బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 959వ ఎపిసోడ్ మరో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. రుద్రాణి కుట్రలకు ఇక తెరపడే టైమ్ దగ్గర పడినట్లు అనిపిస్తోంది. అప్పు, కల్యాణ్ లను రాజ్, కావ్య విడిపించడం, ఆమె ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడంతో కథ కీలకమైన మలుపు తిరిగింది.
హోర్డింగ్ చూసి అడ్రెస్ తెలుసుకున్న రాజ్

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 18) ఎపిసోడ్ రాజ్, కావ్యలను కిడ్నాపర్లు తప్పుదోవ పట్టించే సీన్ తో మొదలవుతుంది. వాళ్లు తప్పుడు అడ్రెస్ కు వెళ్తారు. కానీ వీడియోను బాగా చూసిన రాజ్, కావ్య.. అందులో కిటికీలో నుంచి కనిపించిన ఓ హోర్డింగ్ చూస్తాడు. దానికి ఫోన్ చేసి వాటిని ఎక్కడెక్కడ పెట్టారో తెలుసుకుంటాడు. దాని ద్వారా అప్పు, కల్యాణ్ లను కిడ్నాపర్లు పట్టుకొని ఉంచిన ప్లేస్ ను కనిపెడతాడు.
అప్పుకి నొప్పులు.. ప్రాధేయపడిన కల్యాణ్
మరోవైపు నెలలు నిండటంతో అప్పుకి నొప్పులు మొదలవుతాయి. ఆమె విపరీతమైన నొప్పులతో ఏడుస్తూ ఉంటుంది. దీంతో కల్యాణ్ కిడ్నాపర్లను ప్రాధేయపడతాడు. తమను విడిచిపెట్టాలని వేడుకుంటాడు. తమ సార్ వద్దన్నాడంటూ కావాలని మరోసారి రాజ్ ను ఇరికించే ప్రయత్నం వాళ్లు చేస్తారు. మా అన్నయ్య ఇలాంటి పని చేయడని కల్యాణ్ అంటాడు. అప్పుడే రాజ్, కావ్య ఆ ఇంటి దగ్గరికి వస్తారు. కిటికీలో నుంచి అప్పు, కల్యాణ్ లను చూస్తారు.
రౌడీలతో రాజ్, కావ్య ఫైట్
తెలివిగా రౌడీల కళ్లు కప్పి ఆ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ అప్పు, కల్యాణ్ ల కట్లు విప్పుతుండగా రౌడీలు వస్తారు. వాళ్లను పట్టుకుంటారు. కానీ రాజ్, కావ్య వాళ్లతో ఫైట్ చేస్తారు. ఓవైపు కల్యాణ్, కావ్య కలిసి అప్పుని బయటకు తీసుకెళ్తారు. మరోవైపు రాజ్ రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు. కల్యాణ్, అప్పు తప్పించుకుంటారు. ఇటు రాజ్ ను రౌడీలు చితకబాదుతారు.
వాళ్లను చంపేయమన్న రుద్రాణి
కల్యాణ్, అప్పు కనిపించకపోవడంతో రౌడీలు రుద్రాణికి ఫోన్ చేసి విషయం చెబుతారు. దీంతో ఆమె వాళ్లను తిడుతూ ముందు పట్టుకొని చంపేయండి.. లేదంటే నేను ఇరుక్కుపోతానని అంటుంది. దీంతో రౌడీలు వాళ్ల కోసం వెతికి అప్పు, కల్యాణ్ లను పట్టుకుంటారు. కల్యాణ్ ముందే అప్పుని కత్తితో పొడిచి చంపడానికి వెళ్తారు. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. వాళ్లందరినీ చితకబాదుతాడు. ఇంతలో కావ్య కారు తీసుకొచ్చి కల్యాణ్, అప్పులను తీసుకెళ్తుంది.
హాస్పిటల్లోనూ ధాన్యలక్ష్మి రచ్చ.. తల్లికి క్లాస్ పీకిన కల్యాణ్
{{/usCountry}}కల్యాణ్, అప్పు కనిపించకపోవడంతో రౌడీలు రుద్రాణికి ఫోన్ చేసి విషయం చెబుతారు. దీంతో ఆమె వాళ్లను తిడుతూ ముందు పట్టుకొని చంపేయండి.. లేదంటే నేను ఇరుక్కుపోతానని అంటుంది. దీంతో రౌడీలు వాళ్ల కోసం వెతికి అప్పు, కల్యాణ్ లను పట్టుకుంటారు. కల్యాణ్ ముందే అప్పుని కత్తితో పొడిచి చంపడానికి వెళ్తారు. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. వాళ్లందరినీ చితకబాదుతాడు. ఇంతలో కావ్య కారు తీసుకొచ్చి కల్యాణ్, అప్పులను తీసుకెళ్తుంది.
హాస్పిటల్లోనూ ధాన్యలక్ష్మి రచ్చ.. తల్లికి క్లాస్ పీకిన కల్యాణ్
{{/usCountry}}కావ్య వాళ్లను హాస్పిటల్ కు తీసుకొస్తుంది. ఆపరేషన్ థియేటర్లో అప్పు నొప్పులతో బాధపడుతుంది. అప్పుడే ఇంట్లో వాళ్లందరూ అక్కడికి వస్తారు. అక్కడ కూడా ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది. రాజ్ నే నిందిస్తుంది. అది విని కల్యాణ్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.
అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా.. అన్నయ్య నన్ను కిడ్నాప్ చేయించడమేంటి.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మమ్మల్ని కాపాడాడు.. అన్నయ్య లేకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో అని కల్యాణ్ తన తల్లికి కాస్త గట్టిగానే క్లాస్ పీకుతాడు. దీంతో ఇంట్లో వాళ్లందరు కూడా ధాన్యాన్ని తిడతారు. ఇప్పటికైనా రాజ్, కావ్య గురించి తెలుసుకో అని చెబుతారు. ఇంటికి వచ్చిన తర్వాత రాజ్, కావ్య కూతురికి బారసాల ఏర్పాటు చేస్తారు. తన కూతురికి నాన్నమ్మ ఇందిరా దేవి పేరు పెడతాడు రాజ్.
రుద్రాణి గుట్టు రట్టు
అప్పు తన ప్రసవం తర్వాత వెంటనే అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుసుకునే పనిలో పడుతుంది. పోలీసులు పట్టుకున్న రౌడీల దగ్గరికి వెళ్తుంది. ఈ విషయాన్ని రేఖ అప్పుడే తన తల్లికి ఫోన్ చేసి చెబుతుంది. అటు రౌడీలు తమ ఫోన్లో ఉన్న రుద్రాణి ఫొటో చూపించి ఈమెనే తమకు డబ్బులు ఇచ్చి ఈ పని చేయించిందని చెబుతారు. దీంతో అప్పు, కల్యాణ్ షాక్ తింటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.