బ్రహ్మముడి మే 21 ఎపిసోడ్: కంపెనీ సీఈవోగా రాజు.. బోర్డు సభ్యులను బోల్తా కొట్టించి.. రేఖతో ఆడుకుంటున్న ఇందు..
బ్రహ్మముడి మే 21 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ మే 21 ఎపిసోడ్ లో రేఖతో ఇందు రివర్స్ గేమ్ మొదలు పెడుతుంది. రాజును అడ్డం పెట్టుకొని ఓ ఆటాడుకుంటుంది. అటు కంపెనీకి సీఈవో అయిపోవడానికి రాజు ప్లాన్స్ వేస్తుంటాడు.
బ్రహ్మముడి మే 21 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు మరో షాక్ తగులుతుంది. ఆమె చేతుల్లో నుంచి కంపెనీని పూర్తిగా లాగేసుకోవడానికి రాజును ముందు పెట్టి ఇందు గేమ్ ఆడుతుంది. అందులో రేఖ పూర్తిగా చిక్కుకుపోయేలా కనిపిస్తోంది.

కారు చూసి మురిసిపోయిన భ్రమరాంబ
బ్రహ్మముడి సీరియల్ గురువారం (మే 21) ఎపిసోడ్ రాజు, ఇందు రాగానే తన కారును చూసి భ్రమరాంబ మురిసిపోయే సీన్ తో మొదలవుతుంది. మీ కారు బాగానే ఉందని రాజు అంటాడు. మళ్లీ ఎప్పుడూ తన కారు తీసుకెళ్లొద్దని భ్రమరాంబ అంటుంది. దీంతో రాజు తన చేయి చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. తనకు బాగా నచ్చిన దాన్ని వదలబోనని అంటాడు. అప్పుడే రాజుకు చలపతి ఫోన్ చేయడంతో అతడు వెళ్లిపోతాడు.
వెంకీకి అమ్మాయిలను చూసి పెట్టిన నందు
ఇటు వెంకీని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తున్న నందు అతని కోసం అమ్మాయిలను చూస్తుంది. బ్రహ్మముడి డేటింగ్ యాప్ ద్వారా ముగ్గురిని చూశానని, వాళ్లతో మాట్లాడి ఎవరినో ఒకరిని సెట్ చేసుకోవాలని వెంకీకి చెబుతుంది. ఇద్దరూ ఓ రెస్టారెంట్ లో ఉంటారు.
వరుసగా ఒక్కో అమ్మాయి వస్తుందని, నీకు కావాల్సిన వాళ్లను సెలెక్ట్ చేసుకోమని నందు చెబుతుంది. సరే అని మొదటగా వచ్చిన అమ్మాయితో వెంకీ మాట్లాడతాడు. స్వచ్ఛమైన ప్రేమ కోసం చూస్తున్న వెంకీ.. ఆ అమ్మాయికి అప్పటికే రెండు బ్రేకప్స్ ఉన్నాయని తెలిసి వద్దని పంపిచేస్తాడు.
రాజుకు చలపతి, లక్ష్మీ వీడియో కాల్
ఇటు రాజుకు చలపతి, లక్ష్మీ వీడియో కాల్ చేస్తారు. రాజును సూటు, బూటులో చూసి చలపతి ఆశ్చర్యపోతాడు. అంత ఖరీదైన బట్టలు ఎక్కడివని అడుగుతాడు. తాను బిజినెస్ చేస్తున్నానని, బిజీగా ఉన్నానని రాజు అంటాడు. ఆ సాహుతో చేయనన్నావు కదా అంటే.. ఇది వేరే బిజినెస్ అని, నీ పేరు నిలబెడతానని రాజు అంటాడు. ఈ బట్టల్లో గొప్పింటి బిడ్డగా ఉన్నానా అని రాజు అడిగితే.. నువ్వు ఎలాగూ గొప్పింటి బిడ్డవే అని లక్ష్మీ మనసులో అనుకుంటుంది. ఇంటికి రమ్మని వాళ్లు బతిమాలినా రాజు మాత్రం బిజీగా ఉన్నానని, రావడం కుదరదని చెప్పి పెట్టేస్తాడు.
రాజును చూసి అపర్ణ ఎమోషనల్
అప్పుడే వెనుక నుంచి అపర్ణ రావడం చూసి రాజు షాక్ తింటాడు. ఆమె ఎమోషనల్ అవుతూ రాజు దగ్గరికి వస్తుంది. నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది.. ఇందుని తీసుకొని ఆఫీసుకు వెళ్లడం మాకు ధైర్యాన్ని ఇచ్చింది.. మా కన్నీళ్లు తుడవడానికే వచ్చినట్లుగా ఉంది.. నువ్వు ఎప్పుడూ ఇలాగే మా మనవరాలికి అండగా ఉంటావు కదా అని రాజుని అపర్ణ అడుగుతుంది. ఈమె మరీ ఇంతలా ఎమోషనల్ అయిపోయిందేంటి అనుకున్న రాజు.. అలాగే ఉంటానని అంటాడు.
అల్లుడికి మర్యాద ఎక్కడ అంటూ ఇంట్లో రాజు హంగామా
ఆ తర్వాత రాజు ఇంట్లో వెళ్లి నానా హంగామా చేస్తాడు. చేతిలో బ్యాగు విసిరేస్తాడు. టీపాయ్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ నేలకేసి కొడతాడు. దీంతో అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. ఏం జరిగిందని అడిగితే.. నేను ఈ ఇంటికి అల్లుడి అన్న విషయం మరచిపోయారా.. నేను, నా భార్య అలాంటి గదిలో ఉండాలా.. నాకు కింగ్ సైజ్ బెడ్, ఏసీ ఉన్న గది కావాలని డిమాండ్ చేస్తాడు. రేఖ సరే అంటూ అతనికి ఐశ్వర్య రూమ్ ఇస్తుంది.
ఆ తర్వాత రేఖకు ఎసరు పెట్టేలా కంపెనీ సీఈవో పదవి కోసం నువ్వు పోటీ పడాలని రాజుకి చెబుతుంది ఇందు. దానికోసం బోర్డు సభ్యుల ఓట్లు కావాలని, ముందు వాళ్లను బుట్టలో వేసుకోవాలని ఇందు చెప్పడంతో రాజు అదే పనిలో ఉంటాడు. ఇటు రేఖ దగ్గరికి వెళ్లి రాజు ఏం చేస్తున్నాడో చెబుతుంది. దీంతో రేఖ షాక్ తింటుంది. రాజుని అడ్డం పెట్టుకొని రేఖతో ఇందు ఆడుకుంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


