బ్రహ్మముడి మే 30 ఎపిసోడ్: రాజు, ఇందు ఫస్ట్ నైట్.. రేఖ ట్యాబ్లెట్ ప్లాన్ రివర్స్.. అప్పుల ఊబిలో చలపతి.. నందుకి వెంకీ దూరం
Brahmamudi May 30 Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మొత్తానికి రేఖ, ఇందు శోభనానికి ముహూర్త కుదురుతుంది. ఇద్దరూ ఫస్ట్ నైట్ కోసం ముస్తాబవుతారు. రేఖ వేసిన అన్ని ప్లాన్స్ ఫెయిలైనట్లే కనిపిస్తోంది.
Brahmamudi May 30 Episode: బ్రహ్మముడి సీరియల్ మే 30 ఎపిసోడ్ ఇటు రాజు, ఇందు ఫస్ట్ నైట్.. అటు అతని ఫ్యామిలీ అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆందోళన పడే సీన్లతో సాగిపోయింది. ఉద్యోగం లేక కుమిలిపోతున్న వెంకీ మెల్లగా నందుకి కూడా దూరమవుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

అప్పు మొత్తం ఇచ్చేయాలన్న శంకర్..
బ్రహ్మముడి సీరియల్ శనివారం (మే 30) ఎపిసోడ్ చలపతి దగ్గరికి శంకర్ అప్పులు వసూలు చేయడానికి వచ్చే సీన్ తో మొదలవుతుంది. అతనికి చలపతి వడ్డీ ఇస్తాడు. కానీ శంకర్ మాత్రం అసలు కూడా ఇచ్చేయాలని పట్టుబడతాడు. మీ వాడి ఉద్యోగం పోయిందటగా.. ఇక మీ దగ్గర డబ్బు ఉంటే ప్రమాదం అని అంటాడు. దీంతో చలపతి, లక్ష్మీ ఆందోళన చెందుతారు.
మా వాడికి మరో ఉద్యోగం వస్తుంది.. కాస్త టైమ్ ఇవ్వాలని అడిగినా శంకర్ వినడు. మొత్తం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టడంతో ఇంట్లో ఉన్న రూ.3 లక్షలు ఇస్తాడు చలపతి. ఆ రెండు లక్షలకైనా కొన్ని రోజుల టైమ్ ఇవ్వాలని బతిమాలడంతో చివరికి సరే అంటాడు.
శంకర్ మాటలకు వెంకీ అప్‌సెట్
అయితే వెంకీ కోసం చలపతి పడిన ఆరాటం గురించి శంకర్ దారుణంగా మాట్లాడతాడు. అప్పు చేసి మీ వాడిని చదివించొద్దంటే వినలేదు.. ఇప్పుడు చూడు ఉద్యోగం పోయింది.. ఏం పీకాడని అంటూ దారుణంగా మాట్లాడతాడు. అది విని వెంకీ బాధపడతాడు. వాడికి మరో ఉద్యోగం వస్తుంది.. మిగిలిన డబ్బు కొన్ని రోజుల్లోనే ఇచ్చేస్తామని చలపతి అనడంతో సరే అని శంకర్ వెళ్లిపోతాడు.
రాజు, ఇందుకి శోభనం ముహూర్తం
మరోవైపు రాజు, ఇందు శోభనం కోసం ముహూర్తం పెట్టడానికి పంతులును పిలుస్తుంది అపర్ణ. అతడు వచ్చి ఈ రోజు రాత్రి 11 గంటలకు మంచి ముహూర్తం ఉంది.. ఆ సమయానికి ఇద్దరికీ లోనికి పంపిస్తే సరిపోతుంది అని అంటాడు. దీంతో అపర్ణ, సుభాష్ సంతోషిస్తారు.
రేఖ రచ్చ, రాజు వార్నింగ్
పంతులు ఎందుకు వచ్చాడని రేఖ వచ్చి అడుగుతుంది. ఇందు, రాజు మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించానని అపర్ణ చెప్పడంతో రేఖ షాక్ తింటుంది. ఇందులో టెన్షన్ మొదలవ్వగా.. రాజు మాత్రం ఎగిరి గంతేస్తాడు. ఉత్తిత్తి పెళ్లికి ఫ్రీగా శోభనం కూడా జరిగిపోతోందని అనుకుంటాడు. ఇప్పుడు ఫస్ట్ నైట్ కు తొందరేముంది, అవసరం ఏముంది అని రేఖ రచ్చ చేస్తుంది.
దీంతో రాజు సీన్ లోకి ఎంటరై.. ఏంటి పిన్ని నోరు లేస్తోంది.. ఇన్నాళ్లూ అమ్మమ్మ వాళ్లపైన నోరు పారేసుకున్నది చాలు.. ఇప్పుడు వాళ్ల మనవడు వచ్చాడు.. ఇక కుదరదు అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఆ డైలాగ్ విని శేషు ఓ విజిల్ వేస్తాడు. శోభనం కోసం రాజు తొందరపడటం చూసి ఇందు అతనికి కాలిని గట్టిగా తొక్కుతుంది. రేఖ వద్దంటున్నా.. ఇద్దరికీ రెడీ అవమని అపర్ణ చెబుతుంది. ఏర్పాట్లు చేయాలని రేఖ, ఐశ్వర్యలకు ఆర్డర్ వేస్తుంది.
ఉద్యోగంపై వెంకీ ఆందోళన
ఇటు ఉద్యోగం, అప్పులు, శంకర్ అన్న మాటలు గుర్తుకు వచ్చి వెంకీ ఆందోళన చెందుతాడు. కనీసం భోజనం కూడా చేయడు. తాను ఏ తప్పూ చేయలేదని తండ్రికి సంజాయిషీ ఇస్తాడు. ఏఐ అనే కొత్త టెక్నాలజీ వస్తే నా తప్పా.. అది నేర్చుకోవడానికి కాస్త టైమ్ ఇవ్వాలి కదా.. మాలాంటి ఉద్యోగుల వల్లే కదా ఆ కంపెనీ ఈ స్థాయిలో ఉంది.. అప్పుడు కష్టపడి చదివింది అంతా వృథా అయింది.. ఏ ఉద్యోగానికి వెళ్లినా కొత్త టెక్నాలజీ గురించే అడుగుతున్నారు అని వెంకీ బాధపడుతూ చెబుతాడు. వాటి గురించి ఆలోచించొద్దని, ముందు తినమని చలపతి, లక్ష్మీ అంటున్నా తిండి సహించక అతడు వెళ్లిపోతాడు.
నందుని దూరం పెట్టిన వెంకీ
ఉద్యోగం విషయంలో వెంకీ తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే నందు ఫోన్ చేస్తుంది. అతడు ఫోన్ ఎత్తడు. ఆమె పదే పదే చేస్తుంటే కట్ చేస్తుంటాడు. వీడేంటి ఇలా చేస్తున్నాడు.. ఉద్యోగం విషయంలో టెన్షన్ పడుతున్నాడా.. అయినా నా ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయాలే అని నందు అనుకుంటుంది.
రాజు, ఇందు శోభనం.. రేఖ ప్లాన్ రివర్స్
మొత్తానికి రాజు, ఇందు శోభనానికి అంతా రెడీ అవుతుంది. అయితే శోభనం రాత్రి రాజు గురకపెట్టి నిద్ర పోయేలా పాలల్లో ఓ ట్యాబ్లెట్ వేసి ఇవ్వాలని భూషణ్ కు చెబుతుంది రేఖ. అతడు ఆ ట్యాబ్లెట్ ను భ్రమరాంబకు ఇస్తాడు. కానీ ఇందు శోభనం కోసం ఎదురు చూస్తున్న భ్రమరాంబ మాత్రం.. ఆ ట్యాబ్లెట్ కు బదులు రాజు గుర్రంలా రెచ్చిపోయే మరో ట్యాబ్లెట్ ను పాలల్లో కలుపుతుంది. ఇటు రెడీ అయిన ఇందు గదిలోకి వెళ్తుంది. ఆమె తెచ్చిన పాలు తాగిన రాజు .. ఆమెను బెడ్ పైకి విసిరి మీద పడతాడు. మాంచి మూడ్ లోకి వెళ్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


