బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్‌కు ఆస్తి అప్పగించి పైకి పోతామని లింగరాజుగా ఉన్న రాజ్, మంగతాయారుగా నటిస్తున్న కావ్య అంటారు. దాంతో కుయిలి ఇక్కడే ఉండమని చెబుతుంది. రాహుల్ వద్దంటాడు. ఆస్తిని అంతా అనాథ ఆశ్రమానికి రాసిచ్చి ఎక్కడోచోటికి పోతామంటారు. మీరు ఎక్కడికి వెళ్లటానికి వీళ్లేదు అని కుయిలి, రంజిత్ ఇద్దరు అంటారు.
మా ఆస్తి నీ చేతిలో పెట్టి

దాంతో రాజ్, కావ్య సరే అంటారు. ఇది మాట్లాడుతుంటే చెవిలో సీసం పోసినట్లుంది. మన ఆస్తిని దీని చేతులో పెట్టేస్తే బాగా చూసుకుంటుంది అని కావ్య అంటుంది. దానికి కుయిలి తెగ సంబరపడిపోతుంది. తర్వాత తాత, నానమ్మతో మాట్లాడాలి. మీరు వెళ్లమని కుయిలి వాళ్లను పంపిస్తాడు రాహుల్. గార్డెన్‌లోకి రాజ్, కావ్యను తీసుకెళ్లి ఏంటీ నాటకం అని నిలదీస్తాడు.
అబ్బా గుర్తు పట్టావేంట్రా. బంగారం లాంటి భార్యను కాదని ఇలాంటి దానికోసమా వచ్చావ్ అని రాజ్ అంటాడు. కుయిలితో ఉంటే ధైర్యంగా ఉంటుంది. నాకు చాలా నమ్మకంా ఉంటుంది. ఆ ఇంట్లో నాకు గౌరవం లేదు. ఇంకెందుకు ఆ ఇంటికి అని రాహుల్ అంటాడు. గౌరవం మనం ఇచ్చే చేతలను బట్టి ఉంటుంది. బంగారం లాంటి ఇల్లు వదిలేసి పంజరంలోకి వచ్చావ్ అని కావ్య అంటుంది.
నీకు ఓ భార్య, పాప ఉంది. వాళ్లకు మించిన సంతోషం లేదని రాజ్ అంటే.. మీరు ఎంత చెప్పిన నేను మీతో రాను. మీ గురించి కుయిలికి చెప్పాననుకో గెంటేస్తుంది అని రాహుల్ అంటాడు. అచ్చా.. అవునా బాబు. నువ్వు కోటీశ్వరుడివి కాదని, ఆకలేస్తే అడుక్కుంటాడు. ఇంట్లో విలువ, బయట పరువు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదని కుయిలికి చెబితే ఎగిరి తంతుంది అని రాహుల్‌ను కావ్య, రాజ్ ఇరికిస్తారు.
ఎలా ప్రేమించావ్
ఇంతలో కాఫీ పట్టుకుని కుయిలి వస్తుంది. నా గురించే మాట్లాడుకుంటున్నట్లున్నారు అని కుయిలి అంటుంది. అవును, మావోడికి పెళ్లయిందని తెలిసి ఎలా ప్రేమించావ్ అని రాజ్ అంటాడు. ప్రేమకు ఏది అడ్డు కాదని కుయిలి అంటుంది. అబ్బబ్బా ఏం సెప్పింది. ఒళ్లంతా కొవ్వే.. అదే లవ్వే.. అని కావ్య అంటుంది. కుయిలి ఇచ్చిన కాఫీ తాగి పడేస్తారు ఇద్దరు.
{{/usCountry}}ఇంతలో కాఫీ పట్టుకుని కుయిలి వస్తుంది. నా గురించే మాట్లాడుకుంటున్నట్లున్నారు అని కుయిలి అంటుంది. అవును, మావోడికి పెళ్లయిందని తెలిసి ఎలా ప్రేమించావ్ అని రాజ్ అంటాడు. ప్రేమకు ఏది అడ్డు కాదని కుయిలి అంటుంది. అబ్బబ్బా ఏం సెప్పింది. ఒళ్లంతా కొవ్వే.. అదే లవ్వే.. అని కావ్య అంటుంది. కుయిలి ఇచ్చిన కాఫీ తాగి పడేస్తారు ఇద్దరు.
{{/usCountry}}నీకు కాఫీ కూడా పెట్టడం రాదా. నీ వాలకం చూస్తుంటే వంట కూడా రానట్లుంది. ఇలా అయితే కష్టమే అని కావ్య అంటే.. మీకు హోటల్ నుంచి ఫుడ్ తెప్పిస్తానంటుంది కుయిలి. ఫైవ్ స్టార్ హోటల్ తిండి తప్పా ఏ తిండి పడదని కావ్య అంటుంది. దాంతో అలాగే అని చెప్పిన కుయిలి ఏమేం కావాలో చెప్పమంటుంది. దానికి చాలా పెద్ద లిస్ట్ చెబుతారు కావ్య, రాజ్.
దాంతో కుయిలి షాక్ అవుతుంది. వాళ్ల లిస్ట్ భర్త షణ్ముఖంకు చెబుతుంది కుయిలి. లిస్ట్ ఓకేగానీ ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెప్పించమంటున్నారు. వాటికి 20 నుంచి 30 వేల బిల్ అవుతుంది. ఒక్కపూటకే ఇంత అయితే రోజుకు లక్షన్నర బిల్ అవుతుంది మెయింటేన్ చేయడానికి అని షణ్ముఖం అంటాడు. తప్పదు కమిట్ అయ్యామని కుయిలి అంటుంది.
కుయిలి మావయ్య అని
ఇప్పటికే అప్పు కొండెక్కి కూర్చొంది అని షణ్ముఖం అంటాడు. ఖర్చు పెట్టినదానికి వెయ్యి రెట్లు తీసుకుందాం. ఆ బామ్మ ఆస్తి కూడా మనమే చేజిక్కుంచుకుందాం అని కుయిలి అంటుంది. మరోవైపు విగ్గు పెట్టుకుని నాటకం చాలా కష్టమని రాజ్, కావ్య అనుకుంటారు. విగ్గు తీసి పక్కన పెట్టి మాట్లాడుకుంటారు. ఎంతకాలం ఇలా అని రాజ్ అంటే.. రాహుల్ కళ్లు తెరిచేదాకా అని కావ్య అంటుంది.
వాడు కళ్లు తెరిచేలోపు నేను ఈ క్యారెక్టర్‌లో కన్నుమూసేలా ఉన్నాను అని రాజ్ అంటాడు. సరే మీరు ఏం గమనించారు అని కావ్య అడిగితే అది కంచు దాని మావయ్య చుంచులా అనిపించిందని రాజ్ అంటాడు. అసలు వాడు దాని మావయ్యే కాదనిపిస్తుంది. ఆ రంజిత్ కుయిలి భర్త అని నాకు డౌట్‌గా ఉందని కావ్య కనిపెడుతుంది. డౌట్ వచ్చిందిగా క్లారిఫై చేద్దాం. అందరి జాతకాలు బయటపెడదాం అని రాజ్ అంటాడు.
అటు నుంచి వెళ్తున్న షణ్ముఖం వీళ్లేంటీ కొత్తగా కనిపిస్తున్నారు అని అనుకుని కిటికిలోనుంచి తొంగి చూస్తాడు. కానీ, రాజ్, కావ్య మాత్రం మళ్లీ ముసలివాళ్లలా విగ్ పెట్టుకుని రొమాన్స్ చేస్తారు. ముసలోడే గానీ మహానుభావుడు అంటూ షణ్ముఖం అనుకుని వెళ్లిపోతాడు. జస్ట్ మిస్ అని రాజ్, కావ్య అనుకుంటారు. మరోవైపు బాధపడుతున్న స్వప్నను అప్పు ఓదారుస్తుంది.
రాహులే తిరిగి వస్తాడు
అక్క, బావ తీసుకొస్తారని అప్పు అంటుంది. ఒకరు చెబితే గానీ వచ్చే భర్త నాకెందుకు. నా గురించి కాదు పాప ఉందని ఆలోచిస్తున్నా. ఇన్నాళ్లు భయపడిన వాడు ఆ కుయిలితో సంతోషంగా ఉంటానంటున్నాడు అని స్వప్న అంటుంది. రాహుల్ కోటీశ్వరుడని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. నిజం తెలిసి కూడా కుయిలి బాగా చూసుకుంటుందా. నన్నే మోసం చేశావా అని గెంటేస్తుంది అని అప్పు అంటుంది.
దాని దగ్గర కూడా డబ్బు లేదని అక్కకు డౌట్ వచ్చింది. అదే నిజమైతే రాహులే తిరిగి వస్తాడు అని అప్పు అంటుంది. అబ్బా నువ్వు చెప్పాకా రిలీఫ్‌గా ఉందే. పదా భోజనం చేద్దాం అని స్వప్న అంటుంది. మరోవైపు రాజ్, కావ్య చెప్పిన ఫుడ్ ఐటమ్స్ టేబుల్‌పై ఉంటాయి. షణ్ముఖం డల్‌గా ఉంటే ఏమైందని రాహుల్ అడుగుతాడు. మీవాళ్లు వచ్చారుగా. తిండికే పాతికవేలు అయిందని రంజిత్ అంటాడు.
పాతికవేలకే అలా ఫీల్ అవుతున్నావేంటీ అని రాహుల్ అంటాడు. మావయ్య మనం రిచ్ కదా. ఎందుకు ఫీల్ అవుతాడు. మావయ్య వాచ్ పోయిందట. దాని ఖరీదు 2 లక్షలు ఉంటుందని కవర్ చేస్తుంది కుయిలి. తినడానికి కావ్య, రాజ్ వస్తారు. తినడానికి కూర్చుంటారు. కావ్య అన్ని ఫుడ్ ఐటమ్స్ చూస్తుంది. తర్వాత నాకోసం గోల్డ్ బాబు వస్తున్నాడు. వాడికి ఇలా ఉంటే నచ్చదని రాజ్ అంటాడు.
గోల్డ్ బాబు ఎంట్రీ
గోల్డ్ బాబు ఎవరు అని రంజిత్ అడిగితే.. నేనే అంటూ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. దుబాయ్‌లో ఉండి కోట్లకు పడగెలెత్తాను. నీ స్మైల్ చాలా బాగుంది అంటూ కుయిలి బుగ్గ గిల్లుతూ సరసాలు చేస్తాడు గోల్డ్ బాబు. అది చూసి రాహుల్ కోప్పడతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.