Brahmamudi November 6 Episode: బ్రహ్మముడి- రాజుకు కరెంట్ షాక్- పంతులుతో ఐశ్వర్య ప్లాన్- రాజును ఇందుతో గెంటించేలా స్కెచ్

Brahmamudi Serial November 6th Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 6వ ఎపిసోడ్‌‌లో కోపంతో రేఖ రగిలిపోతుంది. ఇందుతోనే రాజును బయటకు గెంటిస్తానని ఐశ్వర్య ఛాలెంజ్ చేస్తుంది. నందుతో బావ అని పదే పదే పిలిపించుకుంటాడు రాజు. ఇందు కోపంగా ఉంటే రాజు మాట్లాడతాదు. రాజును బెడ్‌పై పడేస్తుంది ఇందు.

Published on: Nov 6, 2026, 10:34:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు ఇందుల పెళ్లి జరుగుతుంది. ఇందు మెడలో రాజు తాళి కట్టి నిజమైన భార్యను చేసుకుంటాడు. ఇద్దరికి బ్రహ్మముడి పడుతుంది. తర్వాత కోపంతో వస్తువులన్నీ పగలగొడుతుంది రేఖ. మా చెల్లెమ్మ ఎవరి మాట వినదని రేఖను శేషు రెచ్చగొడతాడు.

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 6 ఎపిసోడ్

రగిలిపోయిన రేఖ

భూషణ్, భ్రమరాంబ కూల్ అవ్వమంటారు. రక్తం సలసల మరిగిపోతుంది. బస్తీ గాడిని తెచ్చి మొగుడని చెప్పి పిచ్చోళ్లను చేసింది. అధికారాలన్ని లాగేసుకుందని రేఖ అంటుంది. శేషు సెటైర్లు వేస్తాడు. నా ఆశలన్నీ పీకమేడల కూల్చేస్తారు. వాళ్లను వదిలిపెట్టనని రేఖ అంటుంది. ఐశ్వర్య వచ్చి వస్తువులు పగిలితే పగ తీరుతుందా అంటుంది.

మరి ఏం చేయాలి. మీరంతా ఆస్తి కావాలి కావాలి అన్నారు. మరి రాజను ఎందుకు ఆపలేకపోయారు అని భ్రమరాంబ, భూషణ్‌ని నిందిస్తుంది రేఖ. పగతో రగిలిపోతుంది. ఆ సమయంలో ఎవరు రాజును ఆపలేరు ఆంటీ. అది మీరంతా ఒప్పుకోవాల్సిన విషయం. మనం మాట్లాడిన ప్రతి దానికి ధీటుగా సమాధానం ఇచ్చాడని ఐశ్వర్య అంటుంది.

ఇక జీవితం ఇంతే అని సరిపెట్టుకోమంటావా అని రేఖ అంటుంది. ఇప్పటివరకు నువ్వు ఏ విషయంలో గెలవలేదు. ఈ ఇంట్లో ఎదురించడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. కానీ ఇంటి వారసురాలిగా నాకు ఉంది. మీ చేతికి మట్టి అంటకుండా ఈ ఇంటిని నేలమట్టం చేస్తాను. ఇందు నిన్ను నమ్మించి రాజుతో తాళి కట్టించుకుంది. ఇప్పుడు దానిలాగే మోసం చేసి రాజును ఇందుకు దూరం చేస్తానంటుంది ఐశ్వర్య.

ఐశ్వర్య ఛాలెంజ్

ఇకనుంచి నేను పావులు కదపడం, నేను ఆడించే ఆట చూస్తారు. రాజును ఇందుతో మెడపట్టి గెంటించేలా చేస్తాను అని ఐశ్వర్య ఛాలెంజ్ చేస్తుంది. శభాష్ ఐషు. ఇదే మా చెల్లికే కావాల్సింది అని శేషు అంటుంది. రేఖ, భ్రమరాంబ సైలెంట్‌గా ఉంటే.. వీళ్లకు కావాల్సింది ఇది కాదని శేషుకు అర్థమవుతుంది. నేను చేస్తుంటాను. మీరు చూస్తూ ఉండండని ఐశ్వర్య అంటుంది.

సరేనంటారు భ్రమరాంబ, రేఖ. మరోవైపు కిచెన్‌లో నందు సూప్ చేస్తుంటే మరదల్స్ అంటూ రాజు పలకరిస్తాడు. ఇప్పుడు నేను అఫీషియల్‌గా అల్లుడైనపోయాను. అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు, పిలవచ్చు అని రాజు అంటాడు. అలాగే అల్లుడు గారు అని నందు అంటుంది. తనను బావ అని పిలవమని బావ అని పిలవడంలో గొప్పదనం గురించి చెబతాడు రాజు.

దాంతో బావ అని నందు పిలుస్తుంది. పదే పదే పిలిపించుకుంటాడు రాజు. నా పెళ్లాం ఏదని రాజు అడిగితే.. కోపంతో రగిలిపోతుందని నందు చెబుతుంది. నా మాటలతో నా వశపరుచకొనెదను అని రాజు అంటే.. వద్దు లోపలికెళ్తే బుక్కైపోతావని నందు అంటుంది. అయినా వినకుండా రాజు వెళ్లిపోతాడు. అది నీ రిస్క్. పాపం బావ అని నందు అనుకుంటుంది.

రేఖ రాక్షసత్వం గురించి

మరోవైపు రేఖ రాక్షసత్వం గురించి అపర్ణ, సుభాష్ మాట్లాడుకుంటారు. ఇకనుంచి ఇందు జీవితానికి ఏ ఢోకా లేదు. ఇప్పుడు మనస్ఫూర్తిగా చనిపోడానికి రెడీ అని సుభాష్ అంటే.. ఒక్కరే వెళ్తారా నన్ను కూడా తీసుకెళ్లండని అపర్ణ అంటుంది. ఈ విషయంలో చలపతిని మెచ్చుకోవాలి. ఆయనకు జీవితాంతం రుణపడి ఉన్నామని అపర్ణ అంటుంది.

ఇంతలో నందు వచ్చి సూప్ ఇస్తుంది. ఇందు గదిలో రాజు ఉన్నాడని నందు చెబితే.. ఇంకా శోభనం జరగలేదుగా. వేరువేరుగా ఉంచాలని అపర్ణ అంటుంది. ఇందు అక్క కోపంగా ఉంటే కూల్ చేసేందుకు వెళ్లాడని నందు అంటుంది. నా మనవడు ఏం చేస్తున్నాడో అని అపర్ణ వెళ్తుంది. మరోవైపు ఇందు సంతోషంగా ఉంటుంది. రొమాంటిక్ సాంగ్ పెడుతూ రాజు ఎంట్రీ ఇస్తాడు.

ఇందు కోపంగా చూస్తుంది. దాంతో రాజు ఆపేస్తాడు. కోపమా నాపైనా అనే పాట ప్లే చేస్తాడు. ఆపుతావా ఇంకా. పెళ్లి మండపంలోకి ఎందుకొచ్చావ్. నా మీద జాలి కలిగిందన్నమాట అని ఇందు అంటుంది. జాలి కాదని రాజు అంటాడు. నీకు నా ప్రేమ చెప్పాలనుకున్నా. కానీ నా స్థాయి గుర్తొచ్చింది. నాలాంటి వాడు నిన్ను ప్రేమించడం అత్యాశ అవుతుందనిపించిందని రాజు అంటాడు.

నీకు టార్చర్ చూపిస్తా

కొంచెం ఎక్కువైందని ఇందు అంటే.. నిజం చెబుతున్నా బంగారం అని రాజు అంటాడు. మన పెళ్లి అబద్ధమని లక్కీ చెప్పినప్పుడు నా మనసులో మాట చెప్పానుగా. మా నానమ్మ కూడా పెళ్లి చేసుకోమందిగా. అప్పుడేమైంది ఈ ప్రేమ. మీ నాన్నతో వెళ్లిపోయావని కోపంగా అంటుంది ఇందు. ఇప్పుడు ఒప్పుకున్నాడుగా అని రాజు అంటాడు.

ఓహో.. ఆయన కట్టమంటే కట్టావు. ఇప్పుడు తాళి తీసుకొని వెళ్లమంటే వెళ్తావా అని ఇందు అంటుంది. ఆడుకోకు అని రాజు అంటే.. నేను వైఫ్‌ను నీకు టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అని ఇందు అంటుంది. ఒక్క క్షణం ఆలస్యమైతే ప్రాణాలతో ఉండకపోయేదాన్ని. ఇప్పుడు అధికారికంగా లైసెన్స్ వచ్చిందిగా. నీకు భార్య అంటే ఏంటో చూపిస్తా అని ఇందు అంటుంది.

చెప్పరా చూపించనా.. అని రాజును బెడ్‌పై పడేసి.. తల పట్టుకుని ఏం చేస్తావురా అని ఇందు అంటుంది. ఇద్దరు గొడవపడతారు. ఇంతలో అపర్ణ వచ్చి ఏంట్రా ఇది. ముహుర్తం కూడా పెట్టకుండా పట్టపగలు ఇవేం పనులురా అని అపర్ణ అంటుంది. ఇరికిస్తానని ఇందు అనుకుంటుంది. అవేవి పట్టించుకోకుండా తనేం చెబితే చేయాలట అని రాజును ఇరికిస్తుంది ఇందు.

పక్కింటావిడను తరిమిన చలపతి

ఇలా ప్లేట్ తిప్పేసావేంటే అని రాజు షాక్ అవుతాడు. రాజు చెప్పబోతుంటే ఆపుతావా నీ డ్రామాలు అని రాజునే అంటుంది అపర్ణ. నందుతోపాటు అంతా రాజుపైనే రివర్స్ అవుతారు. రాజును బయటకు రారా అని లాక్కెళ్తుంది అపర్ణ. ముహుర్తం పెట్టేవరకు గదిలోకి రావొద్దని రాజుకు ఆర్డర్ వేస్తుంది. మరోవైపు చలపతి ఇంటికి పక్కింటావిడ పంచదార కోసం వెళ్తుంది.

లక్ష్మి ఇస్తుంది. రాజు గురించి మాట్లాడుతుంది ఆవిడ. సంవత్సరం అంతా అందరిని మోసం చేసి అదే పిల్లను పెళ్లి చేసుకున్నాడు. ఇదంతా ఊరంతా చాటింపు వేయమని చలపతి కోప్పడతాడు. పంచదార కోసం వస్తే ఈ మనిషి కారాలు మిర్యాలు నూరుతున్నాడని అంటుంది. నీకు అసలు తల ఉంటేగా తలనొప్పి ఉండేందుకు. అవును మొన్న నీ మొగుడు లేనప్పుడు నీ ఇంట్లోకి ఎవరో వచ్చారంటాగా. ఎవరో మరి అని చలపతి రివర్స్ అవుతాడు.

తెలిసినోళ్లులే. ఆవకాయ జాడీ దింపేందుకు వచ్చారని ఆవిడ అంటుంది. అర్థమైందిలే అని కోపంగా అంటాడు చలపతి. వాడు నిద్ర లేకుంటే చేస్తే వీళ్లొచ్చి అని లుంగీ ఎగ్గట్టి కోపంగా వెళ్తాడు. దాంతో పక్కింటావిడ పారిపోతుంది. ఆ రమణ వదిన ఒక్క మాట అంటే మీరు పది మాటలంటారని లక్ష్మి అంటుంది. మనల్ని అనే వాళ్లు రాకపోవడమే మంచిందంటాడు చలపతి.

రాజుకు కరెంట్ షాక్

మరోవైపు ఇందు నడుము పట్టుకునేందుకు రాజు వెళ్తుంటే కరెంట్ షాక్ తగిలేలా చేస్తుంది ఇందు. తర్వాత వచ్చే శుక్రవారం రాత్రి పదిన్నరకు శోభనానికి మంచి ముహుర్తం ఉందని పంతులు చెబుతాడు. కానీ, అదే పంతులుకి డబ్బులు ఇచ్చి రాజు, ఇందు వేరువేరుగా పడుకునేలా చేస్తుంది ఐశ్వర్య. 3 రోజుల్లో రాజును ఇందు గెంటేస్తుందని ఐశ్వర్య ప్లాన్ వేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More