బ్రహ్మముడి జూన్ 17 ఎపిసోడ్: తాగి నిజం కక్కేసిన రాజు.. అసలు పెళ్లే జరగలేదని చెప్పి.. ఐశ్వర్య, లక్కీ షాక్
Brahmamudi June 17th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 17 ఎపిసోడ్ లో రాజు, ఇందు తమ డ్రామాను రక్తి కట్టించినా.. ఐశ్వర్య వదలకుండా లక్కీని రంగంలోకి దించుతుంది. అప్పుడు తప్పతాగి రాజు అసలు నిజం చెప్పేసి ఐశ్వర్యకు దొరికిపోతాడు.
Brahmamudi June 17th Episode: స్టార్ మా టాప్ సీరియల్స్ లో ఒకటైన బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ రక్తి కట్టించేలా సాగింది. రాజు, ఇందు నాటకాన్ని బయటపెట్టాలని ఐశ్వర్య చూసినా.. ఆమె ప్లాన్ వర్కౌట్ కాదు. దీంతో లక్కీని రంగంలోకి దింపి రాజు నిజం బయటపెట్టాలని ప్లాన్ చేస్తుంది. అది కాస్తా సక్సెస్ అవుతుంది.

Doubt in Aishwarya's Mind | రాజు, ఇందుల గొడవ.. ఐశ్వర్యలో అనుమానం!
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జూన్ 17) ఎపిసోడ్ లో రాజు, ఇందు ఇద్దరూ కలిసి ఐశ్వర్య ముందు ఒక పెద్ద గొడవ పడుతూ కనిపిస్తారు. వాళ్ల గొడవ చూసి మొదట ఐశ్వర్య కంగారు పడినా.. ఆ తర్వాత ఆమెలో ఒక పెద్ద డౌట్ మొదలవుతుంది. వీళ్లిద్దరూ నిజంగానే భార్యాభర్తలా? లేక అందరినీ నమ్మించడానికి నాటకమాడుతున్నారా? అనే అనుమానం ఐశ్వర్య మైండ్‌లోకి వస్తుంది.
ఎలాగైనా వీరి గుట్టు రట్టు చేయాలని డిసైడ్ అయిన ఐశ్వర్య.. వెంటనే రేఖను రంగంలోకి దించుతుంది. రేఖను అక్కడికి తీసుకొచ్చి రాజు, ఇందులను ఇరుకున పెట్టాలని చూస్తుంది. కానీ అక్కడ రాజు, ఇందు ఇద్దరూ చాలా అలర్ట్ గా ఉండి.. డ్రామాను రక్తి కట్టిస్తారు. ఇందుపై రాజు ప్రేమ చూపించడం, ముద్దు పెట్టుకోవడం.. ఆమె సిగ్గు పడటం చూసి రేఖ, ఐశ్వర్య షాక్ తింటారు.
ఇది చూసి ఐశ్వర్యలోనే కాదు రేఖలోనూ అనుమానం మరింత బలపడుతుంది. వీళ్లు ఇంత అన్యోన్యంగా ఉంటున్నారేంటి.. ఇందు నాతో అబద్ధం చెబుతోందా అని రేఖ అనుకుంటుంది. ఐశ్వర్య మాత్రం షాక్ లో ఉండిపోతుంది.
Lucky's Sitting Plan | లక్కీని రంగంలోకి దించిన ఐశ్వర్య.. రాజుకు ఫోన్
రాజు, ఇందులు అంత ఈజీగా నిజం చెప్పరని గ్రహించిన ఐశ్వర్య.. ఈసారి మరో అడుగు ముందుకేసి 'లక్కీ'ని వాడుకోవాలని చూస్తుంది. లక్కీకి ఫోన్ చేసి పిలుస్తుంది. అతనితో ప్రేమగా ఉన్నట్లు నటిస్తుంది. మీద మీద పడిపోతుంది. ఆ తర్వాత లక్కీ చేత రాజుకు ఫోన్ చేయిస్తుంది. అసలు రాజు, ఇందు ఎలా పెళ్లి చేసుకున్నారో తెలుసుకోవాలని అతనికి చెబుతుంది.
అతనితో రెండు పెగ్గులు తాగిస్తే నిజం బయటపెడతాడని, సిట్టింగ్ కు ప్లాన్ చేయాలని అంటుంది. కొంచెం టైమ్ ఇవ్వాలని లక్కీ అంటున్నా.. ఇప్పుడే తెలుసుకోమని అని అనడంతో వెంటనే రాజుకు లక్కీ ఫోన్ చేస్తాడు. సిట్టింగ్ కు రమ్మని పిలవడంతో రాజు కూడా ఎగురుకుంటూ సరే అంటాడు.
Venky Struggles | వెంకీ కాళ్లు చూసి చలపతి, లక్ష్మీ ఆందోళన
ఇదిలా ఉంటే కథలో మరోవైపు ఒక ఎమోషనల్ సెంటిమెంట్ డ్రామా నడుస్తుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలి డెలివరీ ఉద్యోగానికి వెళ్లిన వెంకీ తొలి రోజే కాళ్ల నొప్పులతో వస్తాడు. ఇంట్లో మాత్రం తాను సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికే వెళ్తున్నట్లు చెబుతాడు.
అయితే వెంకీ కాళ్ల పరిస్థితి చూసి ఇంట్లో ఉన్న చలపతి, లక్ష్మీ ఇద్దరూ తీవ్ర ఆందోళనకు గురవుతారు. అసలు నువ్వు సాఫ్ట్‌వేర్ ఉద్యోగమే చేస్తున్నావా అని వెంకీని చలపతి అడుగుతాడు. అవును.. కొత్త షూస్ వల్ల ఇలా అయింది అంతే అని అతడు కవర్ చేస్తాడు.
The Truth is Out | తాగి నిజం కక్కేసిన రాజు.. ఇందులో పెళ్లి జరగలేదు
ఇక ఎపిసోడ్ చివర్లో అసలైన హై-వోల్టేజ్ ట్విస్ట్ వస్తుంది. లక్కీ వేసిన సిట్టింగ్ ప్లాన్ లో రాజు ఇరుక్కుపోతాడు. అతడు ఏం చెబుతాడో చూడాలని ఐశ్వర్య కూడా అక్కడే ఉంటుంది. అదే సరైన సమయంగా భావించి లక్కీ ఇందు టాపిక్ తీయడంతో.. రాజు మందు మత్తులో అసలు నిజాన్ని కక్కేస్తాడు.
"నాకు, ఇందుకూ అసలు పెళ్లే జరగలేదు! ఇదంతా కేవలం ఒక డ్రామా" అంటూ లక్కీ ముందు షాకింగ్ సీక్రెట్ ఓపెన్ చేస్తాడు. తాను కేవలం డబ్బు తీసుకొని అద్దె మొగుడిగా నటిస్తున్నట్లు చెబుతాడు. ఈ మాట వినగానే లక్కీతో పాటు వెనకాలే దాక్కుని వింటున్న ఐశ్వర్య షాక్ తింటారు. రాజు నోటి నుంచే ఈ నిజం రావడంతో ఇక ఇందు ఆట కట్టించవచ్చని ఐశ్వర్య ఫిక్స్ అవుతుంది. అక్కడితో ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


