Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. లక్కీ, రాజు, రేఖ స్టోరీ లైన్ ఓవైపు చూపిస్తూనే అటు ఐశ్వర్య, శశి లవ్ ట్రాక్.. ఇటు వెంకీ, నందు ఎపిసోడ్ కూడా ఇందులో చూడొచ్చు. మొత్తానికి రోజు రోజుకీ సీరియల్ మళ్లీ రక్తి కడుతోంది.
రేఖను నిలదీసిన మదన్.. లక్కీ కన్నతల్లి ఎవరంటూ..

అందరి ముందు లక్కీని కాకుండా తనను కొట్టడంతో తల్లి రేఖను మదన్ నిలదీసే సీన్ తో సీరియల్ బుధవారం (జులై 29) ఎపిసోడ్ మొదలైంది. నువ్వు చాలా మారిపోయావ్.. అసలు లక్కీ ఎవరు.. వాడికి నీకు ఉన్న సంబంధం ఏంటి.. వాడి కన్నతల్లిని నువ్వు వెతికి పెడతానని ఎందుకు మాటిచ్చావ్.. మీ ఇద్దరి మధ్య ఏదో గట్టి బంధం ఉంటే తప్ప నువ్వు ఇలా చేయవు అని రేఖను మదన్ నిలదీస్తాడు.
కానీ ఆమె మాత్రం ఏ సమాధానం చెప్పదు. గతంలో నేను అడగకపోయినా చెప్పేదానివి.. కానీ ఇప్పుడు అడిగినా చెప్పడం లేదు.. వాడెవడి కోసమో కన్న కొడుకునే కొట్టావ్.. నువ్వు పూర్తిగా మారిపోయావంటూ మదన్ ఆవేశంగా వెళ్లిపోతాడు.
ఇందుని చూసి శశితో ఐశ్వర్య డ్రామా
ఇటు శశితో కలిసి పీకలదాకా తాగి ఐశ్వర్య ఇంటికి వస్తుంది. ఇందు బయటే ఉండటం చూసి కావాలని శశితో డ్రామా ఆడుతుంది. అతనితో ప్రేమగా మాట్లాడమే కాదు.. హగ్ చేసుకుంటుంది. రేపు ఎక్కడికైనా వెళ్దామా అని అతడు అడిగితే.. చాలా బిజీగా ఉన్నాను కానీ నీ కోసం ఎక్కడికైనా వస్తానని అంటుంది.
ఈ క్రమంలో అతడు మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా.. నీకోసం డైమండ్ రింగ్ అంటూ మోకాలిపై కూర్చొని ఆ రింగును ఐశ్వర్య వేలికి తొడగడానికి ట్రై చేస్తాడు. ఐశ్వర్య ఆ రింగు తీసుకొని తానే పెట్టుకుంటుంది. శశిని హగ్ చేసుకొని అతనికి సెండాఫ్ ఇస్తుంది.
ఐశ్వర్యను నిలదీసిన ఇందు
{{/usCountry}}ఈ క్రమంలో అతడు మనం ఫ్రెండ్స్ అయిపోయాము కదా.. నీకోసం డైమండ్ రింగ్ అంటూ మోకాలిపై కూర్చొని ఆ రింగును ఐశ్వర్య వేలికి తొడగడానికి ట్రై చేస్తాడు. ఐశ్వర్య ఆ రింగు తీసుకొని తానే పెట్టుకుంటుంది. శశిని హగ్ చేసుకొని అతనికి సెండాఫ్ ఇస్తుంది.
ఐశ్వర్యను నిలదీసిన ఇందు
{{/usCountry}}ఐశ్వర్య లోనికి రాగానే ఇందు ఆమెను నిలదీస్తుంది. అర్ధరాత్రి వరకూ తాగి వాడితో ఈ తిరగడం ఏంటి.. ఎవరతను అని అడిగితే.. బాయ్‌ఫ్రెండ్ అని ఐషూ చెబుతుంది. నువ్వు నా అక్కవి.. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది.. ఇలా తాగి తిరగడం ఏంటి.. మైండ్ పని చేస్తోందా అంటూ క్లాస్ పీకుతుంది.
నువ్వేంటి నన్ను అడిగేది.. ఎంత ఖరీదైన డైమండ్ రింగ్ ఇచ్చాడో చూశావా అని ఐశ్వర్య అంటుంది. అంత ఖరీదైనది ఇచ్చాడంటే మన నుంచి ఏదో ఆశిస్తున్నాడని అర్థం అని ఇందు చెబుతుంది. కానీ ఐషూ మాత్రం ఆమె వినకుండా వెళ్లిపోతుంది.
నందును దూరం పెట్టిన వెంకీ.. చలపతికి నందు ఫోన్
ఇటు వెంకీకి నందు ఫోన్ చేస్తుంది. కానీ అతడు మాత్రం లిఫ్ట్ చేయడు. కావాలని ఆమెను దూరం పెట్టేస్తాడు. దీంతో చలపతికి నందు ఫోన్ చేస్తుంది. వెంకీ వద్దని చెప్పేలోపే అతడు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వెంకీ గురించి అడగడంతో ఫోన్ అతనికి ఇస్తాడు. తన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని నందు నిలదీస్తే చూసుకోలేదని అంటాడు. బయటకు వెళ్దామని అంటే.. తనకు పనుందని, రానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో చలపతి, లక్ష్మీ షాక్ తింటారు.
చలపతికి అసలు నిజం చెప్పిన వెంకీ
ఎందుకలా చేస్తున్నావని వెంకీని చలపతి అడుగుతాడు. కొన్నింటిని దూరం పెట్టాల్సిన టైమ్ వచ్చిందని, తప్పు ఆమెది కాదు ఆమె ఫ్యామిలీది అని వెంకీ అంటాడు. అదేంటని అడిగితే.. నువ్వే కదా దుగ్గిరాల కుటుంబానికి దూరంగా ఉండమని చెప్పావంటూ నందు ఎవరో చలపతికి చెబుతాడు వెంకీ.
అది విని అతడు షాకవుతాడు. నిజమేరా.. అయితే ఆ అమ్మాయికి నువ్వు దూరంగానే ఉండు.. మీ అన్నయ్య సమస్యను వెతుక్కుంటూ వెళ్లాడు.. నువ్వు కూడా సమస్యల్లో పడొద్దు అని అంటాడు. అలా అయితే ఆ అమ్మాయి బాధపడుతుంది కదా.. వీడిని తప్పుగా అర్థం చేసుకుంటుంది కదా అని లక్ష్మీ అంటుంది. కానీ మరో దారి లేదని చలపతి స్పష్టం చేస్తాడు.
రేఖతో మరోసారి ఆడుకున్న రాజు
ఇటు ఇంట్లో రేఖ వర్క్ చేసుకుంటుండగా లక్కీని తీసుకొని రాజు వస్తాడు. కావాలని ఆమె ముందే కూర్చుంటాడు. ఎప్పుడూ ఆఫీసు పనుల్లో బిజీగా ఉండే బదులు.. కాస్త మావాడి బాధను కూడా అర్థం చేసుకోవచ్చు కదా అని అంటాడు. తల్లి ఎవరో తెలుసుకోవడానికి ఎంత ఆరాటపడుతున్నాడో చూడండి అని రేఖతో రాజు మరోసారి ఆడుకుంటాడు.
ఆమె చిరాకు పడుతుంది. ఆమెను ఎందుకలా విసిగిస్తావని లక్కీ అంటాడు. నీకు మీ అమ్మ ఎవరో తెలియాలా వద్దా అని రాజు అనడంతో.. అవును రా నాకు మా అమ్మ కావాలి అని లక్కీ గట్టి అరుస్తాడు. అది విని రేఖ షాక్ తింటుంది.
రేఖ ముందు ఎమోషనల్ అయిన లక్కీ
లక్కీ ఎమోషనల్ అవుతాడు. ఒక్కసారైనా తన తల్లిని చూసి ఆమెను అమ్మా అని పిలవాలని ఉందని అంటాడు. దయచేసి తన తల్లి ఎవరో త్వరగా కనిపెట్టండి మేడమ్ అని రేఖను వేడుకుంటాడు. ఆ తర్వాత భ్రమరాంబను చూసి తన తల్లి ఆమెలాగా ఉంటుందా అని రాజుని అడుగుతాడు. నీ తల్లి ఆమెలాగా ఉండదు.. నిన్ను వదిలేసి వెళ్లిందంటే కాస్త మోడ్రన్ గా ఉంటుంది అని రాజు అంటాడు.
అది విని రేఖ కంగారు పడుతుంది. ఇంత కచ్చితంగా చెబుతున్నావంటే నువ్వు మా అమ్మను చూశావా అని లక్కీ అడుగుతాడు. రేఖ పిన్నీరా మీ అమ్మ అని మరోసారి రాజు అనడంతో లక్కీ, రేఖ షాకవుతారు. ఆమెలాగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అన్నానని రాజు కవర్ చేసుకుంటాడు. ఇక లాభం లేదనుకొని రేఖ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంకా ఎన్నాళ్లు ఇలా చెప్పకుండా ఉంటావో నేనూ చూస్తానని రాజు మనసులో అనుకుంటాడు.
సత్యనారాయణ వ్రతం చేయిద్దామన్న అపర్ణ
ఇటు ఇందుతో అపర్ణ మాట్లాడుతూ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయిద్దామని అనుకుంటున్నట్లు చెబుతుంది. రాజుతో పెళ్లి తర్వాత ఇప్పటి వరకూ పూజ చేయించలేదు.. సత్యనారాయణ వ్రతం చేయిస్తే ఇంట్లో కీడంతా తొలగిపోతుంది.. రాజు అదృష్టవశాత్తూ ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డాడు.. అలాంటిది మళ్లీ జరగొద్దంటే ఈ వ్రతం చేయాల్సిందే అని అపర్ణ, సుభాష్ అంటారు.
కానీ ఇప్పుడవన్నీ వద్దని ఇందు అంటుంది. రాజుతో అసలు పెళ్లే జరగలేదని ఎలా చెప్పాలని మనసులో అనుకుంటుంది. చూద్దాంలే నువ్వయితే ముందు కాఫీ తాగు అని చెప్పి ఇందు వెళ్లిపోతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.