...
...
Next Story

Brahmamudi July 17th Episode: బ్రహ్మముడి.. అత్తారింట్లో ఇందుకి ఫస్ట్ నైట్.. బెండైపోయిన రాజు.. భ్రమరాంబతో ఆడుకున్న నందు

Brahmamudi Serial July 17th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 17 ఎపిసోడ్ లో అటు రాజు, ఇందు ఫస్ట్ నైట్ కు రెడీ కాగా.. ఇటు దుగ్గిరాల ఇంట్లో భ్రమరాంబ, ఐశ్వర్యలకు ఫెవికాల్ తో నోళ్లు మూయిస్తుంది నందు.

Published on: Jul 17, 2026, 07:53:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఇందు ఎంత బతిమాలినా రాజు ఏమాత్రం వెనక్కి తగ్గడు. తాను మళ్లీ ఆ ఇంటికి రాను అని తేల్చి చెబుతాడు. దీంతో అత్తమామల మనసు గెలుచుకున్న ఇందు.. రాజుతో ఓ ఆటాడుకుంటుంది. చివరికి ఫస్ట్ నైట్ సీన్ తో ఇందు ముందు రాజు బెండైపోతాడు.

ఉప్మాలో ఫెవికాల్.. భ్రమరాంబకు నందు దిమ్మదిరిగే షాక్

Brahmamudi July 17th Episode: బ్రహ్మముడి.. అత్తారింట్లో ఇందుకి ఫస్ట్ నైట్.. బెండైపోయిన రాజు.. భ్రమరాంబతో ఆడుకున్న నందు
Brahmamudi July 17th Episode: బ్రహ్మముడి.. అత్తారింట్లో ఇందుకి ఫస్ట్ నైట్.. బెండైపోయిన రాజు.. భ్రమరాంబతో ఆడుకున్న నందు

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (జులై 17) ఎపిసోడ్ భ్రమరాంబ, ఐశ్వర్యలకు నందు బుద్ధి చెప్పే సీన్ తో మొదలవుతుంది. అపర్ణ చేసిన ఉప్మా బాగా లేకపోవడంతో భ్రమరాంబ రచ్చ చేస్తుంది. దీంతో నందు ఎంతో సాఫ్ట్ గా మాట్లాడుతుంది. తన చేతులతో ఎంతో మందికి వంట చేసి పెట్టాలనని, మీకోసం స్పెషల్ గా ఉప్మా చేసి తీసుకొస్తానని వెళ్తుంది.

నందు వాలకం తేడాగా ఉండటంతో శేషు మాత్రం ముందే తనకు పెట్టింది తినేస్తాడు. అటు అనుకున్నట్లే నందు ఉప్మాలో ఫెవికాల్ వేసి తీసుకొస్తుంది. వాసన ఘుమఘుమలాడుతోంది.. ఉప్మా ఇలా చేయాలంటూ అపర్ణతో భ్రమరాంబ అంటుంది.

ఐశ్వర్య, భ్రమరాంబ నోళ్లకు తాళాలు

ఐశ్వర్యకు ఏదో డౌట్ వచ్చి ముందు మీరు తినండని భ్రమరాంబతో అంటుంది. ఆమె ఆకలి దంచేస్తోంది.. ఇంకా పెట్టు ఇంకా పెట్టు అంటూ ప్లేటులో ఉప్మా పెట్టించుకుంటుంది. నోట్లో పెట్టుకోగానే అది కాస్తా అతుక్కుపోతుంది. ఆమెకు నోరు తెరవడానికి కూడా రాదు. ఆ టేస్టును భ్రమరాంబ బాగానే ఎంజాయ్ చేస్తుందేమో అనుకొని ఐశ్వర్య కూడా వద్దని వారిస్తున్నా ఉప్మా నోట్లో పెట్టుకుంటుంది. దీంతో ఆమె నోరు కూడా మూతపడుతుంది.

