...
...
Next Story

Brahmamudi July 21st Episode: బ్రహ్మముడి.. రాజు గురించి నిజం దాచిన ఇందు.. రేఖపై నందు ప్రతీకారం.. లక్కీ రాకతో మారిన సీన్

Brahmamudi Serial July 21st Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 21 ఎపిసోడ్ లో రాజు గురించి ఇందు నిజం దాస్తుంది. కానీ నందులో మాత్రం అనుమానం బలపడుతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లోకి లక్కీ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోనుంది.

Published on: Jul 21, 2026, 08:08:43 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాజు తిరిగి దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టడంతో అపర్ణ మురిసిపోవడం, రేఖ షాక్ తినడం.. రాజు ఎవరన్న అనుమానం నందులో కలగడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ సాగిపోయింది. అయితే రాజు రాకతో ఇందు సంతోషం వెయ్యింతలవుతుంది.

ఇంటికి రావాలంటే కండిషన్స్ ఉన్నాయన్న రాజు

Brahmamudi July 21st Episode: బ్రహ్మముడి.. రాజు గురించి నిజం దాచిన ఇందు.. రేఖపై నందు ప్రతీకారం.. లక్కీ రాకతో మారిన సీన్
Brahmamudi July 21st Episode: బ్రహ్మముడి.. రాజు గురించి నిజం దాచిన ఇందు.. రేఖపై నందు ప్రతీకారం.. లక్కీ రాకతో మారిన సీన్

రాజును ఇందు బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లడానికి ఆటోలో బయలుదేరే సీన్ తో సీరియల్ మంగళవారం (జులై 21) ఎపిసోడ్ మొదలైంది. అయితే ఆటోను మధ్యలోనే ఆపుతాడు రాజు. ఇంటికి రావాలంటే తనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని అంటాడు.

ఏంటని అడిగితే.. ఇక నుంచి తన ఇష్టం వచ్చినట్లే ఉంటానని, బెడ్ పై పడుకుంటానని, తనకు నచ్చినట్లు ఉన్నప్పుడు పేమెంట్ కట్ చేస్తానంటే కుదరదని, అంతేకాదు నువ్వే తీసుకెళ్తున్నావు కాబట్టి పేమెంట్ 20 శాతం పెంచాలని డిమాండ్ చేస్తాడు. రాజు కండిషన్స్ అన్నింటికీ ఇందు సరే అనడంతో అతడు తిరిగి ఆటో ఎక్కుతాడు.

రాజుని చూసి మురిసిపోయిన అపర్ణ, రేఖ షాక్

రాజు ఇంటికి రాగానే అతన్ని చూసి అపర్ణ ఎంతో మురిసిపోతుంది. రేఖ ముఖం మాడిపోతుంది. కానీ రాజు గాయాలు చూసి ఏమైందని అపర్ణ అడుగుతుంది. యాక్సిడెంట్ అయిందని చెబుతాడు. ఆమె కంగారు పడుతుంది. ఏమీ కాలేదని, అందుకే నీకు ఈ విషయం చెప్పలేదని ఇందు అంటుంది.

కొన్ని రోజులు రాజు దూరమైతేనే తన ప్రాణం పోయినట్లు అయిందని, ఇప్పుడు యాక్సిడెంట్ జరగడం ఏంటని అపర్ణ ఎమోషనల్ అవుతుంది. ఆమెను చూసి రాజు షాక్ తింటాడు. ఈమె నన్ను నిజంగానే తన మనవడు అన్నట్లుగా ఫీలైపోతుందేంటి అని మనసులో అనుకుంటాడు. ఇప్పుడు రాజును నా భర్తగా కాదు.. నీ మనవడిగా తీసుకొచ్చానని ఇందు అనడం చూసి రాజు మరింత షాక్ తింటాడు.

రేఖను ఇరికించేలా మాట్లాడిన రాజు

దీంతో రేఖ చాలా కంగారుపడుతుంది. నీకు యాక్సిడెంట్ చేసిన వాళ్లు ఎవరైనా తాను వదలిపెట్టనని నందు అంటుంది. దీంతో రేఖ జోక్యం చేసుకుంటూ ఇవన్నీ ఇప్పుడు అవసరమా.. యాక్సిడెంట్ జరిగిన మనిషిని అలా నిలబెట్టి ఎంతసేపు మాట్లాడతారు.. రాజు నువ్వు రెస్ట్ తీసుకో అని పంపించేస్తుంది.

