Brahmamudi July 8th Episode: బ్రహ్మముడి.. ఇటు నందు.. అటు రాజు.. రేఖకు ఇక చుక్కలే.. దుగ్గిరాల ఆస్తి సేఫ్

Brahmamudi Serial July 8th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 8 ఎపిసోడ్ లో రేఖకు ఊహించని షాక్ తగులుతుంది. చివరి నిమిషంలో నందుని రంగంలోకి దింపిన రాజు గట్టి దెబ్బే కొడతాడు. తర్వాత రేఖకు ఫోన్ చేసి ఇందు ఎప్పటికీ తన భార్యే అని సవాలు విసురుతాడు.

Published on: Jul 8, 2026, 07:59:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖ, భ్రమరాంబ ఆస్తి కలలకు మళ్లీ బ్రేక్ పడుతుంది. చివరి నిమిషంలో రాజు రాకపోయినా అతడు పంపించిన నందు వచ్చి ఇందుని కాపాడుతుంది. దీంతో ఆస్తి కలలు కంటున్న రేఖకు మరో దిమ్మదిరిగే షాక్ తగులుతుంది. అటు మరోసారి రాజుకు ఇందుకు దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

Brahmamudi July 8th Episode: బ్రహ్మముడి.. ఇటు నందు.. అటు రాజు.. రేఖకు ఇక చుక్కలే.. దుగ్గిరాల ఆస్తి సేఫ్
Brahmamudi July 8th Episode: బ్రహ్మముడి.. ఇటు నందు.. అటు రాజు.. రేఖకు ఇక చుక్కలే.. దుగ్గిరాల ఆస్తి సేఫ్

ఆస్తి కాపాడాలంటూ రాజును వేడుకున్న అపర్ణ..

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జులై 8) ఎపిసోడ్ రాజుకు అపర్ణ ఫోన్ చేసి ఆస్తి కాపాడాలంటూ వేడుకునే సీన్ తో మొదలవుతుంది. నువ్వు మళ్లీ వస్తేనే దుగ్గిరాల కుటుంబం, ఇందు నిలబడతాయి.. లేదంటే నా 20 ఏళ్ల కష్టం వృథా అవుతుంది.. నా పిల్లల కలలు కల్లలవుతాయి అని అపర్ణ అంటుంది.

కానీ రాజు మాత్రం అలాంటిదేమీ జరగదు.. నేను చూసుకుంటాను.. ఆస్తి పేపర్లపై సంతకం పెట్టకుండా ఆపే బాధ్యత నాది అని ధైర్యం చెబుతాడు. దీంతో అపర్ణ ఊపిరి పీల్చుకుంటుంది.

పగటి కలలు కంటున్న భ్రమరాంబ

అటు భ్రమరాంబ అప్పుడే పగటి కలలు కనడం మొదలుపెడుతుంది. ఓ బ్రోకర్ కు ఫోన్ చేసి బంజారాహిల్స్ లో ఒక ఎకరా భూమి కావాలని చెబుతుంది. అది విన్న అపర్ణ.. రాత్రి కలలు నిజమవుతాయేమో కానీ.. పగటి కలలు ఎప్పటికీ కావని అంటుంది. అంటే ఆస్తి మాకు దక్కదా అని భ్రమరాంబ అంటే.. అది ఎన్నటికీ జరగదు అని అపర్ణ తేల్చి చెబుతుంది.

ఆస్తి నీకు దక్కదంటూ రేఖకు అపర్ణ ఛాలెంజ్

అప్పుడే రంగంలోకి దిగిన రేఖ.. ఆస్తి కోసం తాము పగటి కలలు కంటున్నామా అని అంటుంది. అవునని, ఆ ఆస్తి ఎప్పటికీ మీకు దక్కదని మరోసారి అపర్ణ ఛాలెంజ్ చేస్తుంది. కాసేపట్లో రిజిస్ట్రార్ వస్తున్నాడు.. వెళ్లి ఇందుని రెడీ చెయ్యమని రేఖ చెబుతుంది.

అపర్ణ వెళ్లిపోయిన తర్వాత ఆమె మరీ ఇంత కాన్ఫిడెంట్ గా ఉందేంటి.. మళ్లీ ఇద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేశారా అని భ్రమరాంబ అంటుంది. వాళ్లకు అంత సీన్ లేదని రేఖ కొట్టి పారేస్తుంది.

ఇందుకు కూడా ధైర్యం చెప్పిన అపర్ణ..

అటు ఇందు దగ్గరికి వెళ్లిన అపర్ణ ఆమెకు కూడా ధైర్యం చెబుతుంది. తన మనవడు రాజు అడ్డుకుంటాడని, అలా అని తనకు మాటిచ్చాడని అంటుంది. మనది కాని బంధాన్ని నమ్మొద్దని ఇందు చెబుతుంది. అయినా తాను సంతకం చేసి పెద్ద తప్పు చేశాడు కదా అని అడుగుతుంది.

అది తనకు తెలియకుండా చేసిందని, కొన్నిసార్లు అలా జరుగుతుందని అపర్ణ అంటుంది. అయినా రాజును నమ్మొద్దని, తానే సంతకం పెట్టకుండా ఉండటానికి సాధ్యమైనంత వరకూ ప్రయత్నిస్తానని చెప్పి ఇందు వెళ్లిపోతుంది.

సంతకం పెట్టడానికి సిద్ధమైన ఇందు

ఆస్తి కోసం అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఇంతలో రిజిస్ట్రార్ వస్తాడు. అటు ఇందు కూడా కిందికి రావడంతో రేఖ, భ్రమరాంబ ఆమెపై ఎంతో ప్రేమ కురిపిస్తూ కూర్చోబెడతారు. డాక్యుమెంట్లు అన్నీ కరెక్టుగా ఉన్నాయని, ఇక ఏ లీగల్ సమస్య రాదని రిజిస్ట్రార్ అంటాడు. అయితే ఇందుని సంతకం చేయొద్దని సుభాష్ వారిస్తాడు. కానీ ఇందు మాత్రం తాను సంతకం పెడతానని అనడంతో సుభాష్ షాక్ తింటాడు.

చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన నందు.. రేఖకు షాక్

రేఖ సంతకం పెట్టిన తర్వాత ఇందు సంతకం పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ చివరికి తప్పని పరిస్థితుల్లో సంతకం పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఎవరి ఆస్తి ఎవరు రాసిస్తారు అంటూ నందు ఎంట్రీ ఇస్తుంది. దీంతో అందరూ షాక్ తింటారు. అది అడగటానికి అసలు నువ్వు ఎవరు.. నువ్వు సంతకం పెట్టాలా అని భ్రమరాంబ అడుగుతుంది.

అవును.. నేను కూడా సంతకం పెట్టాలి.. ఈ ఆస్తిలో నాకూ వాటా ఉంది.. కొన్నేళ్ల కిందట మరో మనిషి కూడా ఈ ఇంట్లో ఉండేదన్న విషయం గుర్తుందా.. కల్యాణ్, అప్పు కూతురు నందును తానే అని చెప్పడంతో సుభాష్, అపర్ణ సంతోషిస్తారు. రేఖ, భ్రమరాంబకు దిమ్మదిరిగే షాక్ తగులుతుంది.

రాజు చెప్పాడన్న నందు

ఆస్తి పేపర్లపై సంతకాలు పెట్టకపోవడంతో ఇందు ఊపిరి పీల్చుకుంటుంది. ఈ విషయం నీకెవరు చెప్పారని అడిగితే నీ మొగుడు రాజు చెప్పాడని నందు అంటుంది. అటు అపర్ణ కూడా రాజుకు ఫోన్ చేసి తిరిగి ఇంటికి రమ్మని చెప్పమని ఇందుకి చెబుతుంది.

మరోవైపు రేఖకు ఫోన్ చేసిన రాజు తన దెబ్బ ఎలా ఉందని అడుగుతాడు. ఎప్పటికైనా ఇందు నా భార్యే అని తేల్చి చెబుతుంది. ఇందు కూడా రాజు విషయంలో మరోసారి ఆలోచనలో పడుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More