Brahmamudi July 28 Episode: బ్రహ్మముడి- వెంకీకి నందు లవ్ ప్రపోజ్- రాజు కోపం ప్లాన్ ఫ్లాప్- ఇందు, రాజును కలిపిన బల్లిబాబు

Brahmamudi Serial July 28 Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 28వ ఎపిసోడ్‌‌లో నందు కాల్ చేసి మాట్లాడి బయటకు వెళ్దామంటే వెంకీ రానంటాడు. దాంతో వెంకీపై డౌట్ పడుతుంది నందు. మదన్, లక్కీ టీవీ రిమోట్ కోసం కొట్టుకుంటారు. రాజు చెప్పడంతో రేఖ మదన్‌ను కొడుతుంది. శశి అకౌంట్‌లోకి ఐశ్వర్య చేరినట్లు రేణు అనుకుంటుంది.

Published on: Jul 28, 2026, 08:27:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నందు ప్రేమ గురించి ఆలోచిస్తూ విరహవేదన అనుభవిస్తుంటాడు వెంకీ. ఇంతలో నందు కాల్ చేస్తుంది. కానీ, వెంకీ కాల్ కట్ చేస్తాడు. మళ్లీ నందు కాల్ చేయడంతో వెంకీ లిఫ్ట్ చేస్తాడు. మనం బయటకు అర్జంట్‌గా వెళ్లాలని నందు అంటే.. రాలేను అని వెంకీ అంటాడు.

బ్రహ్మముడి సీరియల్ జూలై 28వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూలై 28వ ఎపిసోడ్

వెంకీపై నందు డౌట్

నేను దుగ్గిరాల ఇంటి అమ్మాయిని అని తెలిసినప్పటి నుంచి అదోలా చేస్తున్నావ్ అని డౌట్ పడుతుంది నందు. అలా కాదు. ఏం అనుకోకు. వేరే వర్క్ ఉందని వెంకీ కాల్ కట్ చేస్తాడు. వీడేంటీ నేను లవ్ యాక్సెప్ట్ చేస్తానో లేదో అని టెన్షన్ పడుతున్నాడా. మనమే ఓ అడుగు ముందుకు వేయాలని నందు అనుకుంటుంది. అంటే వెంకీకి నందునే లవ్ ప్రపోజ్ చేసేందుకు రెడీ అవుతుంది. మరోవైపు పొదరిల్లు సీరియల్ ప్రోమోను లక్కీ హాల్లో టీవీలో చూస్తుంటాడు.

అప్పుడే మదన్ వస్తాడు. ఏం చేస్తున్నావ్ అని మదన్ అడిగితే.. సీరియల్ అని లక్కీ అంటాడు. ఈరోజుల్లో సీరియల్ ఎవరైనా చూస్తారా అని రిమోట్ లాక్కుని వేరే పెట్టుకుంటాడు మదన్. గొడవ ఎందుకులే, రేఖ ఆంటీకి తెలిస్తే మళ్లీ హెల్ప్ చేయదని లక్కీ ఊరుకుంటాడు. మదన్ వేరే పెట్టి ఫోన్ చూస్తుంటాడు. అది చూసిన లక్కీ మెల్లిగా రిమోట్ తీసుకుని మళ్లీ సీరియల్ మార్చుకుంటాడు.

అది చూసి మదన్ సీరియస్ అవుతాడు. కోప్పడుతాడు. నువ్వు ఫోన్ చూస్తున్నావని ఛానెల్ మార్చాను, దానికే కోపం ఎందుకులే తమ్ముడు నీకు నచ్చిందే పెట్టుకో అని రిమోట్ పక్కన పెడతాడు లక్కీ. రిమోట్ పడేస్తావేంట్రా, ఎలా కనిపిస్తున్నానని అని మదన్ గొడవ పెట్టుకుంటాడు. లక్కీ కాలర్ పట్టుకుంటాడు. గొడవ వద్దని లక్కీ చెబుతాడు.

లక్కీపై నిందలు

కాలర్ వదలమంటాడు లక్కీ. అయినా మదన్ వదలడు. దాంతో మదన్ కాలర్ కూడా పట్టుకుంటాడు లక్కీ. ఇద్దరు తెగ గొడవ పడతారు. అంతా వస్తారు. ఇద్దరిని విడిపిస్తారు. లక్కీని నిందిస్తుంది భ్రమరాంబ. వాడు నీలా బస్తీ అనుకున్నావా. నా కొడుకు కాలర్ పట్టుకుంటావా అని లక్కీని తిడతాడు భూషణ్. కావాలని పట్టుకోలేదని లక్కీ చెబుతుంటే భ్రమరాంబ వారిస్తుంది.

సారీ మేడమ్. నేను కావాలని కాలర్ పట్టుకోలేదు. అప్పటికి నేను చాలా ఆగాను అని లక్కీ అంటాడు. నువ్వు సారీ చెప్పడం ఏంట్రా అని రాజు అంటాడు. భ్రమరాంబ రెచ్చిపోతే.. ఏంటీ ఎక్కువ మాట్లాడుతున్నారా. ఆ బుద్ధి ఏదో నీ మేనల్లుడికి చెప్పుకో అని రాజు అంటాడు. వాడు యూఎస్‌లో చదువుకున్నాడు. వాడికి అన్నీ తెలుసు అని భ్రమరాంబ అంటుంది.

తెలిస్తే ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడు. సంస్కారం నేర్చుకుంటే ఎదుటివాళ్లను తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతాడు. అమ్మ బాబులు నేర్పిస్తే కదా అని రాజు అంటాడు. రిమోట్ దగ్గర గొడవ జరిగింది. ఫస్ట్ కాలర్ పట్టుకుంది తనే. అప్పటికీ చెప్పాను. వినలేదు అని లక్కీ చెబుతాడు. తప్పెవరిది. ఇక్కడ మూర్ఖంగా బిహేవ్ చేసింది ఎవరు. తప్పు తను చేసి మావోడితో సారీ చెప్పించుకుంటారేంటీ. అసలు సారీ చెప్పాల్సింది ఈ మదన్ అని రాజు అంటాడు.

మదన్‌ను కొట్టిన రేఖ

చూస్తావేంటీ రేఖ లాగిపెట్టి వాడిని బయటకు పంపించు అని భ్రమరాంబ అంటుంది. కొట్టు పిన్ని ఎలా బయటకు పంపిస్తావో చూస్తాను. చేయి వేసి చూడమను అని రాజు ఇన్‌డైరెక్ట్‌గా రేఖను బెదిరిస్తాడు. దాంతో మదన్‌ను లాగిపెట్టి కొడుతుంది రేఖ. అది చూసి అంతా అవాక్కవుతారు. నోరెళ్లబెడతారు. ఎవరు నువ్వు, ఈ రేఖ కొడుకు. ఎంత మెచ్యూర్డ్‌గా ఉండాలి. స్థాయి ఏంటో తెలియకుండా ఇలాంటి వాళ్లతో గొడవ పడటం ఏంటీ అని తిడుతుంది రేఖ.

దాంతో అవమానంగా మదన్ వెళ్లిపోతాడు. లక్కీవైపు కోపంగా చూసి పైకి వెళ్తుంది రేఖ. అసలు రేఖకు ఏమైంది అని భ్రమరాంబ అంటే.. రేఖ చాలా మారిపోయింది. తనను ఏదో ఆవహించింది. అదేంటో కనుక్కో. లేకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలు చాలా చూడాల్సి వస్తుందని శేషు అంటాడు. తర్వాత శశితో పార్టీలో ఉంటుంది ఐశ్వర్య.

ఐశ్వర్య అందాన్ని పొగుడుతాడు శశి. ఇంతలో డాడ్ కాల్ చేస్తున్నాడని చెప్పి వెళ్లను అని కాల్ కట్ చేస్తాడు. బిజినెస్ పని మీద లండన్ వెళ్లమంటున్నారని, కోట్లల్లో లాస్ వస్తుందని, నాకు బిజినెస్ అంటే ఇష్టముండదు. ఇప్పుడు బిజినెస్‌ చూసుకోను. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేసి తర్వాత మా నాన్న బిజినెస్ చూసుకుంటాను అని శశి చెబుతాడు.

శశి అకౌంట్‌లో ఐశ్వర్య

హుమ్ రిచ్ పర్సనే అని ఐశ్వర్య మనసులో అనుకుంటుంది. శశి అకౌంట్‌లోకి ఐశ్వర్య కూడా చేరిపోయిందని రేణు అనుకుంటుంది. మరోవైపు రాత్రి రాజు, ఇందులు రేఖ చేసిన దాని గురించి మాట్లాడుకుంటారు. లక్కీని కొడితే మొత్తం రచ్చ రచ్చ అవుతుందని తెలుసు. అసలు నా ప్లాన్ అదే. లక్కీని కొడితే రచ్చ చేద్దామనుకున్నా. కానీ, అస్సలు ఛాన్స్ ఇవ్వలేదు అని తన కోపం ప్లాన్‌ను రేఖ ఫ్లాప్ చేసిందని రాజు చెబుతాడు.

మనం మళ్లీ మళ్లీ ట్రై చేయాలి. రేఖ తన కోపం సరిపోలేదు. మనం తన కోపం పెంచాలి అని ఇందు అంటుంది. ముందు ముందు నాలుక మీద మంట పెట్టినట్లు పెడితే ఎందుకు బయటపడదో చూస్తా. తన నోటి నుంచి నిజం చెప్పే వరకు టార్గెట్ చేస్తూనే ఉంటా అని రాజు అంటాడు. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. తనకు ఏమైనా జరుగుతుందంటే చాలా డేంజరస్‌గా ఆలోచిస్తుందని ఇందు అంటుంది.

తన ఆటలన్ని నా దగ్గర సాగవు. ఇప్పుడు ఆలోచిస్తుంది ఆ మదన్ గాడి గురించి అని రాజు అంటాడు. మరోవైపు మదన్ ఫీల్ అవుతుంటే రేఖ వెళ్లి మాట్లాడుతుంది. సారీ చెబుతుంది. అసలు ఆ లక్కీ గాడు ఎవడు. నువ్వెందుకు వాడికి అంత స్పేస్ ఇస్తున్నావ్ అని తల్లిని నిలదీస్తాడు మదన్.

ఇందు రాజును కలిపిన బల్లిబాబు

ఎప్పుడు కొట్టని నువ్వు ఒక అనాథ వెధవ కోసం కొట్టావ్. అందరి ముందు కొట్టావ్. చాలా అవమానంగా ఉంది తెలుసా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు మదన్. మరోవైపు రాజు హాయిగా రిలాక్స్ అవుతుంటే ఇందు కాఫీ తెస్తుంది. గోడపై బల్లిని ఓ బల్లిబాబు ఊరికే అలా గోడపై ఉండే బదులు నన్ను మా బావను ఒక్కటిచేసి కలిపేయొచ్చుగా అని అంటుంది ఇందు.

దానికి బల్లి సౌండ్ చేస్తుంది. రాజుపై పడుతుంది. బల్లిని చూసి అరుస్తూ ఇందుపైకి ఎక్కుతాడు రాజు. రాజును రొమాంటిక్‌గా ప్రేమగా చూస్తుంటుంది ఇందు. అలా రాజు ఇందును బల్లిబాబు ఒక్కటి చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More