...
...
Next Story

బ్రహ్మముడి జూన్ 25 ఎపిసోడ్: ఐశ్వర్యను కాపాడిన ఇందు.. రేఖకు దిమ్మదిరిగే షాకిచ్చిన శృతి.. రెచ్చిపోయిన అపర్ణ, సుభాష్

Brahmamudi June 25th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 25 ఎపిసోడ్ లో ఐశ్వర్యను ఇందు కాపాడుతుంది. అయితే తనను నిలదీసిన రేఖ దగ్గర అతి వినయంతో కూడిన నటనతో తప్పించుకుంటుంది. మరోవైపు ఐశ్వర్య విషయంలో రేఖపై అపర్ణ, సుభాష్ మండిపడతారు.

Published on: Jun 25, 2026, 08:21:51 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కంపెనీలో ఉద్యోగుల మనసులు గెలుచుకున్న ఇందు.. ఇంట్లో రేఖ దగ్గర తెగ నటించేస్తుంది. అదే సమయంలో రాకేష్ బారి నుంచి ఐశ్వర్యను కూడా కాపాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

ఉద్యోగుల మనసు గెలుచుకున్న ఇందు..

బ్రహ్మముడి జూన్ 25 ఎపిసోడ్: ఐశ్వర్యను కాపాడిన ఇందు.. రేఖకు దిమ్మదిరిగే షాకిచ్చిన శృతి.. రెచ్చిపోయిన అపర్ణ, సుభాష్
బ్రహ్మముడి జూన్ 25 ఎపిసోడ్: ఐశ్వర్యను కాపాడిన ఇందు.. రేఖకు దిమ్మదిరిగే షాకిచ్చిన శృతి.. రెచ్చిపోయిన అపర్ణ, సుభాష్

బ్రహ్మముడి సీరియల్ గురువారం (జూన్ 25) ఎపిసోడ్ కంపెనీలో ఉద్యోగులందరికీ ఇందు జీతాలు ఇచ్చే సీన్ తో మొదలవుతుంది. దీంతో వాళ్లందరూ ఇందుకి కృతజ్ఞతలు చెబుతారు. అంతేకాదు ఆమె కాళ్లపై పడటానికీ వస్తారు. వాళ్లందరి మనసులు గెలుచుకున్న ఇందుని చూసి రేఖ, భూషణ్ షాక్ తింటారు. ఇక నుంచి ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు వస్తాయని, అందరూ బాగా పని చేయాలని ఇందు చెబుతుంది. అందరం కష్టపడి పని చేస్తామని వాళ్లు హామీ ఇస్తారు.

ఐశ్వర్య అప్పు తీర్చిన ఇందు..

ఇటు ఇంట్లో ఐశ్వర్య దగ్గరికి రాకేష్ మరోసారి వస్తాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బు ఇవ్వకపోవడంతో నిన్ను తీసుకెళ్తే మీ ఇంట్లో వాళ్లే ఇస్తారని ఆమెను బలవంతంగా లాక్కెళ్తుంటాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన ఇందు.. రాకేష్ ను లాగిపెట్టి కొడుతుంది. దీంతో అతడు అందరి ముందూ అసలు నిజం చెప్పేస్తాడు. ఐశ్వర్య రూ.10 లక్షల అప్పు గురించి చెప్పడంతో ఆమె షాక్ తింటుంది. అప్పటికప్పుడు ఇందు తన దగ్గర ఉన్న డబ్బు తీసి రాకేష్ మొఖాన కొడుతుంది. వడ్డీతో కలిపి ఇచ్చాను ఇక వెళ్లు అని చెప్పడంతో రాకేష్ వెళ్లిపోతాడు.

ఎదురు తిరిగిన ఐశ్వర్య.. రెచ్చిపోయిన అపర్ణ, సుభాష్.. రేఖకు క్లాస్

ఏం మాట్లాడుతున్నావ్.. సాయం చేసింది వదిలేసి ఇందునే తిడతావా? అయినా ఈ దుగ్గిరాల ఇంటికి ఓ పరువు, ప్రతిష్ట ఉన్నాయి.. ఎవరి దగ్గరంటే వాళ్ల దగ్గర అప్పు చేసి ఇలా ఇంటిపైకి తీసుకొస్తావా.. బుద్దుందా నీకు అంటూ ఐశ్వర్యపై మండిపడుతుంది. అటు రేఖకు కూడా క్లాస్ పీకుతుంది. నీ పెంపకం, నా పెంపకానికి తేడా ఇదీ.. ఇప్పటికైనా తెలుసుకో.. కాస్త తగ్గి ఉంటే మంచిది అని అనడంతో రేఖ షాక్ తింటుంది.

ఇందుని నిలదీసిన రేఖ.. నటనలో అదరగొట్టిన ఇందు

ఆ తర్వాత ఇందుని రేఖ లోనికి తీసుకెళ్తుంది. ఆ వెంటే రాజు కూడా లోనికి వెళ్తాడు. అసలు నువ్వేం చేస్తున్నావంటూ ఇందుని నిలదీస్తుంది. అసలు నన్ను ఒక్క మాట కూడా అడగకుండా నిర్ణయాలు తీసుకుంటున్నావ్.. డబ్బు రాగానే జీతాలు ఎందుకు ఇచ్చావ్.. ఐశ్వర్య అప్పు ఎందుకు తీర్చావని అడుగుతుంది.

దీంతో ఇందు తన నటన మొదలుపెడుతుంది. ఇప్పటికీ మీ మాటే వింటాను ఆంటీ.. అన్నీ మిమ్మల్ని అడిగే చేస్తాను.. అప్పుడు ఎమోషన్ లో అలా చేసేశాను.. అయినా జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగులు ఎలా పని చేస్తారు.. సమయానికి ఎలా కాంట్రాక్ట్ పని పూర్తి చేస్తాం.. ఇక ఐశ్వర్య అప్పు తీర్చకపోతే ఇంటి పరువు బజారున పడుతుంది కదా.. నా స్థానంలో ఉంటే మీరూ అదే చేసేవారు ఆంటీ అంటూ రేఖను కాకా పడుతుంది. అంతేకాదు తన చేతుల్లో మిగిలిన రూ.5 లక్షలను రేఖ చేతుల్లో పెడుతుంది. ఇందు నటన చూసి రాజు ముక్కున వేలేసుకుంటాడు.

సంతకం గురించి అడిగిన రేఖ.. కాపాడిన రాజు.. రేఖ ముందే సరసాలు

ఈ విషయంలో బయటపడినా.. సంతకం గురించి రేఖ నిలదీయడంతో ఇందుకి చెమటలు పడతాయి. ఒక్క అక్షరం ముక్క రాని నువ్వు సంతకం ఎలా పెట్టావని అడుగుతుంది. ఏం చెప్పాలో అర్థం కాక ఇందు టెన్షన్ పడుతుంటే రాజు రంగంలోకి దిగుతాడు. తానే ఇందుకి సంతకం ఎలా పెట్టాలో నేర్పించానని అంటాడు.

ఆ హర్ష ముందు సంతకం కాకుండా వేలిముద్ర వేస్తే అసలు చదువు రాని ఈమె ఎలా కాంట్రాక్టు పూర్తి చేస్తుందని అనుమానిస్తాడని, అందుకే రాత్రంతా తన ఒడిలో కూర్చోబెట్టుకొని సంతకం పెట్టడం నేర్పించానని రాజు అంటాడు. అంతేకాదు రేఖ ముందే ఇందుని ఒడిలో కూర్చోబెట్టుకొని ఎలా నేర్పించానో కూడా చెబుతూ సరసాలు ఆడటంతో రేఖ చూడలేకపోతుంది. సరే సరే వెళ్లండని అంటుంది.

రేఖ ప్లాన్ ఫెయిల్.. వచ్చేసిన శృతి

ఇక ఎపిసోడ్ చివర్లో శృతిని టైమ్ కు రాకుండా చేసి హర్ష ముందు ఇందు, రాజు పరువు తీయాలని రేఖ ప్లాన్ చేస్తుంది. శృతి ఇంటి ముందు రౌడీలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఇటు టైమ్ మించిపోవడంతో హర్ష సీరియస్ అవుతుంటాడు. ఇందు, రాజు కంగారు పడుతున్న సమయంలో శృతి ఎంట్రీ ఇస్తుంది. దీంతో రేఖ షాకవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe