Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మన కంపెనీకి మీ వల్ల బ్లాక్ మార్క్ పడింది. ఎక్స్‌పోలో పాల్గొనాలంటే మంచి కంపెనీతో మనది సిస్టర్ కంపెనీ అనిపించుకుని పాల్గొనాలి. మీరు ఏమనుకోనంటే ఇందు మీ సిస్టర్ కాబట్టి తనతో ఒక్క సంతకం పెట్టించుకుంటే ఈ ఎక్స్‌పోలో పాల్గొనొచ్చు అని పీఏ పారు చెబుతాడు.
సంతకమేగా పెట్టించేద్దాం

ఛీ ఛీ దాన్ని అడగాల అని ఐశ్వర్య అంటుంది. అలా అయితే మన కంపెనీ చచ్చిపోతుంది. మన కంపెనీ ఇప్పుడు ఐసీయూలో ఉంది. ఇందు సంతకం ఆక్సీజన్ సిలిండర్ లాంటిది. కాకపోతే ఆ సిలిండర్ మీ చెల్లి చేతిలో ఉంది. ఆలోచించుకోండి అని పారు అంటాడు. సంతకమేగా పెట్టించేద్దామని ఐశ్వర్య అంటుంది. మరోవైపు నాన్నకు ఇష్టంలేనిది ఎందుకన్నయ్య బాధపెడతావ్ అని రాజుతో అంటాడు వెంకీ.
నాన్నకు ఇష్టం లేకుండా నేను ఏం చేయలేనని వెంకీ అంటాడు. ఇప్పుడు జాబ్ దొరకడం చాలామందికి కష్టంగా ఉందిరా. అలాంటిది జైలుకెళ్లి వచ్చావంటే ఎంత చెప్పిన వినర్రా. ఎంత స్కిల్ ఉన్నా అక్కడే ఆగిపోతారు. ఇంకెతకాలం అవమానాలు పడతావ్. అమ్మనాన్నలు బాధపడతారు. వాళ్లను చూసుకోవాల్సింది నువ్వే. చెప్పులు అరిగేలా తిరిగి టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు. మన కంపెని ఉందిగా అని రాజు అంటాడు.
మన కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు నాన్నకు చెప్పు. మంచికోసం అబద్ధం చెప్పడం తప్పు కాదు. అబద్ధాన్ని జీవితాంతం చెబితే మోసం చేయడం అవుతుంది. మన కంపెనీలో జాబ్ చేస్తూ ఇంకో కంపెనీలో ఉద్యంగ వెతుక్కో. ఇంకో జాబ్ వచ్చినప్పుడు అది నాన్నకు చెప్పు. అప్పుడు ఆయన అర్థం చేసుకుంటారు అని రాజు ఐడియా ఇస్తాడు.
తాళి తెంచే ప్రయత్నం చేయకు
రాజు చెప్పిన మాటలకు వెంకీ కన్విన్స్ అవుతాడు. రాజు కోసం మరదళ్లు ఎదురుచూస్తుంటారు. చలపతి అంకుల్ కోపంతో కర్ర తీసుకుని రాజును పొడిచి ఉంటాడా అన్నట్లుగా అని నందు అంటుంది. అలాంటివి చెప్పకే. మొన్నే తాళి కట్టించుకున్నా. అప్పుడే తెంచే ప్రయత్నం చేయకే అని ఇందు అంటుంది. అప్పుడే వచ్చిన రాజు నీ తాళి చాలా గట్టిది ఇంద్రాదేవి. ఐయామ్ బ్యాక్ అని అంటాడు.
{{/usCountry}}రాజు చెప్పిన మాటలకు వెంకీ కన్విన్స్ అవుతాడు. రాజు కోసం మరదళ్లు ఎదురుచూస్తుంటారు. చలపతి అంకుల్ కోపంతో కర్ర తీసుకుని రాజును పొడిచి ఉంటాడా అన్నట్లుగా అని నందు అంటుంది. అలాంటివి చెప్పకే. మొన్నే తాళి కట్టించుకున్నా. అప్పుడే తెంచే ప్రయత్నం చేయకే అని ఇందు అంటుంది. అప్పుడే వచ్చిన రాజు నీ తాళి చాలా గట్టిది ఇంద్రాదేవి. ఐయామ్ బ్యాక్ అని అంటాడు.
{{/usCountry}}నందు నమ్మకుంటే రాజు గిల్లుతాడు. ఒంటిమీద వాతలు, గాట్లు ఉన్నాయో చూపించమంటారు. చలపతి ఒప్పుకున్నాడు అని రాజు అబద్ధం చెబుతాడు. వెంకీ రేపే వచ్చి జాయిన్ అవుతాడు. అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేసుకోమంటాడు. నాకు ఏదో తేడా కొడుతుందని కాల్ చేస్తానంటుంది ఇందు. రాజునే కాల్ చేస్తానని చేస్తాడు.
చలపతికి రాజు కాల్ చేస్తాడు. నువ్వు ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయనని ఫోన్ పక్కన పెడతాడు చలపతి. ఎన్నిసార్లు చేసిన చలపతి కాల్ లిఫ్ట్ చేయడు. లక్ష్మిని లిఫ్ట్ చేయనివ్వడు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటని ఇందు అడిగితే.. ఏదోటి కవర్ చేస్తాడు రాజు. చాలా సంతోషంగా ఉందంటారు. ఒప్పుకోలేదని తెలిస్తే ఇద్దరు చంపేస్తారేమో అనుకుంటాడు రాజు.
ఐశ్వర్య సంతకం డిమాండ్
తర్వాత ఎక్స్పోకి డిజైన్స్ చేయాలను హాల్లో కూర్చుంటారు. ఐశ్వర్య వచ్చి డాక్యుమెంట్ పడేస్తుంది. ఏంటని అడుగుతారు. రేపు జరగబోతున్న హైదరాబాద్ బిజినెస్ ఎక్స్పోకి నేను ఒక్కదాన్నే వెళ్లాలని ట్రై చేశాను. నా కంపెనీ పెట్టి ఏడాది కావట్లేదు. అందుకే ఎంట్రీ దొరకలేదు. కాబట్టి స్వరాజ్ గ్రూప్‌కి ఐశ్వర్య జ్యూవెలర్స్ సిస్టర్ కంపెనీ అని చెబితే ఎంట్రీ దొరుకుతుంది. సంతకం చేయి అని ఐశ్వర్య డిమాండ్ చేస్తుంది.
నీకు బిజినెస్ అనుభవం లేదు. బిజినెస్ వాళ్లతో ఎలా డీల్ చేస్తావ్ అని అపర్ణ అంటుంది. ఐశ్వర్య ఏదైనా చేయగలదని రేఖ, భూషణ్ అంటారు. ఆపుతారా. ఐశ్వర్య చేసిన ఫస్ట్ డీల్ ఫ్రాడ్ ఇంకా మర్చిపోలేదు. మాకు జరిగిన నష్టం ఇంకా పూర్తి కాలేదు. నిజాయతీ, నిబద్ధత ఇవన్ని లేకుండా క్లయింట్స్‌ని ఎలా అట్రాక్ట్ చేస్తావని రాజు అంటాడు.
ప్రపంచంలో అందరూ నాలా ఎదిగినవాళ్లే. ఇందు సంతకం పెట్టు అని ఐశ్వర్య అంటుంది. సంతకం పెట్టడం కుదరదని రాజు అంటాడు. ఇందు నువ్వు చెప్పు. నాతో కంపెనీ పెట్టించిన ఇందు చెప్పాలి నువ్వు కాదని ఐశ్వర్య అంటుంది. నేను ఇందు భర్తను. అన్నింటికి సమాధానం ఇస్తానని రాజు అంటే.. ఏంటీ ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని రేఖ అంటుంది.
మూతులకు ప్లాస్టర్ వేస్తాను
ఇదే నీకు రిపీట్ అవుతుంది. పెద్దదానివి గౌరవం కాపాడుకో అని రాజు అంటాడు. నా భార్యనే ఎదిరించి మాట్లాడుతున్నావేంటని భూషణ్ అంటే.. చేయి ఎత్తి కూడా మాట్లాడతా అని వార్నింగ్ ఇస్తాడు రాజు. వాడు అన్ని మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటని ఇందును అంతా అడుగుతారు. నోరు పడిపోయిందా అని భ్రమరాంబ అంటుంది.
ఇలా నోరేసుకుని పడిపోతే ఆ మూతులకు ప్లాస్టర్ వేస్తానంటుంది అపర్ణ. నాకు సమాధానం కావాలని ఐశ్వర్య అంటే.. నా సమాధనం కూడా అదే అని నా భర్త చెప్పాడు. అర్థం కావట్లేదా. నా భర్త మాటే నా మాట. తను ఎస్ అంటే ఎస్ నో అంటే నో అని ఇందు అంటుంది. అక్కను సపోర్ట్ చేస్తావనుకున్నా. ఇలా మాట్లాడతావనుకోలేదని సెంటిమెంట్ డైలాగ్ కొడుతుంది ఐశ్వర్య.
ఏంటేంటీ.. అక్క.. తనకు అక్క అని ఇప్పుడు గుర్తొచ్చిందా. భలే ఉన్నావ్ అని అపర్ణ అంటుంది. ఎవరి మీద డిపెండ్ అవ్వనని చెబుతావ్గా ఐషు ఇప్పుడెందుకు నేను అని ఇందు అంటుంది. నాలాంటిది అయితే ఎప్పుడో నీ కంపెనీ లాక్కునేది. ఇందు కాబట్టి క్షమించి ఇంకా కంపెనీ నడిపిస్తుందని అపర్ణ అంటుంది. ఇదే నా ఫైనల్ మాట అని ఇందు అంటుంది.
గెలుస్తానని
దాంతో ఐశ్వర్య నవ్వుతుంది. నువ్వు ఇదే మాట అంటావని నాకు బాగా తెలుసు. నేను ఎక్స్పోకి వస్తే నేను ఎక్కడ గెలుస్తానో అని నీ భయం అని ఐశ్వర్య అంటుంది. మీరు ఎన్నైనా అనుకోండి. ఐశ్వర్యలో మార్పు వచ్చేవరకు ఇలాగే ఉంటుందని ఇందు వెళ్లిపోతుంది. మీరు లేకుండా వెళ్లలేనని అనుకుంటున్నారా. చూస్తూ ఉండండి వెళ్తానని ఐశ్వర్య అంటుంది.
గోడ దూకి వెళ్తావమ్మా అని శేషు సెటైర్ వేస్తాడు. మరోవైపు హ్యాపీ బర్త్ డే వెంకీ అని నందు అంటుంది. బర్త్ డే కాదు. జాబ్ వచ్చినందుకు ట్రీట్ అని చాక్లెట్ ఇస్తాడు వెంకీ. నాన్నకు తెలియకుండా మ్యానేజ్ చేస్తున్నాను అని వెంకీ అంటాడు. రాజు చెప్పింది చెబుతుంది నందు. అది అబద్ధం అని రాజు చెప్పింది నందుకు చెబుతాడు వెంకీ.
బావ అక్కకు, నాకు చెవిలో పూవులు పెట్టావుగా అంటుంది నందు. కానీ, రాజు చేసింది కరెక్టే అని, తప్పు కనిపించడం లేదని, బయట జాబ్ రాగానే వెళ్లి ఇంట్లో చెప్పమని నందు అంటుంది. ఈలోపు నాన్నకు తెలిస్తే పరిస్థితి ఏంటని వెంకీ అంటాడు. తెలిసినప్పుడు చూసుకోవచ్చు. మీ నాన్నకు తెలుస్తుందా అయినా అని నందు అంటుంది.
ఇంటికి సుభాష్ ఫ్రెండ్
మరోవైపు అపర్ణను చెల్లెమ్మా అంటూ నరేంద్ర వస్తాడజు. క్షేమసమాచారాలు మాట్లాడుకుంటారు. సుభాష్‌ను కలుస్తాడు. నరేంద్రను చూసి సుభాష్ సంతోషిస్తాడు. ఇద్దరు ఆప్యాయంగా హత్తుకుంటారు. కూర్చోమని చైర్ ఇస్తే అది విరిగి ఉంటుంది. అది చూసి బాధపడతాడు నరేంద్ర. వారి మాటలు రాజు వింటాడు.
సోఫాలో దర్జాగా కూర్చునేవాడివి. ఆరడగుల మనిషివి నువ్వు నడిస్తే గుమ్మాలే తెరుచుకునేవి. మీటింగ్ హాల్లో మాట్లాడుతుంటే సైలెంట్ అయ్యేవి. అలాంటిది ఏంటిరా ఇది అని నరేంద్ర అంటాడు. పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి కదరా అని సుభాష్ అంటాడు. నువ్వెప్పటికీ మహరాజువిరా. స్వరాజ్ గ్రూప్ నిలబడిందంటే నీ 40 ఏళ్ల కష్టం. మహారాజులా తిరిగిన నువ్వు ఓ మూలకు ఉండటం ఏంట్రా అని బాధగా చెబుతాడు నరేంద్ర.
నేను బాధపడట్లేదురా. నన్ను నా మనవడు, నా మనవరాలు బాగా చూసుకుంటున్నారని సుభాష్ అంటాడు. అబ్బాయి విదేశాలకు రమ్మంటున్నాడురా. ఓసారి చూసి వెళ్దామని వచ్చానని నరేంద్ర అంటాడు. అపర్ణ కాఫీ ఇస్తుంది. సుభాష్ కాఫీ తీసుకోలేకపోతాడు. అది చూసి నరేంద్ర, రాజు చలించిపోతారు. అదంతా విన్న రాజు హాల్లో పంచాయతీ పెడతాడు.
రేఖ, భూషణ్ గది ఖాళీ చేయించిన రాజు
ఎంతో చేసిన ఈ జంటకు 20 ఏళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. వాళ్ల మాస్టర్ బెడ్ రూమ్ ఖాళీ చేయించి మీరిద్దరు సకలసుఖాలు అనుభవిస్తున్నారు. ఇక ఆ దుర్మార్గానికి చరమగీతం పాడేద్దాం. మీరు ఆ గదిని ఖాళీ చేస్తున్నారు అని రాజు అంటాడు. రేఖ, భూషణ్ వారిస్తారు. ఇదే ఫైనల్ డెసిషియన్ అని రాజు వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.