Carmeni Selvam OTT: కళ్లు తెరిపించే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ మూవీ.. సముద్రఖని కోసం చూడాల్సిందే
Carmeni Selvam OTT: మిడిల్ క్లాస్ జీవితాలు, అవసరాలకు మించిన ఖర్చులు, అత్యాశతో పడే ఇబ్బందులు.. ఇలాంటి అంశాలతో వచ్చిన తమిళ ఎమోషనల్ డ్రామా ‘కార్మేని సెల్వం’ ఇవాళ ఓటీటీలో రిలీజైంది. సముద్రఖని తన నటనతో మెస్మరైజ్ చేసిన ఈ మూవీ మస్ట్ వాచ్ అని చెప్పాల్సిందే.
Carmeni Selvam OTT: కంటెంట్ తో మెప్పించే తమిళ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతుంటారు. ఇవాళ అలాంటి తమిళ సినిమా ‘కార్మేని సెల్వం’ ఓటీటీలోకి వచ్చేసింది. మిడిల్ క్లాస్ లైఫ్ స్టోరీని కళ్లకు కట్టినట్లు చూపించి, కళ్లు తెరిపించేలా తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. సముద్రఖని యాక్టింగ్ కోసం ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే.

కార్మేని సెల్వం ఓటీటీ
ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకులను అలరించేందుకు కార్మేని సెల్వం వచ్చేసింది. పి.సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన 'కార్మేని సెల్వం' సినిమా గ్లోబల్ డిజిటల్ ప్రీమియర్ షురూ అయింది. జూన్ 3, 2026 నుంచి ఈ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళం, తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా (బైలింగ్వల్ డ్రామా) రూపొందిన ఈ కార్మేని సెల్వం సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేస్తోంది.
మిడిల్ క్లాస్ లైఫ్
కుటుంబ బంధాలు, ఆర్థిక ఇబ్బందులు, మనుషులకు ఉండే మానసిక ప్రశాంతత, జీవితంలో ఎదురయ్యే నైతిక విలువల చుట్టూ కార్మేని సెల్వం స్టోరీ తిరుగుతుంది. నేటి సమాజంలో సగటు మనిషి ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణలను, కుటుంబ బాధ్యతలను దర్శకుడు రామ్ చక్రి ఈ సినిమాలో ఎంతో చక్కగా చూపించాడు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో సముద్రఖని, గౌతమ్ మీనన్ తమదైన శైలిలో జీవించారనే కామెంట్లు వస్తున్నాయి.
నెట్టింట వైరల్
రామ్ చక్రి దర్శకత్వం వహించిన కార్మేని సెల్వం చిత్రంపై ఓటీటీ ప్రియుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. డిజిటల్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఈ సినిమాకు సంబంధించిన హ్యాష్‌ట్యాగ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భావోద్వేగాలతో కూడిన మంచి ఫ్యామిలీ డ్రామాను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక మంచి అనుభూతిని ఇస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
కార్మేని సెల్వం స్టోరీ
సెల్వం (సముద్రఖని) ఓ కారు డ్రైవర్. సంపత్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్), దేవి (అభినయ) దగ్గర డ్రైవర్ గా చేస్తుంటాడు. సెల్వం భార్య శాంతి (లక్ష్మి ప్రియా చంద్రమౌళి) ఇండ్లీ బండి నడుపుతుంది. వీళ్లకు ఓ కొడుకు బాలు. కొడుకు ఫ్యూచర్ కోసం, సొంత ఇంటి కోసం సెల్వం, శాంతి డబ్బులు పొదుపు చేస్తారు. కానీ ఓ సారి వీళ్లకు కుటుంబ సభ్యుల నుంచి అవమానం ఎదురవుతుంది.
ఈ నేపథ్యంలో సంపత్ ను సెల్వం మోసం చేస్తాడు. విచ్చలవిడిగా అప్పులు చేస్తాడు. కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కార్మేని సెల్వం మూవీ స్టోరీ.
సముద్రఖని కోసం
సముద్రఖని కేవలం నటుడు మాత్రమే కాదు, ఆయన మల్టీ టాలెంటెడ్. దర్శకుడిగా సాగిపోతూనే వెర్సటైల్ యాక్టర్ గా నటనతోనూ అదరగొడుతున్నాడు. మరోసారి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్ లా కార్మేని సెల్వంలో సముద్రఖని సత్తాచాటాడు. విమానం, రామం రాఘవం లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశాడు. ఇప్పుడు కార్మేని సెల్వంలో నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. అతని కోసం ఈ మూవీ చూడొచ్చు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: కార్మేని సెల్వం సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుంది?
జవాబు: ఈ సినిమా జూన్ 3, 2026 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రశ్న: ఈ చిత్రం ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది?
జవాబు: కార్మేని సెల్వం చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
ప్రశ్న: కార్మేని సెల్వం సినిమాలో ప్రధాన పాత్రల్లో ఎవరు నటించారు?
జవాబు: ఈ సినిమాలో పి. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి రామ్ చక్రి దర్శకత్వం వహించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


