బ్రహ్మముడి జులై 1 ఎపిసోడ్: రాజుని లాక్కెళ్లిన చలపతి.. దుగ్గిరాల ఇంట్లో హైడ్రామా.. ఇందుకు ప్రామిస్ చేసిన రాజు

Brahmamudi July 1st Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 1 ఎపిసోడ్ లో పెద్ద ట్విస్టే ఎదురైంది. రాజు అసలు సీక్రెట్ తెలుసుకోవడానికి అతని తల్లిదండ్రులకు పెళ్లి గురించి సమాచారం చేరవేస్తుంది రేఖ. దీంతో చలపతి నేరుగా దుగ్గిరాల ఇంటికి రావడంతో హైడ్రామా నడుస్తుంది.

Published on: Jul 1, 2026, 08:04:50 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందులకు పెద్ద షాకే ఇస్తుంది రేఖ. వీళ్ల దొంగ పెళ్లి గురించి చలపతి, లక్ష్మీలకు తెలియడంతో వాళ్లు నేరుగా దుగ్గిరాల ఇంటికే వస్తారు. అయితే ఆ తర్వాత జరిగిన డ్రామా ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచేలా సాగింది.

బ్రహ్మముడి జులై 1 ఎపిసోడ్: రాజుని లాక్కెళ్లిన చలపతి.. దుగ్గిరాల ఇంట్లో హైడ్రామా.. ఇందుకు ప్రామిస్ చేసిన రాజు
బ్రహ్మముడి జులై 1 ఎపిసోడ్: రాజుని లాక్కెళ్లిన చలపతి.. దుగ్గిరాల ఇంట్లో హైడ్రామా.. ఇందుకు ప్రామిస్ చేసిన రాజు

రాజుకు ప్రేమతో స్వీట్ తినిపించిన ఇందు

హర్ష కాంట్రాక్ట్ కుదరడం రాజు వల్లే అని భావించిన ఇందు అతనికి ప్రేమగా స్వీటు తినిపించడానికి వెళ్తుంది. కానీ రాజు మాత్రం ఇదంతా భ్రమ అని అనుకుంటాడు. ఆమె వెంట పడుతున్నా స్వీటు తినడు. చివరికి ఆమె అతన్ని గట్టిగా గిల్లడంతో అది నిజమని తెలుసుకుంటాడు. నీవల్లే ఈ కాంట్రాక్ట్ ఓకే అయిందని, అందుకే నోరు తీపి చేద్దామని స్వీటు పెడుతున్నట్లు చెబుతుంది. ఆ తర్వాత అతనికి స్వీటు పెట్టి అదే ఎంగిళిని తాను తినడంతో రాజు షాకవుతాడు.

ఇందు ఎమోషనల్.. నీవల్లే ఇలా ఉన్నానంటూ..

ఇందు బాగా ఎమోషనల్ అవుతుంది. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇలా ఉన్నాను.. అంతకుముందు ఎండినపోయిన కట్టెలా ఉన్న నేను మళ్లీ చిగురించాను.. బయటకు వెళ్లాను.. కంపెనీకి సీఈవో అయ్యాను.. ఇప్పుడు కాంట్రాక్టు కూడా దక్కించుకున్నాను అని ఇందు ఎమోషనల్ అవుతుంది. జీవితాంతం ఇలాగే అండగా ఉంటావా అని అన్న ఇందు తర్వాత తేరుకొని తనకు ఎప్పుడూ ఇలాగే సాయం చేస్తావా అని అడుగుతుంది.

రేఖను రెచ్చగొట్టిన ఐశ్వర్య.. రాజు, ఇందులపై అనుమానం

అటు రేఖను రెచ్చగొట్టడానికి వెళ్తుంది ఐశ్వర్య. తాను అప్పుడే చెప్పినా వినలేదని, ఇందు, రాజు తోడు దొంగలని మరోసారి చెబుతుంది. నీ మాట విని పార్టీలో ఫూల్ అయ్యానని రేఖ అంటే.. ఒకవేళ వాళ్లు నిజంగా పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులను ఎందుకు ఇంటికి తీసుకురావడం లేదని ఐశ్వర్య నిలదీస్తుంది.

రాజు ఏదో దాస్తున్నాడని చెప్పడంతో రేఖలో అనుమానం మొదలవుతుంది. ఇన్నాళ్లూ రాజు వైపు ఎలాంటి వీక్‌నెస్ లేదనుకున్నాను.. ఇప్పుడు దొరికాడు.. ఇక వదలను అని రేఖ అనుకుంటుంది.

అండగా ఉంటానన్న రాజు.. రేఖ పని చూసుకుందామంటూ..

ఇటు రాజు ఇందుకు ప్రామిస్ చేస్తాడు. అండగా ఉంటానని భరోసా ఇస్తాడు. తనకు డబ్బే ముఖ్యమని, నీకు అద్దె మొగుడిగా ఉంటూ నీ పని పూర్తయ్యే వరకూ అండగా ఉంటానని హామీ ఇస్తాడు. గాయపడ్డ రేఖ ఏం చేస్తుందో అని ఇందు ఆందోళన చెందితే.. ఆమెకు ఒకటే బ్రెయిన్, మనవి రెండు బ్రెయిన్స్.. ఆమె ఏం చేసినా చూసుకుందామంటూ ఇందుకు రాజు ధైర్యం చెబుతాడు.

రాజు తల్లిదండ్రులకు పెళ్లి గురించి చెప్పిన రేఖ మనిషి

రేఖ మరుసటి రోజే తన ప్లాన్ అమలు చేస్తుంది. చలపతికి అప్పు ఇచ్చిన వ్యక్తి తమ్ముడిని రంగంలోకి దింపుతుంది. తన పేరు రాకుండా రాజు దుగ్గిరాల ఇంటికి అల్లుడైన విషయం చెప్పాలని అతన్ని పంపిస్తుంది. అతడు వెళ్లి తన అన్న డబ్బు తిరిగి ఇవ్వాలని చలపతిని డిమాండ్ చేస్తాడు. తన చిన్న కొడుకు ఉద్యోగం పోయిందని, టైమ్ కావాలని అడిగితే.. మరి నీ పెద్ద కొడుకు గొప్పింటికి అల్లుడైన సంగతేంటని నిలదీస్తాడు.

వాళ్లు షాక్ లో ఉండగానే మీ పెద్ద కొడుకు దుగ్గిరాల ఇంటికి అల్లుడయ్యాడు.. ఇందుని పెళ్లి చేసుకున్నాడు.. అతన్ని అడిగి 24 గంటల్లో మా అన్న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందే అని చెప్పి వెళ్లిపోతాడు. బయటకు వెళ్లి రేఖకు పని పూర్తయిందని చెబుతాడు. ఇప్పుడు ఆ రాజు ఎలా తప్పించుకుంటాడో చూస్తానని ఆమె అనుకుంటుంది.

దుగ్గిరాల ఇంటికి చలపతి, లక్ష్మీ

రాజు పెళ్లి విషయం తెలిసి చలపతి, లక్ష్మీ షాక్ తింటారు. అతడు ఇందుని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఆమెను ఇంటికి తీసుకొచ్చినప్పుడు అబద్ధం చెప్పాడా? అయినా రాజు దుగ్గిరాల ఇంటికి అల్లుడిగా ఉండకూడదు అని చలపతి అంటాడు. వెంటనే ఆ ఇంటికి వెళ్దామని లక్ష్మీని సిద్దం చేస్తాడు.

ఇటు ఇంట్లో అందరి ముందే రాజు, ఇందు ఎంతో సంతోషంగా సరసాలుడుతూ ఉండగా చలపతి, లక్ష్మీ రావడం చూసి షాక్ తింటారు. ఇందును నిజంగానే పెళ్లి చేసుకున్నావా అని చలపతి అడిగితే.. అవునని రాజు అంటాడు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ రాజును చలపతి లాక్కెళ్తుంటాడు. ఇంతలో ఇందుకి ఇచ్చిన ప్రామిస్ గుర్తుకు వచ్చి తండ్రిని రాజు ఎదిరిస్తాడు. ఈ హైడ్రామా మధ్య బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More