బ్రహ్మముడి డిసెంబర్ 9 ఎపిసోడ్: స్వప్నను పూర్తిగా బుట్టలో వేసుకున్న రాహుల్.. రాజ్, కావ్య జీవితంలో ఊహించని మలుపు
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 9) ఎపిసోడ్ లో రాజ్, కావ్యలను చోటు, మోటు కిడ్నాప్ చేయడం, వాళ్లు వెతుకుతున్న పెన్ డ్రైవ్ పోలీసుల చేతికి చిక్కడంలాంటి సీన్లతో సాగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 899వ ఎపిసోడ్ లో కేరళలో రాజ్, కావ్య, చోటు, మోటు చుట్టూ తిరగగా.. ఇటు ఇంట్లో స్వప్నను రాహుల్ పూర్తిగా తన బుట్టలో వేసుకోవడం చూడొచ్చు. అయితే రాజ్, కావ్య కిడ్నాప్ కావడం, పోలీసుల చేతికి పెన్ డ్రైవ్ చిక్కడంతో ఈ సీరియల్ కొత్త మలుపు తిరిగింది.

రెస్టారెంట్లో రాజ్, కావ్య రొమాన్స్
బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 9) ఎపిసోడ్ రాజ్, కావ్య రెస్టారెంట్ కు వెళ్లే సీన్ తో మొదలవుతుంది. అక్కడ ఇద్దరూ రొమాంటిక్ మూడ్ లో ఉంటారు. వాళ్లను చూసిన పక్కనున్న వాళ్లు మీరు లవర్సా? హనీమూన్ కు వచ్చారాలాంటి ప్రశ్నలు అడగడంతో రాజ్ మరింత రెచ్చిపోయి కావ్యతో రొమాంటిక్ గా మాట్లాడుతుంటాడు. ఆ ఇద్దరి వెంట పెన్ డ్రైవ్ కోసం పడుతున్న చోటు, మోటు అక్కడికి వస్తారు. వాళ్లిద్దరినీ రెస్టారెంట్ లో చూడటంతో వాళ్ల గదిలో పెన్ డ్రైవ్ కోసం వెతకడానికి వెళ్తారు.
రాజ్, కావ్య గదిలోకి చోటు, మోటు.. దొరకని పెన్ డ్రైవ్
రాజ్, కావ్య గదిలోకి చోటు, మోటు చొరబడతారు. పెన్ డ్రైవ్ కోసం మొత్తం వెతుకుతారు. కానీ వాళ్లకు ఎక్కడా దొరకదు. ఇంతలో రూమ్ సర్వీస్ వ్యక్తి వస్తాడు. మీరెవరు అని నిలదీస్తాడు. క్లీనింగ్ కోసం వచ్చామని చెబుతారు. దీంతో బాత్రూమ్ క్లీనింగ్ కోసం వచ్చారా.. అయితే వెళ్లి క్లీన్ చేయండని పంపిస్తారు. ఇద్దరూ వెళ్లి చివరికి బాత్రూమ్ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇటు బయట రూమ్ ఊడుస్తున్న వ్యక్తికి పెన్ డ్రైవ్ దొరుకుతుంది. ఇది చాలా ముఖ్యమైంది అయి ఉంటుందని, రిసెప్షన్ లో ఇవ్వాలని అనుకుంటాడు.
స్వప్నను పూర్తిగా పడేసిన రాహుల్
మరోవైపు ఇంట్లో స్వప్నను రాహుల్ పూర్తి తన బుట్టలో వేసుకుంటాడు. ఆమె ముస్తాబవుతుండగా.. దగ్గరికి వెళ్లి నీ కోసమే ప్రత్యేకంగా చేయించానంటూ ఓ నెక్లెస్ ను ఆమె మెడలో వేస్తాడు. అది చూసి స్వప్న మురిసిపోతుంది. ఇన్నాళ్లూ మా అమ్మ మాటలు విని నిన్ను పట్టించుకోలేదని, ఇక నుంచి నిన్ను, పాపను బాగా చూసుకుంటానని అంటాడు. అది విని స్వప్న ఇంకా సంతోషిస్తుంది.
అంతేకాదు కంపెనీలో నగల కోసం కొత్త డిజైన్లు గీశానని, వాటిలో ఏవి బాగున్నాయో నువ్వే సెలెక్ట్ చేయాలని రాహుల్ అంటాడు. దీంతో స్వప్న ఆ డిజైన్లలో నుంచి కొన్నింటిని సెలెక్ట్ చేస్తుంది. తనకూ సరిగ్గా అవే నచ్చాయని, వాటిని తయారీ యూనిట్ కు పంపిస్తానని రాహుల్ చెబుతాడు.
చోటు, మోటును గుర్తుపట్టిన రాజ్
ఇటు కేరళలో ఆ పెన్ డ్రైవ్ జాడ కనిపెట్టడానికి రాజ్, కావ్య దగ్గరికి వెళ్లాలని చోటు, మోటు అనుకుంటారు. ఇంతలో మోటు మారువేషం వేసుకుంటాడు. అది దూరం నుంచి చూసిన రాజ్.. కావ్యకు అవే విషయం చెబుతాడు. రాజ్, కావ్యల దగ్గరికి పదేపదే వెళ్లి ఆ పెన్ డ్రైవ్ గురించి మాట్లాడుకుంటున్నారేమో అని మోటు చూస్తాడు.
చివరికి చోటు మొబైల్ కు ఫోన్ చేసి.. తన ఫోన్ రాజ్ టేబుల్ దగ్గర పెడితే వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నానో వినొచ్చు అనుకొని అలాగే చేస్తాడు. రాజ్ ఆ మొబైల్ చూసి కావాలని ఆ పెన్ డ్రైవ్ ను శృతికి ఇచ్చావు కదా అంటే ఆమె అవునని అంటుంది. దీంతో పెన్ డ్రైవ్ జాడ తెలిసిందనుకొని ఆ శృతి కోసం వాళ్ల వెతుకుతుంటారు. ఇటు రాజ్, కావ్య రెస్టారెంట్లో టేబుల్ దగ్గర పోలీసులతో ఏదో మాట్లాడుతుంటారు.
ఇంతలో రూమ్ సర్వీస్ వ్యక్తి తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ను మరో వ్యక్తికి ఇచ్చి పంపుతాడు. అప్పటికే రాజ్, కావ్య వెళ్లిపోవడంతో అతడు దానిని పోలీసులకు ఇస్తాడు. ఆ పెన్ డ్రైవ్ రాజ్, కావ్యలకు ఇవ్వడానికి పోలీసు వాళ్లను వెంబడించగా.. చోటు, మోటు వాళ్లను కిడ్నాప్ చేయడం చూస్తాడు. అక్కడితో బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.














