...
...
Next Story

బ్రహ్మముడి డిసెంబర్ 19 ఎపిసోడ్: మోడల్‌గా ధాన్యలక్ష్మీ- రాజ్ దగ్గరికి ఫేక్ డైరెక్టర్‌ను పంపిన రాహుల్- నిజం చెప్పిన రేణుక

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 19 ఎపిసోడ్‌లో ట్రెడిషనల్‌గా ఉన్న కావ్య ఫొటో చూసి మోడల్‌గా అనుకుంటాడు రాజ్. కానీ, కావ్య మోడలింగ్‌కు ఒప్పుకోదు. దాంతో మోడల్‌గా ధాన్యలక్ష్మీ రెడీ అయి వస్తుంది. మరోవైపు అంజలి తండ్రి అశోక్ కాదని, తనకు రెండో భర్త అని రేణుక నిజాలు చెబుతుంది.

Published on: Dec 19, 2025, 08:38:38 IST
Advertisement

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య మోడ్రన్ డ్రెస్సులో ఉన్న ఫొటోను డీపీగా పెట్టుకుని, ఫ్యామిలీ అందరికి చూపిస్తానంటాడు రాజ్. దాంతో వద్దని ఫోన్ తీసుకునేందుకు కావ్య ట్రై చేస్తుంది. తర్వాత రాజ్‌ను గట్టిగా సోఫాలో పడేసి ముద్దులు పెట్టినట్లు చేసి మురిసిపెడుతుంది కావ్య. తర్వాత కాసేపటికి భయపడిన రాజ్ ఫోన్ ఇస్తాడు.

కావ్య ట్రెడిషనల్ ఫొటో

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 19 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 19 ఎపిసోడ్

అందులో మోడ్రన్ డ్రెస్ తీసేసి ట్రెడిషనల్‌గా తన ఫొటో పెడుతుంది కావ్య. అది చూసిన రాజ్ కావ్యనే మోడల్‌గా పెట్టి యాడ్ షూట్ చేస్తే అయిపోతుందిగా. ఇంకెవరో మోడల్ ఎందుకు అని రాజ్ అనుకుంటాడు. అదే విషయం కావ్యకు చెబుతాడు రాజ్. కావ్య ఒప్పుకోదు. నువ్వు తప్ప నాకు ఇంకో గతి లేదని రాజ్ అంటాడు. అయినా కావ్య ఒప్పుకోదు. ఎలాగైనా ఒప్పిస్తా. నువ్వే నా మోడల్ అని అనుకుంటాడు రాజ్.

మరోవైపు రేణుక, అశోక్‌లను అప్పు ఇన్వేస్టిగేట్ చేస్తుంది. మీ ఇద్దరు నాకెందుకు అబద్ధం చెప్పారని అప్పు అడుగుతుంది. పాప వివరాలు అన్ని సరిగ్గానే చెప్పాం కదా అని రేణుక అంటుంది. కనిపించకుండా పోయిన మీ పాపకు తండ్రి ఎవరు అని అప్పు అడిగితే రేణుక తడబడుతుంది. పాపకు నేనే తండ్రిని అని అశోక్ అంటాడు. అయితే మరి పాపకు నీకు డీఎన్ఏ ఎందుకు మ్యాచ్ అవ్వలేదని చాలా కోప్పడుతుంది అప్పు.

అప్పుడు రేణుక నిజం చెబుతుంది. అంజలి అశోక్ కూతురు కాదు. అశోక్ నా రెండో భర్త. నా మొదటి భర్త యాక్సిడెంట్‌లో చనిపోయిన తర్వాత అశోక్ దగ్గరయ్యాడని రేణుక చెబుతుంది. మరి ఆ విషయం నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదని అప్పు కోప్పడుతుంది. అశోక్ చెప్పొద్దన్నాడు. మీకే కాదు ఎవరికి చెప్పొద్దు. పాపకు నేనే తండ్రిని. నేను నీకు రెండో భర్తను అని తెలియొద్దు. నువ్వు బాధపడొద్దు అని రేణుక అంటుంది.

అశోక్ గురించి ఎందుకు

ఇరిటేట్ అయిన అప్పు ఇందులో ఏదో తిరకాసు ఉంది. ఏదో మిస్ అవుతున్నా. మళ్లీ కేసు క్లియర్‌గా చూడాలనుకుంటుంది అప్పు. మరోవైపు అంతా డిన్నర్‌లో కూర్చుంటారు. పాపం రాజ్ గాడు బాగా ఫీల్ అవుతున్నాడు. ఇంకాస్తా పొడుద్దాం అని యాడ్ ఫిల్మ్ షూటింగ్ గురించి అడుగుతాడు రాహుల్. మోడల్ హ్యాండ్ ఇచ్చిందని రాజ్ చెబుతాడు.

రాహుల్ చూడు మోడల్‌ను నమ్ముకోకుండా తన భార్యతో షూట్ చేశాడని ప్రకాశం అంటే.. దేనికైనా ప్లానింగ్ ఉండాలని రాహుల్, దాన్నే ముందు చూపు అంటారని రుద్రాణి అంటారు. అంటే రాజ్ కంటే రాహుల్ బాగా ఆలోచించాడని ఇన్‌డైరెక్ట్‌గా అంటారు. తర్వాత మోడల్ ఉంది. కానీ, తనే ఒప్పుకోవట్లేదు అని కావ్య గురించి చెబుతాడు రాజ్. చాలా మంచి ఐడియా అని సుభాష్ అంటాడు.

మోడల్‌గా ధాన్యలక్ష్మీ

మోడలింగ్ అంటే వంట చేయడమా. జనాలు యాక్సెప్ట్ చేయాలిగా అని రుద్రాణి అంటుంది. అపర్ణ సపోర్ట్ చేస్తుంది. కావ్యను ఒప్పుకోమంటుంది. అదంతా నాకు నచ్చదని కావ్య అంటుంది. ఇంట్లోనే గొప్ప మోడల్ ఉండి చూడరేంటీ అని ధాన్యలక్ష్మీ అంటుంది. లోపలికి వెళ్లి తానే మోడల్‌లా నగలు వేసుకుని రెడీ అయి వస్తుంది ధాన్యలక్ష్మీ. అందరిముందు అటు ఇటు నడుస్తుంది.

యాడ్ షూటింగ్‌కు క్యాప్షన్ చెబుతుంది ధాన్యలక్ష్మీ. అంతా వద్దంటారు. భరించలేకపోతున్నామంటారు. మీకు టేస్ట్ లేదని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. మరోవైపు రాత్రి పరాట కాల్చుకునే వాడి దగ్గరికి వెళ్లి రాజ్ దగ్గర యాడ్ షూట్ డైరెక్టర్‌గా నటించాలని చెబుతాడు రాహుల్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe