...
...
Next Story

Brahmamudi March 13 Episode: పబ్‌లో ఐశ్వర్యతో నందు గొడవ.. వెంకీతో డ్యాన్స్.. రేఖకు దొరికిన ఇందు.. పబ్‌లో కాపాడిన రాజు!

Brahmamudi March 13 Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 13 ఎపిసోడ్ లో ఇందు, నందు, రాజు, వెంకీ, ఐశ్వర్య.. ఇలా అందరూ ఒకే పబ్ లో ఉండటం చూడొచ్చు. ఇది తర్వాత ఏం జరగబోతోందా అన్న ఆసక్తిని రేపుతోంది. జాబ్ కోసం వెళ్లి చిక్కుల్లో పడిన ఇందుని రాజు కాపాడతాడా?

Published on: Mar 13, 2026, 06:56:37 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఉద్యోగం కోసం వెళ్లి రాఖీ అనే వ్యక్తి చేతుల్లో చిక్కుకుంటుంది ఇందు. అయితే ఆమె పబ్ లో ఉన్న సమయానికి అక్కడే నందు, ఐశ్వర్య, రాజు, వెంకీ కూడా ఉంటారు. రాఖీ ఆమెను ఇబ్బంది పెట్టడం, అది రాజు చూడటంతో తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.

కొత్త ఉద్యోగం కోసం సంతోష్ దగ్గరికి ఇందు

Brahmamudi March 13 Episode: పబ్‌లో ఐశ్వర్యతో నందు గొడవ.. వెంకీతో డ్యాన్స్.. రేఖకు దొరికిన ఇందు.. పబ్‌లో కాపాడిన రాజు!
Brahmamudi March 13 Episode: పబ్‌లో ఐశ్వర్యతో నందు గొడవ.. వెంకీతో డ్యాన్స్.. రేఖకు దొరికిన ఇందు.. పబ్‌లో కాపాడిన రాజు!

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మార్చి 13) ఎపిసోడ్ లో ఇందుకు స్వాతి గుడ్ న్యూస్ చెబుతుంది. తన ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య సంతోష్ ఓకే చెప్పాడని, ఇప్పుడే తనను కలవడానికి రమ్మన్నాడని ఇందుతో అంటుంది. ఈ సమయంలోనే అని ఆమె అంటున్నా.. అవకాశం వచ్చినప్పుడు తీసుకోవాలని నువ్వే అన్నావుగా అని స్వాతి అంటుంది.

సరే అంటూ ఆమె వెళ్లడానికి రెడీ అవుతుండగా అపర్ణ వచ్చి అడ్డుకుంటుంది. అయితే ఆమెకు ఇందు, స్వాతి ధైర్యం చెబుతారు. స్వాతి తన పాత ఫోన్ ను ఇందుకి ఇచ్చి అందులో సంతోష్ నంబరు, లొకేషన్ ఉన్నాయని చెబుతుంది.

పబ్‌లో నందుతో ఐశ్వర్య గొడవ

ఇటు మఫ్టీలో ఉన్న నందు ఓ స్మగ్లర్ ను పట్టుకోవడానికి పబ్ కు వస్తుంది. అదే పబ్ కు ఐశ్వర్య తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తుంది. ఆ సమయంలో ఇద్దరూ అనుకోకుండా ఒకరినొకరు ఢీకొడతారు. నందు సారీ చెప్పినా ఐశ్వర్య మాత్రం తాను వీఐపీని అని అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది.

అటు సంతోష్ కోసం అదే పబ్ కు వస్తుంది ఇందు. అతనికి ఫోన్ చేస్తుంది. తన బాస్ రాఖీతో కలిసి సంతోష్ మందు తాగుతుంటాడు. ఇందు వచ్చిందని చెబుతూ ఆమెను రాఖీకి చూపిస్తాడు సంతోష్. ఆమెను చూసి రాఖీ ఫ్రెండ్ నువ్వు పరిచయం చేస్తానన్న కొత్త పిట్ట ఇదేనా అని అడుగుతాడు.

రాఖీ అవునని అంటాడు. ఇద్దరూ ఆమెను అదోలా చూస్తుంటారు. ఇందుని సంతోష్ తీసుకొచ్చి రాఖీకి పరిచయం చేస్తాడు. సంతోష్ అడ్డుగా ఉన్నాడని భావించి అతనికి ఏదో ఒక పని చెప్పి ఆఫీసుకు పంపిస్తాడు. ఆ తర్వాత రాఖీ, అతని ఫ్రెండ్ కలిసి ఇందుని తప్పుడు ఉద్దేశంతో చూస్తుంటారు. ఆమె ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటుంది.

పబ్‌లో లక్కీ గొడవ.. అడ్డు పడిన రాజు

రాజుతో కలిసి పబ్ కు వచ్చిన అతని ఫ్రెండ్ లక్కీ కాస్ట్ లీ స్కాచ్ తీసుకురమ్మని వెయిటర్ కు చెబుతాడు. అతడు తీసుకొస్తాడు. అది చాలా ఈజీగా లోపలికి వెళ్లిపోవడంతో అది నకిలీదేమో అని అనుమానపడి వెయిటర్ తో గొడవ పడతాడు. అతన్ని కొడతాడు. అప్పుడే రాజు వచ్చి అడ్డుకుంటాడు. నిజంగానే ఓ చీప్ లిక్కర్ తీసుకురమ్మని అతన్ని పక్కకు తీసుకెళ్లి చెప్పి పంపిస్తాడు. అతడు చీప్ లిక్కర్ తీసుకొచ్చి లక్కీకి ఇవ్వగానే.. అతడు దానిని తాగి ఇది కదా ఒరిజినల్ స్కాచ్ అంటే అని అంటాడు.

వెంకీతో నందు డ్యాన్స్

మరోవైపు నందు ఏ స్మగ్లర్ కోసం పబ్ కు వచ్చిందో అతడు అక్కడికి వస్తాడు. ఫోన్ లో ఫొటో చూసి అతడే అని కన్ఫమ్ చేసుకుంటుంది. అయితే సడెన్ అతడు ఆమెను చూస్తాడు. దీంతో తనను కవర్ చేసుకోవడానికి అప్పుడే అక్కడికి తన గర్ల్‌ఫ్రెండ్ ను వెతుక్కుంటూ వచ్చిన రాజు తమ్ముడు వెంకీని పట్టుకొని నందు డ్యాన్స్ చేస్తుంది. ఆమెను చూసి నువ్వు ఆ బొకే అమ్మాయివే కదా అని అడుగుతాడు. వెంకీకి అసలు విషయం చెప్పకుండా నందుతో ఆమె డ్యాన్స్ చేస్తుంది. వెంకీ ఇబ్బందిగా ఫీలవుతున్నా వదలదు.

ఇందుని చూసిన రాజు

ఇటు రాఖీ మరో గ్లాస్ తెప్పించి ఇందుని తాగమని బలవంత పెడతాడు. తాను తాగనని, అలవాటు లేదని ఇందు చెబుతుంది. ఇది కూడా ఆమెకు ఓ పరీక్ష అని, ఇందులో పాసయ్యావని ఇందుని మెచ్చుకుంటాడు రాఖీ. అప్పుడే రాజు ఆమెను చూస్తాడు. ఆమె ప్రమాదంలో ఉందని తెలుసుకుంటాడు.

అటు ఇంట్లో ఇందుని నీళ్లు తెచ్చివ్వమని రేఖ పిలుస్తుంది. అపర్ణ తెచ్చి ఇస్తుంది. దీంతో ఇందు ఎక్కడికెళ్లిందని అడుగుతుంది. అసలు ఇంట్లోనే ఉందా అని భ్రమరాంబ అడుగుతుంది. దీంతో అపర్ణ షాక్ తింటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe