బ్రహ్మముడి డిసెంబర్ 25 ఎపిసోడ్: స్వరాజ్ గ్రూప్ మళ్లీ నంబర్ వన్.. తప్పు తెలుసుకున్న ధాన్యం.. దుగ్గిరాల ఇంట్లో సంబరాలు

బ్రహ్మముడి సీరియల్ గురువారం (డిసెంబర్ 25) ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంట్లో మళ్లీ ఆనందం వెల్లివిరిసే పరిస్థితులు రావడం చూడొచ్చు. ధాన్య తన తప్పు తెలుసుకుంటుంది. అటు రాజ్, కావ్య మరోసారి స్వరాజ్ గ్రూప్ ను నంబర్ వన్ గా చేస్తారు.

Published on: Dec 25, 2025, 07:56:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 913వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అప్పు విషయంలో మొదట వెనక్కి తగ్గని ధాన్యం తర్వాత దిగి వస్తుంది. అటు రాహుల్ కు క్లైంట్స్ షాకిచ్చి మళ్లీ రాజ్ దగ్గరికి వస్తారు. నెల రోజుల్లోనే స్వరాజ్ గ్రూప్ మళ్లీ నంబర్ వన్ గా నిలుస్తుంది. దీంతో దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సంతోషంలో గంతులేస్తుంది.

బ్రహ్మముడి డిసెంబర్ 25 ఎపిసోడ్: స్వరాజ్ గ్రూప్ మళ్లీ నంబర్ వన్.. తప్పు తెలుసుకున్న ధాన్యం.. దుగ్గిరాల ఇంట్లో సంబరాలు
బ్రహ్మముడి డిసెంబర్ 25 ఎపిసోడ్: స్వరాజ్ గ్రూప్ మళ్లీ నంబర్ వన్.. తప్పు తెలుసుకున్న ధాన్యం.. దుగ్గిరాల ఇంట్లో సంబరాలు

అత్తకు ఎదురు తిరిగిన ధాన్యం.. కంగు తిన్న ఇందిరా దేవి

బ్రహ్మముడి సీరియల్ గురువారం (డిసెంబర్ 25) ఎపిసోడ్ ధాన్యలక్ష్మికి ఇందిరా దేవి క్లాస్ పీకే సీన్ తో మొదలువుతుంది. నువ్వు నీ కోడలు ఎలా మాట వినాలని అనుకుంటున్నావో తాను కూడా నువ్వు అలాగే వినాలని అనుకుంటున్నట్లు ఇందిరా దేవి అంటుంది. దీంతో ధాన్యం ఎదురు తిరుగుతుంది. ఇన్నేళ్లూ ఎప్పుడూ మీ మాట జవదాటలేదని, ఇప్పుడు కూడా మీకు ఇష్టం లేని అన్నదానం చేయనని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో అందరూ షాక్ తింటారు. ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో రాజ్, కావ్య, ఇందిరా దేవి బాధపడతారు.

రాహుల్‌కు క్లైంట్స్ షాక్.. రుద్రాణి కొత్త ప్లాన్

ఇటు మన కంపెనీ క్లైంట్స్ అందరూ మన డిజైన్ల కంటే స్వరాజ్ గ్రూపు డిజైన్లే బాగున్నాయని అక్కడికి వెళ్తామంటున్నారని రాహుల్ కు ఫోన్ చేసి చెబుతాడు మేనేజర్ మూర్తి. దీంతో రాహుల్ ఆగ్రహంతో ఊగిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి.. రాజ్, కావ్యలను దెబ్బ కొట్టడానికి మరో ప్లాన్ చెబుతుంది. ఇలా డిజైన్లంటే కుదరదని, వాళ్లను ఎమోషనల్ గా దెబ్బకొట్టి బిజినెస్ తన వైపు తిప్పుకోవాలని చెబుతుంది. రాహుల్ సరే అంటాడు.

అప్పుకి రేణుక థ్యాంక్స్.. కరిగిన ధాన్యం మనసు

తన కూతురిని తనకు అప్పగించిన అప్పుకి థ్యాంక్స్ చెప్పడానికి రేణుక వాళ్ల ఇంటికి వస్తుంది. అప్పుని పిలిచి థ్యాంక్స్ చెబుతుంది. ఆ పాప కూడా మీరు పోలీస్ డ్రెస్ వేసుకోవాలని, తనలాంటి వాళ్లను రక్షించాలని, తాను కూడా పోలీస్ అవుతానని అంటుంది. ఇలాంటి కోడలు దొరకడం మీ అదృష్టం అని ధాన్యంతోనూ రేణుక అంటుంది. దీంతో ఆమె మనసు కాస్త కరిగినట్లు అనిపిస్తుంది.

ధాన్యలక్ష్మికి క్లాస్ పీకిన ప్రకాశం

రేణుక మాటలను గుర్తు చేసుకుంటూ ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ప్రకాశం అక్కడికి వచ్చి ఆమెకు క్లాస్ పీకుతాడు. తాను అప్పు మీద ప్రేమతోనే ఇలా చేస్తున్నానని ధాన్యం అంటుంది. పక్షులకు రెక్కలు వచ్చిన తర్వాత వాటిని వదిలేయాలని, ఇలా పట్టుకొని ఉంటే ఎలా అని ప్రకాశం అంటాడు.

కల్యాణ్ బిజినెస్ చేయను రైటర్ అవుతాను అంటే ఒప్పుకున్న నువ్వు అప్పు విషయంలో ఎందుకిలా చేస్తున్నావని నిలదీస్తాడు. కొడుకు విషయంలో ఒకలా, కోడలి విషయంలో మరోలా చేయడం కరెక్టేనా అని ప్రకాశం అనడంతో ధాన్యం ఆలోచనలో పడుతుంది.

రాజ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన శృతి..

మరోవైపు ధాన్యం అలా ఎందుకు చేసిందంటూ రాజ్, కావ్య ఆలోచిస్తూ కూర్చున్న సమయంలో శృతి రాజ్ కు ఫోన్ చేస్తుంది. ఓ గుడ్ న్యూస్ అని, మన క్లైంట్స్ అందరూ మన దగ్గరికే వస్తున్నారని అంటుంది. దీంతో రాజ్ ఎగిరి గంతేస్తాడు. కానీ కావ్య మాత్రం ఇప్పుడే ఆర్డర్ తీసుకోవద్దని, తాము వాళ్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తుంది.

రాజ్ ఎందుకలా చేస్తున్నావని అడిగితే.. మనను కాదని వెళ్లారు.. ఇప్పుడు మళ్లీ మనమే కావాలని వస్తున్నారు.. రేపు మళ్లీ ఇలా చేయరని గ్యారెంటీ ఏంటని అనడంతో రాజ్ కూడా ఆలోచనలో పడతాడు. బిజినెస్ లో నన్ను మించిపోతున్నావని కావ్యను మెచ్చుకుంటాడు.

అప్పును ఓదార్చిన అపర్ణ, ఇందిరా దేవి

ఇటు బాధపడుతూ కూర్చున్న అప్పుని ఇంట్లో వాళ్లందరూ ఓదారుస్తుంటారు. నువ్వు ఏ తప్పు చేయలేదని అంటారు. అప్పుడే ధాన్యం అక్కడికి వస్తుంది. తన తప్పు తెలుసుకున్నానని, ఇక నుంచి నువ్వు ఉద్యోగం చేయొచ్చని చెప్పడంతో అప్పుతోపాటు అందరూ సంతోషిస్తారు. అటు బిజినెస్ సమస్య కూడా తీరితే ఇక సంతోషమే సంతోషం అని సుభాష్ అంటాడు.

నెల రోజుల్లో కంపెనీని మళ్లీ నంబర్ వన్ చేయాలని రాజ్ స్పష్టం చేస్తాడు. ఆ దిశగానే పని చేసి విజయం సాధిస్తారు. మళ్లీ మనమే నంబర్ వన్ అని కావ్య సంతోషంగా చెబుతుంది. అటు రాహుల్ ఫ్రస్ట్రేషన్ కు గురవుతాడు. న్యాయంగా పని చేయాలంటూ అందరి ముందే రాహుల్ కు సుభాష్ క్లాస్ పీకుతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More