...
...
Next Story

Brahmamudi September 29 Episode: బ్రహ్మముడి- సిరిని కొట్టిన ఐశ్వర్య- వచ్చిన జాబ్ కాలదన్నుకున్న మదన్- రాజుకు ముచ్చెటమలు

Brahmamudi Serial September 29th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 29వ ఎపిసోడ్‌‌లో ఐశ్వర్య తాను పెట్టబోయే కంపెనీ కోసం లోగో డిజైన్ చేసుకుంటుంది. ఇంతలో సిరి వచ్చి ఇంక్ పడేస్తుంది. దాంతో కోపంతో సిరిని కొడుతుంది ఐశ్వర్య. అది చూసి రాజు చేయి ఎత్తుతాడు. సిరిని సిటీకి దూరంగా పంపిస్తుంది రేఖ.

Published on: Sep 29, 2026, 08:24:51 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా చిన్నపిల్ల అయినా పెద్దదేగా. ముగ్గురు ఒకే గదిలో ఎలా పడుకుంటారు. నీకు ఇబ్బంది కాదా. రేఖ వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నావుగా అని అపర్ణ కోప్పడుతుంది.

సిరిని కొట్టిన ఐశ్వర్య

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 29 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 29 ఎపిసోడ్

బావ తప్పు చేయడు. రేఖ వాళ్లు ఆస్తి కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రతి చిన్న విషయంపై రచ్చ చేస్తున్నారు. అంతా నేను చూసుకుంటాను అని ఇందు సర్దిచెప్పుతుంది. హాల్లో ఐశ్వర్య లోగో డిజైన్ చేస్తుంటుంది. భ్రమరాంబ, శేషు ఎందుకని అడుగుతారు. ఇలా డిజైన్స్ చేసి బతకొచ్చని అనుకుంటున్నావా అని శేషు అంటాడు.

కాదు. రేపు కంపెనీ సీఈఓ అయ్యాక లోగో కావాలిగా. దానికోసం అని ఐశ్వర్య చెబుతుంది. భ్రమరాంబ మెచ్చుకుంటుంది. అప్పుడే బిజినెస్ వుమెన్ అవుతుందని అంటుంది. రాజు వచ్చి సెటైర్లు వేస్తాడు. పాస్ కాకముందే హడావిడి ఏంటో అని వెటకారంగా అంటాడు. నేను కచ్చితంగా పాస్ అయి ఇందుతో కంపెనీ పెట్టించుకుంటానని ఐశ్వర్య అంటుంది.

ఇంతలో సిరి ఆడుతూ వచ్చి ఐశ్వర్య లోగోపై ఇంక్ పడేలా చేస్తుంది. దాంతో కోపంతో సిరిని కొడుతుంది ఐశ్వర్య. సిరి ఏడుస్తూ వెళ్లిపోతుంది. అది చూసి ఆవేశంతో రగిలిపోయిన రాజు ఐశ్వర్య మీదకు చేయి ఎత్తుతాడు. ఐశ్వర్యను ఇందు తిడుతుంది. తను చిన్నపిల్ల అని తెలుసుగా అని కోప్పడుతుంది ఇందు. సుభాష్ కూడా తిడతాడు.

రాజుకు ఐశ్వర్య వార్నింగ్

చాలా బాగుంది. తప్పు చేసింది తను. మీలాంటి వాళ్లు పదిమంది ఉంటేచాలు సొసైటీ చాలా బాగుంటుంది. చేతనైతే జాగ్రత్తగా చూసుకో లేకపోతే ఏదైనా హాస్పిటల్‌లో పడేయ్. ఇంకోసారి రిపీట్ అయితే అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి ఐశ్వర్య వెళ్లిపోతుంది. సిరి ఇంట్లో ఉంటే ఎప్పుడు ఏం చేస్తుందో భయపడాలి. మనింట్లో కోట్లకు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి. తనకు తెలియనితనంతో ఏదైనా చేస్తే ఎలా అని రేఖ చెబుతుంది.

మరోవైపు జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తాడు మదన్. మా కంపెనీలో ఉన్న జాబ్‌కి మీరు ఓవర్ క్వాలిఫైడ్. మీరు ఎక్స్‌పెక్ట్ చేసే శాలరీ మేము ఇవ్వలేం. త్వరలో ఓపెనింగ్స్ పడతాయ్. అప్పుడు మీరు అనుకున్న రోల్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్పటివరకు అసిస్టెంట్ మేనేజర్‌ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది. మీరు చేస్తానంటే చేయొచ్చు అని ఇంటర్వ్యూరర్ చెబుతాడు.

స్వాతికి ఇంటి ఓనర్ వార్నింగ్

ఆఫ్ట్రాల్ అసిస్టెంట్ మేనేజర్‌గా చేయాలా. నా క్వాలిఫికేషన్ తగిన జాబ్ తప్పా ఇంకోటి చేయను. మీలాంటి కంపెనీలు చాలా ఉన్నాయని పొగరుగా మాట్లాడి జాబ్ కాలదన్నుకుని వెళ్లిపోతాడు మదన్. ఇంతలో స్వాతి కాల్ చేసి ఇంటర్వ్యూ, జాబ్ గురించి అడుగుతుంది. రాలేదని, వాళ్ల ఆఫర్ నచ్చలేదని మదన్ చెబుతాడు. ఇంతలో స్వాతి దగ్గరికి ఇంటి ఓనర్ వచ్చి ఒక నెల అడ్వాన్స్ ఇచ్చారు. కానీ, నా భార్య 2 నెలల అడ్వాన్స్ ఇవ్వమంటుంది. 2,3 రోజుల్లో ఎలాగైనా ఇవ్వండని చెబుతాడు.

లేకుంటే మా ఆవిడ గోల చేసి ఇల్లు ఖాళీ చేయిస్తుందని ఇంటి ఓనర్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు సిరి ముందు దాగుడుమూతలు ఆడుకుందామని భ్రమరాంబ చెబుతుంది. లక్కీ పని ఉందని వెళ్లిపోతాడు. సిరికి తెలిసేలా దాగుడుమూతలు ఆడుతున్నాం. ఎవరైనా ఆడొచ్చని గట్టిగా అంటుంది భ్రమరాంబ. అది విన్న సిరి వచ్చి తను కూడా ఆడతానంటుంది.

రేఖ వాళ్లతో సిరి దాగుడుమూతలు ఆడుతుంది సిరి. రేఖను కప్ప అంటుంది సిరి. రేఖ వెళ్లి దాక్కుంటుంది. భూషణ్‌ను బొద్దింక అంటుంది సిరి. శేషును ఎలక అంటుంది. అంతా దాక్కుంటే సిరి వెళ్లి పట్టుకుంటుంది. రేఖ సైగ చేయడంతో తను ప్లాన్ చేసిన డ్రైవర్ కారు డిక్కీ ఓపెన్ చేస్తాడు. భ్రమరాంబ దొరుకుతుంది. భ్రమరాంబకు గంతలు కట్టి అందరిని దాక్కోమంటుంది రేఖ.

రాజుకు ముచ్చెటమలు పట్టిస్తా

సిరి దక్కరికి వెళ్లి బయట కారులో దాక్కుంటే ఎవరికి దొరకను. నేనే గెలుస్తాను అని రేఖ కావాలనే అంటుంది. నీకంటే ముందు నేనే వెళ్లి దాక్కుంటానని చెప్పి కారు డిక్కీలో దాక్కుంటుంది సిరి. రేఖ సైగ చేయడంతో డ్రైవర్ సిరిని కారులో తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు నిజం చెప్పకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను అని రేఖ అనుకుంటుంది.

హాల్లో సిరిని భోజనం చేద్దామని రమ్మని ఇందు పిలుస్తుంది. దాగుడుమూతలు ఆడించాం. ఉన్నట్టుండి సిరి కనిపించట్లేదని ఇందుకు చెబుతుంది భ్రమరాంబ. గదిలోకి వెళ్లి ఇందు చూస్తుంది. ఎక్కడా కూడా సిరి కనిపించదు. ఇంతలో రాజు వస్తే సిరి కనిపించట్లేదని ఇందు చెబుతుంది. తెగ టెన్షన్ పడి అంతా వెతుకుతారు.

కానీ, సిరి దొరకదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే అని రాజు అంటాడు. అలా చేస్తే ముందు పోలీసులు నిన్నే ఇంట్రాగేట్ చేస్తారు. అన్ని క్వశ్చన్స్ అడుగుతారు అని ఇందు వారిస్తుంది. మరోవైపు రేఖకు కాల్ చేసిన డ్రైవర్ సిరిని సిటీ అవుట్ కట్స్‌లో వదిలేశానని చెబుతాడు. ఇకనుంచి రాజుకు ముచ్చెటమలు పటిస్తానని అనుకుంటుంది రేఖ.

పోలీసులకు ఫోన్ చేసి రప్పించు..

సిరి ఎక్కడ అని రేఖను అడుగుతాడు రాజు. నా మీద ఇంతపెద్ద నింద వేసిన తర్వాత నేనెందుకు ఊరుకుంటాను. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి రప్పించు అని రేఖ రివర్స్‌లో రాజును ఆడుకుంటుంది రేఖ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks