బ్రహ్మముడి జూన్ 3 ఎపిసోడ్: రాజు బిల్డప్ చూసి రేఖలో వణుకు.. ఇందుని బ్లాక్‌మెయిల్ చేసిన రాజు.. తమ్ముడిలో ధైర్యం నింపి..

Brahmamudi June 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజు తన ఫస్ట్ నైట్ బిల్డప్ చూసి రేఖలో వణుకు పుడుతుంది. అయితే తనను బెదిరించిన ఇందును రాజు బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెడతాడు. అటు తమ్ముడు వెంకీలోనూ రాజు ధైర్యం నింపుతాడు.

Published on: Jun 3, 2026, 08:36:37 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi June 3rd Episode: స్టార్ మా లో ప్రసారమవుతున్న పాపులర్ డైలీ సీరియల్స్ లో ఒకటైన 'బ్రహ్మముడి' రోజురోజుకూ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. జూన్ 3న ప్రసారమైన తాజా ఎపిసోడ్ లో రాజు, ఇందు మధ్య నడిచిన హై-డ్రామా ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. జూన్ 3వ తేదీ ఎపిసోడ్ హైలైట్స్ మీకోసం..

బ్రహ్మముడి జూన్ 3 ఎపిసోడ్: రాజు బిల్డప్ చూసి రేఖలో వణుకు.. ఇందుని బ్లాక్‌మెయిల్ చేసిన రాజు.. తమ్ముడిలో ధైర్యం నింపి..
బ్రహ్మముడి జూన్ 3 ఎపిసోడ్: రాజు బిల్డప్ చూసి రేఖలో వణుకు.. ఇందుని బ్లాక్‌మెయిల్ చేసిన రాజు.. తమ్ముడిలో ధైర్యం నింపి..

Raju First Night Build up: సక్సెస్ అని రాజు కలరింగ్..

బ్రహ్మముడి బుధవారం (జూన్ 3) ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే రాజు తన ఫస్ట్ నైట్ గురించి ఇంట్లో వాళ్ల ముందు ఓవర్ బిల్డప్ ఇస్తుంటాడు. గదిలో అంతా తాననుకున్నట్లే జరిగిందని, ఫస్ట్ నైట్ చాలా సక్సెస్ ఫుల్ గా ముగిసిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అది విని రేఖ టెన్షన్ పడుతుంది.

భ్రమరాంబ, శేషు మాత్రం మురిసిపోతారు. రాత్రంతా నిద్ర లేదని, ఒళ్లంతా నొప్పులని అంటాడు. ఇందు కిందికి రాగానే ఒసెయ్ ఇందు.. హీటర్ ఆన్ చెయ్.. ఒళ్లు నొప్పులుగా ఉంది అంటూ అందరి ముందూ మరింత బిల్డప్ ఇస్తాడు. అది విని రేఖ.. ఇందుని పక్కకు తీసుకెళ్తుంది. ఇటు రాజు ఫస్ట్ నైట్ విషయాన్ని రాబట్టడానికి శేషు ప్రయత్నిస్తాడు. కానీ రాజు అసలు జరిగిన విషయం చెప్పడు.

Indu Reveals Truth to Rekha: రేఖకు గుట్టు విప్పేసిన ఇందు

కానీ సీన్ కట్ చేస్తే.. అసలు కథ వేరే ఉందని తెలుస్తుంది. రాజు ఇస్తున్న బిల్డప్ అంతా ఫేక్ అని, గదిలో అసలు ఫస్ట్ నైట్ జరగలేదని రేఖకు ఇందు ఫుల్ క్లారిటీ ఇస్తుంది. ఈ విషయాన్ని సీక్రెట్ గా రేఖకు వివరిస్తుంది. మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ పాలు తాగి గుర్రు పెట్టి నిద్ర పోయాడని, ఇప్పుడు అనవసరం బిల్డప్ ఇస్తున్నాడని అంటుంది.

అది విని రేఖ ఊపిరి పీల్చుకుంటుంది. ఈ విషయాలు పట్టించుకోకుండా ముందు ఆ రాజును సీఈవో కాకుండా అడ్డుకోండని ఇందు చెప్పడంతో.. అదే పనిలో ఉన్నానని, కచ్చితంగా తానే సీఈవో అవుతానని రేఖ చెబుతుంది. నువ్వు కాదూ.. ఆ రాజు కాడు.. నేను సీఈవో అవుతానని ఇందు మనసులో అనుకుంటుంది.

Indu Warning to Raju: ఇందు వార్నింగ్.. రాజు బ్లాక్‌మెయిల్

ఈ క్రమంలో రాజు, ఇందు మధ్య పెద్ద వాగ్వాదమే జరుగుతుంది. తన గురించి ఏవేవో అబద్ధాలు చెప్తే ఊరుకునేది లేదని ఇందు అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. తన జోలికి వస్తే ఊరుకోనని, పేమెంట్ కట్ చేస్తానని సీరియస్ అవుతుంది.

కానీ ఈసారి రాజు కూడా వెనక్కి తగ్గకుండా నువ్వు పేమెంట్ కట్ చేస్తే.. నేను వెళ్లి మనది ఉత్తిత్తి పెళ్లి అని, అద్దె మొగుడినని చెబుతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో ఇందు కాస్త తగ్గి సరే పేమెంట్ ను కట్ చేయనులే అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడే వెంకీ ఆత్మహత్యాయత్నం గురించి రాజుకు ఫోన్ చేసి చెబుతాడు తండ్రి.

Raju Motivates Venky: వెంకీకి అండగా నిలబడ్డ రాజు

అది విన్న వెంటనే తన ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్తాడు రాజు. వెంకీని ఓదారుస్తాడు. ఇలాంటి పని ఎందుకు చేశావని నిలదీస్తాడు. మీరేం చేస్తున్నారంటూ తన తల్లిదండ్రులను కూడా రాజు తిడతాడు. అయితే చలపతి మాత్రం రివర్స్ లో రాజును తిడతాడు.

నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఇంటి గురించి పట్టించుకోకుండా.. అప్పుల గురించి పట్టించుకోకుండా.. నీ పాటికి నువ్వు అప్పులు చేస్తూ, జాలీగా తిరుగుతున్నావని నిందిస్తాడు. తాను కూడా ఇంటి కోసమే ఆలోచిస్తున్నానని, బిజినెస్ చేస్తున్నానని అంటాడు. మరి డబ్బులేవి అని చలపతి అడిగితే.. ఇంకా రాలేదని, వస్తాయని చెబుతాడు. తాను చెప్పిన ఉద్యోగం చేయమని తండ్రి చెబితే.. తాను బిజినెస్ తప్ప మరొకటి చేయనని తెగేసి చెబుతాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More