Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య అబార్షన్ చేయించుకోకుండా అడ్డుకొని లక్కీతో పెళ్లికి ఒప్పిస్తారు రాజు, ఇందు. అయితే అలా చేసినందుకు ఇందుని అపర్ణ, సుభాష్ మందలిస్తారు. మరోవైపు సిరిని భూషణ్ తోసేయడం, ఆమెకు తీవ్రంగా గాయపడటం, దాంతో ఆమెకు గతం గుర్తుకు రావడం లాంటి సీన్లు కూడా ఎపిసోడ్ చివర్లో చూడొచ్చు.
లక్కీకి రాజు ఫోన్.. ఐశ్వర్య అబార్షన్ విషయం చెప్పి..

లక్కీకి రాజు ఫోన్ చేసే సీన్ తో సీరియల్ బుధవారం (అక్టోబర్ 7) ఎపిసోడ్ మొదలవుతుంది. ఐశ్వర్య కనిపించడం లేదని అంటే.. తాను ఆమె దగ్గరే ఉన్నానని, అంతా అయిపోయిందని, ఆమె అబార్షన్ చేయించుకుంటోందని ఏడుస్తూ చెబుతాడు లక్కీ.
అడ్డుకోమని రాజు చెబితే.. తాను చెబితే ఆమె వినదని అంటాడు. తన బిడ్డను కాపాడతానని ఇందు మాటిచ్చింది కదా.. దయచేసి ఆ పని చేయండని వేడుకుంటాడు. హాస్పిటల్ లొకేషన్ పెట్టమని రాజు అడుగుతాడు. ఆమె ఆపరేషన్ చేయించుకోకుండా ఆపుతామని సుభాష్ కు మాటిచ్చి రాజు, ఇందు వెళ్తారు.
హాస్పిటల్‌కు రాజు, ఇందు.. కోర్టు ఆర్డర్‌తో ఐషూని అడ్డుకొని..
రాజు, ఇందు హాస్పిటల్ కు పరుగెత్తుకుంటూ వెళ్తారు. అప్పటికే ఐషూ ఆపరేషన్ కు రెడీ అవుతుండటంతో వెళ్లి అడ్డుకుంటారు. తన జీవితం తన ఇష్టం అని ఐశ్వర్య అనడంతో.. డాక్టర్ ను ఆపరేషన్ చేయొద్దని ఇందు అడుగుతుంది. ఆమె ఇష్ట ప్రకారం చేసినప్పుడు చట్టప్రకారం ఆమెకు ఆ హక్కు ఉందని డాక్టర్ అంటుంది.
అందుకే తాము కూడా చట్టప్రకారమే వెళ్లామని, కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చామని ఇందు అంటుంది. రాజు ఓ కాగితం తీసి డాక్టర్ కు చూపిస్తాడు. దీంతో ఆమె ఆపరేషన్ చేయనని చెబుతుంది. ఐశ్వర్య కూడా అది చూసి షాక్ తింటుంది. తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్తారు.
కోర్టుకు వెళ్తానన్న ఐశ్వర్య.. కంపెనీ పెట్టిస్తానంటూ కండిషన్
{{/usCountry}}అందుకే తాము కూడా చట్టప్రకారమే వెళ్లామని, కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చామని ఇందు అంటుంది. రాజు ఓ కాగితం తీసి డాక్టర్ కు చూపిస్తాడు. దీంతో ఆమె ఆపరేషన్ చేయనని చెబుతుంది. ఐశ్వర్య కూడా అది చూసి షాక్ తింటుంది. తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్తారు.
కోర్టుకు వెళ్తానన్న ఐశ్వర్య.. కంపెనీ పెట్టిస్తానంటూ కండిషన్
{{/usCountry}}ఇంటికి వచ్చిన తర్వాత ఐశ్వర్యకు అపర్ణ క్లాస్ పీకబోతుంటే.. ఆపరేషన్ జరగలేదని ఇందు చెబుతుంది. ఎందుకిలా చేస్తున్నావని అపర్ణ నిలదీస్తుంది. నా జీవితం నా ఇష్టం అని ఐషూ అంటుంది. తాను బిడ్డను వదులుకుంటానని, కోర్టుకు వెళ్తానని అంటుంది. ఆ అవసరం లేదని ఇందు చెబుతుంది. తాము అబద్ధం చెప్పామని, కోర్టుకు వెళ్లలేదని, ఆ పేపర్ నకిలీదని అనడంతో ఐషూ షాక్ తింటుంది.
ఎందుకిలా నా జీవితంతో ఆడుకుంటున్నారని ఇందుని నిలదీస్తుంది. కంపెనీ విషయంలోనూ ఇలాగే చేశారని అంటుంది. నీకు కంపెనీ పెట్టిస్తాను.. కానీ నువ్వు బిడ్డను వదులుకోకూడదు.. అలాగే లక్కీని కూడా పెళ్లి చేసుకోవాలి అని కండిషన్ పెడుతుంది. ఇది మరో నాటకమా అని ఐషూ అడిగితే.. తాను మాట తప్పనని, కంపెనీ పెట్టిస్తానని ఇందు చెబుతుంది.
దిగొచ్చిన ఐశ్వర్య.. పెళ్లికి ఓకే.. అగ్రిమెంట్‌పై ఇందు, ఐషూ సంతకాలు
మీరు ఇంతకుముందు కూడా ఇలాగే చెప్పి మాట తప్పారని భ్రమరాంబ అంటుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎలా నమ్మాలి అని రేఖ అనడంతో.. అగ్రిమెంట్ చేసుకుందామని ఇందు అంటుంది. లక్కీని పెళ్లి చేసుకొని, బిడ్డను కని బాధ్యతలు చూసుకోవడానికి ఐషూ ఒప్పుకుంటూ సంతకం చేస్తే.. కంపెనీ పెట్టిస్తానని హామీ ఇస్తూ నేనూ సంతకం చేస్తానని ఇందు అంటుంది.
దీంతో ఐశ్వర్య దిగి వస్తుంది. బిడ్డను కంటాను.. లక్కీని కూడా పెళ్లి చేసుకుంటానని మాటిస్తుంది. దీంతో రాజు వెళ్లి అగ్రిమెంట్ తీసుకొస్తాడు. దానిపై మొదట ఐశ్వర్య, తర్వాత ఇందు సంతకాలు చేస్తారు. అది చూసి రేఖ, భ్రమరాంబ సంతోషిస్తారు. దీనిని అడ్డం పెట్టుకొని ఆస్తిని కొట్టేయాలని రేఖ అనుకుంటుంది. అపర్ణ, సుభాష్ షాకవుతారు.
ఆస్తి ముక్కలు చేశావంటూ ఇందుకి అపర్ణ, సుభాష్ క్లాస్
లోనికి వెళ్లిన తర్వాత ఇందుకి అపర్ణ, సుభాష్ క్లాస్ పీకుతారు. ఈ ఆస్తిని ముక్కలు చేయొద్దని మీ అమ్మానాన్న ఎంతో ప్రయత్నించారని, ఇప్పుడు నువ్వు చేసిన పని కరెక్ట్ కాదని అపర్ణ అంటుంది. అయినా ఆస్తి ముక్కలు కాదు.. మరో కంపెనీ మాత్రమే పెట్టిస్తున్నామని రాజు అంటే.. ఆ ఐశ్వర్య రేఖ చెప్పినట్లే వింటుంది కదా.. ఆమె ఆస్తిని ముక్కలు చేయడానికి చూస్తుంది అని అపర్ణ అంటుంది.
సుభాష్ కూడా ఈ విషయంలో నువ్వు తొందర పడ్డావని ఇందుతో అంటాడు. మీరే ఆపరేషన్ జరగకుండా చేసి ఇంటి పరువు కాపాడాలని అన్నారు కదా.. నాకు మరో దారి కనిపించలేదు.. అయినా కంపెనీ పెట్టించినంత మాత్రాన ఏమీ జరిగిపోదు అని ఇందు చెబుతుంది. కంపెనీ పెట్టించినవాళ్లం.. దానిని తిరిగి లాక్కోవడం తెలియదా.. మేము చూసుకుంటాం అని రాజు కూడా హామీ ఇస్తాడు.
రాజు అరెస్ట్.. సిరికి గుర్తొచ్చిన గతం
మరోవైపు వీల్ చైర్ పై ఆడుకుంటున్న సిరిని భూషణ్ కోపంతో తోసేస్తాడు. దీంతో ఆమె కిందపడిపోతుంది. తలకు తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేయాల్సి వస్తుంది. అందరూ టెన్షన్ లో ఉండగా.. నందు ఎస్సై రూపంలో ఎంట్రీ ఇస్తుంది. రాజును అరెస్ట్ చేయడానికి వచ్చానంటూ అతని చేతికి బేడీలు వేసి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడే సిరికి గతం గుర్తుకు వచ్చి ఆగండి అని బయటకు వస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.