బ్రహ్మముడి మే 22 ఎపిసోడ్: రాజుని మచ్చిక చేసుకుంటున్న రేఖ.. ఇందు ప్లాన్ దెబ్బకి రేఖకు మైండ్ బ్లాంక్.. స్వాతి, ఐషూ గొడవ

బ్రహ్మముడి మే 22 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో రాజు కోరిన రాజ భోగాలు స్వాతి, ఐశ్వర్య, ఇందు మధ్య చిచ్చు పెడతాయి. అటు వెంకీకి అమ్మాయిని సెట్ చేయలేక నందు తల పట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Published on: May 22, 2026, 08:33:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి మే 22 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజుని రేఖ మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించినట్లుగా ఎవరికి వాళ్లు ఫీలవుతుంటారు. అయితే ఇందు వేసే తాజా ప్లాన్ దెబ్బకు రేఖ మైండ్ బ్లాంక్ అయిపోతుంది.

బ్రహ్మముడి మే 22 ఎపిసోడ్: రాజుని మచ్చిక చేసుకుంటున్న రేఖ.. ఇందు ప్లాన్ దెబ్బకి రేఖకు మైండ్ బ్లాంక్.. స్వాతి, ఐషూ గొడవ
బ్రహ్మముడి మే 22 ఎపిసోడ్: రాజుని మచ్చిక చేసుకుంటున్న రేఖ.. ఇందు ప్లాన్ దెబ్బకి రేఖకు మైండ్ బ్లాంక్.. స్వాతి, ఐషూ గొడవ

రాజ భోగాల కోసం రాజు డిమాండ్

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మే 22) ఎపిసోడ్ ఇంట్లో రాజు చేసే హంగామాతో మొదలవుతుంది. ఇంటి అల్లుడిని ఇలాగే చూసుకుంటారా అంటూ హడావిడి చేసే రాజు.. తనకు విశాలమైన గది, కింగ్ సైజ్ బెడ్, మంచి ఏసీ ఉండాలని డిమాండ్ చేస్తాడు. అది విన్న రేఖ మొదట భ్రమరాంబను గది ఇవ్వమంటుంది.

ఆమె ఒప్పుకోదు. తర్వాత స్వాతి రూమ్ తీసుకోమంటుంది. దానికీ భ్రమరాంబ అడ్డు పడుతుంది. చివరికి ఐశ్వర్య రూమ్ తీసుకొమ్మని అడుగుతుంది. దానికి ఐశ్వర్య నో అంటే.. రాజు మెల్లగా ఆమె గుట్టు బయటపెట్టే ప్రయత్నం చేయడంతో సరే అంటుంది.

మూడో అమ్మాయినీ రిజెక్ట్ చేసిన వెంకీ

మరోవైపు వెంకీకి అమ్మాయిని సెట్ చేసే పనిలో ఉన్న నందు.. మూడో అమ్మాయినీ అతడు రిజెక్ట్ చేయడంతో తల పట్టుకుంటుంది. డేటింగ్ యాప్ ద్వారా ముగ్గురి సెట్ చేయగా.. అందరినీ వెంకీ వద్దంటాడు. చివరిగా వచ్చిన అమ్మాయి తనకు మరో రెండు నెలల్లో పెళ్లి అంటూనే వెంకీతో డేటింగ్ కు రెడీ అవుతుంది. కానీ వెంకీ మాత్రం స్వచ్ఛమైన ప్రేమ అంటూ వద్దంటాడు. దీంతో అతన్ని ఎలా వదిలించుకోవాలా అని నందు ఆలోచిస్తుంది.

ఇందుపై మండిపడిన ఐశ్వర్య

ఇటు ఇందు, రాజు కోసం ఐశ్వర్య గది ఖాళీ చేస్తుంటుంది. అప్పుడే ఇందు అక్కడికి వెళ్తుంది. ఆమెను చూడగానే ఐశ్వర్య తీవ్రంగా మండిపడుతుంది. నువ్వే ఇక్కడ ఉండు.. మాకు గది అవసరం లేదని ఇందు చెబుతున్నా.. నీ నాటకాలు చాలు అంటూ ఆమె తిడుతుంది. అన్నీ మీ అమ్మ బుద్ధులే వచ్చాయి.. లోపల ఒకలా, పైకి ఒకలా మాట్లాడతావు.. నా నుంచి గది లాక్కుంటారా.. దీనికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా అని వార్నింగ్ ఇచ్చి ఐశ్వర్య వెళ్లిపోతుంది.

రాజుకి క్లాస్ పీకిన ఇందు

ఆ తర్వాత గదిలోకి వచ్చిన రాజుని చూసి ఇందు క్లాస్ పీకుతుంది. ఎందుకు అన్ని ఎక్స్‌ట్రాలు చేస్తున్నావని అంటుంది. నీకోసం ఇంత పెద్ద గది ఇప్పిస్తే నన్ను తిడతావా అని రాజు అంటాడు. మన గెటపే కాదు.. సెటప్ కూడా మార్చాలని ఇందుకి చెబుతాడు. ఈ విషయం వదిలెయ్ కానీ.. ఉద్యోగులకు జీతాలు, నాకు వారంలో పేమెంట్ ఇస్తానని చెప్పావ్.. ముందు దాని గురించి ఆలోచించు అని రాజు అంటాడు. దీంతో ఇందు ఆలోచనలో పడుతుంది.

రాజుని మచ్చిక చేసుకుంటున్నానన్న రేఖ

రేఖ చేస్తున్న పనులు చూసి భ్రమరాంబ, భూషణ్ ఆమెకు క్లాస్ పీకుతారు. వాడు ముందే కంత్రీలాగా ఉన్నాడు.. వాడిని నెత్తి మీద పెట్టుకుంటే సింహాసనం ఎక్కి కూర్చొంటాడు అని భూషణ్ అంటాడు. ఈరోజు రూమ్ అడిగాడు.. రేపు ఇంకేదో అడుగుతాడు ఇస్తావా అంటూ భ్రమరాంబ కూడా అంటుంది.

మీరు ఏమనుకున్నా సరే.. వాడిని మచ్చిక చేసుకునే పనిలో నేను ఉన్నాను.. వాడు సంతకం పెడితేనే ఆస్తి వస్తుందని లాయర్ చెప్పాడు కదా.. నా దృష్టంతా ఈ ఆస్తిని సొంతం చేసుకోవడంపైనే ఉంది.. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సిందే.. కుక్కకు బిస్కెట్ వేసినట్లు వాడికి ఓ రూమ్ పడేశాను అంతేకదా అని చెప్పి రేఖ వెళ్లిపోతుంది.

స్వాతితో ఐశ్వర్య గొడవ

ఇటు స్వాతి గదిలోకి వెళ్తుంది ఐశ్వర్య. తన బట్టలు పెట్టుకోవడానికి అక్కడ ప్లేస్ లేకపోవడంతో నీ బట్టలు తీసేయ్ అంటూ స్వాతికి ఆర్డర్ వేస్తుంది. కానీ ఆమె వినదు. రిక్వెస్ట్ చేస్తే చేసేదాన్ని కానీ ఇప్పుడు చేయనంటూ గొడవకు దిగుతుంది. ఇద్దరూ మాటా మాటా అనుకుంటారు. ఇందు వల్లే ఇదంతా జరిగిందని ఐశ్వర్య అంటే.. అక్కను ఎందుకు అంటున్నావని స్వాతి అంటుంది. చివరికి పడుకునే విషయంలోనూ ఇద్దరి మధ్యా గొడవ జరుగుతుంది. తన టైమ్ వచ్చినప్పుడు చెబుతానంటూ ఐశ్వర్య అంటుంది.

మరోవైపు కంపెనీని సొంతం చేసుకోవడానికి సీఈవో పదవి కోసం పోటీ పడాలని, తాను పోటీ పడితే రేఖకు అనుమానం వస్తుందని రాజుతో ఇందు చెబుతుంది. బోర్డు సభ్యులను బుట్టలో వేసుకునే పనిలో రాజు ఉంటాడు. అదే విషయాన్ని ఇటు రేఖకు చెబుతుంది ఇందు. దీంతో ఆమె షాక్ తింటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More