లైంగికంగా వేధించాడ‌ని వైరాముత్తు పేరు చెప్పా.. అందుకే త‌మిళ‌నాడు అవార్డు రాలేదు.. వ‌స్తే షాక్ అయేదాన్ని: చిన్మయి పోస్ట్

ఇటీవల తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఫిల్మ్ అవార్డులు ప్రకటించింది. 2016 నుంచి 2022 వరకు వచ్చిన చిత్రాలను పరిగణించి ఈ పురస్కారాలు అనౌన్స్ చేసింది. కానీ సింగర్ చిన్మయి శ్రీపాదకు ఏ అవార్డూ రాలేదు. దీనిపై ఆమె రియాక్టవుతూ వైరాముత్తు లైంగికంగా వేధించాడని చెప్పినందుకే రాలేదని పేర్కొంది. 

Published on: Feb 4, 2026, 06:18:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఫిల్మ్ అవార్డులు ప్రకటించింది. 2016 నుంచి 2022 సంవత్సరాలకు గాను రాష్ట్ర చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. 2016 నుంచి 2022 వరకు సింగర్ చిన్మయి శ్రీపాద తమిళంలో హిట్ పాటలు పాడారు. ముఖ్యంగా ‘96’ సినిమాలో తన వాయిస్ తో మ్యాజిక్ చేశారు. అయినా అవార్డు మాత్రమే రాలేదు. దీనిపై తాజాగా చిన్మయి రియాక్షన్ తెగ వైరల్ గా మారింది.

చిన్మయి శ్రీపాద
చిన్మయి శ్రీపాద

అవార్డు రావాల్సిందని

చిన్మయికి అవార్డు రావాల్సిందని ఓ యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. పొన్నియిన్ సెల్వన్ 1కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ అవార్డుకు ఎంపికయ్యారు. రెహమాన్ కు కంగ్రాచ్యులేట్ చెప్తూ.. ‘‘సర్ దీనికి మీరు పూర్తిగా అర్హులు. అభినందనలు. కానీ 96 సినిమా సాంగ్స్ కు చిన్మయికి అవార్డు రాకపోవడం షాక్ కు గురిచేసింది’’ అని ఆ యూజర్ తన ఎక్స్ లో పోస్టు చేశాడు.

వైరాముత్తు పేరు

చిన్మయికి అవార్డు రాకపోవడం షాకింగ్ గా ఉందంటూ ఆ యూజర్ చేసిన పోస్టుకు చిన్మయి రియాక్టయ్యారు. ‘‘నాకు షాకింక్ గా లేదు. వైరాముత్తు పేరు చెప్పిన తర్వాత కూడా వాళ్లు నాకు అవార్డు ఇచ్చి ఉంటే అప్పుడు షాక్ కు గురయ్యేదాన్ని’’ అని చిన్మయి రియాక్టయింది.

లైంగిక వేధింపులు

వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని 2018లో భారతదేశంలో జరిగిన #MeToo ఉద్యమ సమయంలో చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. అలాగే మ్యూజిక్ ఇండస్ట్రీలోని ఇతరులపై వచ్చిన ఆరోపణలను కూడా ఆమె గట్టిగా వినిపించారు. డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవిపై ఆరోపణలు చేసిన వాళ్లకు సపోర్ట్ గా నిలిచినందుకు సౌత్ ఇండియన్ సినీ, టెలివిజన్ ఆర్టిస్టులు అండ్ డబ్బింగ్ ఆర్టిస్టుల సంఘం (SICTADAU) నుంచి చిన్మయిని తొలగించారు.

చిరంజీవి కామెంట్లపై

రీసెంట్ గా క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదని, సినీ ఇండస్ట్రీ అద్దం లాంటిదని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. దీనిపై రియాక్టయిన చిన్మయి ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఉదాహరణలు కూడా చెప్పారు. ఓ లేడీ మ్యూజిషియన్ కు పురుషాంగం ఫొటో పంపి, మ్యూజిక్ స్టూడియోలోనే లైంగికంగా వేధించారని చిన్మయి వెల్లడించారు. తన తల్లి ఉండగానే తనపై వైరాముత్తు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కూడా చిన్మయి మరోసారి గుర్తుచేశారు.

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. ట్రోల్స్ వచ్చినా ముందుకు సాగిపోతున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More