నువ్వు మారిపోయావని రేఖను నిలదీసిన శేషు

అందరూ వెళ్లిపోయిన తర్వాత శేషు తనదైన రీతిలో రేఖను నిలదీస్తాడు. నువ్వు మారిపోయావు చెల్లెమ్మా.. ప్లాన్ ప్రకారం వెళ్లగొట్టిన రాజు తిరిగి ఇంటికి వస్తే రెస్ట్ తీసుకోమని అంటావా.. నందు గురించి భ్రమరాంబ, ఐశ్వర్య చెబుతుంటే పట్టించుకోవా.. నువ్వు మారిపోయావ్ అని అంటాడు. తాను మారలేదని, ప్రతీసారి దెబ్బ కొట్టడం కుదరదని, కొన్నిసార్లు సైలెంట్ గా ఉండాల్సి వస్తుందని ఆవేశంగా చెప్పి రేఖ వెళ్లిపోతుంది.

ఇందు మాటలతో రాజు అయోమయం

రాజు ఇంటికి రాగానే కండిషన్స్ అవీ ఏమీ లేవు అని ఇందు ప్లేటు ఫిరాయిస్తుంది. ఇది మన ఇల్లు అని అంటుంది. ఆమె మాటలు విని రాజు అయోమయానికి గురవుతాడు. ఇది నీ ఇల్లు.. నీకు అద్దె మొగుడిగానే తాను వచ్చానని రాజు అంటాడు. నీ కండిషన్స్ కు ఒప్పుకోనని ఇందు అనడంతో తాను వెళ్లిపోతానని రాజు బెదిరిస్తాడు. సరే వెళ్లు అని ఇందు అంటుంది. మీ నాన్నమ్మ వాళ్లను నన్ను వెళ్లనివ్వరనే కదా నీ ధైర్యం అని రాజు అంటాడు. అవును అని చెప్పి ఇందు వెళ్లిపోతుంది.

సంబరపడిపోయిన ఇందు.. రాజు ఎవరని అడిగిన నందు

నందు దగ్గరికి వెళ్లిన ఇందు.. ఆమెను హగ్ చేసుకొని ఎంతో సంబరపడిపోతుంది. తనకు చాలా సంతోషంగా ఉందని, ఇక మన కష్టాలన్నీ తీరినట్లే అని అంటుంది. అది సరే గానీ రాజు ఎవరు అక్క అని అడుగుతుంది నందు. వద్దని పంపించిన నువ్వే ఆ కుటుంబానికి రాజుని దూరం చేయొద్దని అన్న నువ్వే ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావని నిలదీస్తుంది.

అప్పుడు పరిస్థితుల వేరు అని, రాజును ఇంటి నుంచి పంపించేసినా మన ఇంటి గురించే ఆలోచించి ఆస్తి పోకుండా నిన్ను పంపించి అడ్డుకున్నాడని, అది తెలుసుకొనే మళ్లీ తీసుకొచ్చానని అబద్ధం చెబుతుంది. రాజు మన బావ, ఈ ఇంటి వారసుడు నందు అని తన మనసులోనే అనుకుంటుంది. కానీ నందులో మాత్రం రాజుపై అనుమానం అలాగే ఉండిపోతుంది.

రాజుకి యాక్సిడెంట్ రేఖ పనే అని నందుకు చెప్పిన ఇందు

ఆ తర్వాత రాజు యాక్సిడెంట్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దని నందుతో ఇందు అంటుంది. ఎందుకు చేసుకోవద్దు.. అది ఎవరు చేసినా వాళ్లను వదలను అంటుంది. ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారో తనకు తెలుసని, అది చేసింది రేఖ ఆంటీనే అని ఇందు చెప్పడంతో నందు షాక్ తింటుంది. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని నందు అంటుంది. వద్దని ఇందు వారిస్తున్నా ఆమె వినదు.

ఇక ఎపిసోడ్ చివర్లో లక్కీ దుగ్గిరాల ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం సీరియల్ మొత్తాన్ని మలుపు తిప్పబోతోంది. రేఖ కొడుకుగా అతన్ని రాజు ఇంట్లోకి తీసుకొస్తాడు. అయితే ఆ విషయం తనకు తప్ప మరెవరికీ తెలియదు. కానీ తర్వాతి ఎపిసోడ్లలో తాను రేఖ కొడుకునే అని లక్కీకి తెలిస్తే అతని రియాక్షన్ ఏంటి? రానున్న రోజుల్లో తన ఫ్రెండ్ రాజుకి లక్కీయే ప్రత్యర్థిగా మారతాడా అన్న ఆసక్తి నెలకొంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe