Brahmamudi October 2 Episode: బ్రహ్మముడి.. అపర్ణకు నిజం చెప్పేసిన ఇందు.. ఐశ్వర్య పాస్.. ఇందుతో గొడవ.. కళ్లు తిరిగి పడి..

Brahmamudi Serial October 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 2 ఎపిసోడ్ లో సిరి గురించి అపర్ణకు ఇందు అసలు నిజం చెప్పేస్తుంది. మరోవైపు ఐశ్వర్య డిగ్రీ పాసై తనకు కంపెనీ పెట్టించాలంటూ ఇందుతో గొడవ పడి కళ్లు తిరిగి పడిపోతుంది.

Published on: Oct 2, 2026, 08:50:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో సిరి గురించి నిజం తెలుసుకొని రాజుకు అపర్ణ క్షమాపణ చెబుతుంది. అదే సమయంలో మరోసారి ప్లాన్ ఫెయిలై రేఖ బిక్కమొహం వేస్తుంది. అటు ఐశ్వర్య కళ్లు తిరిగి పడిపోవడం ఎపిసోడ్ చివర్లో ఓ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

Brahmamudi October 2 Episode: బ్రహ్మముడి.. అపర్ణకు నిజం చెప్పేసిన ఇందు.. ఐశ్వర్య పాస్.. ఇందుతో గొడవ.. కళ్లు తిరిగి పడి..
Brahmamudi October 2 Episode: బ్రహ్మముడి.. అపర్ణకు నిజం చెప్పేసిన ఇందు.. ఐశ్వర్య పాస్.. ఇందుతో గొడవ.. కళ్లు తిరిగి పడి..

రౌడీలను చితకబాది ఇందు, సిరిని కాపాడిన రాజు

రౌడీల నుంచి తప్పించుకొని దాక్కున్న సిరిని ఇందు చూసే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 2) ఎపిసోడ్ మొదలైంది. అప్పుడే సిరి, ఇందుని రౌడీలు చూస్తారు. వన్ ప్లన్ వన్ ఆఫర్ అంటూ ఇద్దరినీ చుట్టుముడతారు. అప్పుడే రాజు ఎంట్రీ ఇస్తాడు. రౌడీలను చితకబాదుతాడు. దీంతో ఆ ముగ్గురూ పారిపోతారు. సిరిని తీసుకొని రాజు, ఇందు ఇంటికి వెళ్తారు.

ఇంట్లో పోలీసులు.. సిరి గురించి చెప్పిన రేఖ

మరోవైపు రేఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఇంటికి పోలీసులు వస్తారు. అసలు ఏం జరిగింది అని వాళ్లు అడుగుతారు. దీంతో సిరి గురించి రేఖ చెబుతుంది. వీళ్ల మనవడు అంటూ అపర్ణ, సుభాష్ ను చూపిస్తూ.. ఓ అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టాడు.. అసలు ఆమె ఎవరో కూడా తెలియదు.. ఇప్పుడామె కనిపించకుండా పోయింది.. ఆ నింద నాపై వేస్తున్నారు.. అందుకే మీరే అసలు విషయం తెలుసుకోండి అని చెబుతుంది.

అపర్ణపై పోలీసుల ప్రశ్నల వర్షం.. మీ మనవడిని అరెస్ట్ చేస్తామంటూ..

దీంతో వచ్చిన పోలీసులు అపర్ణను నిలదీస్తారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అసలు మీ మనవడు ఎక్కడు? సిరి ఎవరు? ఆమెతో అతనికి ఏం సంబంధం? సిరి ఇప్పుడు ఎక్కడికి వెళ్లింది? ఆమె ఈ ఇంట్లో ఎందుకు ఉంది అంటూ వరుసగా ప్రశ్నలు అడుగుతారు. కానీ వాటికి అపర్ణ దగ్గర సమాధానాలు ఉండవు. మీరు ఏమీ చెప్పకపోతే మీ మనవడిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని పోలీసుల బెదిరిస్తారు. దీంతో అపర్ణ మరింత ఆందోళన చెందుతుంది. ఆమె గురించి వివరాలు చెబుతారా లేదా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లమంటారా అని అడుగుతాడు.

ఎంట్రీ ఇచ్చిన రాజు.. రేఖను ఇరికించి..

వాటిని నేను సమాధానాలు ఇస్తానంటూ రాజు ఎంట్రీ ఇస్తాడు. అసలు మీకు సిరి గురించి ఎవరు చెప్పారని రాజు అడిగితే.. రేఖ మేడమ్ ఫోన్ చేసిందని అంటారు. ఏంటి పిన్నీ.. మనకు మనకు ఎన్ని ఉన్నా.. ఇలా అనవసరంగా పోలీసులను ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అని రాజు నిలదీస్తాడు. ఈమెనే సిరి.. ఆమె, నా భార్య, నేను కలిసి అలా బయటకు వెళ్లాం అంతే.. ఆలోపే ఆమె మనసులో ఏదో పెట్టుకొని ఇలా మీకు చెప్పింది అని రాజు అనడంతో రేఖ ఇరుక్కుంటుంది.

ఆమె ఏదో చెప్పడానికి వెళ్తే పోలీసులు ఆమెకు గట్టి వార్నింగ్ ఇస్తారు. మీ ఇంట్లో విషయాలు మీరు చూసుకోండి.. మరోసారి ఇలాంటివి చేస్తే మిమ్మల్ని స్టేషన్ కు తీసుకెళ్లాల్సి ఉంటుందని అని చెప్పి వెళ్లిపోతారు. సిరి తప్పిపోవడం వెనుక నీ హ్యాండ్ ఉందని తేలితే మాత్రం నేనేంటో నీకు చూపిస్తాను అని రాజు కూడా రేఖకు వార్నింగ్ ఇస్తాడు.

ఇందుని నిలదీసిన అపర్ణ

ఆ తర్వాత ఇందుని బయటకు తీసుకెళ్లి అపర్ణ నిలదీస్తుంది. అసలు మీ జీవితాల్లో ఏం జరుగుతోంది.. ఆ పోలీసులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా నా దగ్గర సమాధానం లేదు.. తొలిసారి ఏదో తప్పు చేసినట్లు తల వంచుకోవాల్సి వచ్చింది.. అసలు ఆ సిరి ఎవరు.. రాజు జీవితంలో నీకు స్థానం ఉందా.. అని అడుగుతుంది.

కానీ ఇందు మాత్రం నిజం చెప్పదు. రాజు జీవితంలో నాకు స్థానం ఉంది అనడంతో అలా అయితే సిరిని రాజు పెళ్లి చేసుకోలేదా అని అడుగుతుంది. ఇన్నాళ్లు ఆగావు కదా.. మరికొన్నాళ్లు ఓపిక పట్టు.. అసలు నిజమేంటో నీకే తెలుస్తుందని ఇందు అంటుంది. అయినా అపర్ణ వినదు. తనపై ఒట్టు వేయించుకుంటుంది.

నిజం చెప్పేసిన ఇందు.. సిరి రాజు భార్య కాదంటూ..

దీంతో చేసేది లేక ఇందు నిజం చెప్పేస్తుంది. బావ అసలు సిరిని పెళ్లి చేసుకోలేదు.. ఓరోజు అనుకోకుండా బావ చేసిన యాక్సిడెంట్ లో సిరి గాయపడి కోమాలోకి వెళ్లిపోయింది.. వాళ్ల నాన్న చనిపోయారు.. అప్పటి నుంచి సిరి బాగోగులు బావే చూసుకుంటున్నాడు.. డబ్బు కోసం నన్ను కూడా కిడ్నాప్ చేశాడు.. రెండేళ్లుగా ఆమె కోమాలో నుంచి వస్తే అసలు నిజం చెప్పించి తనపై నింద రాకుండా చూసుకుందామనుకున్నాడు.. కానీ ఆమె గతం మరచిపోయింది.. దీంతో బావ ఎంతో కుమిలిపోతున్నాడు అని ఇందు చెబుతుంది.

మరి ఈ నిజం తనకు ఎందుకు చెప్పలేదని అడిగితే.. ఇది అందరికీ తెలిస్తే రేఖ ఆంటీ దానిని రాజుకు వ్యతిరేకంగా వాడుకని జైలుకి పంపిస్తుంది.. అందుకే చెప్పలేదు.. ఇప్పుడు కూడా నువ్వు ఈ నిజం ఎవరికీ చెప్పనని మాటివ్వు అంటూ అపర్ణతో ఇందు ఒట్టేయించుకుంటుంది.

రాజు, సిరిని చూసి అపర్ణ ఎమోషనల్.. క్షమాపణ చెప్పి..

మరోవైపు భయంతో వణికిపోతున్న సిరిని ఓదార్చి నిద్ర పుచ్చుతాడు రాజు. అతని గదిలోకి వెళ్లిన అపర్ణ ఎమోషనల్ అవుతుంది. అపర్ణ రావడంతో రాజు షాకవుతాడు. ఆ తర్వాత ఆమె అతనికి క్షమాపణ చెబుతుంది. తానే సిరి గురించి నిజం చెప్పేయాల్సి వచ్చిందని ఇందు అంటుంది. నువ్వు తప్పు చేయవని తెలిసి కూడా.. ఇన్నాళ్లూ నిన్ను అనుమానించినందుకు క్షమాపణ చెబుతున్నానంటూ అపర్ణ ఎమోషనల్ అవుతుంది.

ఐశ్వర్య పాస్.. కళ్లు తిరిగి పడిపోయి..

ఆ తర్వాత ఐశ్వర్య తాను ఎగ్జామ్స్ లో పాసయ్యానంటూ వస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం కంపెనీ పెట్టించాలని ఇందుతో భ్రమరాంబ అంటుంది. అయితే అంతకంటే ముందు కొన్నాళ్లు కంపెనీలో ఉద్యోగం చేయాలని, తర్వాతే కంపెనీ పెట్టిస్తానని ఇందు అంటుంది. అది కుదరదు.. నాకు కంపెనీ పెట్టించాల్సిందే అని ఐశ్వర్య గొడవకు దిగుతుంది. ఇంతలో ఆమె కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారు పడతారు. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More