Chinmayi Sripada: కృతి సనన్ యాడ్ వివాదం.. రేపిస్ట్ బూట్లు నాకుతారు.. సింగర్ చిన్మయి ఘాటు వ్యాఖ్యలు!
Chinmayi Sripada: కృతి సనన్ రాఖీ యాడ్‌పై సంస్కృతి పేరిట విమర్శలు గుప్పిస్తున్న వాళ్లకు సింగర్ చిన్మయి శ్రీపాద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తీవ్ర అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా బాబాకు వరుసగా పేరోల్ ఇవ్వడాన్ని ఈ సందర్భంగా తప్పుపడుతూ సంచలన పోస్టు పెట్టింది.
Chinmayi Sripada: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ నటించిన ఒక రక్షా బంధన్ ప్రకటనపై సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ కొనసాగుతోంది. రాఖీ యాడ్ లో ఎక్స్ పోజింగ్ చేసేలా దుస్తులు ధరించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై చిన్మయి శ్రీపాద సంచలన పోస్టు పెట్టింది.

చిన్మయి శ్రీపాద పోస్ట్
సోషల్ మీడియాలో తరచూ వివాదాస్పద పోస్టులు పెడుతూ సింగర్ చిన్మయి శ్రీపాద వార్తల్లో ఉంటుంది. తాజాగా కృతి సనన్ యాడ్ ను, అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచా సౌధా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) పెరోల్ ను పోల్చుతూ ఘాటు పోస్టు పెట్టింది చిన్మయి.
డేరా బాబాకు పెరోల్
అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు తాజాగా పెరోల్ దక్కింది. పెరోల్ పై అతను బయటకు వచ్చాడు. 2020 నుంచి అతను పెరోల్ పై బయటకు రావడం ఇది 17వ సారి కావడం గమనార్హం. ఇప్పుడు ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన చిన్మయి.. సమాజంలోని డబుల్ స్టాండర్డ్స్ ను ప్రశ్నించింది.
సంస్కృతి పేరిట విమర్శలు
నటి కృతి సనన్ నటించిన రాఖీ ప్రకటనపై కొందరు నెటిజన్లు 'భారతీయ సంస్కృతిని దిగజార్చుతున్నారు' అంటూ ట్రోలింగ్ ప్రారంభించారు. ఈ వ్యవహారంపై స్పందించిన చిన్మయి, సోషల్ మీడియా ట్రోలర్ల వైఖరిని గట్టిగా ప్రశ్నించింది.
ఒకవైపు పవిత్రమైన బంధాల ఆధారంగా తీసిన ఒక వ్యాపార ప్రకటనను సంస్కృతి ముసుగులో విమర్శించే జనం, మరోవైపు తీవ్రమైన అత్యాచార నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి పదే పదే పెరోల్ ఇస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.
బూట్లు నాకుతారు
"తమకు నచ్చిన ఒక అత్యాచార దోషి బూట్లు నాకుతూనే.. సంస్కృతి పేరిట వ్యాపార ప్రకటనలను విమర్శించడం ఇక్కడి ప్రజల నైజం. ఒక శిక్ష అనుభవించే రేపిస్ట్‌కు నిరంతరం పేరోల్స్ ఇవ్వడమే ఈ దేశపు అసలైన సాంప్రదాయం అయిపోయింది. ఈ పాపం, కర్మానుభవం కచ్చితంగా అలాంటి మనస్తత్వం ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులకు తిరిగి వస్తుంది," అని చిన్మయి సంచలన పోస్టు పెట్టింది.
చిన్మయి ఫైర్
గతంలో కూడా మీటూ (#MeToo) ఉద్యమం సమయంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా చిన్మయి బలంగా గళం విప్పింది. తాజాగా కృతి సనన్ రాఖీ యాడ్ విషయంలో జరుగుతున్న రచ్చను, డేరా సచా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు వరుసగా లభిస్తున్న పెరోల్స్‌ను పోలుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి.
ఒక మహిళ దుస్తులు, ఆమె నటించే ప్రకటనలపై పద్ధతుల పేరిట నీతులు చెప్పే సమాజం, ఒక తీవ్రమైన నేరస్థుడి విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటోందో ఆలోచించాలని చిన్మయి సూచించింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


