Brahmamudi July 13th Episode: బ్రహ్మముడి.. నా బావను నా ఇంటికే తీసుకెళ్తానన్న ఇందు.. చలపతికి షాక్.. దుగ్గిరాల ఇంటికి రాజు
Brahmamudi July 13th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 13 ఎపిసోడ్ లో చలపతికి ఇందు పెద్ద షాకే ఇస్తుంది. రాజు తన బావ అని తెలుసుకున్న ఆమె.. అతన్ని తన ఇంటికే తీసుకెళ్తానని తేల్చి చెబుతుంది. అతని జీవితంలో నుంచి వెళ్లిపోయే ప్రసక్తే లేదని అంటుంది.
Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా, ఎమోషనల్ గా సాగిపోయింది. రాజుకు యాక్సిడెంట్ కావడం, తాము పెంచుకున్న కొడుకు కోసం చలపతి, లక్ష్మీ కన్నీరుమున్నీరవడం.. రాజు దుగ్గిరాల వారసుడు అని తెలుసుకున్న ఇందు.. అతన్ని తన వెంటే తీసుకెళ్తానని పట్టుబట్టడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ రక్తి కట్టించింది.

రేఖకు రాజు ఫోన్.. లక్కీని తీసుకొస్తానని వార్నింగ్
నీ తల్లి నీకు దొరికేసినట్లే.. కొన్ని గంటలు ఆగు అని రేఖే అతని తల్లి అని లక్కీకి చెప్పకుండా రాజు వెళ్లిపోయే సీన్ తో సీరియల్ లేెటెస్ట్ ఎపిసోడ్ మొదలవుతుంది. ఆ తర్వాత రేఖకు ఫోన్ చేస్తాడు రాజు. ఏంటి పిన్ని.. నిజం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావా.. లేక టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు.
వెంటనే ఇంట్లో వాళ్లకు నిజం చెప్పెయ్.. లక్కీకి నీ తల్లి దొరికేసిందని ఇప్పటికే చెప్పాను.. నీ ఫోన్ కోసం వాడు వెయిట్ చేస్తున్నాడు.. నువ్వు చెప్పకపోతే లక్కీని నేరుగా ఇంటికే తీసుకొచ్చి అందరి ముందూ నిజం చెప్పేస్తానని వార్నింగ్ ఇస్తాడు. వాడికి నా పేరు చెప్పావా అని రేఖ అడుగుతుంది. లేదు.. అది నీ నోటితోనే వినాలని రాజు అంటాడు. సరే అని ఫోన్ పెట్టేస్తుంది.
రాజుకు ఫుల్‌స్టాప్ పెడతానన్న రేఖ.. వినేసిన స్వాతి
ఆ తర్వాత ఐశ్వర్య, భ్రమరాంబ కలిసి రేఖ దగ్గరికి వచ్చి నందు గురించి చెబుతారు. అది పెద్ద విషయమే కాదన్నట్లు రేఖ పట్టించుకోదు. రాజు గురించి ఆలోచిస్తున్నావా అని ఐశ్వర్య అడుగుతుంది. అతని వల్లే నందు ఇంటికి వచ్చిందని అంటుంది.
ఇక ఆ రాజుగాడి ఛాప్టర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచిస్తున్నాను.. ఈరోజుతో రాజు కాస్తా లేట్ రాజు అవుతాడు అని వాళ్లతో అంటుంది రేఖ. అది కాస్తా స్వాతి వింటుంది. రాజును లేపేయడానికి అంతా సిద్ధం చేశానని, మరికాసేపట్లో వార్త వస్తుందని, ఇక వాడి పీడ విరగడైనట్లే.. మళ్లీ మన రాజ్యమే వస్తుందని రేఖ స్పష్టం చేస్తుంది.
ఇందుకి రేఖ ప్లాన్ చెప్పిన స్వాతి.. ఫోన్ చేసినా ఎత్తని రాజు
స్వాతి పరుగెత్తుకుంటూ వెళ్లి ఇందుకి అసలు విషయం చెబుతుంది. రేఖ ఆంటీ రాజుని ఏదో చేయబోతోందని అంటుంది. దీంతో వెంటనే రాజుకు ఫోన్ చేస్తుంది ఇందు.
అప్పటికే లక్కీ మరోసారి రాజుకు ఫోన్ చేసి తన తల్లి ఎవరో చెప్పరా అని అడుగుతూ ఉంటాడు. దీంతో ఫోన్ బిజీ వస్తుంది. వీడు మళ్లీ మళ్లీ ఇలా ఫోన్ చేసి విసిగిస్తూనే ఉంటాడు.. ఫోన్ సైలెంట్ లో పెట్టేస్తాడు రాజు. దీంతో ఇందు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాజు లిఫ్ట్ చేయడు.
చలపతికి ఇందు ఫోన్.. రాజు ప్రాణాలు ప్రమాదంలో అంటూ..
దీంతో చలపతికి ఇందు ఫోన్ చేస్తుంది. రాజు ఇంట్లోనే ఉన్నాడా అని అడుగుతుంది. లేడు.. అయినా నువ్వు మళ్లీ ఎందుకు ఫోన్ చేశావ్.. ఇక చేయకు అని అంటాడు. దీంతో రాజు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, రేఖ ఆంటీ అతన్ని చంపేందుకు ప్లాన్ చేసిందని ఇందు చెబుతుంది. దీంతో చలపతి, లక్ష్మీ కంగారు పడతారు. ఇందు ఫోన్ పెట్టేసిన తర్వాత చలపతి కూడా రాజుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. దీంతో అటు ఇందు, ఇటు తల్లిదండ్రులు రాజును వెతకడం కోసం బయలుదేరుతారు.
రాజుకు యాక్సిడెంట్.. రేఖ ఫుల్ ఖుష్..
రాజు బైక్ పై వెళ్లుండగా వెనకాలే అతన్ని రేఖ మనిషి ఫాలో అవుతాడు. రేఖకు ఫోన్ చేసి వాడు నా ముందే ఉన్నాడు.. మీరు ఓకే అంటే గుద్దేస్తాను అని అంటాడు. వెంటనే ఆ పని చెయ్.. నీకు రూ.5 లక్షలు ఇస్తానని రేఖ చెబుతుంది. దీంతో వేగంగా వచ్చి రాజును ఢీకొడతాడు. రాజు కింద పడి అతని తల చెట్టుకి బలంగా తాకుతుంది. తీవ్రంగా రక్తం కారుతుంది. అతడు చనిపోయాడని రేఖకు ఫోన్ చేసి చెబుతాడు ఆ వ్యక్తి. దీంతో ఫుల్ ఖుషీ అవుతూ అతనికి డబ్బు పంపిస్తుంది రేఖ.
ఇందుకి అసలు నిజం చెప్పేసిన చలపతి
రాజును వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్తారు. తలకు బలమైన గాయమై రక్తం పోవడంతో డాక్టర్లు అతనికి చికిత్స చేస్తూ ఉంటారు. చలపతి, లక్ష్మీ కంగారు పడుతూ ఉండగా ఇందు వస్తుంది. దీంతో ఆమెను చూసి చలపతి తిడతాడు. మళ్లీ ఎందుకు వచ్చావని నిలదీస్తాడు. నీ మొగుడని తెలిస్తేనే రేఖ వాడిని చంపాలని చూసింది.. ఇక వాడు దుగ్గిరాల వారసుడు అని తెలిస్తే ఇంకేం చేస్తుందో అని చలపతి అసలు నిజం చెప్పేస్తాడు.
రాజు పెంచుకున్న కొడుకని చెప్పిన చలపతి.. ఇందు షాక్
అది విని ఇందు షాక్ తింటుంది. రాజు దుగ్గిరాల వారసుడేంటి అని అడుగుతుంది. దీంతో 20 ఏళ్ల కిందట జరిగిన యాక్సిడెంట్ గురించి చలపతి చెబుతాడు. అందులో అందరూ ప్రాణాలు కోల్పోయారు.. రాజు మాత్రం మిగిలాడు.. అతడు మాకు దొరకడంతో ఇంటికి తీసుకొచ్చాం.. గతం మరచిపోవడంతో మా కన్న కొడుకులాగా పెంచుకున్నాం.. రాజు మీ నాన్న వాళ్ల అక్క కొడుకు అని చెప్పడంతో ఇందు నోట మాట రాదు. రేఖకు ఈ విషయం తెలిస్తే వాడిని ఎక్కడ చంపుతుందో అన్న భయంతో వాడిని మీ ఇంటి వైపు రాకుండా చేశామని కూడా చలపతి చెబుతాడు.
బావను తీసుకెళ్తానన్న ఇందు
అందుకే చెబుతున్నాను.. ఇక ఎప్పటికీ రాజు జీవితంలోకి రావద్దు.. వాడికి దూరంగా వెళ్లిపో.. వాడు మా కన్న కొడుకు కాకపోయినా మా కొడుకుతో సమానంగా పెంచుకున్నాం.. వాడికేమైనా అయితే తట్టుకోలేం.. నువ్వు వెళ్లిపో అని చలపతి దండం పెడతాడు. ఇంటికెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటుంది ఇందు. తనకు తోడుగా బావను ఉంచినందుకు కృతజ్ఞత చెబుతుంది. కా
నీ అతడికి ఏమీ కాకుండా చూడాలని మొక్కుకుంటుంది. తిరిగి హాస్పిటల్ కు వచ్చిన ఆమెను చలపతి మళ్లీ వారిస్తాడు. కానీ రాజు నా బావ.. నా బావను నా ఇంటికి తీసుకెళ్తాను.. దూరంగా ఉండటం కుదరదు అని చలపతికి ఇందుకు తేల్చి చెప్పడంతో అతడు షాక్ తింటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


