Brahmamudi May 13th Episode: రేఖకు మరో షాక్.. రాజు సంతకం కూడా కావాలన్న లాయర్.. నిజం దాచిన చలపతి.. చెల్లినని చెప్పిన నందు
Brahmamudi May 13th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 13 ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ సీన్లు కనిపించాయి. రాజు ఇంటిని వెతుక్కుంటూ వెళ్లిన అపర్ణ దగ్గర చలపతి నిజం దాచేలా కనిపిస్తాడు. అటు రేఖకు మరో షాక్ తగలగా.. తాను సొంత చెల్లిని అని ఇందుతో నందు అంటుంది.
Brahmamudi May 13th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో చాలా ట్విస్టులే ఉన్నాయి. రాజు గురించి తెలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్తుంది అపర్ణ. మరోవైపు ఆస్తి సొంతం కావాలంటే రాజు సంతకం కూడా కావాలని లాయర్ స్పష్టం చేస్తాడు. ఇటు ఇందుని పెళ్లి విషయంలో నిలదీసిన నందు.. తాను సొంత చెల్లిని అని చెబుతుంది.

రాజు గురించి చలపతి ఆందోళన
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మే 13) ఎపిసోడ్ రాజు గురించి చలపతి ఆందోళన పడే సీన్ తో మొదలవుతుంది. వాడు ముందు ఉంటే తిడతాను కానీ.. ఇప్పుడు కనిపించకపోతే భయం వేస్తోందని, వాడు బాగుండాలని చలపతి అంటాడు. రాజు జాడ తెలియకపోవడంతో కంటతడి పెట్టుకుంటాడు. లక్ష్మి అతనికి ధైర్యం చెబుతుంది.
సుభాష్, అపర్ణ దగ్గర రాజు నటన
ఇటు ఇంట్లో సుభాష్, అపర్ణ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి రాజు నటిస్తాడు. బయట కుర్చీలో కూర్చొన్న సుభాష్ దూరంగా ఉన్న వాటర్ బాటిల్ అందుకోవడానికి ప్రయత్నించి కింద పడుతుండగా రాజు వచ్చి కాపాడతాడు. అతనికి నీళ్లు తాగిస్తాడు. అది చూసి అపర్ణ ఎమోషనల్ అవుతుంది. రూపంలోనే కాదు గుణంలోనూ అతనికి తన కొడుకు రాజ్ లక్షణాలే ఉన్నాయని అనుకుంటుంది. ఆ తర్వాత సుభాష్ ను రాజు ఇంట్లోకి తీసుకెళ్తాడు.
రాజు గురించి ఇందు దగ్గర ఆరా తీసిన అపర్ణ
అప్పుడే అపర్ణ దగ్గరికి ఇందు వస్తుంది. దీంతో రాజు గురించి మరోసారి ఆమె ఆరా తీస్తుంది. అతడు చాలా దగ్గరి వాడిలా అనిపిస్తున్నాడని అంటుంది. కానీ తన ఇంట్లో వాళ్లతోనూ తాను మాట్లాడానని, వాళ్లు వేరే వాళ్లని ఇందు చెబుతుంది. అయినా సరే రాజు తల్లిదండ్రులతో మాట్లాడితేనే తన మనసు కుదుటపడుతుందని అపర్ణ అనడంతో సరే వాళ్ల పూర్తి అడ్రెస్ ఇస్తానని ఇందు చెబుతుంది.
దుగ్గిరాల కుటుంబం అసలు స్టోరీ చెప్పిన సుభాష్
ఇటు సుభాష్ ను ఇంట్లోకి తీసుకెళ్లిన రాజు.. వాళ్ల గది చూసి షాకవుతాడు. ఇందు మీ గురించి గొప్పగా చెప్పింది కానీ మీరేంటి ఇలా ఉన్నారు అని రాజు అడుగుతాడు. ఆమె చెప్పింది నిజమే అని, ఒకప్పుడు దుగ్గిరాల కుటుంబం ఎలా ఉండేదో సుభాష్ వివరిస్తాడు. చివరికి ఆ రోజు జరిగిన ప్రమాదం గురించి కూడా చెప్పబోతాడు. కానీ రాజు మాత్రం ఈ ముసలోడు ఏంటి తరతరాల గురించి ఏదేదో చెబుతున్నాడు అనుకొని ఇక ఇప్పటికి చాలు.. మిగిలిన స్టోరీ తర్వాత చెబుదురుగానీ అని వెళ్లిపోతాడు.
రాజు, ఇందులను వేరు చేసిన రేఖ, భ్రమరాంబ
రాజు, ఇందు గురించి ఇటు భ్రమరాంబ సంబరపడిపోతుంది. ఒకే గదిలో వాళ్లు ఉంటే పిల్లలు కూడా పుట్టేస్తారని శేషుతో అంటుంది. అప్పుడే రేఖ అక్కడికి వస్తుంది. వెంటనే ఇందుని ఆ గదిలో నుంచి బయటకు తీసుకు రావాలని భ్రమరాంబతో అంటుంది. అందరూ కలిసి వాళ్ల గదికి వెళ్తారు. ఇప్పుడే పెళ్లయింది కదా.. అప్పుడే కలిసి ఉండొద్దు.. ఫస్ట్ నైట్ కు ముహూర్తం చూపిస్తాం.. ఇప్పుడైతే వేరుగా పడుకోవాలి.. ఇందు మా భ్రమరాంబ వదిన గదిలో పడుకుంటుందని చెప్పి ఆమెను తీసుకెళ్లిపోతారు.
రాజు ఇంటికి వెళ్లి ఆరా తీసిన అపర్ణ
మరోవైపు రాజు ఇల్లు వెతుక్కుంటూ అపర్ణ వెళ్తుంది. చివరికి చలపతి, లక్ష్మిలను కలుస్తుంది. అయితే అప్పటికే వాళ్లు రాజు గురించి ఆందోళనగా ఉంటారు. అతడు దుగ్గిరాల కుటుంబానికి చెందినవాడని తెలిస్తే ప్రమాదం అని శృతి చెప్పిన విషయం చలపతి గుర్తు చేసుకుంటాడు. అప్పుడే అపర్ణ వచ్చి తాను దుగ్గిరాల కుటుంబానికి చెందిన వ్యక్తిని అని, రాజును చూశానని, అచ్చూ తన కొడుకులా ఉన్నాడని చెప్పడంతో వాళ్లు షాక్ తింటారు. రాజు గురించి అప్పటికే ఆందోళనగా ఉన్న చలపతి ఆమె దగ్గర అసలు నిజం దాచేలా కనిపిస్తాడు.
రేఖకు షాక్.. ఇందు దగ్గరికి నందు
ఇటు రేఖకు మరో షాక్ తగులుతుంది. ఆస్తి రావాలంటే ఇందు పెళ్లి సర్టిఫికెట్, అలాగే ఆమె భర్త సంతకం కూడా తప్పనిసరి అని చెప్పడంతో రేఖ, భూషణ్ షాక్ తింటారు. అటు భ్రమరాంబలోనూ ఆందోళన మొదలవుతుంది.
ఇటు ఇందు దగ్గరికి వచ్చిన నందు.. ఆ తాళి ఏంటి? అంటే నువ్వు వాడిని పెళ్లి చేసుకున్నావా అని నిలదీస్తుంది. ఏదో అక్క అని పిలిచినంత మాత్రాన సొంత చెల్లివి అవుతావా.. నీకు అన్నీ చెప్పాలా అని ఇందు అంటుంది. దీంతో అవును నేను నీ సొంత చెల్లినే అని నందు అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


