...
...
Next Story

Brahmamudi May 5 Episode: బ్రహ్మముడి- వీలునామాతో పంగనామం, ఆస్తి కోసం రంగంలోకి రేఖ కొడుకు- మదన్‌తో ఇందుకు పెళ్లి!

Brahmamudi Serial May 5th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 5వ ఎపిసోడ్‌‌లో రాజ్, కావ్య రాసిన వీలునామాతో దెబ్బ కొట్టడంతో ఆస్తి కోసం కొడుకు మదన్‌ను రంగంలోకి దించుతుంది రేఖ. ఇందుకు మదన్‌తో పెళ్లి చేయించేందుకు పంతులును ఇంటికి పిలిపిస్తుంది రేఖ. ఇందుకు లాయర్ కాల్ చేసి వీలునామా గురించి చెబుతాడు.

Published on: May 5, 2026, 07:39:23 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్, కావ్యలు రాయించిన వీలునామాను రేఖకు చూపిస్తాడు లాయర్. అంటే, ఇప్పుడు ఇందుకు ఆస్తిపై ఎలాంటి హక్కు లేదా అని రేఖ అంటుంది. అవును, పెళ్లి తర్వాత అధికారం వస్తుంది. అప్పుడే ట్రాన్స్‌ఫర్ చేయగలం. అప్పటివరకు తను సంతకం చేసిన ఈ పేపర్స్ చిత్తు కాగితాలతో సమానం అని లాయర్ అంటాడు.

రెండింటి కోసం పోరాడుతాను

బ్రహ్మముడి సీరియల్ మే 5 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ మే 5 ఎపిసోడ్

మరోవైపు తనకు పెళ్లి అయితేనే ఆస్తి రాసే అధికారం వస్తుందని, అది తెలిసే సంతకం పెట్టాను అని ఇందు అంటుంది. నానమ్మా నువ్వు ఇచ్చిన అమ్మ పుస్తకమే నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నాకు మీరు కావాలి, ఆస్తి చేజారకూడదు. నాకోసం చాలా ముందు చూపుతో అమ్మనాన్న వీలునామా అలా రాయించారు. నేను రెండింటి కోసం పోరాడుతాను. అంతేకానీ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రేఖకు పోనివ్వను ఇందు అంటుంది.

శభాష్ అమ్మా. నీలో ఈ ధైర్యమే మేము చూడాలనుకుందని సుభాష్ అంటాడు. అసలు నీకు ఈ విషయం ఎలా తెలిసిందని స్వాతి అడుగుతుంది. నిన్న రాత్రి లాయర్ సత్యదేవ్ గారి నుంచి కాల్ వచ్చిందని జరిగింది చెబుతుంది. ఇందుకు కాల్ చేసిన లాయర్ సత్యదేవ్ మీ కంపెనీకి లీగల్ అడ్వైజర్ అని పరిచయం చేసుకుంటాడు. రాజ్, కావ్యలు రాయించిన వీలునామా గురించి చెబుతాడు. దాంతో ఇందు చాలా సంతోషించినట్లు, లాయర్ బాగా హెల్ప్ చేసినట్లు చెబుతుంది.

ఇప్పుడు వాళ్లు నిజం తెలిసి ఏడుస్తూ కూర్చొంటారు అని స్వాతి అంటుంది. మరోవైపు రేఖ, భూషణ్, భ్రమరాంబ అలాగే దిగాలుగా ఉంటారు. శేషు వచ్చి భ్రమరాంబ, భూషణ్‌లపై తడిగుడ్డ వేస్తాడు. రేఖపై వేస్తుంటే బెదిరించడంతో భయపడి ఆగిపోతాడు శేషు. ఇన్నాళ్లు వేసిన ప్లాన్స్, ఆశలు అన్ని బూడిద అయిపోయాయని, ఇది అస్సలు ఊహించలేదు కదా. ఎప్పుడో చనిపోయిన ఇందు తల్లిదండ్రులు కూతురుకు శ్రీరామరక్షలా నిలిస్తారనుకున్నామా. నిజంగా రాజ్, కావ్యలు ఎంతైన తెలివైనవారని శేషు అంటాడు.

వీలునామాతో పంగనామం

మదన్‌ను అడ్డుపెట్టుకుని ఈ ఆస్తి ఎలా కాపాడుకుంటానో మీరు చూస్తారని రేఖ అంటుంది. మరోవైపు పడుకున్న రాజువైపు చలపతి, లక్ష్మీ మాట్లాడుకుంటారు. అద్దాల మేడలో పడుకునే వాడు ఇక్కడ బిజినెస్ అంటూ కష్టపడుతున్నాడు. బిజినెస్ అనేది వీడి రక్తంలోనే ఉందని ఇప్పుడే అర్థమైంది. వాడికి నిజం చెప్పకుండా మంచి పని చేశాం. ఇంకోసారి కల వస్తే మనకు తెలిసిన నిజం చెప్పకు అని చలపతి అంటుంది.

ఎందుకండి వాడు మనల్ని వదిలిపెట్టిపోతాడనే భయమా అని లక్ష్మీ అంటే.. భయం నిజమే. కానీ, ఆ రేఖ మంచిది కాదట. వీడికి నిజం తెలిస్తే రేఖకు ఎదురుతిరుగుతాడు. మనకు ప్రాణాలతో మిగలడు. శ్రీశైలంకు సంబంధించిన నిజం వీడికి తెలియొద్దని చలపతి అంటాడు. లక్ష్మీ కూడా భయపడి సరేనంటుంది. మరుసటి రోజు ఉదయం మదన్‌ను పిలిపించిన రేఖ మా అందరి జీవితం నీ మీద ఆధారపడి ఉందని అంటుంది.

రంగంలోకి రేఖ కొడుకు

ఇప్పుడు ఆస్తి ఇందు మీద ఉంది. ఆస్తిని తన నుంచి లాక్కోవాలంటే తనకు పెళ్లి చేసి లాక్కోవాలి అని రేఖ అంటుంది. దానికి ఇక్కడిదాకా పిలవాలా. ఎవరో ఒకరు తింగరోడిని పెళ్లి చేసి ఆస్తి గుంజేసుకోండి మదన్ అంటాడు. వేరే ఎవడో పెళ్లి చేసుకుంటే ఆస్తి మనకెలా వస్తుంది. నువ్వే ఇందును పెళ్లి చేసుకోవాలి అని రేఖ అంటుంది. అంతా షాక్ అవుతారు. అది నాకు అస్సలు నచ్చదు. ఏడుపు మొహంతో ఉంటుంది. సంతకం కూడా రాదు. నా పరువు పోతుందని మదన్ అంటాడు.

ఈ పెళ్లి చేసేది ఆస్తి కోసం. పెళ్లి చేసుకో. ఆస్తి మన చేతికి వచ్చిన ఏడాదికి విడాకులు ఇప్పిస్తా. తర్వాత నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తానని రేఖ అంటుంది. దాంతో మదన్ కన్విన్స్ అవుతాడు. అలా ఆస్తి కోసం ఇందుతో పెళ్లికి కొడుకు మదన్‌ను రంగంలోకి దింపుతుంది రేఖ. తర్వాత రేఖ నిర్ణయాన్ని తప్పుబడుతుంది భ్రమరాంబ. తన కూతురు స్వాతికి మదన్‌ను ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాం కదా అని భ్రమరాంబ అంటుంది.

అది అనుకుంది నువ్వు, నేను కాదు. కాస్తా బుర్రపెట్టి ఆలోచించు. నీకు ఏం ఉందని. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్లు మనం మనం సంబంధం పెట్టుకుంటే ఏం వస్తుంది. అయినా మదన్ స్థాయికి నీ కూతురు సరిపోతుందా. ఆశకు హద్దు ఉండాలి. అంతేకానీ హద్దు దాటి ఆశపడకూడదని వదిన భ్రమరాంబను అవమానిస్తుంది రేఖ. దాంతో భ్రమరాంబకు కోపం వస్తుంది. ఆస్తి నువ్వొక్కదానివే కొట్టేద్దామని చూస్తున్నావా. అది ఎలా జరుగుతుందో చూస్తానని భ్రమరాంబ అనుకుంటుంది.

మదన్‌తో ఇందు పెళ్లి

మరోవైపు ఐశ్వర్యకు రాకేష్ కాల్ చేస్తే కంగారుపడుతుంది. బాల్కనీలోనుంచి కిందకు చూస్తే రాకేష్ వస్తుంటాడు. ఐశ్వర్య భయంతో కిందకు దిగి రాకేష్‌ను బయటకు లాక్కెళ్తుంది. నాకు డబ్బు ఇవ్వాల్సిన వాడు చివరి నిమిషంలో మోసం చేశాడని ఐశ్వర్య చెబుతుంది. రాకేష్ వినడు. ఐశ్వర్యపై కోప్పడుతాడు. మా ఆంటీ కోపంగా ఉంది. నాకు తనకు సంబంధం లేదంటే మాత్రం నీకు నేను ఒక్క రూపాయి ఇవ్వను అని ఐశ్వర్ అంటుంది.

మరోవైపు ఇందుకు మదన్‌తో పెళ్లి చేయిస్తున్నట్లు పంతులును పిలిపించి ఇంట్లో చెబుతుంది రేఖ. అది విని అపర్ణ, సుభాష్ షాక్ అయి ఒప్పుకోరు. ఇందును ఈ పెళ్లికి ఒప్పుకోవద్దని అపర్ణ చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks