Brahmamudi July 31 Episode: బ్రహ్మముడి- ఇదొక తింగరబుచ్చి, స్లీవ్‌లెస్ జాకెట్, ట్రాన్సపరెంట్ చీర- రేఖపై ఐశ్వర్య సెటైర్లు
Brahmamudi Serial July 31 Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 31వ ఎపిసోడ్‌లో తాగొచ్చిన ఐశ్వర్య రేఖ నుంచి నందు దాకా ప్రతి ఒక్కరిపై సెటైర్లు వేస్తుంది. ఐశ్వర్య మాటలకు డౌట్ పడిన భ్రమరాంబ రాజు, ఇందు భార్యాభర్తలు కాదనే సాక్ష్యం కోసం వెతుకులాట మొదలుపెడతానంటుంది. రాజు, ఇందు విడిగా పడుకోవడం అపర్ణ చూస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అపర్ణ, రాజు తింటుంటారు. అపర్ణపై రాజు ప్రేమ చూపిస్తుంటే అపర్ణ ఎమోషనల్ అవుతుంది. ఇంతలో స్వాతి వచ్చి నువ్వు ఎంత చెప్పిన ఐశ్వర్య బయటకు వెళ్లింది. లక్కీ బైక్ ఎక్కి వెళ్లింది అని అంటుంది.

నా మీద కోపంతో
నీ ఫ్రెండ్ ఐశ్వర్యను తీసుకెళ్లడం ఏంటని రాజుపై కోప్పడుతుంది ఇందు. లిఫ్ట్ అడిగితే సాయం చేసినట్లున్నాడు. నువ్వు అనాల్సింది ఐశ్వర్యను అని రాజు అంటాడు. రాజు చెప్పింది కరెక్ట్ అని, రేఖ పెంపకంలో అది తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని అపర్ణ అంటుంది. నా తాపత్రయం అదే. నా మీద కోపంతో అది పొగరుతో ఎక్కడ సమస్యల్లో పడుతుందనే నా భయమంతా అని ఇందు అంటుంది.
రాజు నవ్వుతాడు. నువ్వు తనను మార్చాలంటే నవ్వోస్తుంది. అది జరగదు. తన గురించి నీకంటే నాకే బాగా తెలుసు అని రాజు అంటాడు. ఏం తెలుసు చెప్పు అంటే.. వీళ్లకు నిజం చెబితే ఏమైపోతారో అని మనసులో అనుకుని ఏం లేదని రాజు పైకి అంటాడు. మరోవైపు శశి దగ్గరికి ఐశ్వర్య వెళ్లి హగ్ ఇస్తుంది. అది చూసి లక్కీ తెగ షాక్ అవుతాడు.
బేబీ అని ఐషును శశి అంటే.. నేను తనను తీసుకొచ్చింది వీడికి హగ్గు ఇచ్చేందుకా అని ఫీల్ అవుతాడు లక్కీ. నీకు డబ్బులు ఇవ్వాలా అని శశి అంటే.. హలో నేను ఐశ్వర్య ఫ్యామిలీ ఫ్రెండ్‌ని అని లక్కీ అంటాడు. అంటే బాడీగార్డా అని జోకులు వేస్తాడు శశి. తర్వాత సారీ చెబుతాడు. అంత అవసరం లేదురా, మధ్యలో బీర్ తీసుకు వస్తాడని తీసుకొచ్చానని ఐశ్వర్య అవమానిస్తుంది.
తాగి ఐశ్వర్య గొడవ
రేయ్ లక్కీ ఇది మన ప్లేస్ కాదు సైలెంట్‌గా ఉండరా అని మనసులో అనుకుంటాడు లక్కీ. లక్కీ ముందే ఐశ్వర్య అందాన్ని పొగుడుతాడు శశి. ఐశ్వర్య లోపలికి వెళ్దామంటుంది. లక్కీని కూడా రమ్మంటుంది. కట్ చేస్తే ఐశ్వర్య బాగా తాగి ఇంట్లోకి గొడవ చేస్తూ ఎంట్రీ ఇస్తుంది. ఒసేయ్ ఇందు రావే అని రచ్చ చేస్తుంది. అంతా వస్తారు.
అసలు నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావే అని ఇందును అంటుంది ఐశ్వర్య. నీ వల్ల పరువు పోతుందని అపర్ణ అంటుంది. తాగొద్దని చెప్పానుగా అని ఇందు అంటే అందుకే ఎక్కువ తాగా, ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ, నానమ్మ పెగ్గు, తాతయ్య పెగ్గు, ఈ రాజు పెగ్గు అంటూ చాలా తాగేసా. ఎక్కువైందని. అయితే ఇప్పుడేంటీ. నన్ను తాగొద్దని చెప్పడానికి నువ్వెవరే, నా మీద నీ పెత్తనం ఏంటే అని ఐశ్వర్య అంటుంది.
మీరు చెప్పినట్లు గంగిరెద్దిలా తల ఆడించడానికి రేఖ ఆంటీని కాదు అని ఐశ్వర్య అంటే.. ఐషు అని కోప్పడుతుంది రేఖ. హా.. వచ్చిందమ్మా వయ్యారీ.. అసలు ఇదో పెద్ద తింగరబుచ్చి, ఇంట్లో కళ్లముందే ఏం జరుగుతుందో తెలుసుకోలోని అమాయకపు చక్రవర్తి అని రేఖపై సెటైర్లు వేస్తుంది ఐశ్వర్య. భ్రమరాంబ కలగజేసుకుంటే.. నీకంటే తక్కువే వాగుతున్నా బావురుకప్ప భ్రమరాంబ అని ఐశ్వర్య అంటుంది.
రేఖపై ఐశ్వర్య సెటైర్లు
బావురుకప్ప కాకపోతే గాండ్రుకప్పు. నువ్వు అరవడం తప్పా దాంట్లో అర్థముండదు, పాడుండదు. ఏమైనా అంటే శేషు అంటావ్. వాడేమో మూసా మూసా అంటాడు అని ఐశ్వర్య అంటుంది. నన్ను వాడు అంటావా అని శేషు కోప్పడితే ఆమాత్రం రెస్పెక్ట్ ఇచ్చా సంతోషిచ్చా అని నోరు మూయిస్తుంది ఐశ్వర్య. ఐషు చాలా ఓవర్ చేస్తున్నావ్ రూమ్‌లోకి వెళ్లు అని రేఖ అంటుంది.
ఎహే ఆపు అని చేయి తీసేస్తుంది ఐశ్వర్య. నీకే ఏం తెలియదు. వీళ్లు బార్యాభర్తలు కాదని వీడియో చూపిస్తే అది ఏఐ వీడియో అని చెప్పగానే నమ్ముతావా. స్లీవ్‌లెస్ జాకెట్ వేసి, ట్రాన్స్‌పరెంట్ చీర కట్టుకుని ఓ తెగ తిప్పుకుంటూ తిరుగుతావ్ కదా అని ఐశ్వర్య నానా మాటలు అంటుంది. ఆ మాటలు ఏంటని భూషణ్ అంటే.. ఆగు మావయ్య నీ మాటలు నీ పెళ్లామే వినదు, మేము వినాలా అని ఐశ్వర్య అంటుంది.
మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాం కదా అని రాజు అంటే.. చూపించావ్‌లే. అది ఎవరు తీసుకొచ్చారు. ఆ బుడ్డమిరపకాయ్ నందునే కదా అని ఐశ్వర్య అంటుంది. అంత మాట అంటావా అని స్వాతి అంటే.. కాకపోతే. అది పెద్ద హైట్ ఉందా. నువ్వొక మెసెంజర్‌లా అటు విషయాలు ఇటు ఇటు విషయాలు అటు చెబుతావ్ అని ఐశ్వర్య అంటుంది.
రేఖ నుంచి నందు దాకా విరుచుకుపడిన ఐషు
రేఖ నుంచి నందు, స్వాతి దాకా ఒక్కొక్కరిని మాటలతో ఐశ్వర్య ఆడుకుంటుంది. రాజు కిడ్నాప్ నుంచి పెళ్లి దాకా అంతా చెప్పి నీ ఆటలు ఏంటో, నీ ప్లాన్ ఏంట్రా అని రాజు కాలర్ పట్టుకుని కూలిపోతుంది. మత్తులో పడిపోతుంది. ఇందు పట్టుకుంటుంది. లక్కీ పట్టుకునాని పోతే రాజు ఆపి ఓవరాక్షన్ చేయకని చెబుతాడు. దీని సంగతి రేపు పొద్దున చెబుతానని భ్రమరాంబ అంటుంది.
తాగితే నిజాలు బయటకొస్తాయంటారు. అయితే, ఐషు చెప్పింది నిజమేనా అని భ్రమరాంబ డౌట్ పడుతుంది. రా నిజమేంటో కనుక్కుందామని భ్రమరాంబ అంటుంది. రేఖ ఏంటీ కళ్లలోకి చూస్తేనే ఊరుకునేది కాదు, ఇప్పుడు ఎవరు ఏమన్నా సైలెంట్‌గా ఉంటోంది ఏంటని భూషణ్ డౌట్ పడతాడు. భ్రమరాంబ వచ్చి మేము నిజమేంటో పసిగట్టేశాం అంటుంది.
లక్కీ నా కొడుకు అనే నిజం తెలిసిపోయిందా అని మనసులో భయపడిన రేఖ వదినా మీరు ఏమనుకుంటున్నారో అది అబద్ధం అని అంటుంది. అసలు మేము ఏం అనుకుంటున్నామో నీకెలా తెలుసు అని రివర్స్‌లో అడుగుతుంది భ్రమరాంబ. రేఖ కంగారుపడుతుంది. అది అంతా గమనిస్తారు. ఆ ఐషు మాటలు విన్నాకా మాకు అనుమానంగా ఉంది. ఇందుకు రాజు అద్దె మొగుడుగా నటిస్తున్నాడనిపిస్తుందని భ్రమరాంబ అంటుంది.
సాక్ష్యాలు సంపాదిస్తానన్న భ్రమరం
ఐషు చెప్పినట్లు ఆ ఇందు నిన్ను మాయ చేస్తుందేమో అనిపిస్తుందని భ్రమరాంబ అంటుంది. అనుమానంగా ఉంటే సరిపోదు ఆధారాలు కావాలని భూషణ్ అంటాడు. ఈ విషయం లైట్ తీసుకోండి. అంత టైమ్ వేస్ట్ అని రేఖ అంటుంది. నా అనుమానం తీరేదాకా నేను పట్టానా ఉండలేను. సాక్ష్యాలు సంపాదిస్తాను అని భ్రమరాంబ అంటుంది.
ఇకనుంచి ఇందు, రాజులను పిన్ టు పిన్ గమనిస్తాను. సాక్ష్యం లేకుండా రేఖకు చెబితే ఇది పట్టించుకోదని భ్రమరాంబ మనసులో అనుకుంటుంది. మరోవైపు ఐషు వాగిన వాగుడుకు ఎవరికైనా డౌట్ వచ్చిందంటావా అని రాజు అంటాడు. దాని గురించి ఆలోచించట్లే. తనకు మంచి చేయాలని చూస్తే తప్పుగా అర్థం చేసుకుంటుంది. రోజురోజుకీ తన ప్రవర్తన దిగజారిపోతుందని ఇందు అంటుంది.
ఈరోజు ఇంట్లో వాళ్లందరిమీద విరుచుకుపడిందని ఇందు బాధపడుతుంది. బావ నాకు మాకు అక్క కావాలి అని రాజును అడుగుతుంది. తర్వాత రాజు బెడ్‌పై, ఇందు నేలపై పడుకోవడం అపర్ణ చూసి షాక్ అవుతుంది. అదే విషయం సుభాష్‌కు చెబితే వారిద్దరితో సత్యనారాయణ వ్రతం చేయిద్దాం. నిజంగా భార్యాభర్తలయితే చేస్తారని అంటాడు.
సత్యనారాయణ వ్రతానికి ఒప్పుకోను రాజు
సత్యనారాయణ వ్రతం చేయిస్తున్నామని, గుడిలో ఏర్పాట్లు చేయిస్తున్నామని ఇందుతో అపర్ణ అంటుంది. అదే విషయం రాజుతో ఇందు కంగారుగా చెబుతుంది. సత్య నారాయణ వ్రతానికి రాజు ఒప్పుకోడు. ఇందు ఎక్స్‌ట్రా డబ్బులు ఇస్తానంటుంది. దేవుడు ముందు నటించలేను, సత్య నారాయణ వ్రతానికి రాను అని రాజు తెగేసి చెబుతాడు. దాంతో ఇందు చిక్కుల్లో పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


