Brahmamudi May 12th Episode: బ్రహ్మముడి.. రాజు ఇంటికి అపర్ణ.. వాళ్ల కన్న కొడుకు కాదని తెలిసి.. విడాకులకు ఇందు రెడీ

Brahmamudi May 12th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 12 ఎపిసోడ్ లో రాజు ఇంటికి అపర్ణ వెళ్తుంది. అతడు మీ కన్న కొడుకు కాదు కదా అని వాళ్లను అడుగుతుంది. ఇటు రేఖ చెప్పినట్లే ఇందు విడాకుల కోసం రెడీ అంటుంది.

Published on: May 12, 2026, 08:21:59 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi May 12th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రెండు ట్విస్టులు ఉన్నాయి. ఒకటి రేఖ చెప్పినట్లే రాజుకు విడాకులు ఇవ్వడానికి ఇందు సిద్ధమని అంటుంది. మరోవైపు అసలు రాజు ఎవరో తెలుసుకోవడానికి అతని ఇంటికి వెళ్తుంది అపర్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Brahmamudi May 12th Episode: బ్రహ్మముడి.. రాజు ఇంటికి అపర్ణ.. వాళ్ల కన్న కొడుకు కాదని తెలిసి.. విడాకులకు ఇందు రెడీ
Brahmamudi May 12th Episode: బ్రహ్మముడి.. రాజు ఇంటికి అపర్ణ.. వాళ్ల కన్న కొడుకు కాదని తెలిసి.. విడాకులకు ఇందు రెడీ

రాజు ఓవరాక్షన్.. పేమెంట్ కట్ చేసిన ఇందు

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (మే 12) ఎపిసోడ్ రాజు చేసిన ఓవరాక్షన్ కు ఇందు క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. వర్షం కురిసిన రాత్రి అంటూ తన క్యారెక్టర్ ను పాడు చేసిన రాజుకు పేమెంట్ లో రూ.2 వేలు కట్ అని అంటుంది.

పెళ్లి ఫొటోలు తీసినందుకు కూడా పేమెంట్ కట్ చేస్తానని బెదిరిస్తుంది. దీంతో దారికి వచ్చే రాజు.. అంత పని చేయొద్దని బతిమాలుతాడు. ఫొటోలకు కాదు కానీ.. ఓవరాక్షన్ కు మాత్రం కట్ అని అంటుంది. ప్రస్తుతం తన టైమ్ బాగా లేదని, తన డబ్బు సమస్య పోయే వరకు కాస్త తగ్గి ఉండాలని రాజు అనుకుంటాడు.

ఇందుకు భ్రమరాంబ సపోర్ట్.. రేఖకు బుద్ధి చెబుతానంటూ..

ఇటు ఇందు పెళ్లి చేసుకొని వచ్చినందుకు భ్రమరాంబ సంబరపడుతుంది. తాను అడ్డుకోవాల్సిన పెళ్లి ఆ అవసరం రాకుండానే రద్దయిందని అనుకుంటుంది. ఇదే అదునుగా మదన్ కు తన కూతురు స్వాతిని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది.

తన కొడుక్కి చేసుకుంటే ఏం వస్తుంది బూడిద అని అన్న రేఖకు తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. తాను కచ్చితంగా ఇందు, రాజు విడిపోకుండా చూసుకుంటానని శపథం చేస్తుంది భ్రమరాంబ.

