Brahmamudi October 22 Episode: బ్రహ్మముడి- పెళ్లి రోజే సుభాష్‌ను చంపేందుకు రేఖ ప్లాన్- ఐశ్వర్య ఫ్రాడ్ కనిపెట్టిన వెంకీ
Brahmamudi Serial October 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 22వ ఎపిసోడ్లో గుడిలో పెళ్లిరోజు సందర్భంగా పూజ చేయిస్తున్న అపర్ణ, సుభాష్ దగ్గరికి స్వామిజీ వచ్చి రాజుకు ప్రాణగండం ఉందని చెబుతాడు. సుభాష్‌ను చంపి రాజుపై నేరం పడేలా రేఖ ప్లాన్ చేస్తుంది. వెంకీని జైలుకు పంపించమని ఐషుకు సలహా ఇస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో రేఖ కోపంగా ఉంటుంది. శేషు సెటైర్లు వేస్తాడు. ఎవరైనా కనికరిస్తే కారు ఇస్తారేమో అని ఎదురుచూస్తుంది అంటాడు శేషు. కోపంతా పనిమనిషి వసంతను పిలుస్తుంది రేఖ. కాఫీ పెట్టమంటే కుదరదని చెబుతుంది.

రేఖకు ఎదురుతిరిగిన పనిమనిషి
పొయ్యి ఖాళీ లేదు. వంట చేస్తున్నాను. ఈరోజు పెద్దయ్యగారు పెద్దమ్మగారి పెళ్లి రోజు అంటగా. వాళ్లకోసం చేస్తున్నాను అని పనిమనిషి చెప్పి వెళ్లిపోతుంది. నీ మాట అంటే లెక్కలేకుండా పోతుందేంటీ రేఖ అని భ్రమరాంబ అంటుంది. మరోవైపు గుడిలో సుభాష్, అపర్ణ పూజ చేస్తారు. నా మనవడు మనవరాలు నిజంగా వివాహబంధంతో ఒక్కటికావాలని కోరుకుటుంది అపర్ణ.
అదంతా సులువు కాదని ఓ స్వామిజీ ఎంట్రీ ఇస్తాడు. గురువుగారు చాలా కాలం తర్వాత మీ దర్శనం దక్కింది. కానీ ఎందుకు అలా అన్నారో అర్థం కావడం లేదని అపర్ణ అంటుంది. మీ వంశానికి వారసుడు అయిన రాజు జీవితాన్ని మృత్యువు నీడలా వెంటాడబోతుంది. తన ప్రాణాలకు పెనుప్రమాదం ముంచి ఉంది. పుష్కరకాలం క్రితం రాజు ప్రాణ గండం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు మళ్లీ ప్రాణగండం ఉందని స్వామిజీ అంటాడు.
దీనికి పరిష్కారం చెప్పమని అపర్ణ అంటుంది. రాజు, ఇందుల సాన్నిహిత్యం పెళ్లి బంధంతో ముడిపడాలి. ఇద్దరికి బ్రహ్మముడి పడాలి. ఇందు మాంగళ్య బలం రాజుకు తోడుకావాలి. ఇది వెంటనే జరగాలి. ఇప్పుడు చేసే చిన్నపొరపాటు రేపు జరగబోయే పెద్ద విపత్తుకు దారి తీయొచ్చు అని చెప్పి వెళ్లిపోతాడు స్వామిజీ. మరోవైపు రాజు, ఇందు కారులో వెళ్తుంటారు.
రాజు, ఇందుకు తప్పిన గండం
రాజు లేట్ చేశాడని కోప్పడుతుంది ఇందు. రూల్స్ గురించి మాట్లాడుతుంది. రాజు రొమాంటిక్ సాంగ్స్ పెడతాడు. ఇందు చిరాకుపడుతుంది. ఐదు నిమిషాల్లో ఆఫీస్‌లో ఉండాలంటుంది ఇందు. దాంతో రాజు స్పీడుగా వెళ్తాడు. రాంగ్ రూట్లో ఒకడు రావడంతో రాజు సడెన్ బ్రేక్ వేస్తాడు. ఇంతలో అపర్ణ ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది.
యమలోకానికి దగ్గరిగా వెళ్లి వచ్చేశాను అని ఇందు చెబుతుంది. ఏంటే సరిగా చెప్పు అని అపర్ణ అంటే.. ఇప్పుడే యాక్సిడెంట్ చేస్తూ మిస్ అయి కారు పక్కకు తీసుకుని ఉన్నామని ఇందు అంటుంది. వెంటనే రమ్మని అపర్ణ ఆర్డర్ వేస్తుంది. రాజుకు పని అప్పగించి రమ్మని సుభాష్ అంటాడు. రాజుకు అదే విషయం చెబుతుంది ఇందు. మరోవైపు బంగారం బాక్స్‌ను పట్టుకొస్తూ కింద పడేస్తాడు వెంకీ.
అందులో గోల్డ్ చూసి ఇది 24 క్యారెట్ గోల్డ్ కాదని కొలిక్తో అంటాడు వెంకీ. ఇది ఐశ్వర్య కంపెనీకి క్వాలిటీ లేని గోల్డ్ పంపిస్తే ఎలా రా అని వెంకీ అంటాడు. ముందు మన కంపెనీ గురించి ఆలోచించు. అదంతా వద్దని ఫ్రెండ్ అంటాడు. వాళ్ల కుటుంబం గురించి నాకు తెలుసు. వాళ్లు ఇలాంటి గోల్డ్ అడగరు. మన కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరుగుతుందిరా అని వెంకీ అంటాడు.
కంపెనీ ఫ్రాడ్ కనిపెట్టిన వెంకీ
నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావ్. అంత పెద్ద కంపెనీకి ఇంత తక్కువ క్వాలిటీ పంపిస్తే తెలియదా. క్వాలిటీ చెక్ ఉంటుందని ఫ్రెండ్ అంటాడు. నా ముందు తప్పు జరిగితే నేను ఊరుకోలేనురా అని వెంకీ అంటాడు. ఎన్నిసార్లు మేనేజర్‌తో తిట్లు తింటావురా. లైట్ తీసుకో అని ఫ్రెండ్ అంటాడు. అందరూ లైట్ తీసుకుంటున్నారంటే కచ్చితంగా ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది. లైట్ తీసుకోలేను అని వెంకీ మనసులో అనుకుంటాడు.
మరోవైపు ఇందుకు రాజును నిజంగా పెళ్లి చేసుకో అని చెబుతుంది. ఎందుకు అని ఇందు అడుగుతుంది. విషయం చెప్పకుండా వాడికి ఇష్టం లేకున్నా పెళ్లి చేసుకోమ్మని అపర్ణ చెబుతుంది. పేమెంట్ ఇచ్చినట్లు చేసుకోవాలా. అదంతా కుదరదు. బావ నన్ను పెళ్లి చేసుకోను అంటే నేను తట్టుకోలేను అని ఇందు అంటుంది.
ఇప్పుడు వాడిని పెళ్లి చేసుకోకుంటా తర్వాత చేసుకుందామన్న వాడు ఉండడే. వాడికి ప్రాణగండం ఉందే. నువ్వు వాన్ని పెళ్లి చేసుకుంటేనే వాడు బతుకుతాడు అని గుడిలో స్వామిజీ చెప్పినగురించి అపర్ణ చెబుతుంది. ఇందు నమ్మదు. మృత్యువు ఏ రూపంలో అయిన రావచ్చు. వాడు నీ మెడలో కట్టే తాళిబొట్టే శ్రీరామ రక్ష అని 20 ఏళ్ల క్రితం జరిగిన యాక్సిడెంట్ గురించి చెబుతుంది అపర్ణ.
వారం రోజుల టైమ్
నువ్వే వెళ్లి వాడితో మాట్లాడి పెళ్లికి ఒప్పించే. మనకు ఇంకా వారం రోజులు మాత్రమే టైమ్ ఉందే అని అపర్ణ అంటుంది. సరేనని ఇందు అంటుంది. మరోవైపు రేఖ కంగారుగా అటు ఇటు నడుస్తుంటుంది. ఇలాంటి బతుకు బతికేకన్నా చావడం మేలు అని శేషు అంటాడు. ఇదే ఆలోచన వాళ్లకు వచ్చేలా చేస్తానని రేఖ అంటుంది. ఈ ఇంట్లో పెద్ద తలకాయ పోతే వీళ్లందరికి భయం పుడుతుందిగా. ఇంట్లో పెద్ద అనిపించుకుంటున్న ఆ తలకాయను లేపేస్తా అని రేఖ అంటుంది.
కొంపదీసి చంపేస్తావా ఏంటీ అని శేషు షాక్ అవుతాడు. ఎలా ఏంటీ అని భ్రమరాంబ అడుగుతుంది. ఇవాళ వాళ్ల పెళ్లి రోజు కదా. కానీ ఇదే వాళ్ల ఆఖరి రోజు. ముసలోడికి మెడిసిన్ వేస్తారుగా. రాజు ఇవాళే కొత్త మెడిసిన్ తెచ్చాడు. అందులో మనం డోస్ పెంచేస్తాం. అది సుభాష్‌కి అపర్ణ ఇస్తుంది. కాసేపటికి రియాక్షన్ కొట్టి రక్తం కక్కుని అక్కడిక్కడే చస్తాడు అని రేఖ ప్లాన్ చెబుతుంది.
రాజునే మెడిసిన్ తెచ్చాడు కాబట్టి వాన్ని నిందిస్తాం. రాజు కావాలనే మెడిసిన్ తెచ్చాడని ఇందును నమ్మిస్తాం. అప్పుడు రాజును ఇంట్లోంచి ఇందు గెంటేస్తుంది అని రేఖ అంటుంది. ఇక నువ్వే ఇంటికి దిక్కు అవుతావని భ్రమరాంబ అంటుంది. ఒకవేల మన ప్లాన్ వికటిస్తే అందరూ కలిసి మనమీద పడతారని, ఇదేదో తేడా కొట్టేలా ఉందని శేషు అంటాడు.
చావుగంట మోగిస్తా
ఈరోజు ఈ ఇంట్లో చావుగంట మోగించకపోతే నా పేరు రేఖనే కాదని శపథం చేసి వెళ్లిపోతుంది రేఖ. మరోవైపు సీఈఓ కుర్చీలో రాజు కూర్చుంటాడు. ప్రశాంత్ వస్తాడు. మేడమ్ గురించి అడిగితే ఇందుకేనా డల్‌గా ఉన్నావని అడుగుతాడు రాజు. మేడమ్ నాకు దేవతలాంటిది. నేను భక్తుడిని సర్ అని ప్రశాంత్ అంటాడు. టేబుల్‌పై కాళ్లు పెట్టుకుంటాడు రాజు.
డిజైన్స్ గురించి రాజు అడిగితే.. 3 రోజుల్లో కంప్లీట్ చేస్తానని ప్రశాంత్ అంటాడు. అంటే నీకు శాలరీలో 70 శాతం కట్ చేసి ఇస్తామని రాజు అంటాడు. అంతపని చేయకండని ప్రశాంత్ వేడుకుంటాడు. ఇంతలో వెంకీ వస్తాడు. తన కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుందని, అందులో ఐశ్వర్య కంపెనీకి కూడా భాగం ఉందని డౌట్‌గా ఉందని వెంకీ చెబుతాడు.
వెంకీని జైలుకు పంపే సలహా
గోల్డ్‌లో క్వాలిటీ లేదని చెబుతాడు వెంకీ. అదే విషయం ఇందుకు చెబుతాడు రాజు. బిజినెస్ చేసే స్టైల్ మార్చుకోమ్మని ఐశ్వర్యకు రాజు వార్నింగ్ ఇస్తాడు. రాజు, ఇందు నీపై ఎంక్వైరీ చేసేలోపు వెంకీని జైలుకు పంపిస్తే సైలెంట్ అవుతారని ఐశ్వర్యకు రేఖ సలహా ఇస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


