...
...
Next Story

Brahmamudi July 23 Episode: బ్రహ్మముడి.. తమ్ముడి గదిలో లక్కీ- రేఖతో ఆడుకున్న రాజు - నందు ప్రేమలో వెంకీ - చలపతి ట్విస్ట్

Brahmamudi Serial July 23rd Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 23 ఎపిసోడ్ లో లక్కీని అడ్డు పెట్టుకొని రేఖతో రాజు ఆడుకుంటాడు. అటు ఇందుకి అసలు నిజం చెప్పేయడంతో ఆమె షాక్ తింటుంది. ఇటు వెంకీ కూడా చివరికి తాను నందు ప్రేమలో పడినట్లు తెలుసుకుంటాడు.

Published on: Jul 23, 2026, 08:08:41 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో చాలా ట్విస్టులే జరిగాయి. లక్కీని తన తమ్ముడైన మదన్ గదిలోనే ఉంచడానికి రాజు ప్లాన్ చేయడం, అందరి ముందూ రేఖే అతని తల్లి అని చెప్పడం, ఇటు నందు ప్రేమలో వెంకీ పడటం, దుగ్గిరాల ఇంటి అమ్మాయి మాత్రం వద్దని చలపతి ట్విస్ట్ ఇవ్వడంతో రసవత్తరంగా మారింది.

ఎమోషనల్ అయిన లక్కీ..

Brahmamudi July 23 Episode: బ్రహ్మముడి.. తమ్ముడి గదిలో లక్కీ- రేఖతో ఆడుకున్న రాజు - నందు ప్రేమలో వెంకీ - చలపతి ట్విస్ట్
Brahmamudi July 23 Episode: బ్రహ్మముడి.. తమ్ముడి గదిలో లక్కీ- రేఖతో ఆడుకున్న రాజు - నందు ప్రేమలో వెంకీ - చలపతి ట్విస్ట్

లక్కీ తల్లిని రేఖే వెతికి పెడుతుందని, ఆమే అడ్రెస్, ఆధార్ కార్డ్ అని రాజు చెప్పే డైలాగుతో సీరియల్ గురువారం (జులై 23) ఎపిసోడ్ మొదలైంది. ఇంతలో లక్కీ ఎమోషనల్ అవుతాడు. చిన్నప్పటి నుంచీ తల్లి ప్రేమ లేకుండా పెరిగానని, అసలు తల్లి ఎవరో తెలియని వ్యక్తిని ఈ ప్రపంచంలో తానే అని అంటాడు. మీరు మా అమ్మను వెతికి పెడతారా మేడమ్ అని లక్కీ అడుగుతాడు.

రేఖను పూర్తిగా ఇరికించిన రాజు

మేడమ్ ఏంటి అమ్మా అని పిలువు అని రాజు అనడంతో అందరూ షాక్ తింటారు. అంటే లక్కీ తల్లిని వెతికి పెడుతుంది కదా.. తల్లిలాంటిది అని చెబుతున్నాను అని రాజు కవర్ చేయడంతో రేఖ ఊపిరి పీల్చుకుంటుంది. మరి లక్కీని ఈ ఇంట్లోనే ఉండమంటారా అంటూ రేఖను మరింత ఇరికిస్తాడు రాజు. మీరు వద్దంటే ఇప్పుడే పంపించేస్తాను.. వాడి తల్లిని వెతికే భారం తానే మోస్తానని సెంటిమెంట్ డైలాగులు కొడతాడు. చేసేది లేక రేఖ సరే అని చెప్పి వెళ్లిపోతుంది. రేఖ పిన్నీ చెప్పింది కాబట్టి ఇక వీడు ఇక్కడే ఉంటాడని రాజు అంటాడు.

నందు ప్రేమలో వెంకీ.. ప్రేమలేఖ రాసి..

ఇంతలో బయట రాజు గురించి చలపతి, లక్ష్మీ మాట్లాడుకుంటూ ఉంటారు. బలవంతంగా పంపించాం.. వాడు అక్కడ ఎలా ఉన్నాడో అని చలపతి అంటాడు. అది వాడి ఇల్లు బాగానే ఉంటాడులే అని లక్ష్మీ అంటుంది. అప్పుడే బయటకు వచ్చిన వెంకీ.. అది అన్నయ్య ఇల్లేంటి అని అడుగుతాడు. వదిన ఇల్లు అయినప్పుడు అన్నయ్యది కూడా అదే అవుతుంది కదా అంటూ చలపతి కవర్ చేస్తాడు. అన్నయ్య ఎక్కడున్నా తనలాగే ఉంటాడు.. అతని గురించి పెద్దగా ఆలోచించకండని వెంకీ అంటాడు.

వెంకీ ప్రేమ గురించి అడిగిన చలపతి..

అది సరేగానీ.. నీ సంగతేంటి.. నువ్వు ఎవరినైనా ప్రేమించావా.. ఒకవేళ ప్రేమిస్తే చెప్పు.. నీ పెళ్లి ఘనంగా చేస్తాం.. అమ్మాయి ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే.. కానీ మీ అన్నయ్యలా మాత్రం చేయకు అని చలపతి అంటాడు. దీంతో తాను నందును ప్రేమిస్తున్న విషయం వెంకీ గుర్తు చేసుకుంటాడు.

అయితే చలపతి ఒక కండిషన్ పెడతాడు. దుగ్గిరాల అమ్మాయిని మాత్రం ప్రేమించకు.. మీ అన్నయ్య ఆ పని చేసినందుకే మాకు ఈ పరిస్థితి కలిగింది.. ఆ ఇంటి వారసురాలిని ప్రేమించనని మాటివ్వు అని చలపతి అనడంతో వెంకీ ఆలోచిస్తాడు. అయినా తాను నందును ప్రేమిస్తున్నాను కదా.. ఆమె దుగ్గిరాల వారసురాలు కాదు కదా అని చలపతికి మాటిస్తాడు. అప్పుడే నందు వచ్చి బయటకు వెళ్దామని తీసుకెళ్తుంది.

రాజుని నిలదీసిన లక్కీ, ఇందు

ఇటు రాజుని బయటకు తీసుకెళ్లిన లక్కీ అతన్ని నిలదీస్తాడు. అసలు రేఖ తన తల్లిని ఎలా వెతుకుతుంది.. మా అమ్మ ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని లక్కీ అడుగుతాడు. అప్పుడే ఇందు కూడా వచ్చి అదే విషయంపై నిలదీస్తుంది. ఆమె ఎవరికీ సాయం చేయదు.. అలాంటిది లక్కీ తల్లిని ఎలా వెతుకుతుందని రాజుపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దీంతో లక్కీని పక్కకు తీసుకెళ్లిన రాజు.. ఆ విషయం నేను చూసుకుంటాను.. ముందు నువ్వు వెళ్లి ఐశ్వర్యను లైన్లో పెట్టే సంగతి చూడు అని చెప్పి పంపిస్తాడు.

ఇందుకి నిజం చెప్పేసిన రాజు

అతడు వెళ్లిపోయిన తర్వాత కూడా రాజుని ఇందు నిలదీస్తుంది. ఏం దాస్తున్నావ్ నువ్వు.. ఈ ఇంటికి సంబంధించిన విషయం అయితే మాత్రం తనకు కచ్చితంగా చెప్పాల్సిందే అని ఇందు పట్టుబడుతుంది. ఇక లాభం లేదనుకొని రేఖనే లక్కీ తల్లి అని ఇందుతో అసలు నిజం చెప్పేస్తాడు రాజు. దీంతో ఆమె షాక్ తింటుంది. ఆంటోనీతో రేఖ మాట్లాడిన మాటలు తాను విన్నట్లు రాజు చెబుతాడు. తనకు తెలియకుండా తన ఇంట్లోనే ఇంత జరుగుతోందా అని ఇందు ఆశ్చర్యపోతుంది.

రేఖనే లక్కీని తన కొడుకు అని చెప్పించాలన్న రాజు

మరి ఎందుకు ఆలస్యం.. వెంటనే ఈ విషయం ఇంట్లో అందరి ముందు చెప్పి రేఖ ఆంటీని ఒప్పించవచ్చు కదా అని ఇందు అంటుంది. అలా చేస్తే లక్కీపై ఎప్పుడూ ఆమె తల్లి ప్రేమ చూపించదని, తనకుతానుగా ఆమె లక్కీ తన కొడుకు అని చెప్పేలా చేయాలని రాజు అంటాడు. దీనికి నీ సాయం కావాలని అడుగుతాడు. నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను బావ అని అనడంతో రాజు ముందు ఆ బావ అని పిలవడం ఆపెయ్ అని అంటాడు. సరే బావ అంటూ మరోసారి టీజ్ చేసి వెళ్లిపోతుంది.

నందుకి లవ్ ప్రపోజల్ చేయలేకపోయిన వెంకీ

ఇటు బైక్ పై నందును బయటకు తీసుకెళ్తున్న వెంకీ ఆమెకు ప్రపోజ్ చేద్దామని అనుకుంటాడు. రిజెక్ట్ చేస్తే ఏంటి పరిస్థితి అనే భయం కలిగినా ఏదైతే అదయింది.. చెప్పేస్తానని అనుకుంటాడు. అతడు మౌనంగా ఉండటం చూసి ఏమైందని నందు అడుగుతుంది. ఇంకా ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. నిన్నే ప్రేమిస్తున్నానని వెంకీ చెప్పేలోపే.. ఎస్సై ఇల్లు వచ్చింది.. రాజుకు యాక్సిడెంట్ ఎలా అయిందో తెలుసుకోవాలన్నాను కదా.. అదే పనిమీద వచ్చానని ఎస్సై ఇంట్లోకి వెళ్లిపోతుంది. మిస్సయ్యాను.. ఎలా లవ్ ప్రపోజ్ చేయాలి అని వెంకీ అనుకుంటాడు.

తమ్ముడి గదిలో అన్న లక్కీ

అటు తాను ఎవరి గదిలో ఉండాలని రాజుని అడుగుతాడు లక్కీ. రేఖ పిన్నీ కొడుకు మదన్ ఉన్నాడు కదా.. అతని గదిలో ఉండమని రాజు పంపిస్తాడు. కానీ మదన్ మాత్రం పొగరు చూపిస్తూ కుదరదంటాడు. మీ అమ్మే చెప్పిందని లక్కీ అనడంతో ఆమెను పిలుస్తాడు. ఇంతలో రాజు ఎంట్రీ ఇచ్చి నేను అతన్ని నీ గదిలో ఉండమన్నానని అంటాడు. ఇద్దరూ అన్నదమ్ములే కదా అని అనడంతో రేఖ షాక్ తింటుంది. అన్నదమ్ములేంటి అనడంతో రేఖే కదా లక్కీ తల్లి అని రాజు మరో బాంబు పేలుస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe