బ్రహ్మముడి జూన్ 1 ఎపిసోడ్: శోభనం గదిలో అరుంధతిలా ఇందు- ఐ లవ్యూ చెప్పిన రాజు- రేఖకు మైండ్ బ్లాక్- ఫస్ట్ నైట్ సక్సెస్
Brahmamudi Serial June 1st Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 1వ ఎపిసోడ్‌లో శోభనం గదిలోకి సిగ్గు పడుతూ వెళ్లిన ఇందు రాజుకు పాలు ఇవ్వకుండా పారబోస్తుంది. రాజు సిగ్గు పడుతుంటే కోప్పడుతుంది. కానీ, ఇందుపై రొమాంటిక్‌గా దూసుకెళ్లిన రాజు ఐ లవ్యూ అని చెబుతాడు. ముద్దు పెట్టుకునేందుకు దగ్గరిగా వెళ్తాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేఖ టెన్షన్ పడుతుంటే భూషణ్ వచ్చి స్లీపింగ్ పిల్స్ తెచ్చినట్లు, ఉదయం పదింటి వరకు లేవడని చెబుతాడు. గట్టిగా చెబితే అయిపోయేదానికి ఈ ట్యాబ్లెట్స్ ఇదంతా ఎందుకు అని భూషణ్ అడుగుతాడు.

శోభనం జరిపించమంది ఇందునే
నిజమే. కానీ, శోభనం జరిపించమని ఇందు కోరింది. తనకు రాజు అంటే ఇష్టం లేదు. కానీ, నానమ్మ వాళ్లు బాధపడకూడదని వాళ్ల కోసంస ఫస్ట్ నైట్‌కు ఒప్పుకుంది. అలా అని ఫస్ట్ నైట్ ఒప్పుకోలేదు. జస్ట్ వాడితో గదిలోకి వెళ్లేందుకు ఒప్పుకుంది. ఇందును గుప్పిట్లో పెట్టుకోవాలంటే ఇలాంటివి చేయాలని రేఖ అంటుంది.
మరోవైపు రేఖ ఇచ్చి మత్తు ట్యాబ్లెట్ చేతిలో పట్టుకున్న భ్రమరాంబ ఇది పాలల్లో వేయమని ఇచ్చావ్. కానీ నేను వేయనుగా. వాడు గుర్రుపెట్టి నిద్రపోయే ట్యాబ్లెట్ కాదు గుర్రంలా పరుగెత్తే ట్యాబ్లెట్ నేను ఒకటి తీసుకొచ్చాను. ఈ దెబ్బతో నెల తిరిగే సరికి ఇందు తల్లి అవుతుంది. ఆ తర్వాత రాజు, ఇందును వేరు చేయలేవు. దాంతో నీ కొడుకుకు నా కూతురే దిక్కు. అప్పుడు నువ్వే పెళ్లి చేస్తావని అనుకుంటుంది.
తను తీసుకొచ్చిన ట్యాబ్లెట్‌ను పాలల్లో వేస్తుంది భ్రమరాంబ. మరోవైపు ఇందును శోభనానికి అపర్ణ, స్వాతి రెడీ చేస్తారు. రాజు బావ వచ్చినప్పటి నుంచి నువ్వు చాలా సంతోషంగా ఉన్నావ్. నీ స్థానం మారిందని స్వాతి సంతోషిస్తుంది. అపర్ణ కూడా అదే అంటుంది. అంతలో భ్రమరాంబ పాలు తీసుకొచ్చి శోభనానికి హడావిడి చేస్తుంది. ఇందు అక్క కోసం నువ్వు ఇంతలా చేస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను అని స్వాతి అంటుంది.
పాలపై అపర్ణ డౌట్
ఇందుకు పాలు ఇచ్చి తీసుకెళ్లమంటుంది. పాలు ఇద్దరు కలిసి తాగండి అని పదే పదే చెబుతుంది భ్రమరాంబ. దాంతో అపర్ణ డౌట్ పడుతుంది. ఇందులో ఏమైనా కలిపావా అని అపర్ణ అడిగితే.. కలిపాను. పంచదార అని భ్రమరాంబ అంటుంది. తర్వాత ఇందు వెళ్తుంది. మరోవైపు శేషు మల్లెపూలు చుట్టుకుని డ్యాన్స్ చేస్తుంటాడు. భ్రమరాంబ కూడా వచ్చి శేషుతో కలిసి డ్యాన్స్ చేస్తుంది. అలా ఇద్దరు భార్యాభర్తలు జోష్‌తో డ్యాన్స్ చేస్తారు.
తర్వాత ఆపి ఎందుకు అంత సంతోషమని భ్రమరాంబ అడిగితే.. శోభనం గది ఎంత గొప్పగా రెడీ చేశాడో చెబుతాడు శేషు. మన ఫస్ట్ నైట్‌కు మించి డబుల్, త్రిబుల్ రేంజ్‌లో జరుగుతుంది శోభనం అని శేషు అంటాడు. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ చూపిస్తాను అని భ్రమరాంబను వయ్యారంగా నడుచుకుని రమ్మంటాడు శేషు. ఇలాగే అక్కడ ఇందు వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుందని శేషు అంటాడు.
మరోవైపు శోభనం గదిలోకి ఇందు వెళ్తుంది. సిగ్గుతో మెల్లిగా ఇందు అడుగులు వేస్తుంది. రాజు సంతోషిస్తాడు. శేషు చెప్పినట్లుగానే చూపిస్తారు. రాజు, ఇందు పాలు తాగుతారు. ఇందు పైట పట్టుకుని రాజు లాగుతాడు. తర్వాత ఎత్తుకుని బెడ్‌పై పడేస్తాడు. బెడ్ మీద రాజు, ఇందు రొమాంటిక్‌గా కలిసిపోతారు. దాంతో అయిపోయిందని చప్పట్లు కొడతాడు శేషు. భ్రమరాంబ తిడితే.. జరిగేది ఇదే అని శేషు అంటాడు.
శోభనం గదిలో అరుంధతిలా ఇందు
మరోవైపు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చూసి రాజు ఆశ్చర్యపోతాడు. పెళ్లవ్వకుండానే దానికి మొగుడు అయిపోయా.. పెళ్లవ్వకుండానే శోభనం అవుతుంది. ఈ ఎక్స్‌పీరియెన్స్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని రాజు అనుకుంటాడు. తర్వాత ఇందు గదిలోకి వస్తుంది. పాలు ఇవ్వమన్నట్లుగా చేయి చాస్తాడు రాజు. కానీ, ఆ పాలను చెత్తబుట్టలో పారబోస్తుంది ఇందు. దాంతో ఇందుపై అరుస్తాడు రాజు. మరి ఏం చేయాలని ఇందు అంటే.. రాజు సిగ్గుపడతాడు.
అప్పుడప్పుడు ముసలోళ్ల దగ్గర టైమ్ స్పెండ్ చేసేవాన్ని. వాళ్లు ఇవే చెప్పేవాళ్లు. ఆచారాలు తెలియకుండా పాలు ఒలకబోసావ్. ఇప్పుడు మళ్లీ పాలు తీసుకురాపో అని రాజు అంటాడు. పాలు కాదు విషం తెస్తాను అని ఇందు అంటుంది. అదేంటీ ఇప్పటిదాకా సిగ్గు పడి సడెన్‌గా అరుంధతి అవతారం ఎత్తావ్ అని రాజు అడుగుతాడు. అదంతా వాళ్ల కోసం. నానమ్మ కోరిక తీర్చేందుకు ఇలా రెడీ అయి వచ్చానని ఇందు అంటుంది.
అలా అంటే మీ నానమ్మ కోరుకుంది మనిద్దరం ఒక్కటవ్వాలనే కదా అని రాజు అంటాడు. ఇందు కోప్పడుతుంది. కోపంలో కూడా అందంగా ఉన్నావు. ముద్దొస్తున్నావ్ అని ఇందు వద్దన్న పైకి వెళ్తాడు రాజు. ఇందు డోర్ తీయబోతుంటే రాజు ఆపి మల్లెపూల వాసన చూస్తాడు. నేను అరుస్తానని ఇందు అంటే.. నేను కరుస్తా అని రాజు అంటాడు. అమ్మో వీడేంటీ ఇలా బిహేవ్ చేస్తున్నాడని ఇందు భయపడిపోతుంది.
ఐ లవ్యూ చెప్పిన రాజు
ఏం అందం అందం.. ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నావ్. నిన్ను చూస్తుంటూనే మత్తు ఎక్కేస్తుంది. నువ్వు నా లైఫ్‌లో చాలా స్పెషల్. ఐ లవ్యూ అని ఇందుకు రాజు చెబుతాడు. దాంతో ఇందు షాక్ అయిపోతుంది. ఇందును ముద్దు పెట్టేందుకు దగ్గరికి వెళ్తాడు రాజు. మరుసటి రోజు ఉదయం రాజు నిద్ర లేచి మల్లెపూలతో వస్తాడు. శోభనం గ్రాండ్ సక్సెసా అని శేషు అడిగితే.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశా అని రాజు అంటాడు.
దాంతో రేఖ తెగ షాక్ అయిపోతుంది. త్వరలో మీరు తాతయ్య కాబోతున్నారని రాజు అంటాడు. ఇందు కూడా చీర సర్దుకుంటూ, అలసటగా రావడంతో తన ప్లాన్ ఫెయిల్ అయిందని రేఖ మరింత మైండ్ బ్లాక్ అవుతుంది. భ్రమరాంబ తెగ సంతోషిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


