హైదరాబాద్‌లో ‘నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్’ ప్రారంభం - స్థలం కేటాయింపుపై సీఎం రేవంత్ ప్రకటన

Netflix Eyeline Studios Global VFX in Hyderabad : ప్రముఖ ఓటీటీవేదిక, ప్రపంచస్థాయి వినోదాన్ని అందజేసే ప్రముఖ ప్రాజెక్ట్ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్' హైదరాబాద్‌లో తన కార్యాలయం నెలకొల్పింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు హీరో రాణా పాల్గొన్నారు.

Published on: Mar 12, 2026, 12:48:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో 'నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్' గ్లోబల్ వీఎఫ్ఎక్స్ (VFX), వర్చువల్ ప్రొడక్షన్ హబ్‌ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు​ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.

నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ ప్రారంభం
నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ ప్రారంభం

​హైటెక్ సిటీలోని క్యాపిటలాండ్ ఐటీపీహెచ్ (ITPH)లో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెట్ ఫ్లిక్స్ ఈ అత్యాధునిక హబ్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎన్నో కొత్త అవకాశాలను కల్పిస్తుంది.

హైదరాబాద్‌ను దక్షిణ భారత చలనచిత్ర, AVGC సూపర్‌హబ్‌గా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ వీఎఫ్ఎక్స్ హబ్ AVGC స్టార్టప్‌ల కోసం పెట్టుబడులు, ప్రపంచ సహకారాలను ఒకచోట చేర్చుతుంది. AI-ఆధారిత VFX సామర్థ్యాలు, పార్టనర్‌షిప్ స్టూడియోలను నిర్మిస్తుంది. వీఎఫ్ఎక్స్ రంగంలో ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు హైదరాబాద్‌ నుంచి పని చేస్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ముంబైలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారత్‌లో ఇది రెండో కార్యాలయం(హైదరాబాద్) అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ ఏర్పాటుతో సృజనాత్మక, సాంకేతిక ప్రతిభ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

హైదరాబాద్ : నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్' ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్ చూడండి….

ఫ్యూచర్ సిటీలో భూమిని కేటాయిస్తాం - సీఎం రేవంత్

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. చాలా మంది ఎంతో కాలంగా ఈ సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇవాళ్టితో నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని… హైదరాబాద్ వేదికగా నెట్ ఫ్లిక్స్ స్టూడియోస్ ను ఏర్పాటు చేయటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

“నాకు సినిమాలంటే చాలా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇవాళ వీఎఫ్ఎక్స్ వరకు సాంకేతిక అభివృద్ధి చెందుతూ వస్తోంది. చెన్నైలో ఉండే సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు ఆనాటి హీరోలు కృషి చేశారు. నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ కు వచ్చిందంటే హాలీవుడ్ కూడా హైదరాబాద్ కు వచ్చినట్లే. నెటిఫ్లిక్స్ ఇక్కడ నెలకొల్పిన విషయాన్ని గర్వంగా చెబుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది. నెట్ ఫ్లిక్స్ సంస్థ కార్పొరేట్ ఆఫీస్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తే... ప్రభుత్వపరంగా ఫ్యూచర్ సిటీలో భూమిని కూడా కేటాయిస్తాం” అని ప్రకటించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More