బ్రహ్మముడి ఫిబ్రవరి 25 ఎపిసోడ్: రాహుల్‌ను చంపేసిన రాజ్.. బాంబు పేలుడులో కన్నుమూసిన కావ్య.. గన్ను పట్టిన రుద్రాణి

బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని బాంబు పేల్చి చంపాలని చూస్తుంది రుద్రాణి. బాంబును పేల్చేస్తుంది. అయితే రాజ్, అపర్ణ, సుభాష్ మాత్రమే బతుకుతారు. రాహుల్ ను రాజ్ చంపేస్తాడు.

Published on: Feb 25, 2026, 07:14:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఫిబ్రవరి 25 ఎపిసోడ్ లో రాహుల్ ను చంపేస్తాడు రాజ్. బాంబు పేలుడులో రాజ్, అపర్ణ, సుభాష్ తప్ప మిగిలిన అందరూ కన్నుమూసినట్లుగా ఈ ఎపిసోడ్ లో చూపించారు. రాహుల్ ను రాజ్ చంపడం చూసి వచ్చిన రుద్రాణి.. రాజ్ తోపాటు మిగిలిన వాళ్లను చంపడానికి వస్తుంది.

బ్రహ్మముడి ఫిబ్రవరి 25 ఎపిసోడ్: రాహుల్‌ను చంపేసిన రాజ్.. బాంబు పేలుడులో కన్నుమూసిన కావ్య.. గన్ను పట్టిన రుద్రాణి
బ్రహ్మముడి ఫిబ్రవరి 25 ఎపిసోడ్: రాహుల్‌ను చంపేసిన రాజ్.. బాంబు పేలుడులో కన్నుమూసిన కావ్య.. గన్ను పట్టిన రుద్రాణి

స్వప్నను తీసుకెళ్లిన అప్పు, కావ్య.. ప్లాన్ మార్చాలన్న రాహుల్

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ బస్సులో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తున్న సీన్ తో మొదలైంది. అప్పు, కావ్య వచ్చి అక్క స్వప్నను కూడా కారులో నుంచి తీసుకెళ్తారు. దీంతో రాహుల్ కంగారు పడతాడు. తల్లికి ఫోన్ చేసిన జరిగిన విషయం చెప్పి ప్లాన్ మార్చమని అంటాడు.

కానీ రుద్రాణి వినదు. భార్య కావాలా, ఆస్తి కావాలా.. బంగ్లా బతుకు కావాలా, బానిస బతుకు కావాలా తేల్చుకో.. అయినా స్వప్నను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు కదా.. ఈ త్యాగం తప్పదు అని చెప్పడంతో రాహుల్ సరే అంటాడు. దూరం నుంచి వాళ్ల చావు చూడు అని రుద్రాణి చెబుతుంది.

బస్సును పేల్చేసిన రుద్రాణి

దుగ్గిరాల ఫ్యామిలీ ప్రయాణిస్తున్న బస్సు రుద్రాణి వేచి చూస్తున్న మూల మలుపులోకి వస్తుంది. దీంతో వెంటనే రుద్రాణి రిమోట్ నొక్కతుంది. ఒక్కసారి బాంబు పేలిపోతుంది. బస్సులో ఉన్న వాళ్లంతా చెల్లాచెదురుగా పడిపోతారు. బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఎగిరి చెల్లాచెదురుగా పడిపోతారు. దూరం నుంచి ఆ సీన్ చూసి రాహుల్, రేఖ సంతోషిస్తూ ఉంటారు.

ప్రమాదం నుంచి బయటపడిన అపర్ణ, సుభాష్

అందరూ చనిపోయారని అనుకుంటున్న వేళ అపర్ణలో కదలిక వస్తుంది. తీవ్ర గాయాలతోనూ ఆమె మెల్లగా లేస్తుంది. చుట్టూ అందరూ పడిపోవడం చూసి ఏడుస్తుంది. మొదట రాజ్ దగ్గరికి, తర్వాత అల్లుడి దగ్గరికి, ఆ తర్వాత కావ్య దగ్గరికి వెళ్లి లేపడానికి ప్రయత్నించినా వాళ్లు లేవరు. కావ్య చేతుల్లోని బిడ్డ మాత్రం సురక్షితంగా ఉంటుంది.

నీ ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడుకున్న పాపను చూడంటూ ఏడుస్తూ కావ్యను లేపే ప్రయత్నం చేస్తుంది అపర్ణ. కానీ ఫలితం ఉండదు. చివరికి సుభాష్ లో కదలిక వస్తుంది. అతని చేతిలోనూ అప్పు, కల్యాణ్ కూతురు ఉంటుంది. ఇదంతా కారులో నుంచి చూస్తున్న రాహుల్, రేఖ షాక్ తింటారు.

పిస్టల్‌తో కాల్చేయాలని చూసిన రాహుల్.. కాపాడిన రాజ్

శతృశేషం మిగలకూడదంటూ చేతిలో గన్ను పట్టుకొని బయటకు వస్తాడు రాహుల్. అతన్ని చూడగానే అంబులెన్స్ కు ఫోన్ చేయురా అని అపర్ణ వేడుకుంటుంది. కానీ సడెన్ గా అతడు గన్ను చూపించి చంపాలనుకున్న వాళ్లే ఎలా కాపాడతారనుకున్నావ్ అని రాహుల్ అంటాడు. అది చూసి అపర్ణ షాక్ తింటుంది. సుభాష్ తీవ్ర గాయాలతో పైకి లేవలేకపోతాడు. ఆస్తి కోసమే ఇదంతా చేశానంటూ అపర్ణను రాహుల్ చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే రాజ్ అతన్ని అడ్డుకుంటాడు.

రాహుల్‌ను చంపేసిన రాజ్

ఎందుకిదంతా చేశావ్.. డబ్బు కోసమా అని రాహుల్ ను అడుగుతాడు రాజ్. అడిగితే ఇచ్చే వాడిని కదరా అని అంటాడు. ఇదేరా నీతో ప్రాబ్లమ్.. ఇవ్వడానికి నువ్వెవడివి.. ఆ ఆస్తిలో నాకూ హక్కు ఉంది అని రాహుల్ అంటాడు. అందుకే మిమ్మల్ని చంపడానికి మా అమ్మతో కలిసి ప్లాన్ చేశామని అంటూ రాజ్ ను కాల్చి చంపడానికి రాహుల్ ప్రయత్నిస్తాడు.

దీంతో రాజ్ అతనితో గొడవ పడతాడు. ఈ క్రమంలో బుల్లెట్ రాహుల్ కు తగులుతుంది. రాజ్ మరోసారి అతన్ని కాలుస్తాడు. దీంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలుతాడు. అది చూసి అపర్ణ, సుభాష్ సంతోషించగా.. కారులో ఉన్న రేఖ షాక్ తింటుంది.

రుద్రాణి ఎంట్రీ

ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న రుద్రాణి.. రాహుల్ ను రాజ్ కాల్చి చంపడంతో వాళ్ల దగ్గరికి వెళ్తుంది. రాజ్ తలపై కర్రతో కొడుతుంది. నువ్వు నా వారసుడిని చంపావు కదా.. నేనూ మీ వాళ్లను చంపుతానంటూ గన్ను తీసుకుంటుంది. అపర్ణ వైపు గురి పెడుతుంది. ఇటు నేలపై పడిపోయిన రాజ్.. వాళ్లను నువ్వే కాపాడాలి కావ్య అంటూ ఆమెను లేపే ప్రయత్నం చేస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More