Brahmamudi November 7 Episode: బ్రహ్మముడి.. శోభనం కోసం రాజు తహతహ.. ఇందు నడుము చూసి టెంప్ట్.. రేఖ అన్న, తల్లి ఫొటోలు మాయం
Brahmamudi Serial November 7th Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 7 ఎపిసోడ్ లో రాజు, ఇందు శోభనం ముహూర్తం మూడు రోజులు వాయిదా పడుతుంది. ఈలోపు ఇందు నడుము చూసి రాజు టెంప్ట్ అవుతాడు. మరోవైపు హాల్లో నుంచి రేఖ తల్లి, అన్న ఫొటోలను రాజు తీసి పారేస్తాడు.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందు శోభనం కోసం ముహూర్తం చూస్తారు. అటు రాజు దగ్గరికి వచ్చిన లక్కీ క్షమాపణ చెప్పినా రాజు మాత్రం పట్టించుకోడు. ఇక ఫ్రెండ్షిప్ కట్ అనేస్తాడు. మరోవైపు ఎపిసోడ్ చివర్లో దుగ్గిరాల ఇంట్లోకి మళ్లీ సీతారామయ్య, ఇందిరా దేవి ఫొటోలు తిరిగి వస్తాయి.

వెంకీ, రాజులపై మండిపడిన చలపతి
రాజును తలచుకొని చలపతి మండిపడే సీన్ తో సీరియల్ శనివారం (నవంబర్ 7) ఎపిసోడ్ మొదలైంది. లక్ష్మీని తిడుతూ ఉంటాడు. ఇంతలో వెంకీ తాను ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నా అంటూ బయటకు వస్తాడు. నిజంగానే ఇంటర్వ్యూకి వెళ్తున్నావా లేదంటే నువ్వూ ఆ ఇంటికే వెళ్తున్నావా అని చలపతి నిలదీస్తాడు. వెంకీకి వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఆ రాజుగాడు ఇప్పటికే ఓ ముళ్లకంప మీద ఉన్నాడు.. ఆ దుగ్గిరాల కొంప ఓ ముళ్ల కంప.. అందులోకి వెంకీని కూడా పంపించొద్దు అని చలపతి అంటాడు.
కొత్త ఉద్యోగం కోసం వెంకీ తంటాలు
ఇటు వెంకీ కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తాడు. అతని ప్రొఫైల్ చాలా బాగుందని ఇంటర్వ్యూయర్ మెచ్చుకుంటాడు. అయితే లాస్ట్ జాబ్ ఎందుకు మానేశావని అడుగుతాడు. వెంకీ అక్కడ జరిగింది చెబుతాడు. దీంతో ఇంటర్వ్యూయర్ షాకవుతాడు.
నీ పని నువ్వు చేసుకోకుండా మేనేజ్మెంట్ విషయంలో ఎందుకు జోక్యం చేసుకున్నావ్.. అయినా జైలుకి వెళ్లి వచ్చిన నీలాంటి వాళ్లకు ఉద్యోగం ఇస్తే నా కంపెనీ కూడా పాడవుతుంది అని ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరిస్తాడు.
వెంకీని ఓదార్చిన నందు
దీంతో వెంకీ బాధపడుతూ బయటకు వస్తాడు. నిజాయతీకి ఈ లోకంలో విలువే లేదంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నందు అతన్ని ఓదారుస్తుంది. మగాడికి 25 ఏళ్లు వచ్చినా తండ్రి సంపాదన మీద ఆధారపడటం అంతే ఎంత నరకమో తెలుసా? ఇంట్లో అన్నం తినాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుందని అంటాడు. ఏంకాదు.. నీకు మంచి ఉద్యోగం వస్తుందంటూ వెంకీకి నందు ధైర్యం చెబుతుంది.
లక్కీ క్షమాపణను అంగీకరించని రాజు
అటు ఇంట్లో పెళ్లి తర్వాత రాజు హాయిగా కూర్చొంటాడు. తనలో తాను సంతోషిస్తుంటాడు. ఇంతలో లక్కీ వచ్చి మాట కలిపే ప్రయత్నం చేస్తాడు. కానీ రాజు అతన్ని దూరం పెడతాడు. లక్కీ తాను తప్పు చేశానని, క్షమాపణ చెప్పినా పట్టించుకోడు. ప్రాణం పోతున్నా ఓ ఫ్రెండ్ రహస్యాన్ని బయటపెట్టకూడదని, నీ స్థానంలో నేను ఉంటే అలా చేసేవాడినే కాదని రాజు అంటాడు.
ఇక నుంచి నీ ఫ్రెండ్షిప్ కట్ అంటాడు. ఇప్పుడు మనం తోడళ్లుళ్లం.. ఒకే ఇంట్లో కలిసి ఉంటాం.. రోజూ ముఖాలు చూసుకోవాలి అని లక్కీ అంటాడు. అదే జరిగితే తాను ముఖం పక్కకు తిప్పుకొని వెళ్తానని రాజు అంటాడు. నీపై నమ్మకం చచ్చిపోయింది.. ఇక నీతో ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పి వెళ్లిపోతాడు.
శోభనం కోసం రాజు ఆరాటం.. తాళి కట్టిన ముహూర్తం బాలేదన్న పంతులు
మరోవైపు రాజు, ఇందు శోభనం కోసం ముహూర్తం పెట్టడానికి పంతులుని పిలుస్తారు. రాజు శోభనం కోసం తహతహలాడుతుంటాడు. అందరి ముందే ఇందు కొంగు పట్టుకొని సరసరలాడుతూ కనిపిస్తాడు. పంతులు మాత్రం పంచాంగం చూసి ఇందు మెడలో రాజు తాళి కట్టిన ముహూర్తం బాలేదని అంటాడు. మరి ఎవరో జరగాల్సిన పెళ్లిలో ఏదో పెద్ద హీరోలా ఎంట్రీ ఇచ్చి తాళి కడితే ఇలాగే ఉంటుందని రేఖ అంటుంది. అటు ఐశ్వర్య, భ్రమరాంబ కూడా తలా ఓ మాట అని వెళ్లిపోతారు.
శాంతి పూజ తర్వాతే శోభనం.. మూడు రోజుల పాటు దూరందూరం
మరి దీనికి ఏం చేయాలి అని అపర్ణ, సుభాష్ అడుగుతారు. శాంతి పూజ జరిపించాలని పంతులు చెబుతాడు. అయితే దీనికోసం మూడు రోజుల పాటు భార్యాభర్తలను దూరంగా ఉంచాలని, ఆ తర్వాత శాంతి పూజ జరిపి మూడో రోజు రాత్రి 10.30 గంటలకు శోభనం జరిపించాలని చెబుతాడు. మూడు రోజులు శోభనం కోసం ఆగాలా అని రాజు లోలోపల బాధపడతాడు. బయటకు మాత్రం 3 కాదు 30 రోజులైనా సరే అంటాడు. ఇక అప్పటి నుంచే రాజుని ఇందుకి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తారు ఇంట్లో వాళ్లు.
ఇందు నడుము చూసి టెంప్ట్ అయిన రాజు
అయితే ఇందు మాత్రం గదిలో రాజును టెంప్ట్ చేసే పనిలో ఉంటుంది. అప్పుడే స్నానం చేసి వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటూ రాజుకు తన నడుమును కావాలనే చూపిస్తుంది. అది చూసి రాజు టెంప్ట్ అవుతాడు. ఇన్నాళ్లూ అద్దె మొగుడిగా ఉండి ఇందులో ఈ యాంగిల్ చూడలేదని, ఇక ఆపుకోలేకపోతున్నానని రాజు అనుకుంటాడు.
ఇందు నడుము గిల్లడానికి ట్రై చేస్తాడు. అతడు చూస్తున్నాడన్న విషయం గమనించిన ఇందు మరింత రెచ్చగొడుతుంది. నడుము గిల్లడానికి రాగానే తన చేతిలో ఉన్న హెయిర్ స్ట్రెయిటనర్ మెషీన్ తో రాజు వేలికి వాత పెడుతుంది. మూడు రోజులు నా దగ్గరికి రావద్దన్నారు కదా.. బయటకు వెళ్లు అని రాజును తరిమేస్తుంది.
ఇందుని రాజుకి దూరం చేసిన అపర్ణ
ఇటు వేలు పట్టుకొని హాల్లోకి బాధగా వస్తాడు రాజు. గదిలో ఏం జరిగిందో అక్కడున్న శేషుకి అర్థమైపోయి రాజును ఆట పట్టిస్తాడు. ఇంతలో అపర్ణ కూడా వచ్చి మూడు రోజుల పాటు గదిలోకి వెళ్లకు అని ఆర్డర్ వేస్తుంది. ఇక నుంచి హాల్లోనే పడుకోవాలని స్పష్టం చేస్తుంది. దీంతో రాజు ఉసూరుమంటాడు.
దుగ్గిరాల ఇంట్లోకి సీతారామయ్య, ఇందిరాదేవి
ఎపిసోడ్ చివర్లో రాజు దుగ్గిరాల ఇంటి పెద్దవాళ్లు సీతారామయ్య, ఇందిరాదేవి ఫొటో ఫ్రేమ్ చేయించి తీసుకొస్తాడు. ఆ ఫొటో చూసి మా అమ్మ, నాన్న అంటూ సుభాష్ ఎమోషనల్ అవుతాడు. ఈ ఫొటో ఎక్కడ పెడదాం అని ఆలోచిస్తారు. స్టోర్ రూమ్ లో పెట్టండి అని రేఖ అంటుంది. దీంతో రాజు రెచ్చిపోతాడు. అక్కడున్న మీ అన్న, మీ అమ్మ ఫొటోను స్టోర్ రూమ్ లో పడేయడం కరెక్ట్ అంటూ ఆ ఫొటోలు తీసి సీతారామయ్య, ఇందిరాదేవి ఫొటో పెడతాడు. దీంతో రేఖ షాకవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


