...
...
Next Story

Brahmamudi August 7 Episode: బ్రహ్మముడి.. ఐశ్వర్య నాటకం చూసేసిన లక్కీ.. రేఖకు దారుణమైన అవమానం.. రాజు ప్లాన్ సక్సెస్

Brahmamudi Serial August 7th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 7 ఎపిసోడ్ లో ఐశ్వర్య అప్పు నాటకాన్ని లక్కీ చూసేస్తాడు. మరోవైపు తనకు ఐషూతోనే పెళ్లి చూపులని అనుకున్న లక్కీకి పెద్ద షాక్ తగులుతుంది. అటు రాజు ప్లాన్ ప్రకారం రేఖకు దారుణమైన అవమానం జరుగుతుంది.

Published on: Aug 7, 2026, 08:36:30 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య అప్పు నాటకం, రేఖను ఇరికించడానికి రాజు వేసే మరో ప్లాన్, నందు గురించి తలుచుకుంటూ వెంకీ బాధపడటంలాంటి సీన్లను చూడొచ్చు. లక్కీ పెళ్లి చూపుల వేళ రేఖకు దారుణమైన అవమానం కూడా జరుగుతుంది.

అప్పు విషయంలో నిలదీసిన ఇందు.. ఎదురు తిరిగిన ఐశ్వర్య

Brahmamudi August 7 Episode: బ్రహ్మముడి.. ఐశ్వర్య నాటకం చూసేసిన లక్కీ.. రేఖకు దారుణమైన అవమానం.. రాజు ప్లాన్ సక్సెస్
Brahmamudi August 7 Episode: బ్రహ్మముడి.. ఐశ్వర్య నాటకం చూసేసిన లక్కీ.. రేఖకు దారుణమైన అవమానం.. రాజు ప్లాన్ సక్సెస్

ఐశ్వర్య తన దగ్గర రూ.3 లక్షల అప్పు చేసిందని, వెంటనే తీర్చమని ఓ వ్యక్తి గొడవకు దిగే సీన్ తో సీరియల్ శుక్రవారం (ఆగస్ట్ 7) ఎపిసోడ్ మొదలైంది. అప్పు ఎందుకు చేశావని ఇందు నిలదీస్తుంది. కానీ ఐషూ ఎదురు తిరుగుతుంది. తాను అప్పు చేయలేదని, చేసేలా మీరే చేశారని ఇందుని తప్పుబడుతుంది.

తాను డబ్బు అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదని, అందుకే అప్పు చేశానని రేఖను, ఇందును తిడుతుంది. అప్పు తీర్చలేకపోతే కారు తాళాలు ఇవ్వండని ఆ వ్యక్తి అంటాడు. ఆ కారు పేపర్లు తాకట్టు పెట్టే అప్పు తీసుకుందని చెబుతాడు. దీంతో అందరూ షాక్ తింటారు.

రేఖను తప్పుబట్టిన అపర్ణ.. అప్పు తీర్చిన ఇందు

ఇంత జరుగుతుంటే ఎందుకు ఏమీ మాట్లాడటం లేదు.. చిన్నప్పటి నుంచి నీ గారాబం వల్లే ఐశ్వర్య ఇలా తయారైంది.. అప్పు కోసం ఇలా ఇంటిపైకి రావడం ఇది రెండోసారి అని రేఖను అపర్ణ నిలదీస్తుంది. రాజు కూడా అదే అంటాడు. ఈ అప్పుతో తమకు సంబంధం లేదని, మీరే చూసుకోండని స్పష్టం చేస్తాడు.

అయితే ఆ డబ్బు తీసుకొని బయటకు వెళ్లిన ఆ వ్యక్తి ఇంటి పక్కనే కూర్చొని లెక్కబెడుతుంటాడు. అతని దగ్గరికి వచ్చిన ఐశ్వర్య.. చాలా బాగా నటించావు కానీ.. ఆ డబ్బు ఇవ్వమని తీసుకుంటుంది. అతనికి రూ.20 వేలు ఇచ్చి పంపించేస్తుంది. తనకు వచ్చిన డబ్బు చూసి మురిసిపోతుంది.

అప్పుడే లక్కీ వెనుక నుంచి ఇదంతా చూసేయడంతో ఐశ్వర్య షాక్ తింటుంది. ఈ విషయం ఎవరికైనా చెప్పావో అంటూ లక్కీకి కూడా వార్నింగ్ ఇస్తుంది. దీంతో తాను ఎవరికీ చెప్పనులే కానీ తనకు పార్టీ కావాలని అడుగుతాడు. ఆమె సరే అంటుంది.

ఐశ్వర్య గురించి ఇందు ఆందోళన.. రేఖ నిజం బయట పెట్టాలన్న రాజు

ఇటు ఐశ్వర్య గురించి ఇందులో ఆందోళన చెందుతూ ఉంటుంది. రాజు రాగానే అదే విషయం చెబుతుంది. ఆమె విషయంలో తాను సాయం చేస్తానని రాజు మాట ఇస్తాడు. అయితే ముందు రేఖ విషయం చూడాలని, తాను ఎంత ప్రయత్నించినా లక్కీ తన కొడుకే అన్న మాట ఆమె నోటి నుంచి రావడం లేదని రాజు అంటాడు. మరేం చేద్దామని ఇందు అంటుంది. తన దగ్గర మరో ప్లాన్ ఉందని చెబుతాడు.

లక్కీకి పెళ్లి చూపుల ప్లాన్ వేసిన రాజు

లక్కీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దామని రాజు అంటాడు. దాని వల్ల నిజం ఎలా తెలుస్తుందని ఇందు అడిగితే.. వచ్చిన వాళ్లు లక్కీ తల్లిదండ్రుల గురించి అడుగుతారని, వాళ్లతో దారుణమైన మాటలు అనిపిస్తే రేఖకు ఆవేశం వస్తుందని రాజు అంటాడు. ఎంతైనా లక్కీ తన కొడుకే కాబట్టి.. అతన్ని అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోదని, నిజం చెప్పేస్తుందని రాజు చెబుతాడు. ప్లాన్ బాగానే ఉంది కానీ.. వర్కౌట్ అవుతుందా అని ఇందు సందేహ పడుతుంది. భారతంలో కర్ణుడిని అవమానిస్తుంటే కుంతీ సైలెంట్ గా ఉంది.. మరి ఈ కుంతి ఏం చేస్తుందో అని రాజు అంటాడు.

బాధలో వెంకీ, నందు

మరోవైపు తనను దూరం పెట్టిన వెంకీ గురించి తలుచుకుంటూ నందు బాధపడుతూ ఉంటుంది. అటు వెంకీ కూడా ఆమెను నానా మాటలు అనడం గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటాడు. లక్ష్మి వచ్చి అతన్ని ఓదారుస్తుంది. నువ్వు అనవసరంగా ఆ అమ్మాయిని బాధ పెడుతున్నావని అంటుంది. ఇలా చేస్తేనే నాపై ఆమెకు అసహ్యం కలిగి దూరంగా వెళ్తుందని అంటాడు. మరి నీ విషయం ఏంటని అడిగితే.. తాను కూడా నందును మరచిపోతానని చెబుతాడు.

పెళ్లి చూపుల గురించి లక్కీకి చెప్పిన రాజు..

ఇటు లక్కీని పిలిచిన రాజు, ఇందు అతన్ని ఓ ఇంటి వాడిని చేయాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. లక్కీ మాత్రం తనకు ఇల్లు ఇప్పిస్తాడేమో అనుకొని ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అంటాడు. ఇంటివాడిని చేయడం అంటే పెళ్లి చూపులు రా అని రాజు అంటాడు. లక్కీ లోలోపల సంతోషిస్తాడు. ఐశ్వర్యతోనే ఆ పెళ్లి చూపులని అనుకుంటాడు. రాజు మాత్రం అసలు విషయం దాస్తాడు.

రాజుకు థ్యాంక్స్ చెప్పిన లక్కీ.. మనమిద్దరం ఒకే ఇంటికి తోడళ్లుళ్లం కావాలనుకున్నాం కదా.. నువ్వు ఇందును పెళ్లి చేసుకోలేదు కదా అని అంటాడు. ఇందు అయోమయంలో పడుతుంది. సరే అది తర్వాత చూసుకుందాంలే అని రాజు అతన్ని పంపిస్తాడు. లక్కీ ఏం మాట్లాడుతున్నాడు అని ఇందు అంటుంది. వాడు మీ అక్క ఐశ్వర్యతో పెళ్లి చూపులని అనుకుంటున్నాడు.. ఆమెను వాడు ప్రేమిస్తున్నాడు కానీ.. ఆమె వీడిని అస్సలు పట్టించుకోవడం లేదని తెలుసుకోలేకపోతున్నాడు అని రాజు అంటాడు.

రేఖకు దారుణమైన అనుమానం

అటు అనుకున్నట్లు రాజు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. వచ్చిన వాళ్లు లక్కీ పేరెంట్స్ గురించి అడుగుతారు. చిన్నప్పుడే వాడిని తల్లి వదిలేసి వెళ్లిందని రాజు చెబుతాడు. దీంతో ఆ తల్లిని వాళ్లు తిడతారు. భ్రమరాంబ కూడా అలాంటి దాన్ని చెప్పు తిరగేసి కొట్టాలని అంటుంది. తనకు దారుణమైన అవమానం జరుగుతుండటంతో ఇక ఆవేశం పట్టలేక రేఖ అందరి ముందూ లేచి నిల్చొని ఏదో చెప్పబోతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks