...
...
Next Story

Brahmamudi July 27 Episode: బ్రహ్మముడి.. ఇందుపై రాజులో మొదలైన అనుమానం.. ఐశ్వర్యతో లక్కీ సరసాలు.. వెంకీ విరహ వేదన

Brahmamudi Serial July 27th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 27 ఎపిసోడ్ లో రాజుకి ఇందు సేవలు చేస్తుంటుంది. దీంతో రాజులో ఆమెపై అనుమానం మొదలవుతుంది. అటు నందుకి తన ప్రేమను చెప్పలేక వెంకీ విరహ వేదన అనుభవిస్తుంటాడు.

Published on: Jul 27, 2026, 08:06:30 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజుకి నచ్చిన భార్యలా ఉండటానికి ఇందు ప్రయత్నిస్తుంది. అయితే ఆమె చేసే పనులో రాజులో కొత్త అనుమానాలు రేకెత్తిస్తాయి. ఓవైపు ఐశ్వర్య కోసం లక్కీ ట్రై చేస్తుండగా.. మరోవైపు శశి కూడా ఆమెను లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తుంటాడు.

రాజును టీజ్ చేసిన ఇందు

Brahmamudi July 27 Episode: బ్రహ్మముడి.. ఇందుపై రాజులో మొదలైన అనుమానం.. ఐశ్వర్యతో లక్కీ సరసాలు.. వెంకీ విరహ వేదన
Brahmamudi July 27 Episode: బ్రహ్మముడి.. ఇందుపై రాజులో మొదలైన అనుమానం.. ఐశ్వర్యతో లక్కీ సరసాలు.. వెంకీ విరహ వేదన

తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో ఇందుకి రాజు వర్ణించే సీన్ తో సీరియల్ సోమవారం (జులై 27) ఎపిసోడ్ మొదలైంది. ఇందులో ఉన్న ఒక్క లక్షణం కూడా తనకు వద్దని రాజు అంటాడు. అంతేకాదు ఆమె తనకు ఎలాంటి సేవలు చేయాలో కూడా చెబుతాడు.

ఉదయాన్ని అందంగా తయారై తనను నిద్ర లేపి కాఫీ ఇవ్వాలని, ఆ తర్వాత చేతిలో బ్రష్ పెట్టి బాత్రూమ్ లోకి పంపాలని, వేడి నీళ్లు పెట్టాలని, తన బట్టలు సెలెక్ట్ చేసి ఉంచాలని, తనకు ఇష్టమైన వంట చేయాలని.. ఇలా రాజు చెబుతూ వెళ్తాడు. దీంతో ఇందు అతన్ని టీజ్ చేస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి నీకు దొరకదు బావ అని వెళ్లిపోతుంది.

ఐశ్వర్యకు ప్రపోజ్ చేసిన శశి

అటు ఐశ్వర్యను శశి ప్రేమ యాక్సెప్ట్ చేసేలా ఆమె ఫ్రెండ్ రేణు ఒత్తిడి తెస్తుంది. ఐషూ మాత్రం ఇష్టం లేకుండానే సరే అంటుంది. దీంతో రేణు వెళ్లి శశికి ఐశ్వర్య పరిస్థితి వివరిస్తుంది. చాలా బాధల్లో ఉంది.. డబ్బు కావాలట.. క్రెడిట్ కార్డు బిల్లు కూడా కట్టలేదు అని చెప్పి పంపిస్తుంది.

ఇటు రాజు చెప్పినట్లు ఉదయాన్నే అందంగా తయారై అతనికి సేవలు చేస్తుంది ఇందు. రాజుని నిద్ర లేపి కాఫీ ఇస్తుంది. తర్వాత బ్రష్, సబ్బు చేతుల్లో పెడుతుంది. స్నానానికి పంపిస్తుంది. అతడు వచ్చే లోపే వేసుకోవాల్సిన బట్టలు కూడా రెడీగా ఉంచుతుంది. కిందికి వస్తే నీకోసం వేడి వేడి టిఫిన్ పెడతాను బావ అని సరసాలాడుతూ చెప్పి వెళ్లిపోతుంది.

ఇందుపై రాజులో అనుమానం

ఇందు చేస్తున్న సేవలు కూడా రాజులో అనుమానం వచ్చేలా చేస్తుంది. టిఫిన్ దగ్గర కూడా అందరూ ఇడ్లీ తింటుంటే రాజు కోసం ఇందు స్పెషల్ గా పెసరట్టు చేసి తీసుకొస్తుంది. ప్రేమ వడ్డిస్తుంది. నువ్వు నాకు చాలా స్పెషల్ కదా బావ.. అందుకే నీకోసం స్పెషల్ పెసరట్టు అంటుంది. అది చూసి లక్కీకి కూడా డౌట్ వస్తుంది. ఇదేంటిరా ఇందు ఇలా చేస్తుంది.. అద్దె మొగుడిపై ప్రేమ పెరుగుతోందా అని అడుగుతాడు. తనకూ అర్థం కావడం లేదని, దీని వెనుక ఏదో పెద్ద స్కామ్ ఉందని అనిపిస్తోందని అంటాడు.

డైనింగ్ టేబుల్ దగ్గర ఐశ్వర్యతో లక్కీ రొమాన్స్

మరోవైపు డైనింగ్ టేబుల్ దగ్గర ఐశ్వర్యతో లక్కీ రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఆమె పక్కనే కూర్చొని మెల్లగా టేబుల్ కింద ఆమె కాలిని తన కాలితో టచ్ చేస్తుంటాడు. దీంతో ఆమె గట్టిగా అతని కాలు తొక్కుతుంది. అతడు కెవ్వుమని అరుస్తాడు. ఏమైందని రాజు, స్వాతి అడిగితే.. ఆనందంతో అరిచానని, తనకు ఇలా ఎప్పుడూ అందరితో కలిసి తినే ఛాన్స్ రాలేదని అంటాడు.

ఇందుని చూసి మురిసిపోయిన అపర్ణ

ఇక రాజుకి ఇందు ప్రేమతో సేవలు చేయడం చూసి అపర్ణ మురిసిపోతుంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆమె అంటుంది. ఇంతకుముందు రాజుని పంపినట్లు మళ్లీ ఎప్పుడూ పంపించకు.. అతడు చాలా మంచివాడు అని అపర్ణ చెబుతుంది. కానీ రాజు ఈ ఇంటి వారసుడని, తనకు బావ అనే విషయం మాత్రం మీకు చెప్పలేకపోతున్నానని ఇందు లోలోపల బాధపడుతుంది.

నందుకు తన ప్రేమను చెప్పలేక బాధపడిన వెంకీ

అటు నందుకి తన ప్రేమను చెప్పలేక వెంకీ బాధ పడుతూ కూర్చొంటాడు. ఆమె కోసం రాసిన లెటర్ చూస్తూ.. ఇది ఎంతో ప్రేమగా నీకు ఇవ్వాలని అనుకున్నాను.. కానీ అది ఇవ్వకుండానే డస్ట్ బిన్ లో పారేయాల్సి వస్తోందని అంటాడు. ఆ తర్వాత ఆ లెటర్ బయట పారేస్తాడు. తనకు ఇష్టమైన అమ్మాయితో ఇన్నాళ్లూ ఎంతో ఆనందంగా తిరిగానని, ఇప్పుడామే దుగ్గిరాల వారసురాలని తెలిసి దూరం చేసుకోవాల్సి వస్తోందని ఆమె ఫొటో చూస్తూ ఒంటరిగా కూర్చుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe