Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రాజు వెళ్తుంటే.. చలపతి అడ్డుకుంటాడు. ఆఫీస్‌కి వెళ్తున్నా. ఒక్క సంతకం చేసి వస్తాను. నీకోసం తనను కాదనుకున్నా. నావల్ల కంపెనీకి నష్టాలు రాకూడదు అని రాజు చెబుతాడు. దాంతో చలపతి సైలెంట్‌గా వెళ్లిపోతాడు.
ప్రశాంత్ ప్లాన్స్

మరోవైపు రాజు వస్తే ఎలా మాట్లాడాలని ఇందు కంగారుపడుతుంటే నేనున్నాగా అని డిజైనర్ ప్రశాంత్ అంటాడు. ఇంతలో రాజు వస్తాడు. ఇందు వెళ్లి చూస్తుంది. రాజు, ఇందు ఎదురుపడతారు. సంతకం ఎక్కడ పెట్టాలని రాజు అడిగితే.. పేపర్ మీద, కాఫీ ఏమైనా తీసుకురావాలా అని ప్రశాంత్ అంటాడు. రాజు వార్నింగ్ ఇస్తాడు.
ఒక్క మాట కూడా మాట్లాడాలని ఇందు అనుకుంటుంది. మనిద్దరం కలిసి సర్ మీద దండయాత్ర చేద్దామని ప్రశాంత్ అంటాడు. సర్వర్ డౌన్ అయింది, నెట్వర్క్ ఫెయిల్ అయిందంటూ సిల్లీ రీజన్స్ చెప్పి సర్ సాయంత్రం వరకు ఉండేలా చేస్తాను. మీరిద్దరు మాట్లాడుకునే చేస్తాను. సర్ ఇంటికి వెళ్లేలోపు ఇందు నిన్ను విడిచి ఉండలేను అనేలా చేస్తాను అని ప్రశాంత్ ఛాలెంజ్ చేస్తాడు.
రాజు కోపంతో పెట్టుకోకని ఇందు అంటుంది. సర్ ఎప్పుడెప్పుడు మీకు ఎస్ చెబుతానా అని ఎదురుచూస్తున్నారు. మీ ఇద్దరి మధ్య బ్రహ్మముడి పడేలా చేస్తానని ప్రశాంత్ రాజు దగ్గరికి వెళ్తాడు. ఫిల్టర్ కాఫీ తెచ్చానంటాడు. ఆ పేపర్స్ ఏవో త్వరగా తెస్తే వెళ్లిపోతానంటాడు రాజు. మీ కంపెనీలో మీరు 10 నిమిషాలు ఉండరా. మేడమ్ అక్కడ అంతలా బాధపడటం చూసి ఇలా ఉండటం కరెక్ట్ కాదు సర్ అని ప్రశాంత్ అంటాడు.
ప్రశాంత్ చెంపపగలగొట్టిన రాజు
సర్ అక్కడ ఇందు మేడమ్‌కి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతాడు ప్రశాంత్. అది అందరి లైఫ్‌లో కామన్ అని తేలికగా అనేస్తాడు రాజు. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మేడమ్‌పై మీకున్న ప్రేమ నాకు తెలుస్తుంది. మీరు ఇందు మేడమ్ గురించే ఆలోచిస్తున్నారు. మేడమ్‌కి సారీ చెప్పి తనతో కలిసిపోవాలని చూస్తున్నారు. మీలో పెద్ద యుద్ధమే జరుగుతుందని ప్రశాంత్ అంటాడు.
{{/usCountry}}సర్ అక్కడ ఇందు మేడమ్‌కి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతాడు ప్రశాంత్. అది అందరి లైఫ్‌లో కామన్ అని తేలికగా అనేస్తాడు రాజు. మీ మనసులో ఏముందో నాకు తెలుసు. మేడమ్‌పై మీకున్న ప్రేమ నాకు తెలుస్తుంది. మీరు ఇందు మేడమ్ గురించే ఆలోచిస్తున్నారు. మేడమ్‌కి సారీ చెప్పి తనతో కలిసిపోవాలని చూస్తున్నారు. మీలో పెద్ద యుద్ధమే జరుగుతుందని ప్రశాంత్ అంటాడు.
{{/usCountry}}నాన్న చెప్పాడు మాటిచ్చాను ఇవన్నీ చెత్త సర్. పట్టించుకోకుండి. వెళ్లి ఇప్పుడే మేడమ్‌కి సారీ చెప్పేయండి సర్ అని ప్రశాంత్ అంటాడు. దాంతో ప్రశాంత్‌ను లాగిపెట్టి కొడతాడు రాజు. ఆ సౌండ్ ఇందుకు వినిపిస్తుంది. ప్రశాంత్‌పై ఇందు సెటైర్లు వేస్తుంది. ప్రశాంత్ చెంప వాచిపోయి ఉంటుంది. దాంతో ప్రశాంత్ ఏడుస్తాడు. చెప్పింది విననప్పుడు వినేదాకా చెప్పాలిగా అని ప్రశాంత్ అంటాడు.
మీ ఇద్దరిని కలిపేవరకు నేను ఊరుకోను. కొత్తగా ఆలోచిద్దాం. కొత్త రూట్లో ట్రై చేద్దామని ప్రశాంత్ అంటాడు. ఆరోజు భోజనం విషయంలో రాజును ఉడికించారుగా. ఇప్పుడు కూడా అదే చేసి ఇద్దరు కలిసి భోజనం చేయండి. కచ్చితంగా కలిసిపోతారు అని ప్రశాంత్ చెబుతాడు. సరేనని రాజు దగ్గరికి క్యారేజ్ తీసుకెళ్తుంది ఇందు. రాజు స్పెక్ట్స్ పెట్టుకుంటాడు.
ప్రేమ చచ్చిపోయిందా రాజు
అదంతా ప్రశాంత్ చూస్తాడు. రాజు వెళ్లబోతుంటే తప్పు చేసినవాళ్లే పారిపోతారంటుంది. దాంతో రాజు ఆగిపోతాడు. నా వంట మిస్సయిన ఫీలింగ్ రాలేదా అని క్యారేజ్ ఓపెన్ చేస్తుంది ఇందు. రాజుకు ఇష్టమైన గుత్తి వంకాయ, బెండకాయ చేసినట్లు చెబుతుంది. నాకు ఇప్పుడు ఆకలిగా లేదని రాజు అంటే.. ప్రేమ చచ్చిపోయిందా అని ఇందు అంటుంది.
త్వరగా డాక్యుమెంట్స్ పంపిస్తే సంతకం చేసి వెళ్తానని రాజు అంటాడు. నువ్వు భోజనం చేస్తేనే డాక్యుమెంట్స్ తెప్పిస్తానని ఇందు బ్లాక్ మెయిల్ చేస్తుంది. రాజు వెళ్లిపోతుంటే చేయి పట్టుకుని ఇందు ఆపుతుంది. నిజంగానే వెళ్లిపోతావా అని ప్రేమగా, బాధగా అడుగుతుంది. నా గురించి ఆలోచించట్లేదని నాకు అర్థమయ్యేలా కళ్లజోడు తీసి చెప్పు అని ఇందు అంటుంది.
పక్కకు తిరిగిన రాజు కళ్లు తుడుచుకుంటాడు. డాక్యుమెంట్స్ ఇస్తే వెళ్లిపోతానంటాడు. తీసుకొస్తానని ఇందు వెళ్తుంది. ఫైల్ ఇవ్వగానే రాజు సంతకం పెడతాడు. ఇందును చూడకుండానే కళ్లు తడుచుకుంటూ వెళ్లిపోతాడు రాజు. మరోవైపు ఆఫీస్‌లో రాజు, ఇందు కలిశారని భ్రమరాంబ కంగారుపడుతుంది. రేఖకు ఇందు ఆఫీస్‌లోని వ్యక్తి కాల్ చేస్తాడు.
ఇందు మనిషిని కొనేసిన రేఖ
ఇందుతో రాజు ఒక్కమాట కూడా మాట్లాడుకుండా వెళ్లిపోయాడని చెబుతాడు. ఇందు కూడా ఏం మాట్లాడలేదని చెబుతాడు. అంటే ఇందు మనిషిని రేఖ కొనేసిందని తెలుస్తోంది. దాంతో రేఖ, భ్రమరాంబ సంతోషిస్తారు. పెళ్లికి చివరి సమయంలో రాజు అడ్డుపడితే ఏంటీ పరిస్థితి అని భూషణ్ అంటాడు. తండ్రి మాటకు కట్టుబడే కొడుకు రాజు. కచ్చితంగా పెళ్లి ఆపడని కాన్ఫిడెంట్‌గా చెబుతుంది రేఖ.
పెళ్లి పనులు మొదలుపెట్టమంటుంది రేఖ. భ్రమరాంబ సరేనంటుంది. మరోవైపు రాజు బైక్ స్టార్ట్ కాదు. ఆ బైక్ సార్ట్ కాదు. ఆ బైక్ సైలెన్సర్‌లో నా కర్చీఫ్ పెట్టాను. మీరు సర్‌తో వెళ్లండి. ఇంట్లో డ్రాప్ చేయండని ఇందుకు చెబుతాడు ప్రశాంత్. సరే మీ కారు ఎక్కేలా చేస్తానంటాడు ప్రశాంత్.
ఇందు పెళ్లి
తర్వాత ఇందు పెళ్లి పనులు జరుగుతుంటాయి. ఇందు బాధపడకపోవడం చూసి భ్రమరాంబ, రేఖ డౌట్ పడతారు. ఇందు కావాలని కోరుకులేదా అంటూ రాజుకు కాల్ చేసి మాట్లాడుతుంది అపర్ణ. అదంతా లక్ష్మి, రాజు వింటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.