ఐశ్వర్యను బెదిరించిన రాజు

మరోవైపు తన డబ్బు ఇవ్వకుండా తన ఇంటికే వచ్చిన రాజును గదిలోకి లాక్కెళ్తుంది ఐశ్వర్య. డబ్బు గురించి అడుగుతుంది. కాస్త టైమ్ కావాలని అతడు అంటాడు. కుదరదు ఇప్పుడే కావాలని ఐశ్వర్య అంటుంది. అయితే మీ ఆంటీ దగ్గరికే వెళ్లి తేల్చుకుందామని రాజు బ్లాక్‌మెయిల్ చేస్తాడు. కిడ్నాప్ చేసింది నేనే అని తెలుసు కానీ.. చేయించింది నువ్వే అని తెలియాలి కదా అని అంటాడు. దీంతో ఐశ్వర్య భయపడి వెనక్కి తగ్గుతుంది. నీ డబ్బు నీకు ఇస్తాను.. నన్ను నమ్ము కానీ టైమ్ కావాలి అని రాజు చెప్పి వెళ్లిపోతాడు.

ఇందు నటన.. విడాకులు ఇవ్వమన్న రేఖ

అటు రేఖ దగ్గరికి వెళ్లిన ఇందు తెగ నటిస్తుంది. రాజు తనను ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని అంటుంది. చిన్నప్పటి నుంచీ మీరు ఏం చెబితే అది చేశాను.. ఇప్పుడు కూడా మీరు ఏం చెబితే అది చేస్తాను.. వాడితో కలిసి ఉండటం నాకు ఇష్టం లేదు.. మీ మాట కాదనను.. ఏం చేయమంటారని అంటుంది. అది విని భ్రమరాంబ షాక్ తింటుంది. ఇది ఇంతలా నటిస్తోందేంటని అనుకుంటుంది. అప్పుడు రేఖ రియాక్ట్ అవుతూ.. అలా అయితే విడాకులు ఇవ్వడానికి రెడీనా అంటుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నప్పుడు విడాకులు ఇవ్వడానికి నష్టమేంటని ఇందు చెబుతుంది. తాను సిద్ధమే అని చెప్పి వెళ్లిపోతుంది.

ఆస్తి కోసం రేఖ కొత్త ప్లాన్

అయితే అదే జరిగితే తనకు ప్రమాదం అని భ్రమరాంబ అనుకుంటుంది. విడాకులు ఇప్పుడే ఎలా కుదురుతాయి.. కనీసం ఏడాది కావాలి కదా అని లాజిక్ చెబుతుంది భ్రమరాంబ. అవును కదా అని రేఖ అనుకుంటుంది. అన్ని రోజులు వాళ్లను భరించడం తన వల్ల కాదని అంటుంది.

ఆమెకు ఎలాగూ పెళ్లి అయిపోయింది కాబట్టి.. ఆ వేలిముద్ర వేయించుకొని ఆస్తిని సొంతం చేసుకోవాలని రేఖ అనుకుంటుంది. అది విని భ్రమరాంబ సంతోషిస్తుంది. అదే జరిగితే ఆస్తీ వస్తుంది.. ఏడాది టైమ్ ఉంది కాబట్టి ఈలోపు మదన్ తో స్వాతి పెళ్లి కూడా జరిపించేస్తే అయిపోతుంది అని అనుకుంటుంది.

రాజు కోసం లక్కీ, తల్లిదండ్రుల ఆందోళన

అటు రాజు కోసం లక్కీ, చలపతి, లక్ష్మీ ఆందోళన చెందుతుంటారు. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కంగారు పడతారు. వీడు ఎక్కడికి వెళ్లాడో అని వాళ్లు అనుకుంటారు. లక్కీ దగ్గర కూడా రాజు లేకపోవడంతో చలపతి, లక్ష్మి మరింత టెన్షన్ పడుతుంటారు.

అప్పుడే అపర్ణ వాళ్ల ఇంటికి వస్తుంది. తన పేరు దుగ్గిరాల అపర్ణ అని చెప్పడంతో చలపతి, లక్ష్మీ షాక్ తింటారు. రాజును చూశాను.. అతడు అచ్చూ తన కొడుకు స్వరాజ్ లా ఉన్నాడు.. వాడు మీ కొడుకు కాదు కదా అని వాళ్లను అడుగుతుంది. దీంతో వాళ్లు మరింత షాక్ లో పడిపోతారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More