Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంటి తాళాలు పట్టుకుని అధికారంతో చక్రం తిప్పుతుంటుంది రేఖ. శేషు అన్నమాటలను గుర్తు చేసి ఇప్పుడు చూశావా అని చిటికేస్తూ తన పవర్ చూపిస్తుంది రేఖ. ఇల్లంతా నీ కంట్రోల్లో ఉందని భ్రమరాంబ అంటుంది.
రాజు బెస్ట్ ఫ్రెండే వాడిపాలిట రాహువులా మారాడు

రాజు గాడి బెస్ట్ ఫ్రెండే వాడిపాలిట రాహువులా మారాడని భూషణ్ అంటాడు. శేషు సైలెంట్‌గా ఉండటం నచ్చలేదని, ఏదోటి చెప్పమని రేఖ అంటుంది. చెప్పాలని ఉన్నా మీకు వినాలని ఉందో లేదో అని శేషు అంటాడు. అయినా చెప్పమని రేఖ అంటుంది. రాజు వెళ్తున్నా ఇందు సైలెంట్‌గా ఉంది. అంటే మనం అనుకుంది కాకుండా ఏదో జరుగుతుందనిపిస్తుందని శేషు అంటాడు.
ఇందు మౌనం వెనుక ఆస్తికి నష్టం జరుగుతుందని అంతే అని రేఖ అంటుంది. ఇందు ఆస్తుల కోసం భయపడే రకం కాదు ఇంకా ఏదో తేడా కొడుతుందని శేషు అంటుంది. రేఖ, శేషు వాదించుకుంటారు. ఇకనుంచి నా ఆట నీకు కచ్చితంగా నచ్చుతుంది. ఇందుకు పెళ్లి చేయబోతున్నాను. రేపే పెళ్లిసంబంధం తీసుకొస్తాను అని రేఖ అంటుంది.
తాళి కట్టే టైమ్‌కి రాజు రాకుండా ఉంటాడా అని శేషు అంటే.. ఎవరొస్తారో రాని నన్ను కాదని ఎవ్వరు దాని మెడలో తాళి కట్టలేరు అని రేఖ అంటుంది. మరోవైపు ఇందు గురించి రాజు బాధపడటాన్ని చలపతి, లక్ష్మి చూస్తారు. రాజు ఏం తినట్లేదు, తాగట్లేదని లక్ష్మి అంటుంది. ఇందును మర్చిపోడానికి కాస్తా టైమ్ పడుతుందని చలపతి అంటాడు.
ఎప్పటికైనా అక్కడికి చేరుకోవాల్సిందే
మీరు ఒక్కసారైనా వాడి స్థానంలో ఉండి ఆలోచించారా. నిజాలు మాట్లాడుకోవాలంటే రాజు వాళ్ల రక్తం. ఎప్పటికైనా వాడు చేరుకోవాల్సింది అక్కడికే. అదే మాట ఇందు, అపర్ణ అంటే ఏం చేసేవాళ్లు. మీకు ఇచ్చిన మాటకు మిమ్మల్ని ఏమనలేదు. అలాంటి వాళ్లను బాధపెట్టి ఏం చేస్తారు అని లక్ష్మి అంటుంది. వాడు మనకు పుట్టకపోయిన ఎన్నో చేశామే. వాడు బాగుండాలని కోరుకునే హక్కు లేదా అని చలపతి అంటాడు.
{{/usCountry}}మీరు ఒక్కసారైనా వాడి స్థానంలో ఉండి ఆలోచించారా. నిజాలు మాట్లాడుకోవాలంటే రాజు వాళ్ల రక్తం. ఎప్పటికైనా వాడు చేరుకోవాల్సింది అక్కడికే. అదే మాట ఇందు, అపర్ణ అంటే ఏం చేసేవాళ్లు. మీకు ఇచ్చిన మాటకు మిమ్మల్ని ఏమనలేదు. అలాంటి వాళ్లను బాధపెట్టి ఏం చేస్తారు అని లక్ష్మి అంటుంది. వాడు మనకు పుట్టకపోయిన ఎన్నో చేశామే. వాడు బాగుండాలని కోరుకునే హక్కు లేదా అని చలపతి అంటాడు.
{{/usCountry}}మీరేమనుకున్నా వాడు బాగుండటమే నాకు కావాల్సింది. రెండు రోజుల్లో వాడే సెట్ అవుతాడన్న చలపతి రాజు దగ్గరికి వెల్లి పాలు తాగమంటాడు. వద్దని రాజు వెళ్లిపోతాడు. వాడు బతికి ఉండాలన్న ఆశతో ఇలా చేస్తున్నానని చలపతి అంటాడు. మరోవైపు సరిద్దుకోలేని తప్పు చేశానని లక్కీ బాధపడతాడు. వీడు వెధవ అయినా నాకోసం స్టాండ్ తీసుకున్నాడు. వీడు తోడుగా ఉంటే అప్పుడప్పుడు ఉపయోగపడతాడు అని ఐశ్వర్య అనుకుంటుంది.
నీకు రాజు ఎంతో ఇచ్చిన నాకోసం అలాంటివాడికి షాక్ ఇచ్చావ్. హస్బండ్ మెటిరీయలే నువ్వు. దీన్ని మిత్రద్రోహం, వెన్నుపోటు అంటారు. నాకు మాత్రం భార్య కోసం చేసిన త్యాగం అనిపిస్తుందని ఐశ్వర్య అంటుంది. నిజంగా నీకు నేను పాజిటివ్‌గా కనిపిస్తున్నానా అని లక్కీ అంటే నువ్వెప్పుడు నా దృష్టిలో ఫూల్వేరా ఫూల్ అని ఐశ్వర్య మనసులో అనుకుంటుంది.
ఐశ్వర్య దృష్టిలో పడ్డావ్
నా కళ్లలో నీకు తెలియట్లేదా. నీ మీద పాజిటివ్‌గానే చెప్పాను అని జరిగిందే చెబుతుంది ఐశ్వర్య. నువ్వు లక్కీ.. ఐశ్వర్య దృష్టిలో పడ్డావ్. ఇలాగే ట్రై చేయి నువ్వు అనుకుంది జరిగే అవకాశం ఉందని ఐశ్వర్య వెళ్లిపోతుంది. వీడికి సోపు వేయాల్సిన కర్మ పట్టిందని అనుకుంటుంది. తర్వాత అపర్ణ, ఇందు సైలెంట్‌గా ఉంటే రేఖ పంచ్‌లు వేస్తుంది.
ఇంట్లో పోయిన నవ్వులు తిరిగి తీసుకొస్తానని ఓ ఫొటో కింద వేసి. ఇందుకు కాబోయే భర్త అని ఈరోజే పెళ్లి చూపులు అని చెబుతుంది రేఖ. అంతా షాక్ అవుతారు. ఇందుకు మంచి జీవితం మనందరి బాధ్యత కదా అని భ్రమరాంబ అంటుంది. ఇందును బాధపెట్టడానికి మీరు ఆడుతున్న పెళ్లాటలా ఉందని శేషు అంటాడు. ఇతను ఇందుకు కవచంలా ఉంటాడు. బాగా చదువుకున్నాడని రేఖ అంటుంది.
నువ్వెవరో నా మనవరాలికి పెళ్లి చేయడానికి. ఎవరితో పెళ్లి చేయాలో నేను డిసైడ్ చేస్తానని అపర్ణ అరుస్తుంది. నేను చెప్పేది వినే స్థాయిలో మాత్రమే నువ్వు ఉన్నావని రేఖ. ఆల్రెడీ పెళ్లిచూపుల వాళ్లను రమ్మని చెప్పాను అని రేఖ అంటుంది. దానికి ఇందు రెడీ అవుతానని వెళ్లిపోతుంది. అదంతా విన్న ఐశ్వర్య కోపగించుకుని పైకి వెళ్లిపోతుంది.
నీకు క్యారెక్టర్ ఉందా
ఈ పెళ్లి జరుగుతుందని రేఖ అంటే.. అపర్ణ వెళ్లిపోతుంది. ఇందు భలే మాట విన్నదని భ్రమరాంబ అంటే.. ఆ ముసలోళ్లు మన కంట్రోల్లో ఉన్నారుగా అని రేఖ అంటుంది. ఇందు దగ్గరికి వెళ్లిన ఐశ్వర్య తన కడుపు తెచ్చుకున్నందుకు తిట్టిన నువ్వు పెళ్లికాకుండా భర్తను తెచ్చుకున్నావ్. నేను కడుపు చేసినవాన్నే పెళ్లి చేసుకుని ఇంటి పరువు కాపాడాను అని ఐశ్వర్య అంటుంది.
ఇన్నాళ్లు ఒకడితో ఉండి ఇప్పుడు ఇంకొకరితో పెళ్లికి రెడీ అయ్యావ్. మరి నీకు క్యారెక్టర్ ఉందా అని ఐశ్వర్య అంటుంటే.. అపర్ణ కోప్పడుతుంది. పిచ్చిపిచ్చిగా వాగితే పళ్లు రాలగొడతానంటుంది. దిగజారిపోయి బతుకుతుంది ఇది. మీ నీతి మాటలు దానికి చెప్పుకోండని ఐశ్వర్య అంటుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా. రేపు పెళ్లయ్యాకా కూడా సమాజం ఇలాగే అంటుందని పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావని అపర్ణ నిలదీస్తుంది.
పెళ్లికి ఒప్పుకున్నానని ఎవరన్నారు. నా మనసులో ఉంది రాజు. రాజునే పెళ్లి చేసుకుంటాను. రెడీ అవుతాను. కానీ దేనికి రెడీ అవుతానే తనకు తెలియదని. నేను పెళ్లి చేసుకునేది బావనే. నా బావ నాకోసం వస్తాడని, ఇది జరిగి తీరుతుందని ఇందు అంటుంది. మరోవైపు రాజు ఆకలి లేదంటే చలపతి తిడతాడు. నేను కూడా తినను అని చలపతి అంటాడు.
రాజు నిరహార దీక్ష
వాడు వచ్చి నా పక్కన కూర్చుని తింటే తప్పా తినను. నువ్వు కూడా తినకు అని లక్ష్మితో చలపతి అంటాడు. నువ్వు తినకు మమ్మల్ని పస్తులు ఉంచు. నిరాహార దీక్ష చేయు. నీ డిమాండ్స్ నెరవేరవరకు చేయు. మహా అయితే షుగర్ వస్తుంది. తినకపోతే చస్తాను అంతేగా. నా స్వార్థం కోసం నీతో ఆడుకోవట్లేదు. నీ బాగు కోసమే ఆలోచిస్తున్నా అని చలపతి అంటాడు.
ఇంతలో నందు వస్తుంది. రాజుతో మాట్లాడుతుంది. అక్కడ అక్క అస్సలు బాగాలేదు. లైఫ్‌లో తోడుగా ఉంటాను అన్నవాడు మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ షాక్‌లోనే ఉంది. మా అక్కను అలా వదిలేసి ఎలా రావాలనిపించిందని నందు నిలదీస్తుంది. ఇన్ని రోజుల్లో నీకు తెలియలేదా అక్క నిన్ను ఎంతలా ఇష్టపడుతుందో. అక్కకు ఈరోజు పెళ్లిచూపులు అని నందు చెబుతుంది.
ఆఫీస్‌కి రాజు రీఎంట్రీ
వేరేవాళ్లతో అక్కకు రేఖ ఆంటీ పెళ్లి చేయబోతుంది. ఇంట్లో ఎవరు ఆపట్లేదు. నిన్ను తీసుకెళ్లాలని చెప్పట్లేదు. నీ మనసు చెప్పింది విని నిర్ణయం తీసుకో అని నందు వెళ్లిపోతుంది. మరోవైపు ఇందు పెళ్లికి రేపే దివ్యమైన ముహుర్తం ఉందని పంతులు చెబుతాడు. దాన్నే రేఖ ఖాయం చేయమంటుంది. ఇందు పెళ్లికి ఒక్కరోజు గడువు ఉండగా.. ఆఫీస్‌కు రాజు వస్తాడు. అక్కడ రాజును చూసి సంతోషిస్తుంది ఇందు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.