క్లాస్ పీకిన నందు

అటు అత్తారింట్లో ఇందు మెల్లగా పాగా వేస్తుంది. చలపతి, లక్ష్మీ ముందే రాజును కోపంగా చూస్తుంది. రూమ్ లోకి రా అని అనడంతో అందరూ షాక్ తింటారు. కాలికి మర్దనా చేయాలి కదా అనడంతో ఊపిరి పీల్చుకుంటారు. నువ్వు వద్దు.. నాకు మా అమ్మే చేయాలని రాజు అంటాడు. లక్ష్మీ మాత్రం ఇక నుంచి అన్ని పనులు నీ భార్యే చేస్తుందని చెప్పి వెళ్లిపోతుంది.

అటు చలపతి కూడా ఇందుకే సపోర్ట్ చేస్తాడు. రాను అని రాజు మొండికేయడంతో మరో కాలు కూడా విరగ్గొడతానని ఇందు అంటుంది. చలపతి ఓ రోకలి బండ తీసుకొచ్చి ఇస్తాడు. దీంతో రాజు నాన్నా కాపాడు అంటూ వేడుకుంటాడు. ఇన్నేళ్లుగా నేను చేయలేని పని ఒక్క రోజులో చేశావ్.. వీడు నా ముందు మోకరిల్లేలా చేశావని ఇందుతో అంటాడు చలపతి. మర్యాదగా ఆమెతో కాలికి మర్దనా చేయించుకో అని ఆర్డర్ వేసి వెళ్లిపోతాడు.

ఇందు ఎమోషనల్.. నమ్మని రాజు

తర్వాత రాజును మోసుకుంటూ ఇందు బయటకు తీసుకెళ్తుంది. అతని కాలికి మర్దనా చేస్తూ ఇందు ఎమోషనల్ అవుతుంది. నేను ఎంతగా రానని చెప్పినా ఎందుకు వినడం లేదు అని రాజు అంటాడు. నీ వల్ల నాకు మంచి జరిగిందని ఇందు అంటుంది. కానీ నీ వల్లే నాకిలా జరిగిందని రాజు అంటాడు.

అందుకే నా వెంట తీసుకెళ్తాను.. అక్కడ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని ఇందు చెబుతుంది. నీకేమైనా జరిగితే తట్టుకోలేను అని ఏడుస్తుంది. అది చూసి ఇదో డ్రామానా.. నేను అస్సలు నమ్మను అని రాజు అంటాడు.

బావ అని పిలిచిన ఇందు.. రాజు షాక్

అయినా నేను కేవలం అద్దె మొగుడు అని తెలిసినా కూడా ఎందుకు ఇంట్లో అసలు మొగుడు అయినట్లు ఓవరాక్షన్ చేస్తున్నావ్ అని ఇందుని అడుగుతాడు రాజు. ఆ విషయం నీకు చెప్పలేను బావ అని ఇందు మనసులో అనుకుంటుంది. నిజంగా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావా అని అడుగుతాడు రాజు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే చెప్పు.. నీలాంటిదాన్ని నేను అస్సలు చేసుకోను.. పెళ్లి చేసుకోకుండా అయినా ఉంటానని రాజు అంటాడు.

ఈ క్రమంలోనే ఇందు రాజుని మరోసారి బావ అని పిలుస్తుంది. అది విని రాజు షాక్ తింటాడు. ఏదో ప్రేమతో అలా పిలిచానని ఇందు కవర్ చేసుకుంటుంది. నువ్వెంత ప్రేమ కురిపించినా ఈ రాజు బెండవడు ని అంటాడు. అయినా మనం నిజంగానే పెళ్లి చేసుకున్నామని ఇంట్లో వాళ్లు అనుకుంటున్నారని, అందుకే పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తారని రాజు అంటాడు.

ఇందు, రాజు ఫస్ట్ నైట్

ఆ తర్వాత రాజు అన్నట్లే ఆ రోజు రాత్రి ఇందు కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబవుతుంది. తలనిండా పూలు పెట్టుకొని, చేతిలో పాల గ్లాసుతో గదిలోకి వచ్చి తలుపు వేయడంతో రాజు ఏం చేస్తున్నావని అంటాడు. ఏం చేయాలో అదే చేస్తున్నానని రాజు దగ్గరికి వస్తుంది ఇందు. ఈ పాలు తాగు అంటూ ఇస్తూ రాజు బుగ్గపై ప్రేమతో సుతారంగా తాకుతుంది. దీంతో రాజు బెండైపోతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe