...
...
Next Story

BTS The Return: ఓటీటీలో బీటీఎస్ కమ్‌బ్యాక్ కాన్సర్ట్.. నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ చూసేయండి.. స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే

BTS The Return: పాప్ సెన్సేషన్ బీటీఎస్ మళ్లీ వచ్చేస్తోంది. ఈ బ్యాండ్ చాలా రోజుల తర్వాత లైవ్ కాన్సర్ట్ ఇవ్వబోతోంది. దీనిని నెట్‌ఫ్లిక్స్ లో మార్చి 21న లైవ్ లో చూడొచ్చు. ఈ విషయాన్ని ఆ ఓటీటీ వెల్లడించింది.

Published on: Mar 18, 2026, 14:59:47 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

BTS The Return: సౌత్ కొరియా పాప్ సెన్షేషన్ బీటీఎస్ లోని ఏడుగురు సభ్యులు మళ్లీ చేతులు కలిపారు. కొన్నేళ్లుగా కొరియన్ ఆర్మీలో సేవలందించడానికి వెళ్లిన వీళ్లు.. ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ఇప్పుడు అందరూ కలిసి ఓ కమ్‌బ్యాక్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. దీని లైవ్ స్ట్రీమింగ్ నెట్‌ఫ్లిక్స్ లో రానుంది.

బీటీఎస్ ది రిటర్న్ లైవ్ స్ట్రీమింగ్

BTS The Return: ఓటీటీలో బీటీఎస్ కమ్‌బ్యాక్ కాన్సర్ట్.. నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ చూసేయండి.. స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే
BTS The Return: ఓటీటీలో బీటీఎస్ కమ్‌బ్యాక్ కాన్సర్ట్.. నెట్‌ఫ్లిక్స్‌లో లైవ్ చూసేయండి.. స్ట్రీమింగ్ డేట్, టైమ్ ఇదే

బీటీఎస్ బ్యాండ్ కమ్‌బ్యాక్ కాన్సర్ట్ లైవ్ స్ట్రీమింగ్ వివరాలను నెట్‌ఫ్లిక్స్ బుధవారం (మార్చి 18) వెల్లడించింది. “బీటీఎస్‌పైనే స్పాట్ లైట్ ఉంది. బీటీఎస్ ది కమ్‌బ్యాక్ లైవ్ మార్చి 21న సాయంత్రం 4.30 గంటలకు.. కేవలం నెట్‌ఫ్లిక్స్ లో” అనే క్యాప్షన్ తో ఓ ట్వీట్ చేసింది.

ఇక మరో ట్వీట్ లో ఈ బ్యాండ్ లోని సభ్యులందరి పేర్లను రాసింది. “RM + Jin + SUGA + j-hope + Jimin + V + Jung Kook.. బీటీఎస్ కమ్‌బ్యాక్ లైవ్.. మార్చి 21న సాయంత్రం 4.30 గంటల నుంచి నెట్‌ఫ్లిక్స్ లో” అని ట్వీట్ చేసింది.

బీటీఎస్‌పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న సౌత్ కొరియన్ పాప్ సెన్సేషన్ 'బీటీఎస్' (BTS) మళ్లీ ఫుల్ ఎనర్జీతో కమ్‌బ్యాక్ ఇస్తోంది. ఈ కాన్సర్ట్ లైవ్ స్ట్రీమింగ్ తోపాటు నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ కూడా తీసుకొస్తోంది. ఈ ఏడుగురు కుర్రాళ్ల ఎమోషనల్ జర్నీని చూపిస్తూ 'ది రిటర్న్' (The RETURN) పేరుతో ఒక స్పెషల్ డాక్యుమెంటరీని మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను బావో గుయెన్ డైరెక్ట్ చేయగా.. హైబ్ (HYBE), ది మెషీన్, ఈస్ట్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి ప్రొడ్యూస్ చేశాయి.

ట్రైలర్‌ రిలీజ్

ఆర్ఎం మాట్లాడుతూ.. "మేం ఇంకా సౌత్ కొరియా పల్లెటూరి కుర్రాళ్లమే. మిలిటరీలో టైమ్ అలా గడిచిపోయింది. కానీ ఇక్కడ లాస్ ఏంజిల్స్‌లో ఉన్నప్పుడు టైమ్ వాల్యూ ఏంటో తెలుస్తోంది. అసలు మమ్మల్ని 'బీటీఎస్'గా మార్చేది ఏంటో మేం వెతుకుతున్నాం" అని అన్నాడు. "నాకైతే ఇదంతా ఒక కల లాగా అనిపిస్తోంది" అని జంగ్‌కుక్ చెప్పాడు.

గ్రాండ్ కమ్‌బ్యాక్ కాన్సర్ట్.. 'అరిరాంగ్' ఆల్బమ్ రిలీజ్

టేలర్ స్విఫ్ట్, జస్టిన్ బీబర్ లాంటి గ్లోబల్ స్టార్స్‌తో సమానంగా స్పాటిఫైలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన బీటీఎస్.. దాదాపు నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ స్టేజ్ ఎక్కబోతోంది. ఈ వీకెండ్‌లో సియోల్‌ లోని చారిత్రక గ్వాంగ్‌హ్వామున్ స్క్వేర్‌లో ఒక భారీ ఓపెన్-ఎయిర్ కాన్సర్ట్ ప్లాన్ చేశారు.

ఈ లైవ్ కాన్సర్ట్ చూడటానికి దాదాపు 2.5 లక్షల మందికి పైగా ఆర్మీ ఫ్యాన్స్ వస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ ఈవెంట్‌కు ఒక్క రోజు ముందే బీటీఎస్ 5వ స్టూడియో ఆల్బమ్ 'అరిరాంగ్' (Arirang) కూడా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe