. దీంతో అంత పని చేయకండి అని రాజు కంగారు పడతాడు. ఆయన ఇందు మాట నమ్ముతాడు.. నన్ను తిడతాడు అని రాజు అంటాడు.
అలాంటిదేమీ లేదులే, ఊరికే అన్నానని ఇందు అంటుంది. రాజుకు వ్రతం గురించి చెప్పి వస్తానని అతన్ని గదిలోకి తీసుకెళ్తుంది. నీ సాయం కావాలని ఒకరికొకరు అడుగుతారు. డబ్బు కోసం రాజు.. వ్రతం కోసం ఇందు అడగాలని అనుకుంటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.