బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్: తల్లి జ్ఞాపకాన్ని రాజుకి ఇచ్చేసిన ఇందు.. మదన్‌ను రంగంలోకి దించిన రేఖ.. వెంకీకి నందు గిఫ్ట్

బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖపై రాజు, ఇందు పైచేయి సాధిస్తారు. అయితే రేఖ మాత్రం మదన్ ను రంగంలోకి దింపి మరో కొత్త ప్లాన్ కు తెరతీస్తుంది. అటు వెంకీకి నందు ఓ గిఫ్ట్ ఇస్తుంది.

Published on: May 27, 2026, 08:38:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్: దుగ్గిరాల కంపెనీని సొంతం చేసుకోవడానికి ఇటు ఇందు, రాజు.. అటు రేఖ గట్టిగానే ప్లాన్స్ చేస్తున్నారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి స్టెప్ లో ఇందు గెలుస్తుంది. పరంధామయ్య మద్దతును కూడగడుతుంది.

బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్: తల్లి జ్ఞాపకాన్ని రాజుకి ఇచ్చేసిన ఇందు.. మదన్‌ను రంగంలోకి దించిన రేఖ.. వెంకీకి నందు గిఫ్ట్
బ్రహ్మముడి మే 27 ఎపిసోడ్: తల్లి జ్ఞాపకాన్ని రాజుకి ఇచ్చేసిన ఇందు.. మదన్‌ను రంగంలోకి దించిన రేఖ.. వెంకీకి నందు గిఫ్ట్

పరంధామయ్య మద్దతు కూడగట్టిన రాజు, ఇందు

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మే 27) ఎపిసోడ్ కంపెనీ బోర్డు మెంబర్ పరంధామయ్యతో రాజు, ఇందు మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. ఈ సందర్భంగా దుగ్గిరాల కుటుంబం కంపెనీకి, సమాజానికి చేసిన మంచి గురించి అతడు గొప్పగా చెబుతాడు. రేఖ వచ్చిన తర్వాత దారుణాలు చేస్తోందని, అందుకే తాను కంపెనీకి వెళ్లడం మానేశానని అంటాడు.

మన కంపెనీకి పునర్ వైభవం తెస్తానని ఇందు అంటుంది. అయితే దీనికోసం మద్దతు కావాలని అడగడంతో అతడు సరే అంటాడు. ఐదుగురిలో ఇద్దరు రేఖ మనుషులు ఉన్నారని, మిగిలిన ఇద్దరు మీరు చెప్పినట్లు వింటారని ఇందు చెబుతుంది. మీ ఓటు తనకు కావాలని అడగడంతో అతడు సరే అంటాడు.

ఇందుతో స్నేహం చేయాలని మదన్‌కు చెప్పిన రేఖ

మరోవైపు ఇంటి దగ్గర తన కొడుకు మదన్ కోసం వేచి చూస్తుంటుంది రేఖ. ఆమె దగ్గరికి భ్రమరాంబ, శేషు వెళ్తారు. అప్పుడే మదన్ కూడా వస్తాడు. వాళ్ల ముందే మదన్ తో రేఖ మాట్లాడుతూ.. ఇక నుంచి ఇందుతో స్నేహంగా ఉండాలని చెబుతుంది. ఎంతలా అంటే.. నువ్వు లేకపోతే అది పిచ్చిదైపోయేంతలా స్నేహం చేయాలి అని అంటుంది. అతడు సరే అని వెళ్లిపోతాడు.

ఆమెకు పెళ్లయింది కదా అని భ్రమరాంబ అంటే.. విడాకులు ఇప్పించి మళ్లీ తన కొడుకుతో పెళ్లి చేయిస్తానని రేఖ చెబుతుంది. మరో ఏడాది సమయం ఉంది కాబట్టి అంతలోపు ఇందుని మదన్ తన వైపుకు తిప్పుకుంటాడని అంటుంది. దీంతో భ్రమరాంబ షాకవుతుంది. నీ కూతురిని మా వాడికి ఇచ్చి చేయాలనుకుంటున్నావు కదా.. అది జరగనివ్వను అని రేఖ మనసులో అనుకొని వెళ్లిపోతుంది.

శేషుతో భ్రమరాంబ డ్రామా.. ఇందు శోభనం చేయాలంటూ..

అయితే భర్త శేషుతో కలిసి భ్రమరాంబ కొత్త నాటకానికి తెరతీస్తుంది. తాను చెప్పినట్లు చేయాలని అంటుంది. ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్లి అపర్ణ, సుభాష్ ముందు నాటకం మొదలు పెడతారు. ఇందుపై భ్రమరాంబ ప్రేమ ఒలకబోస్తుంది. పెళ్లయి ఇన్నాళ్లయినా శోభనం జరిపించలేదు.. ఇంట్లో ఎవరికీ ఆ ఆలోచన లేదు అంటుంది. అది విన్న అపర్ణ, సుభాష్ ఆమె చెప్పింది నిజమే కదా అనుకుంటారు. వెంటనే పంతులుగారిని పిలిపించి మంచి ముహూర్తం పెడదామని అపర్ణ అంటుంది.

వెంకీ కోసం నందు షర్ట్ గిఫ్ట్

ఇటు వెంకీ కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి రెడీ అవుతుంటాడు. అంతలో అతనికి ఓ కొరియర్ వస్తుంది. అందులో షర్ట్ ఉండటం చూసి ఎవరు పంపించారని చలపతి అడుగుతాడు. నందుయే పంపి ఉండొచ్చని వెంకీ మనసులో అనుకుంటాడు. అంతలో ఆమె ఫోన్ చేస్తుంది. ఇంటర్వ్యూకి రెడీ అయ్యావా.. కొరియర్ వచ్చిందా అని అడుగుతుంది. నీ బోరింగ్ షర్ట్స్ వేసుకోకుండా ఇంటర్వ్యూ ఆ షర్ట్ వేసుకో చాాలా బాగుంటుంది అని చెబుతుంది. అతడు సరే అంటాడు.

తల్లి జ్ఞాపకం ఇచ్చేసిన ఇందు

ఇటు రాజుకి మరోసారి హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. డబ్బు కడితేనే ట్రీట్మెంట్ కొనసాగిస్తానని అంటారు. దీంతో అతడు ఇందు దగ్గరికి వెళ్లి తన పేమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. డబ్బు లేకపోవడంతో ఆమె తన మెడలోని బంగారు చెయిన్ ఇస్తుంది. దానిని తాకట్టు పెట్టి హాస్పిటల్లో డబ్బు కడతాడు రాజు.

ఇందు మెడలో చెయిన్ లేకపోవడం చూసి అపర్ణ నిలదీస్తుంది. మీ అమ్మ ఇచ్చిన ఒకే ఒక్క జ్ఞాపకం అది.. ఎక్కడ అని అడుగుతుంది. రూమ్ లోనే ఉందంటూ ఆమె కవర్ చేసి వెళ్లిపోతుంది. ఆ మాట విని రాజు ఎమోషనల్ అవుతాడు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More