Brahmamudi June 5th Episode: స్టార్ మాలో ఒకప్పటి టాప్ సీరియల్ బ్రహ్మముడిలో కొత్త కొత్త ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. తాజా ఎపిసోడ్ లో ఇందు సీఈవో కాకుండా అడ్డుకోవడానికి ఐశ్వర్య ఆమెను కిడ్నాప్ చేస్తుంది. బోర్డు మీటింగ్ అయ్యే వరకు ఆమెను వదలనని భీష్మించుకుంటుంది. అటు రాజులో ఆందోళన మొదలవుతుంది.
ఇందుని మళ్లీ బుట్టలో వేసుకున్న ఐశ్వర్య

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (జూన్ 5) ఎపిసోడ్ సీఈవో పోస్ట్ తనే అన్న కాన్ఫిడెన్స్ లో రాజు సూటుబూటులో ఫొటోలకు పోజులిచ్చే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత ఇందు వచ్చి లేటవుతుందని చెప్పడంతో రాజు వెంటనే రెడీ అవుతాడు.
అయితే ఇంతలో ఇందు దగ్గరికి వచ్చిన ఐశ్వర్య.. రాకేష్ తనను మళ్లీ బెదిరిస్తున్నాడని, కాపాడాలని అడుగుతుంది. తనకు బోర్డు మీటింగ్ ఉందని చెప్పినా వినదు. అరగంటలో పని పూర్తవుతుందని, నువ్వు చెబితే వాడు వింటాడని, తన వెంట రావాలని బతిమాలుతుంది. ఎంతో భయపడిపోతున్నట్లు నటిస్తుంది. దీంతో ఇందు మనసు కరిగి సరే వెళ్దామని అంటుంది.
సీఈవో పోస్టు తనదే అన్న రాజు.. రేఖకు షాక్
ఇటు సీఈవో పోస్ట్ తనదే అన్న కాన్ఫిడెన్స్ తో రేఖ కూడా ఉంటుంది. భ్రమరాంబ ఆమెకు హారతి ఇస్తుంది. సీఈవోగా తిరిగి రావాలని అంటుంది. కానీ రాజు ఎంట్రీ ఇచ్చి.. కాబోయే సీఈవో తానేనని అంటాడు. దీంతో రేఖ షాక్ తింటుంది. తనతో పెట్టుకోవద్దని అంటాడు. అది విని అపర్ణ, సుభాష్ చాలా సంతోషిస్తారు.
ఇందు ఎక్కడ అంటూ రాజును నిలదీసిన రేఖ
ఇంతకీ ఇందు ఎక్కడ అని రేఖ అడుగుతుంది. సీఈవో పోస్టు కోసం నువ్వే మళ్లీ కిడ్నాప్ చేశావా అని నిలదీస్తుంది. కానీ రాజు మాత్రం తాను ఇప్పుడు తన భర్తనని, కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదని అంటాడు. తనతో పోటీ పడలేక నువ్వే కావాలని ఏదో చేశావని రేఖ అంటుంది. దీంతో ఇందుకి ఫోన్ చేస్తాడు రాజు.
ఇందుని కిడ్నాప్ చేయించిన ఐశ్వర్య
{{/usCountry}}ఇంతకీ ఇందు ఎక్కడ అని రేఖ అడుగుతుంది. సీఈవో పోస్టు కోసం నువ్వే మళ్లీ కిడ్నాప్ చేశావా అని నిలదీస్తుంది. కానీ రాజు మాత్రం తాను ఇప్పుడు తన భర్తనని, కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదని అంటాడు. తనతో పోటీ పడలేక నువ్వే కావాలని ఏదో చేశావని రేఖ అంటుంది. దీంతో ఇందుకి ఫోన్ చేస్తాడు రాజు.
ఇందుని కిడ్నాప్ చేయించిన ఐశ్వర్య
{{/usCountry}}హాల్లోనే ఉండమంటే ఎక్కడికెళ్లావ్ అని ఇందుని అడుగుతాడు. తాను అర్జెంట్ పని మీద బయటకు వచ్చానని చెబుతుంది. బోర్డు మీటింగ్ అని తెలిసి ఎందుకు వెళ్లావ్ అంటూ రాజు నిలదీస్తాడు. అది స్టార్ట్ అయ్యే లోపు తాను కచ్చితంగా వస్తానని ఇందు చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఫాస్ట్ గా వెళ్లమని ఐశ్వర్యతో అంటుంది. కానీ ఆమె మాత్రం.. నిన్న సీఈవో కానివ్వను.. రాకేష్ లేడు ఎవడూ లేడు.. బోర్డు మీటింగ్ అయ్యే వరకు నువ్వు నాతోనే ఉంటావు.. సాయంత్రం వరకు వదలను.. నిన్ను కిడ్నాప్ చేస్తున్నా అని మనసులో అనుకుంటుంది.
వెంకీని మోటివేట్ చేసిన నందు
మరోవైపు జాబ్ పోయి డిప్రెషన్ లోకి వెళ్లిన వెంకీని నందు కలుస్తుంది. అతన్ని ఓదారుస్తుంది. ధైర్యం నింపే ప్రయత్నం చేస్తుంది. తనకు ఉన్న కష్టాలతో పోలిస్తే నీకు ఒక శాతం కూడా లేవు అని వెంకీకి చెబుతుంది. తనకు ఉద్యోగం ఎవరూ ఇవ్వడం లేదని, అందరూ ఏఐ టెక్నాలజీ గురించి అడుగుతున్నారని వెంకీ చెబుతాడు.
అయితే ఆ కొత్త టెక్నాలజీ నేర్చుకోమని నందు చెబుతుంది. దానికి డబ్బులు కావాలిగా అని అంటే.. ఉదయం సమయంలో ఏదైనా జాబ్ చేస్తూ, సాయంత్రం కోర్సు జాయిన్ అవ్వమని చెబుతుంది. బైక్ నడపడం ఇష్టమైతే డెలివరీ చేయమని ఐడియా ఇస్తుంది. దీంతో వెంకీ సరే అంటాడు. మొత్తానికి అతడు నవ్వేలా చేస్తుంది నందు.
ఇందు కిడ్నాప్.. రాజులో టెన్షన్
ఇటు ఇందుని తీసుకెళ్లి తాను ముందే మాట్లాడిన రౌడీలకు అప్పగిస్తుంది ఐశ్వర్య. వీళ్లెవరు అని ఇందు అడిగితే.. నిన్ను సీఈవో కానివ్వను.. నేను నిన్ను కిడ్నాప్ చేశాను అని చెబుతుంది. దీంతో ఇందు షాక్ తింటుంది. అటు బోర్డు మీటింగ్ మొదలవుతుంది. ఇందు ఎక్కడ అని పరంధామయ్య అడుగుతాడు. వచ్చేస్తుంది అని రాజు చెబుతాడు. 12లోపు సీఈవోను అనౌన్స్ చేస్తామని, ఆలోపు రావాల్సిందే అని చెప్పడంతో రాజులో కంగారు మొదలవుతుంది.