Brahmamudi November 16 Episode: బ్రహ్మముడి.. రఘువీర్‌ను చెప్పుతో కొట్టిన ఇందు.. 300 కోట్లే కాదు ఐషూకి భారీ ఆఫర్

Brahmamudi Serial November 16th Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్ లో స్వరాజ్ గ్రూపు పతనం కోసం రఘువీర్ ఎంట్రీ ఇస్తాడు. గతంలో ఇందు తనను చెప్పుతో కొట్టి అవమానించడంతో ఇప్పుడు వాళ్లను పడగొట్టడానికి ఐశ్వర్యతో చేతులు కలుపుతాడు.

Published on: Nov 16, 2026, 09:05:49 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఎక్స్‌పోలో ఇందు, రాజ్ లకు షాక్ తగులుతుంది. స్వరాజ్ గ్రూపును దెబ్బ కొట్టడానికి ఐశ్వర్యతో రఘువీర్ చేతులు కలుపుతాడు. తన తెలివితేటలతో ఇందు మంచి ఆర్డర్లు తీసుకొచ్చినా.. ఒక్క ఆర్డర్ తో ఎక్స్‌పోలో ఐషూ పైచేయి సాధిస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్

ప్రశాంత్‌కు రాజు క్లాస్.. ఎక్స్‌పోలో టాప్ కంపెనీయే నంబర్ వన్ అంటూ..

ప్రశాంత్ కు రాజు క్లాస్ పీకే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 16) ఎపిసోడ్ మొదలవుతుంది. ఇందు చీరను, ఆమె హెయిర్‌స్టైల్ ను ప్రశాంత్ పొగుడుతాడు. దీంతో రాజు కుళ్లుకుంటూ అతన్ని తిడతాడు. అప్పుడే ఎక్స్‌పో గురించి హోస్ట్ అనౌన్స్‌మెంట్ ఇస్తాడు. ఇది చాలా పెద్ద ఎక్స్‌పో అని, స్వరాజ్ గ్రూపులాంటి పెద్ద కంపెనీలు వచ్చాయని, ఇందులో గెలిచిన కంపెనీనే నంబర్ వన్ కంపెనీగా గుర్తిస్తామని చెబుతాడు. తర్వాత ఎక్స్‌పో మొదలవుతుంది.

ఇందుకి కోటి విలువైన తొలి ఆర్డర్.. ఐషూ షాక్

ఇందు, రాజు ఉన్న స్వరాజ్ స్టాల్ దగ్గరికి ఓ కస్టమర్ వస్తారు. ఆయనకు తమ జువెలరీ గురించి వివరిస్తారు. వాళ్ల డిజైన్లు నచ్చడంతో ఆ కస్టమర్ పెద్ద ఆర్డర్ ఇస్తారు. ఏకంగా రూ.కోటి విలువైన ఆర్డర్ ఇచ్చి అడ్వాన్స్ కూడా ఇస్తారు. స్వరాజ్ గ్రూపుకు తొలి ఆర్డర్ వచ్చిందని, ఇది ఈ ఎక్స్‌పోకి మంచి స్టార్ట్ అని హోస్ట్ అనౌన్స్ చేయడంతో ఐషూ షాక్ తింటుంది. ఇందుని చూసి కుళ్లుకుంటుంది.

కస్టమర్‌తో ఐశ్వర్య గొడవ.. జువెలరీ కొనే ముఖమా అంటూ..

ఆ తర్వాత ఐశ్వర్య స్టాల్ కు కూడా ఓ కస్టమర్ వస్తారు. ఆమెతోపాటు పాటు అసిస్టెంట్ పారు కూడా తమ దగ్గర ఉన్న డిజైన్లన్నీ చూపిస్తారు. కానీ ఆ కస్టమర్ మాత్రం వాటన్నింటినీ చూసి ఇవన్నీ పాత డిజైన్లలా కనిపిస్తున్నాయి కదా అని అంటారు. దీంతో ఐషూ రెచ్చిపోతుంది. అసలు నీది జువెలరీ కొనే ముఖమేనా.. ఎప్పుడైనా కొన్నావా.. ఫుట్‌పాత్ పై కొనేలా ఉన్నావు.. నా డిజైన్లను ఓల్డ్ డిజైన్లంటావా అని తిడుతుంది.

అది విని ఇందు షాక్ తింటుంది. కస్టమర్లతో ఇలాగేనా మాట్లాడేది.. అసలు నీ బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూస్తాను.. నీలాంటి వాళ్లకు అనుమతి ఇచ్చిన వాళ్లను అనాలి అని తిట్టి కస్టమర్ వెళ్లిపోతారు. దీంతో ఇలాంటి దానికోసమా నువ్వు ఇంత చేస్తుంది అని రాజు కూడా ఇందుని అంటాడు.

ఇందు నగలను పాడు చేయమని పారును పంపించి..

తన దగ్గరికి కస్టమర్లు రాకపోవడంతో ఇందు బిజినెస్ పాడు చేయాలని ఐశ్వర్య ప్లాన్ చేస్తుంది. వాళ్ల నగల్లో స్టోన్స్ పాడు చేయాలని పారుకి చెబుతుంది. అతడు వెళ్లి ఓ జువెలరీ తీసుకొని స్టోన్స్ పీకేస్తాడు. కిందేసి తొక్కుతాడు. దీంతో అందులో స్టోన్స్ పోతాయి. ఏమీ తెలియనట్లు దానిని అక్కడ పెట్టేసి వెళ్లిపోతాడు. అప్పుడే ఓ కస్టమర్ వచ్చి ఆ జువెలరీ చూస్తాడు. అందులో స్టోన్స్ కనిపించకపోవడంతో స్వరాజ్ గ్రూపుని అవమానించేలా మాట్లాడతాడు. అది విని రాజు, ప్రశాంత్ షాకవుతారు.

కవర్ చేసిన ఇందు.. పోయిన రాళ్లతోనూ ఆర్డర్..

పక్కనే ఉన్న ఇందు వెంటనే రంగంలోకి దిగుతుంది. దానిని కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అందులో రాళ్లు పోలేదని, అదే లేటెస్ట్ మోడల్ అని ఆ కస్టమర్ ను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడిదే బాగా ట్రెండ్ అవుతుందని చెబుతుంది. మీకు తెలియదా.. మీరు చాలా అప్డేటెడ్ గా ఉంటారని అనిపిస్తోంది అని ఇందు అంటుంది.

మీరు కూడా చూడలేదా అని చుట్టూ ఉన్న వాళ్లను అడగడంతో.. తాము చూశామని, ట్రెండింగ్ లో ఉందని చెబుతారు. చివరికి ఆ కస్టమర్ కూడా అది నిజమని నమ్మి.. ఈ లేటెస్ట్ మోడల్ తనకూ కావాలని, ఓ పది సెట్లు చేయమని అడ్వాన్స్ ఇస్తాడు. పోయిన స్టోన్స్ తోనూ ఇందు బిజినెస్ చేయడం చూసి ఐషూ షాకవుతుంది.

కస్టమర్‌కు నిజం చెప్పేసి..

అయితే ఆర్డర్ వచ్చినా ఇందుకు మనసు అంగీకరించదు. వెంటనే వెళ్లి కస్టమర్ ను కలుస్తుంది. తాను అబద్ధం చెప్పానని, అందులో స్టోన్స్ నిజంగానే పోయాయని అంటుంది. ఆ సమయంలో అక్కడ చాలా మంది ఉన్నారని, మార్కెట్ లో స్వరాజ్ గ్రూపుకు మంచి పేరు ఉందని, అప్పుడు నిజం చెబితే తమ ప్రతిష్ట దెబ్బతింటుందనే అలా చెప్పానని అంటుంది. మీకు కావాలంటే మీకు నచ్చిన ఆ డిజైన్లలో స్టోన్స్ సెట్ చేసి ఇస్తామని చెబుతుంది. దీంతో కస్టమర్ అంగీకరిస్తాడు. ఆమె నిజాయతీని మెచ్చుకుంటాడు. అది చూసి రాజు, ప్రశాంత్ కూడా ఇందు తెలివితేటలను, నిజాయతీని మెచ్చుకుంటారు.

ఇందుకి 15 కోట్ల బిజినెస్

ఆ తర్వాత ఇందుకి, స్వరాజ్ గ్రూపుకు వరుస ఆర్డర్లు వస్తూనే ఉంటాయి. ఐశ్వర్య మాత్రం ఈగలు తోలుతూ ఉంటుంది. చివరికి తమకు 15 కోట్ల ఆర్డర్లు వచ్చాయని ప్రశాంంత్ చెప్పడంతో ఇందు, రాజు సంతోషిస్తారు. అదే సమయంలో ఐశ్వర్యకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదని ఎగతాళి చేయడంతో మరొకరి గురించి అలా తక్కువ చేసిన మాట్లాడొద్దని ప్రశాంత్ కు ఇందు క్లాస్ పీకుతుంది.

అయితే ఆమె నా అక్క.. మేమంతా ఒక ఫ్యామిలీ అని అంటుంది. దీంతో రాజు రంగంలోకి దిగుతాడు. చూశావా.. అందుకే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని ప్రశాంత్ కు చెబుతూ.. సరే సీఈవోగారు అంటూ ఇందుతో వెటకారంగా అంటాడు. తాను ఆ ఉద్దేశంతో అలా అనలేదని ఇందు వివరించే ప్రయత్నం చేసినా రాజు వినడు.

రాజు, ఇందు జీవితంలో రఘువీర్ ఎంట్రీ

అయితే ఎన్ని ఆర్డర్లు వచ్చినా ఒక్క రఘువీర్ ఇచ్చిన రూ.300 కోట్ల ఆర్డర్ తో ఐశ్వర్య ఎక్స్‌పో విజేతగా నిలుస్తుంది. రఘువీర్ ను చూసి వీడా అంటూ ఇందు షాకవుతుంది. గతంలో అతన్ని నడిరోడ్డుపై రాజు ముందే చెప్పుతో కొట్టిన సీన్ గుర్తు చేసుకుంటుంది ఇందు. ఆర్డర్ తోపాటు ఐశ్వర్యకు మరో పెద్ద ఆఫర్ కూడా ఇస్తాడు రఘువీర్. అదే సమయంలో మీపై పగతో దెబ్బ తీయడానికే ఇలా ప్లాన్ చేసినట్లు రాజు, ఇందుతో చెబుతాడు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More