బ్రహ్మముడి జూన్ 27 ఎపిసోడ్: రాజుతో పీకల్లోతు ప్రేమలో ఇందు.. నిమ్మకాయలతో బోల్తా కొట్టించిన శృతి.. రేఖ ప్లాన్ ఫ్లాప్
Brahmamudi Serial June 27th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 27 ఎపిసోడ్ లో రేఖ ప్లాన్ అట్టర్ ఫ్లాపవుతుంది. తన కోసం వచ్చిన రౌడీలను నిమ్మకాయలతో శృతి బోల్తా కొట్టిస్తుంది. అటు హర్ష డీల్ ఓకే కావడంతో రాజుతో పీకల్లోతు ప్రేమలో పడుతుంది ఇందు.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా టాప్ సీరియల్స్ లో ఒకటైన బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేలా విలన్ రేఖ ప్లాన్ అట్టర్ ఫ్లాపవుతుంది. డిజైన్లను అడ్డుకోవడానికి ఆమె వేసిన ప్లాన్లన్నీ ఎదురుతన్నడంతో రాజు, ఇందు స్వీట్లతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే రాజు ప్రేమలో పడుతుంది ఇందు.

ఇందు డిజైన్లు చూసి ఎగతాళి చేసిన రాజు
రాజు, ఇందు చాలా సీరియస్ గా డిజైన్లు వేసే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ శనివారం (జూన్ 27) ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇందు వేసిన డిజైన్లు చూసి రాజు ఎగతాళి చేస్తాడు. ముగ్గులు వేయడం, కోన్ తో మెహెందీ పెట్టడం వచ్చా అని అడుగుతాడు. వచ్చు అని ఇందు చెప్పడంతో అవి వచ్చినా ఇంత దరిద్రంగా వేస్తావా అంటూ నవ్వుతాడు. నీ డిజైన్లు చూపించమని రాజుని అడిగి నీవి కూడా అలాగే ఉన్నాయి కదా అని ఇందు అంటుంది.
ఇందు, రాజు డిజైన్లు చూసి నవ్విన అపర్ణ
అటు అప్పుడే వచ్చిన అపర్ణ ఇద్దరి డిజైన్లు చూసి నవ్వుతుంది. మీకంటే చిన్న పిల్లల డ్రాయింగ్స్ బాగుంటాయని అంటుంది. అప్పుడే శృతి తన డిజైన్లు పంపిస్తుంది. ఇవి బాగున్నాయంటూ.. కొన్ని మార్పులు చెబుతుంది ఇందు. ఆ మార్పులు చేస్తానని శృతి అంటుంది.
మా అమ్మ టాలెంట్ నాకు లేకపోయినా.. ఎవరినీ ఎలా సరిగ్గా వాడుకోవాలో మాత్రం తెలుసని అపర్ణతో ఇందు అంటుంది. అవును కరెక్టే.. నన్ను వాడుకుంటుంది కదా అని రాజు అంటాడు. ఇద్దరినీ చూసి అపర్ణ ఆశ్చర్యపోతుంది. ఓసారి తిట్టుకుంటారు.. ఓసారి వెక్కిరించుకుంటారు.. మరోసారి ప్రేమ కురిపించుకుంటారు.. ఏంటో మీరు అని అపర్ణ అంటుంది.
శృతికి రేఖ ఫోన్.. పని పూర్తవ్వొద్దని వార్నింగ్
మరోవైపు శృతికి రేఖ ఫోన్ చేస్తుంది. డిజైన్లు ఎంత వరకూ వచ్చాయని అడుగుతుంది. పూర్తయ్యాయని, ఫైనల్ టచెస్ ఇస్తున్నట్లు చెబుతుంది. అయితే రేఖ మాత్రం పని పూర్తి కాకూడదని, సమయానికి డిజైన్లు ఇవ్వొద్దని వార్నింగ్ ఇస్తుంది. హాస్పిటల్లో ఉన్న మీ అమ్మగారు బాగుండాలి కదా.. ఆమె ట్రీట్మెంట్ కోసం ఎంత డబ్బయినా నేనే ఇస్తాను అని రేఖ ఆశ చూపుతుంది. దీంతో శృతి కూడా సరే అంటుంది. డిజైన్లు సమయానికి ఇవ్వనని చెబుతుంది.
డాక్టర్‌కు రాజు ఫోన్.. నిలదీసిన ఇందు..
రాత్రి ఇందు నిద్రపోయిన తర్వాత రాజు మెల్లగా లేస్తాడు. బయటకు వెళ్లి డాక్టర్ కు ఫోన్ చేస్తాడు. డబ్బు పంపించాను అందిందా అని అడుగుతాడు. తనకు ఎలా ఉంది అని అడుగుతాడు. తన పరిస్థితి అలాగే ఉందని, ఇంకా ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ లేదని డాక్టర్ చెప్పడంతో రాజు నిరాశ చెందుతాడు. ఎంత ఖర్చయినా తాను భరిస్తానని, నయమయ్యేలా చేయాలని రాజు అంటాడు.
అయితే ఇదంతా చాటు వింటున్న ఇందు బయటకు వచ్చి రాజును నిలదీస్తుంది. హాస్పిటల్లో ఎవరున్నారని అడుగుతుంది. అయితే రాజు మాత్రం ఎదురు తిరుగుతాడు. అది నీకు అనవసరం.. ఇది నా పర్సనల్.. నీకు నేను కేవలం అద్దె మొగుడిని మాత్రమే.. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు.. నాకు నిజంగానే కష్టాలు ఉన్నాయని తెలిసింది కదా.. ఓ సాయం చెయ్యు.. పేమెంట్ టైమ్ కు ఇవ్వు చాలు అని చెప్పి సీరియస్ గా వెళ్లిపోవడంతో ఇందు షాక్ తింటుంది.
శృతి రాకపోవడంతో రాజు, ఇందు టెన్షన్
మరోవైపు మరుసటి రోజు హర్ష వచ్చి ఆఫీసులో కూర్చొంటాడు. కానీ శృతి మాత్రం సమయానికి రాదు. దీంతో రాజు, ఇందు టెన్షన్ పడుతుంటారు. రేఖ వచ్చి ఎవరి కోసం ఎదురు చూస్తున్నారని అడుగుతుంది. చెప్పమని రాజు అనడంతో శృతి కోసమే కదా అని అంటుంది. ఈపాటికి రావాల్సి ఉన్నా రాలేదని చెబుతూ ఇందు ఆందోళన చెందుతుంది. ఆమె ఏ పనిలో ఉందో అని రేఖ అంటుంది. క్లైంట్ ని ఎక్కువ సేపు వేచి ఉంచకూడదని, త్వరగా డిజైన్లు వచ్చేలా చూడండి అని చెప్పి రేఖ వెళ్లిపోతుంది.
శృతిని ఇంట్లోనే బంధించే ప్లాన్ వేసిన రేఖ
పక్కకు వెళ్లి శృతి ఇంటి ముందు తాను పెట్టిన రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నారు.. శృతి ఇంట్లోనే ఉంది కదా అని అడుగుతుంది. ఉదయం నుంచీ ఇక్కడే ఉన్నామని, ఆమె ఎక్కడికీ వెళ్లలేదని చెబుతారు. ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.
రౌడీలను బోల్తా కొట్టించిన శృతి
ఆ తర్వాత ఆ ఇద్దరు రౌడీలు శృతి ఇంటి దగ్గరికి వెళ్లి ఆమె ఏం చేస్తుందో చూద్దామనుకుంటారు. అంతలోపు శృతి వచ్చి గోడ అవతల చెత్త వేయడంతో అది ఆ ఇద్దరిపై పడుతుంది. వాళ్లను చూసి బయటకు వచ్చిన శృతి.. చూసుకోకుండా వేశానని చెబుతుంది. తర్వాత తిన్నారా అని అడుగుతుంది.
ఎండలు బాగా ఉన్నాయి.. నాకు కాస్త నిమ్మకాయలు తెచ్చిస్తారా.. నిమ్మరసం తాగితే ఒంట్లోని వేడంతా పోతుంది అని చెబుతుంది. దీంతో ఇద్దరూ వెళ్లి నిమ్మకాయలు తెస్తారు. తమకూ నిమ్మరసం కావాలని అడుగుతారు. అయితే ఆ నిమ్మరసంతోనే వాళ్లను బోల్తా కొట్టిస్తుంది శృతి.
రాజు ఎంగిలి తిన్న ఇందు
హర్ష డీల్ సక్సెస్ అయిన ఆనందంలో రాజు, ఇందు, సుభాష్, అపర్ణ ఉంటారు. చివరి నిమిషంలో జరిగిన గందరగోళం గురించి చెప్పడంతో ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని సుభాష్ సూచిస్తాడు. తర్వాత రాజుకు ఇందుయే స్వయంగా స్వీట్ తినిపిస్తుంది. ఆ తర్వాత ఆ ఎంగిళి తాను కూడా తింటుంది. వద్దని రాజు అంటున్నా కూడా సిగ్గు పడుతూ తింటూ రాజుతో పీకల్లోతు ప్రేమలో పడినట్లు కనిపిస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


