Actress Bold Scene: షారుఖ్ ఖాన్ బ్లాక్‌బస్టర్ మూవీ 'చక్ దే ఇండియా'లో కెప్టెన్ విద్యా శర్మ పాత్రతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి విద్యా మాల్వదే. 53 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్, సహజమైన నటనతో ఆకట్టుకుంటున్న ఆమె.. 2022లో ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ (SonyLIV)లో విడుదలైన 'డాక్టర్ అరోరా' (Dr. Arora) వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ఎదురైన ఒక ఆసక్తికరమైన, భావోద్వేగభరిత అనుభవాన్ని తాజాగా బయటపెట్టారు.

బాలీవుడ్ బబుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ సిరీస్‌లో సీనియర్ నటుడు కుముద్ మిశ్రాతో కలిసి ఒక ఇంటిమేట్ సన్నివేశం చేయడానికి ముందు తాను ఎంతగా భయపడిపోయారో, ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తనను ఎలా శాంతపరిచారో వివరించారు.
"అది కేవలం శారీరక సన్నివేశం కాదు.. ఒక మహిళ అంతర్మథనం"
'డాక్టర్ అరోరా' సిరీస్‌లో విద్యా మాల్వదే, కుముద్ మిశ్రా మధ్య ఒక కీలకమైన ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ఆ సీన్ చిత్రీకరణకు ముందు తాను, కుముద్ మిశ్రా ఇద్దరూ తీవ్ర ఒత్తిడికి గురయ్యామని విద్యా తెలిపారు.
“ఆ సీన్ గురించి నేను, కుముద్ జీ ఇద్దరం చాలా కంగారు పడ్డాం. ఎందుకంటే అది కేవలం ఒక ఫిజికల్ సీన్ మాత్రమే కాదు.. ఒక మహిళ లోపల జరిగే భావోద్వేగ పోరాటాన్ని చూపించే సన్నివేశం. శారీరక చర్యతో పాటు ఆ ఎమోషన్‌ను కూడా సరిగ్గా పండించగలనా లేదా అని నేను చాలా భయపడ్డాను” అని విద్యా పేర్కొన్నారు.
“కుముద్ జీకి కూడా అలాంటి ఇంటిమేట్ సీన్ చేయడం అదే మొదటిసారి. అందుకే షూటింగ్ చివరి రోజున ముందుగా ఈ సన్నివేశాన్ని పూర్తి చేసేయాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ఆయన చాలా గొప్ప నటుడు కావడం వల్ల నాకు ఎంతో సౌకర్యంగా అనిపించింది” అని ఆమె చెప్పుకొచ్చారు.
ఇంతియాజ్ అలీ కాళ్లు పట్టుకోవడంతో 20 సెకన్లలో నార్మల్ అయ్యా
ఇలాంటి సున్నితమైన సన్నివేశాలు చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ మేకర్స్ వ్యవహరించే తీరు చాలా ముఖ్యమని విద్యా మాల్వదే అభిప్రాయపడ్డారు. ఆ సిరీస్ నిర్మాత, క్రియేటర్ అయిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తమకు ఇంటిమసీ కోచ్‌లా వ్యవహరించారని ఆమె గుర్తుచేసుకున్నారు.
{{/usCountry}}ఇలాంటి సున్నితమైన సన్నివేశాలు చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ మేకర్స్ వ్యవహరించే తీరు చాలా ముఖ్యమని విద్యా మాల్వదే అభిప్రాయపడ్డారు. ఆ సిరీస్ నిర్మాత, క్రియేటర్ అయిన డైరెక్టర్ ఇంతియాజ్ అలీ తమకు ఇంటిమసీ కోచ్‌లా వ్యవహరించారని ఆమె గుర్తుచేసుకున్నారు.
{{/usCountry}}“మేము ఆ సన్నివేశాన్ని ప్లాన్ చేయడానికి, రిహార్సల్ (బ్లాకింగ్) చేయడానికి ఇంతియాజ్ సర్ ఇంటికి వెళ్లాం. అప్పుడు నేను చాలా కంగారుగా బెడ్ చివరన కూర్చున్నాను. వెంటనే ఇంతియాజ్ సర్ నా ఎదురుగా కూర్చుని, నా పాదాలను (కాళ్లను) తన చేతులతో పట్టుకున్నారు.” అని చెప్పారు.
“మొదటి 10 సెకన్లు నాకు ఏమీ అర్థం కాలేదు.. 'ఇదేంటి, సర్ ఏం చేస్తున్నారు?' అని నా మనసులో రకరకాల ఆలోచనలు వచ్చాయి. కానీ ఆయన నా కాళ్లు పట్టుకునే నాతో ఎంతో సహజంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆశ్చర్యకరంగా కేవలం 20 సెకన్లలోనే నాలోని భయం, ఆందోళన మొత్తం మాయమై నేను పూర్తిగా శాంతించాను. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సన్నివేశం రిహార్సల్స్ పూర్తి చేశాం” అని విద్యా వివరించారు.
'డాక్టర్ అరోరా' సిరీస్ విశేషాలు
సాజిద్ అలీ, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించిన 'డాక్టర్ అరోరా' సిరీస్‌కు ఇంతియాజ్ అలీ కథ అందించడంతో పాటు నిర్మించారు. 1999 నాటి చిన్న పట్టణాల నేపథ్యంలో సాగే ఈ 8 ఎపిసోడ్ల సిరీస్‌లో 'గుప్త రోగ నిపుణుడు' (సెక్సాలజిస్ట్) డాక్టర్ విశేష్ అరోరా (కుముద్ మిశ్రా) వద్దకు వచ్చే విభిన్న జంటల సమస్యలను సున్నితంగా, హాస్యభరితంగా ఆవిష్కరించారు. ఈ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.