...
...
Next Story

Teaser: హీరోగా మారిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ- తొలి ప్రేమ కథ టీజర్ లాంచ్- శైలేష్ కొలను, ఆకాష్ పూరి కామెంట్స్

Tholi Prema Katha Teaser Launch: చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ హీరోగా మారిన లేటెస్ట్ మూవీ తొలి ప్రేమ కథ. అన్నీ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా నిర్వహించిన తొలి ప్రేమ కథ టీజర్ లాంచ్ ఈవెంట్‌కి డైరెక్టర్ శైలేష్ కొలను, హీరో ఆకాష్ పూరి అతిథులుగా హాజరయ్యారు. సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Published on: Nov 7, 2026, 22:14:56 IST
Advertisement

Satvik Varma Tholi Prema Katha Teaser Released: తెలుగులో వస్తున్న సరికొత్త సినిమా తొలి ప్రేమ కథ. ఈ సినిమాలో సాత్విక్ వర్మ, అనీ హీరో, హీరోయిన్‌గా నటిస్తున్నారు. లిఖిత్, ఆదిత్య సమర్పణలో లతా కె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి లక్ష్మణ్ అల్లు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా తొలి ప్రేమ కథ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హీరో ఆకాష్ పూరి, డైరెక్టర్ శైలేష్ కొలను ఈ ట్రైలర్ లాంచ్‌లో అతిథులుగా హాజరయ్యారు.

మూడ్ ఆఫ్ ది సీజన్‌గా

హీరోగా మారిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ- తొలి ప్రేమ కథ టీజర్ లాంచ్- శైలేష్ కొలను, ఆకాష్ పూరి కామెంట్స్
హీరోగా మారిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ- తొలి ప్రేమ కథ టీజర్ లాంచ్- శైలేష్ కొలను, ఆకాష్ పూరి కామెంట్స్

తొలి ప్రేమ కథ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. "‘తొలి ప్రేమ కథ’ కరెక్ట్ టైమ్‌లో మూడ్ ఆఫ్ ది సీజన్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాల కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలాంటి సమయంలోనే ఈ సినిమా వస్తోంది. టీజర్ చూస్తుంటే చాలా హాయిగా ఉంది. చాలా జెన్యూన్‌గా, నేచురల్‌గా ఉంది" అని అన్నారు.

"సాత్విక్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసి ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. తను చాలా కష్టపడ్డాడు. నాకు ఈ టీజర్ చాలా నచ్చింది. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా అద్భుతంగా అనిపించాయి. ధ్రువన్ అద్భుతమైన మెలోడీ ఇచ్చాడు. ఈ సినిమా కచ్చితంగా థియేటర్‌లో చూస్తాను" అని దర్శకుడు శైలేష్ కొలను తెలిపారు.

డైలాగ్స్ చాలా నచ్చాయి

"అలాగే ఇందులో చివర్లో వినిపించిన డైలాగ్స్ కూడా నాకు చాలా నచ్చాయి. పర్ఫార్మెన్స్‌లో చాలా సహజంగా ఉన్నాయి. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా తీశారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్‌లో చూడాలని కోరుకుంటున్నాను" అని డైరెక్టర్ శైలేష్ కొలను కోరారు.

హీరోగా మారిన చైల్డ్ ఆర్టిస్ట్ సాత్విక్ వర్మ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. శైలేష్ గారికి, హీరో ఆకాష్ పూరి గారికి ధన్యవాదాలు. వాళ్లు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆకాష్ అన్న నా ఈవెంట్‌లో ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను" అని తెలిపారు.

"ఇది మంచి మ్యూజికల్ లవ్ స్టోరీ. దీనికి కారణం ధ్రువన్ గారు అందించిన అద్భుతమైన మ్యూజిక్. అలాగే మా నిర్మాత, దర్శకుడు చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారు. అందరూ కూడా మా సినిమాని సపోర్ట్ చేసి ఘనవిజయం చేయాలని కోరుకుంటున్నాను" అని హీరో సాత్విక్ వర్మ అన్నారు.

ధ్రువన్ మ్యూజికల్ అని వేశారు

ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి లక్ష్మణ్ అల్లూ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ కథ అనుకున్నప్పుడే సాత్విక్ అన్నీ యాక్టర్స్‌గా ఊహించుకున్నాను. అలాగే ఇందులో విజువల్స్, మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంటాయి. చాలా అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమాని షూట్ చేశాను. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. మా సినిమాని మీరందరూ సక్సెస్ చేసి, థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను" అని పేర్కొన్నారు.

ఆర్.ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ.. "ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈ సినిమా టీమ్ అందరూ కూడా పోస్టర్‌పై ‘ఆర్.ఆర్. ధ్రువన్ మ్యూజికల్’ అని వేశారు. కచ్చితంగా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. మా సాయి గారికి, కృష్ణ గారికి, హీరో గారికి అందరికీ ధన్యవాదాలు. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. తప్పకుండా మీరందరూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా" అని ఆకాంక్షించారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks